Telangana CS
-
సత్వరమే ఉద్యోగ నియామకాలు: సీఎస్ శాంతికుమారి
సాక్షి, హైదరాబాద్: వివిధ శాఖల ఉద్యోగ నియామకాల పురోగతిని తెలిపేందుకు ప్రత్యేకంగా డ్యాష్ బోర్డును ఏర్పాటు చేసి నిరంతరం సమీక్షించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి తెలిపారు. సరీ్వసు అంశాలు, రోస్టర్ పాయింట్లు, రిజర్వేషన్లకు సంబంధించిన పలు శాఖలలో పెండింగ్ అంశాలను తక్షణమే పరిష్కరించి ఉద్యోగ నియామకాలకు నోటిఫికేషన్లు జారీ చేయాలని ఆదేశించారు. ఉద్యోగ నియామకాలపై బీఆర్కేఆర్ భవన్లో మంగళవారం ఆమె ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా 17,516 పోస్టులకు నోటిఫికేషన్ జారీ కాగా, ఇప్పటికే ప్రాథమిక పరీక్షలు పూర్తి చేశామని, ఏప్రిల్‌లో రాత పరీక్షలు పూర్తి చేసి సెపె్టంబర్‌లోగా నియామకాలు జరుపుతామని సీఎస్ పేర్కొన్నారు. రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా 10 వేల పోస్టులకు సెపె్టంబర్‌లోగా నియామక ప్రక్రియ పూర్తి చేస్తామన్నారు. ఈ భేటీలో జీఏడీ కార్యదర్శి శేషాద్రి, ఆర్థిక శాఖ కార్యదర్శులు శ్రీదేవి, రోనాల్డ్ రోస్, టీఎస్పీఎస్సీ కార్యదర్శి అనితా రామచంద్రన్, టీఎస్ఎల్పీఆర్బీ చైర్మన్ శ్రీనివాసరావు, వర్సిటీ కామన్ బోర్డు చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి పాల్గొన్నారు. చదవండి: నిఘా లేదు.. సర్వర్ లేదు! కీలకమైన టీఎస్పీఎస్సీలో ‘సెక్యూరిటీ’ లోపాలు -
ట్యాక్స్ రివ్యూ మీటింగ్ నిర్వహించిన తెలంగాణ సీఎస్ శాంతి కుమారి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఇవాళ(బుధవారం) బిఆర్కేఆర్ భవన్ లో అధికారులతో రాష్ట్రాల స్వంత పన్నులు పన్నుయేతర ఆదాయాల రూపంలో సాధించిన పురోగతిని సమీక్షించారు. కమర్షియల్ ట్యాక్స్, ఎక్సైజ్, స్టాంపులు అండ్ రిజిస్ట్రేషన్, రవాణా, మైనింగ్ తదితర శాఖల అధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ ఏడాది లక్ష్యాల సాధనపై దృష్టి సారించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధికారులను ఆదేశించారు. పన్నుల వసూళ్లను పెంచేందుకు అవసరమైతే ప్రత్యేక చర్యలను చేపట్టాలని అధికారులను సీఎస్ కోరారు. ప్రతి వారం సమీక్షలు నిర్వహించి లక్ష్యాలను చేరుకోవాలని ఆమె తెలిపారు. ఆదాయాన్ని ఆర్జించే శాఖలైన కమర్షియల్ ట్యాక్స్, రిజిస్ట్రేషన్, ఎక్సైజ్, రవాణా శాఖలు అదనపు ఆదాయాన్ని పెంపొందించేందుకు కార్యాచరణ ప్రణాళికను ప్రతిపాదించాలని కోరారు. ఈ ఏడాది జనవరి చివరి నాటికి పన్నుల వసూళ్లలో రూ. 91,145 కోట్లు, పన్నుయేతర ఆదాయంలో రూ. 6996 కోట్లు మొత్తం రూ. 98,141 కోట్లుగా ఆదాయం సమకూరిందని తెలంగాణ సీఎస్ శాంతి కుమారి వెల్లడించారు. కమిషనర్ ఇన్స్పెక్టర్ జనరల్, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ రాహుల్ బొజ్జా, కమీషనర్, కమర్షియల్ టాక్సెస్ నీతూ కుమారి ప్రసాద్, ఫైనాన్స్ స్పెషల్ సెక్రటరీ రోనాల్డ్ రోస్, డైరెక్టర్ ప్రొహిబిషన్ ఎక్సైజ్ సర్ఫరాజ్ అహ్మద్, రవాణా శాఖ కమీషనర్ బుద్ధ ప్రకాష్ జ్యోతి మరియు ఇతర అధికారులు ఈ సమీక్షకు హాజరయ్యారు. -
Somesh Kumar: తెలంగాణలో సోమేశ్ ‘ముద్ర’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఎస్.సోమేశ్‌కుమార్ తనదైన ముద్ర వేసుకున్నారు. మూడేళ్ల క్రితం సీనియర్ ఐఏఎస్ అధికారి ఎస్.కె.జోషి నుంచి ప్రభుత్వ శాఖల పాలన పగ్గాలు తీసుకున్న ఆయన.. అనేక రాజకీయ విమర్శలను, ఆరోపణలను ఎదుర్కొన్నారు. ఎన్ని విమర్శలు వచ్చినా తనదైన శైలిలో ప్రభుత్వ వ్యవస్థను ముందుకు నడిపిన ఐఏఎస్ అధికారిగా గుర్తింపు పొందారు. ముఖ్యంగా ప్రభుత్వానికి ఆదాయ వనరులను సృష్టించడంలో దిట్టగా పేరొందారు. ఎక్సైజ్, రిజిస్టేషన్లు, వాణిజ్య పన్నుల శాఖల ద్వారా ఆదాయాన్ని రెండు, మూడింతలు చేయడంలో కీలకపాత్ర పోషించిన ఆయన ఆయా శాఖల్లో కీలక సంస్కరణలు చేపట్టారు. రాష్ట్రంలోని చిట్‌ఫండ్ కంపెనీల ఇష్టారాజ్యాన్ని నియంత్రించేలా మార్పులు తెచ్చారు. ఆబ్కారీ శాఖలో హోలోగ్రామ్ విధానాన్ని తెచ్చి కల్తీ, నాన్‌డ్యూటీ పెయిడ్ మద్యాన్ని నియంత్రించడంతోపాటు ట్రాక్ అండ్ ట్రేస్ విధానం ద్వారా ప్రభుత్వానికి ఆదాయం పెరిగేలా మార్పులు తెచ్చారు. వాణిజ్య పన్నుల శాఖను పునర్వ్యవస్థీకరించి పన్ను ఎగవేతలను సమర్థవంతంగా అడ్డుకున్నారు. ఆదాయ శాఖలన్నింటిలో తనదైన ముద్ర వేసిన సోమేశ్.. ధరణి పోర్టల్‌ను అందుబాటులోకి తేవడం ద్వారా వ్యవసాయ భూముల క్రయవిక్రయాల్లో పారదర్శకతను తెచ్చారు. అయితే, ఈ పోర్టల్ అమల్లో అనేక విమర్శలు కూడా వచ్చాయి. రైతుల భూములకు సంబంధించిన సమస్యలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ల్యాండ్ బ్యాంక్ రూపకల్పన నిరర్ధక ఆస్తులు, భూములను అమ్మి ప్రభుత్వ ఖజానా నింపడం, టీఎస్ఐఐసీ లాంటి సర్వీస్ ప్రొవైడర్ ద్వారా భూములను విక్రయించే పద్ధతిని సోమేశ్‌కుమార్ తీసుకొచ్చారు. లెక్కాపత్రం లేని ప్రభుత్వ భూముల వివరాలను పక్కాగా తయారు చేసి భవిష్యత్తు అవసరాల కోసం ల్యాండ్ బ్యాంక్‌ను రూపొందించడం లాంటి పనులు కూడా ఆయన హయాంలోనే జరిగాయి. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగుల పోస్టింగులకు సంబంధించిన పైరవీలకు సోమేశ్ చెక్ పెట్టారనే వాదన కూడా ఉంది. ఏటా అన్ని శాఖల్లో ఆడిటింగ్‌ను క్రమం తప్పకుండా నిర్వహించడం ద్వారా జవాబుదారీతనం పెంపు కోసం యత్నించారు. ఇక జీహెచ్ఎంసీ కమిషనర్‌గా పనిచేసిన కాలంలో డోర్ టు డోర్ సర్వే, రూ.ఐదుకే భోజనం, ఎస్ఆర్డీపీ (స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రోగ్రాం) కింద ఫ్లైఓవర్ల నిర్మాణం, మల్టీపర్పస్ ఫంక్షన్ హాళ్ల నిర్మాణం లాంటి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. జీహెచ్ఎంసీలో కాల్‌సెంటర్ ఏర్పాటు చేసి ప్రజలు సులవుగా ఫిర్యాదులు చేసే అవకాశం కల్పించింది కూడా ఈయన హయాంలోనే. ఈ కాల్‌సెంటర్ కోవిడ్ సమయంలో చాలా ఉపయోగపడిందనే పేరుంది. -
తెలంగాణ సీఎస్ సోమేష్ కుమార్‌ను రిలీవ్ చేసిన కేంద్రం
న్యూఢిల్లీ: తెలంగాణ సీఎస్ సోమేష్ కుమార్‌ను రిలీవ్ చేసింది కేంద్రం. గురువారంలోగా ఆంధ్రప్రదేశ్‌లో రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. ఈమేరకు మంగళవారం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ సీఎస్‌గా సోమేష్ కొనసాగింపును హైకోర్టు రద్దు చేసిన మరునాడే కేంద్రం ఉత్తర్వులు జారీ చేయడం గమనార్హం. రాష్ట్ర విభజనప్పుడు సోమేష్ కుమార్‌ను కేంద్రం ఏపీకి కేటాయించింది. కేంద్రం ఉత్తర్వులు నిలిపివేసి తెలంగాణలో కొనసాగేలా గతంలో క్యాట్ ఉత్తర్వులు జారీ చేసింది. క్యాట్ మధ్యంతర ఉత్తర్వులతో సోమేష్‌కుమార్ తెలంగాణలో కొనసాగుతున్నారు. క్యాట్ ఉత్తర్వులు కొట్టివేయాలని 2017లో హైకోర్టును కేంద్రం ఆశ్రయించింది. క్యాట్ ఉత్తర్వులు కొట్టివేస్తూ సీజే జస్టిస్ ఉజ్జల్ భూయాన్ బెంచ్ తీర్పునిచ్చింది. చదవండి: సీఎస్ సోమేష్‌కుమార్ క్యాడర్ కేటాయింపు రద్దు.. టీఎస్ హైకోర్టు కీలక ఆదేశాలు -
సరూర్‌నగర్ పరువు హత్యపై స్పందించిన ఎన్హెచ్ఆర్సీ
సాక్షి, హైదరాబాద్ : నగరంలో సరూర్‌నగర్‌లో జరిగిన పరువు హత్యోదంతంపై జాతీయ మానవ హక్కుల సంఘం స్పందించింది. మీడియాలో వస్తున్న కథనాల ఆధారంగా.. నాగరాజు హత్య కేసుపై ఎన్హెచ్ఆర్సీ సుమోటోగా కేసు నమోదు చేసుకుంది. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి(సీఎస్), డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్(డీజీపీ) నోటీసులు పంపింది. సరూర్‌నగర్‌లో జరిగిన పరువు హత్యోదంతంపై నాలుగు వారాల్లోగా సమగ్ర నివేదిక అందజేయాల్సిందిగా శుక్రవారం ఆదేశించింది. ఇక ఈ ఘటనలో నిందితులను అరెస్టు చేసి, ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా విచారణ వేగంగా జరిగేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టినట్టు తమ దృష్టికొచ్చిందని, అయితే పట్టపగలు నడిరోడ్డుపై జరిగిన ఇలాంటి ఘటనలు అరాచకత్వానికి నిదర్శమని, ఇది తీవ్రమైన మానవహక్కుల ఉల్లంఘన అని ఎన్హెచ్ఆర్సీ పేర్కొంది. మతాంతర, కులాంతర వివాహాలు జరిగినప్పుడు పరువుహత్యలు జరగకుండా నివారించేందుకు రాష్ట్ర ప్రభుత్వం వద్ద ఏదైనా విధానం ఉందా? అంటూ చీఫ్ సెక్రటరీని కమిషన్ ప్రశ్నించింది. సీఎస్ తన నివేదికలో ఈ అంశంపై బదులివ్వాలని పేర్కొంది. ఈ హత్యోదంతం దర్యాప్తు స్థితిగతులు, బాధిత కుటుంబానికి కల్పిస్తున్న భద్రత, దర్యాప్తులో అధికారుల నిర్లక్ష్యం ఏదైనా ఉంటే అలాంటివారిపై తీసుకున్న చర్యల గురించి నివేదిక సమర్పించాల్సిందిగా డీజీపీని ఆదేశించింది. చదవండి: సరూర్‌నగర్ పరువు హత్యపై స్పందించిన గవర్నర్ తమిళిసై -
తెలంగాణ సీఎస్‌పై సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ ఆగ్రహం
న్యూఢిల్లీ: ఢిల్లీలో ముఖ్యమంత్రులు, హైకోర్టు సీజేల సంయుక్త సదస్సు సందర్భంగా తెలంగాణ చీఫ్ సెక్రటరీపై సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలోని న్యాయవ్యవస్థ సమస్యల పరిష్కారంపై సీఎం, హైకోర్టు సీజే పలు నిర్ణయాలు తీసుకున్నప్పటికీ వాటిని అమలు చేయకుండా పెండింగ్‌లో ఉంచడంపై సీరియస్ అయ్యారు. తమ వ్యక్తిగత పనుల కోసం అడగడం లేదని.. న్యాయవ్యవస్థ బలోపేతం కోసమే నిర్ణయాలు తీసుకుంటున్నామన్నారు. కోర్టుల్లో దయనీయమైన పరిస్థితులు ఉన్నాయని ఎన్వీ రమణ ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా కోర్టుల్లో ఒక న్యాయవాది లోపలకు వెళ్లి వెనక్కు వస్తే తప్ప మరొకరు వచ్చే పరిస్థితి లేదని వ్యాఖ్యానించారు. దీనిపై స్పందించిన తెలంగాణ న్యాయశాఖమంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఈ అంశాలను తాను పరిశీలిస్తానని హామీ ఇచ్చారు. చదవండి👉 (పంజాబ్‌లో టెన్షన్.. టెన్షన్.. ఇంటర్నెట్ సేవలు బంద్) -
GO 111: 84 గ్రామాలకు జీవో 111 నుంచి విముక్తి
సాక్షి, హైదరాబాద్: వివాదాస్పదమైన జీవో 111ను ఎత్తేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించి ఓ అధికారిక ఉత్తర్వులను జారీ చేసింది ప్రభుత్వం. జీవో 111 పరిధి నుంచి 84 గ్రామాలకు విముక్తి కలిగిస్తున్నట్లు.. తెలంగాణ ప్రభుత్వం బుధవారం 69 పేరిట కొత్త జీవో జారీ చేసింది. ఇకపై జంట జలాశయాల పరిరక్షణకు చర్యలు తీసుకోనున్నారు. ఇందులో భాగంగా.. ఎస్టీపీల నీరు జంట జలాశయాల్లో కలవకుండా జాగ్రత్తలు తీసుకోనున్నారు. అంతేకాదు.. జంట జలాశయాల చుట్టుపక్కల గ్రామాల్లో సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నారు. తద్వారా భూగర్భ జలాలు కలుషితం కాకుండా చర్యలు తీసుకోనున్నారు. జంట జలాశయాల పరిరక్షణకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేసింది తెలంగాణ సర్కార్. కమిటీ సభ్యులుగా మున్సిపల్, ఫైనాన్స్ శాఖల ప్రిన్సిపల్ సెక్రటరీలు, వాటర్ బోర్డ్ ఎండి, పొల్యూషన్ కంట్రోల్ మెంబర్ సెక్రటరీ, HMDA డైరెక్టర్ ఉంటారు. జంట జలాశయాల పరిరక్షణకు తీసుకోవాల్సిన మార్గదర్శకాల రూపకల్పన చేయనున్న సీఎస్ నేతృత్వంలోని ఈ కమిటీ. ► గ్రీన్ జోన్ ల గుర్తింపు ► మురుగు నీరు వెళ్లే టాక్ లైన్స్ ఏర్పాటు ప్లానింగ్ ► STP లను ఎక్కడెక్కడ ఏర్పాటు చేయాలనే దానిపై నివేదిక ► 84 గ్రామాల్లో భవనాల నిర్మణాలకు సంబంధించిన ప్లానింగ్ ఎలా ఉండాలి ► వీటిపై ఖచ్చితమైన మార్గదర్శకాలు తయారు చేయనుంది ఈ కమిటీ. -
సీఎస్, డీజీపీ, కరీంనగర్ సీపీలకు నోటీసులు.. టీఆర్ఎస్లో ‘ప్రివిలేజ్’ సంకటం!
సాక్షి, హైదరాబాద్: బండి సంజయ్ దీక్ష భగ్నం, అరెస్టుతో మొదలైన రాజకీయవేడి ఇప్పట్లో చల్లారే సూచనలు కనిపించడం లేదు. ఆ ఘటనకు సంబంధించి ప్రభుత్వ ఉన్నతాధికారులు, పోలీసులకు ప్రివిలేజ్ కమిటీ సమన్లు జారీ చేయడం చర్చనీయాంశంగా మారింది. అధికారులు ప్రభుత్వపరం గానే సమాధానం ఇవ్వాల్సి ఉన్నా.. రాజ కీయ పరిణామాలపై అందరి దృష్టి పడింది. దీక్ష భగ్నం తర్వాతి పరిణామాల నేపథ్యం లో పలువురు బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు తెలంగాణకు వచ్చి టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ లక్ష్యంగా విమ ర్శలు చేశారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్‌తోపాటు పలువురు టీఆర్ ఎస్ నేతలు ఆ విమర్శలను తిప్పికొట్టారు కూడా. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఈడీ, సీబీఐ వంటి సంస్థలను అడ్డుపెట్టుకుని విపక్ష పార్టీలపై బెదిరింపులకు పాల్పడు తోందని ఆరోపణలు గుప్పించారు. ఈ క్రమంలో ప్రివిలేజ్ కమిటీ నోటీసులకు ఏం సమాధానమిస్తారు, కమిటీ ఏం చేస్తుందన్న ది ఉత్కంఠగా మారింది. బీజేపీ నేతలు ఈ అంశంపై రాజకీయ విమర్శలు చేస్తే.. తా ము కూడా స్పందించాల్సి వస్తుందని టీఆర్ఎస్కు చెందిన ఓ ముఖ్య నేత వెల్లడిం చారు. ఈ అంశాన్ని తాము రాజకీయం చేయదలుచుకోలేదని వ్యాఖ్యానించారు. -
ఎవరైనా ఒక్కటే: తెలంగాణ సీఎస్ వాహనానికి ట్రాఫిక్ చలాన్
-
హైకోర్టుకు తెలంగాణ సీఎస్ వివరణ
-
ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి కృషి: సీఎస్
సాక్షి, హైదరాబాద్: నగరంలో ట్రాఫిక్, పార్కింగ్ సమస్యల పరిష్కారానికి మల్టీలెవల్ పార్కింగ్ కాంప్లెక్స్‌ల నిర్మాణాలు చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి తెలిపారు. బుధవారం సచివాలయంలో నగర మేయర్ బొంతురామ్మోహన్‌తో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ హైదరాబాద్‌లో ట్రాఫిక్ సమస్య పరిష్కారం కోసం, ప్రభుత్వ, ప్రైవేటు స్థలాల్లో మల్టీలెవల్ పార్కింగ్ కాంప్లెక్స్ నిర్మాణ ప్రతిపాదనలపై ట్రాఫిక్ నిపుణులతో అధ్యయనం చేయించాలన్నారు. 100–500 గజా ల్లోపు స్థలాల్లో చైన్ పార్కింగ్ ఏర్పాటు అంశాన్ని పరిశీలించాలని బొంతురామ్మోహన్ అన్నారు. çసమీక్షలో ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి శివశంకర్, లా సెక్రటరీ నిరంజన్‌రావు, రంగారెడ్డి కలెక్టర్ రఘునందన్‌రావు తదితరులు పాల్గొన్నారు. -
ప్రతి గ్రామంలో నర్సరీ ఏర్పాటు చేయండి
సాక్షి, హైదరాబాద్: హరితహారంలో భాగంగా ప్రతి గ్రామం, మున్సిపాలిటీల్లో నర్సరీలను ఏర్పాటు చేయాలని సీఎస్ ఎస్.కె.జోషి పంచాయతీ రాజ్, మున్సిపల్ శాఖ అధికారులను ఆదేశించారు. గురువారం సచివాలయంలో హరితహారం కార్యక్రమంపై సీఎస్ సమీక్ష నిర్వహించారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్రంలోని 142 పట్టణ స్థానిక సంస్థలు, 12751 గ్రామపంచాయతీలలో భూమి గుర్తింపు, అవసరమైన మౌలిక సదుపాయాలు, మొక్కలు తదితర వివరాలను వారంలోగా పంపాలన్నారు. అర్బన్ పార్కుల్లో నర్సరీల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు. పట్టణ నర్సరీల పర్యవేక్షణకు అర్బన్ ఫారెస్ట్రీ, ఎంఏయూడీ ఓఎస్డీ కృష్ణను నోడల్ అధికారిగా నియమించినట్లు సీఎస్ తెలిపారు. కార్యక్రమంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ మిశ్రా, ముఖ్యకార్యదర్శి వికాస్ రాజ్ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
రెసిడెన్షియల్ విద్యార్థులను తీర్చిదిద్దండి
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు చర్యలు తీసుకోవాలని, దేశంలోని ప్రతిష్టాత్మక ఉన్నత విద్యా సంస్థల్లో సీట్లు లభించేలా బోధన జరగాలని అధికారులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె.జోషి ఆదేశించారు. అర్హులైన ప్రతి విద్యార్థికి రెసిడెన్షియల్ పాఠశాలల్లో ప్రవేశం దక్కేలా చూడాలన్నారు. గురువారం సచివాలయంలో వివిధ శాఖల ఉన్నతాధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సంక్షేమ హాస్టళ్లు, కళాశాలలు, పాఠశాలలకు గ్రేడింగ్ విధానం రూపొందించాలని ఆదేశించారు. ఎస్సీ, ఎస్టీ అభివృద్ధి నిధుల వ్యయం పెంచాలని, స్టడీ సర్కిళ్ల ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ యువత ఉద్యోగాలు పొందేలా శిక్షణ ఇవ్వాలన్నారు. భూ పంపణీ పథకం లబ్ధిదారులు వ్యవసాయం చేసేలా సహకారం అందించాలని సూచించారు. వ్యవ సాయానికి 24 గంటల విద్యుత్ ఇస్తున్నందున ఈ వేసవిలో 17 వేల మెగావాట్ల డిమాండ్ వచ్చినా తట్టుకునేలా విద్యుత్ అధికారులు ఆ మేరకు చర్యలు తీసుకోవాలన్నారు. -
సీఎస్‌గా బాధ్యతలు స్వీకరించిన ఎస్కే జోషి
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా శైలేంద్ర కుమార్ జోషి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన... సీఎస్‌గా అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ అభివృద్ధిలో దూసుకు వెళుతోందన్నారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ప్రాధాన్యత ఇస్తానని, సీఎం కేసీఆర్ ఆదేశాలతో పని చేస్తానని ఎస్కే జోషి తెలిపారు. మరోవైపు నూతన సీఎస్‌గా బాధ్యతలు స్వీకరించిన ఎస్కే జోషిని డీజీపీ మహేందర్ రెడ్డి, పలువురు అధికారులు సచివాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు. నూతన సీఎస్‌గా శైలేంద్ర కుమార్ జోషిని నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఇవాళ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. -
సీఎస్ పదవీకాలం మరో 3 నెలలు!
డీవోపీటీకి సీఎం కేసీఆర్ లేఖ సాక్షి, హైదరాబాద్: ఈ నెలాఖరున పదవీ విరమణ చేయాల్సి ఉన్న రాష్ట్ర ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శి ప్రదీప్ చంద్ర పదవీకాలాన్ని 3 నెలలపాటు పొడిగించాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాల విభాగానికి (డీవోపీటీ) లేఖ రాశారు. రాష్ట్ర సాధారణ పరిపాలనా విభాగం గురు వారం ఈ లేఖను డీవోపీటీకి పంపించింది. కొత్త రాష్ట్రం కావడంతో పాటు ఐఏఎస్ అధికారుల కొరత ఉండటంతో సీనియర్ అధికారుల సేవలు అవసరమని సీఎం భావిస్తున్నారు. అందుకే సీఎస్ పదవీ కాలాన్ని పొడిగించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున విజ్ఞప్తి చేస్తే ఐఏఎస్ అధికారుల సర్వీసును 3 నెలల పాటు పొడిగించే వీలుంది. అఖిల భారత సర్వీసు అధికారుల సర్వీసు నిబం దనల ప్రకారం ఈ వెసులుబాటు ఇచ్చే అధికారం కేంద్రం పరిధిలో ఉంటుంది. రాష్ట్ర తొలి సీఎస్ రాజీవ్‌శర్మ పదవీకాలాన్ని కేంద్రం ఇదే తరహాలో వరుసగా 2 సార్లు మూడు నెలల చొప్పున పొడిగించటం తెలిసిందే. తాజాగా ప్రదీప్ చంద్రకు మరో 3 నెలల పాటు సర్వీసు పొడిగించాలని కోరటంతో డిసెంబర్ 31న ముగియనున్న సీఎస్ పద వీకాలం వచ్చే ఏడాది మార్చి 31 దాకా కొనసాగే అవకాశాలున్నాయి. -
తెలంగాణ సిఎస్‌ను కలిసిన హోంగార్డులు
-
రాజీవ్ శర్మ పదవీకాలం మరో 3 నెలలు పొడిగింపు
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ పదవీ కాలాన్ని మరో మూడు నెలలు పొడిగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ నెలాఖరున పదవీ విరమణ పొందనున్న రాజీవ్ శర్మ పదవీకాలాన్ని మరో మూడు నెలలపాటు పొడిగించినట్టు కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి ఉత్తర్వులు అందాయి. కాగా ఈ నెల 31న రాజీవ్‌శర్మ పదవీ కాలం ముగియనుండటంతో ముఖ్యమంత్రి కేసీఆర్ మరో ఆరు నెలలు పదవీ కాలాన్ని పొడిగించాలని ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. 1982 బ్యాచ్‌కు చెందిన రాజీ వ్‌శర్మ సొంత రాష్ట్రం ఉత్తరప్రదేశ్. అసిస్టెంట్ కలెక్టర్‌గా సర్వీస్ ప్రారంభించారు. కృష్ణా, తూర్పుగోదావరి జిల్లాల కలెక్టర్‌గా పనిచేశారు. హైదరాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి స్పెషల్ కమిషనర్‌గానూ రాజీవ్ శర్మ సేవలందించారు. -
ఆగస్టులో తెలంగాణ సచివాలయం కూల్చివేత
మంచి రోజులు రాగానే కొత్త సచివాలయ భవనానికి ముహూర్తం ఏడాదిలో పనుల పూర్తి లక్ష్యం.. అప్పటిదాకా తాత్కాలిక విడిది ముఖ్యమంత్రి, సాధారణ పరిపాలన విభాగానికి అద్దె భవనం పరిశీలనలో ఎంసీహెచ్ఆర్డీ, బూర్గుల భవన్, ఎక్స్‌పోటెల్ హోటల్ హెచ్‌వోడీ కార్యాలయాల్లో మంత్రులు, అధికారులకు సర్దుబాటు హైదరాబాద్: తాత్కాలిక సచివాలయానికి సరిపడే భవనాల వేట మొదలైంది. ప్రస్తుత సచివాలయాన్ని కూల్చి.. కొత్త సచివాలయ నిర్మాణానికి ఏర్పాట్లను రాష్ట్ర ప్రభుత్వం వేగవంతం చేసింది. మంచి రోజులు రాగానే.. ఆగస్టులో ఈ పనులకు ముహూర్తంగా ఎంచుకున్నట్లు అధికార వర్గాలు సూచనప్రాయంగా వెల్లడించాయి. పనులు ప్రారంభమైనప్పటి నుంచి ఏడాది వ్యవధిలో కొత్త భవన సముదాయ నిర్మాణాన్ని పూర్తి చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు లక్ష్యంగా నిర్ణయించారు. ఈ నేపథ్యంలో ఉన్నతాధికారులు ముందస్తు ఏర్పాట్లపై దృష్టి సారించారు. సచివాలయాన్ని కూల్చివేసి కొత్తది నిర్మించే వరకు పరిపాలనా వ్యవహారాలకు విఘాతం తలెత్తకుండా చేసుకోవాల్సిన ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై అధికార యంత్రాంగం ప్రత్యేక దృష్టి కేంద్రీకరించింది. రెండ్రోజుల కిందట సీఎస్ రాజీవ్‌శర్మ సారధ్యంలోని ఉన్నతాధికారుల కమిటీ వీటిపై ప్రత్యేక సమాలోచనలు జరిపింది. ముఖ్య కార్యదర్శులు అధర్‌సిన్హా, ఆర్ అండ్ బీ ముఖ్య కార్యదర్శి సునీల్‌శర్మ, న్యాయ శాఖ కార్యదర్శి సంతోష్‌రెడ్డి ఈ సమావేశంలో పాల్గొన్నారు. నిర్మాణ వ్యవధిలో ముఖ్యమంత్రి, సాధారణ పరిపాలన, సచివాలయ కేంద్రంగా ఉండే మంత్రులు, వివిధ శాఖల కార్యదర్శులు తమ కార్యకలాపాలు ఎక్కణ్నుంచి నిర్వహించాలనే అంశంపైనే ప్రధానంగా చర్చించినట్లు తెలిసింది. తాత్కాలిక విడిదిని ఎక్కడ ఏర్పాటు చేయాలి..? ఎక్కడెక్కడ అందుకు అనువైన భవనాలున్నాయని ఆరా తీశారు. హైదరాబాద్‌లో ఉన్న హెచ్‌వోడీ కార్యాలయాలు, వివిధ ప్రభుత్వ శాఖల కార్యాలయాలు ఎక్కడెక్కడ ఉన్నాయి.. ఎక్కడెక్కడ ఎంత ఖాళీ స్థలముంది..? ఎక్కడైనా సచివాలయంలోని కార్యాలయాలను సర్దుబాటు చేసే అవకాశముందా.. అనే సమాచారంపై ఆరా తీశారు. ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో జరిగిన చర్చల్లోనూ ఇదే విషయంపై ప్రత్యేకంగా చర్చ జరిగినట్లు తెలిసింది. మంత్రులు, ఆయా శాఖల కార్యదర్శులు, అధికారులు, సిబ్బందిని సంబంధిత హెచ్‌వోడీ కార్యాలయాల్లో వీలైనంత మేరకు సర్దుబాటు చేయాలని, అందుకు సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని సీఎం సీఎస్‌కు సూచించినట్లు తెలిసింది. ప్రభుత్వ సలహాదారులు ఏడాది పాటు తమ నివాసాల నుంచే విధులు నిర్వహించే అవకాశమిద్దామని ముఖ్యమంత్రి వారితోనే అభిప్రాయపడ్డట్లు సమాచారం. దీంతో ముఖ్యమంత్రి, సీఎంవో, సాధారణ పరిపాలన విభాగం అధికారులు, సిబ్బందిని సర్దుబాటు చేయటమొకటే మిగులుతుందని, అంతమేరకు సరిపడే భవనమేదైనా ఉందా.. పరిశీలించాలని ఈ సందర్భంగా సీఎం ఆదేశించారు. దీంతో సచివాలయం సమీపంలోని బూర్గుల రామకృష్ణారావు భవన్, లోయర్ ట్యాంక్‌బండ్ రోడ్‌లోని ఎక్స్‌పోటెల్, జూబ్లీహిల్స్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి విభాగం(ఎంసీహెచ్ఆర్డీ) భవనాల పేర్లు ఉన్నతాధికారుల కమిటీ పరిశీలనకు స్వీకరించింది. వీటిని స్వయంగా పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని సీఎస్ ఉన్నతాధికారులతో పేర్కొన్నట్లు తెలిసింది. వివిధ ప్రాంతాల్లో ఉన్న హెచ్‌వోడీ భవనాలు, కార్యాలయాల్లో అంతకు మించి సదుపాయాలున్నవి ఏమైనా ఉన్నాయా..? అని ఆరా తీస్తున్నారు. దీంతో తాత్కాలిక సచివాలయం ఎక్కడ ఏర్పాటవుతుంది.. సచివాలయ కేంద్రంగా పని చేస్తున్న శాఖల అధికారులు, సిబ్బందిని ఎక్కడెక్కడికి తరలిస్తారనేది ఆసక్తి రేపుతోంది. -
సాయంత్రం ఢిల్లీకి తెలంగాణ సీఎస్, డీజీపీ
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, డీజీపీ అనురాగ్ శర్మ మంగళవారం సాయంత్రం ఢిల్లీ వెళ్లనున్నారు. 16 రాష్ట్రాల సీఎస్‌లు, డీజీపీలతో ఎస్సీ కమిషన్ భేటీ కానుంది. ఆ సదస్సులో పాల్గొన్న అనంతరం సీఎస్, డీజీపీ కేంద్ర హోంశాఖ ఉన్నతాధికారులతో భేటీ కానున్నారు. సెక్షన్-8 అంశంపై కేంద్ర హోంశాఖతో చర్చించనున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
సానుకూల దృక్పథంలో ఇరు రాష్ట్రాల మధ్య చర్చలు!
-
సానుకూల దృక్పథంలో ఇరు రాష్ట్రాల మధ్య చర్చలు!
ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య చోటు చేసుకున్న ఉద్యోగుల విభజన అంశం కొలిక్కి వచ్చినట్లు కనబడుతోంది. దీనిలో భాగంగానే శుక్రవారం ఇరు రాష్ట్రాల సీఎస్ లు ఐవైఆర్ కృష్ణారావు, రాజీవ్ శర్మ లు కేంద్ర హోంశాఖ కార్యదర్శి అనిల్ గోస్వామితో సమావేశమయ్యారు. ప్రధానంగా పునర్ విభజన చట్టం వివాదాలపై వారి మధ్య చర్చ జరిగింది. ఈ సమావేశం అనంతరం ఇరు రాష్ట్రాల సీఎస్ లు మీడియాతో మాట్లాడారు. ఉద్యోగుల విభజనపై రెండు రాష్ట్రాలు అంగీకారానికి వచ్చినట్లు ఆంధ్రప్రదేశ్ సీఎస్ కృష్ణారావు స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టంలోని వివాదాలపై కేంద్రాన్ని పరిష్కారం ఇవ్వమని కోరినట్లు ఆయన తెలిపారు. కాగా, కమల్ నాధన్ కమిటీ కార్యకలాపాలు హైదరాబాద్ లో సాగేందుకు అనుమతి కోరినట్లు తెలంగాణ రాష్ట్ర సీఎస్ రాజీవ్ శర్మ తెలిపారు. విభజన చట్టంలోని అంశాలపై ఇరు రాష్ట్రాలకు వేర్వేరు అభిప్రాయాలున్నట్లు ఆయన తెలిపారు. వీటిపై కేంద్రాన్ని న్యాయ సలహా కోరామన్నారు. అందరికీ అనుకూలంగా ఉండే విధానాన్ని అనుసరించాలని ప్రత్యూష్ సిన్హాను కోరామన్నారు. ఇరు రాష్ట్రాల మధ్య చర్చలు సానుకూల దృక్పథంలో సాగుతున్నాయని రాజీవ్ శర్మ తెలిపారు. -
కేంద్ర హోంశాఖ కార్యదర్శితో రెండు రాష్ట్రాల సీఎస్‌లు భేటీ
న్యూఢిల్లీ: కేంద్ర హోంశాఖ కార్యదర్శి అనిల్ గోస్వామితో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల సీఎస్‌లు ఐవైఆర్ కృష్ణారావు, రాజీవ్ శర్మ శుక్రవారం న్యూఢిల్లీలో భేటీ అయ్యారు. పునర్ విభజన చట్టం వివాదాలపై వారి మధ్య ప్రధానంగా చర్చ జరిగింది. అయితే గవర్నర్‌కు శాంతిభద్రతలు, హైదరాబాద్‌లో ప్రభుత్వ సంస్థల అంశాలను ఏపీ సీఎస్ లేవనెత్తారు. పునర్విభజన చట్టాలను ఏపీ సర్కారు గౌరవించడం లేదని తెలంగాణ సీఎస్ అనిల్ గోస్వామికి ఫిర్యాదు చేశారు. -
జూలైలో గోదావరి పుష్కరాలు
సాక్షి, హైదరాబాద్: కుంభమేళా తరహాలో గోదావరి పుష్కరాలను 2015 సంవత్సరం జూలై 14 నుంచి 25 వరకు నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా బుధవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ సలహాదారు రమణాచారి ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ పుష్కరాలకు భారీ సంఖ్యలో భక్తులు హాజరుకానున్నందున ఎలాంటి లోటుపాట్లు ఎదురుకాకుండా నిర్వహించాలని రాజీవ్ శర్మ పేర్కొన్నారు. పుష్కర ఘాట్లు, దేవాలయాలకు వెళ్లే రోడ్లను తీర్చి దిద్దాలని. ఈ మొత్తం పనుల కోసం రూ.100 కోట్లు కేటాయించాలని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించారు. బాసర, భద్రాచలం, ధర్మపురి ఈ మూడు ప్రాంతాల్లో ఒకదానిని ప్రధాన పుష్కర ఘాట్‌గా తీర్చిదిద్దాలని, పుష్కరాల ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్రపతి పేరును సీఎం సిఫారసు చేసినందున దానిపై మరోసారి ఆయనతో చర్చించి తుది నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించారు. -
రేపు ఢిల్లీలో ప్రత్యూష్ సిన్హా కమిటీ భేటీ
హైదరాబాద్: ఇరు రాష్ట్రాలకు అఖిల భారత సివిల్స్ సర్వీసెస్ అధికారుల పంపకాలపై ఏర్పాటైన ప్రత్యూష్ సిన్హా కమిటీ సోమవారం న్యూఢిల్లీలో సమావేశం అవుతుంది. ఈ భేటీకి తెలంగాణ, ఏపీ రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శలు హాజరుకానున్నారు. అధికారుల తుది జాబితాను కమిటీ రేపు ఖరారు చేయనుంది. అయితే పలువురు ఉన్నతాధికారుల అభ్యంతరాలను కమిటీ పరిగణలోకి తీసుకుంది. ఆ అభ్యంతరాలపై కమిటీ రేపు చర్చించనుంది. అనంతరం ఆ జాబితాను ప్రధాని నరేంద్ర మోడీకి కమిటీ పంపనుంది. మోడీ ఆమోద ముద్ర పడగానే పూర్తి స్థాయిలో విభజన జరగుతుంది. -
'ఏకీకృత ఫీజు, కామన్ ఎంట్రెన్స్ పై మరోదఫా చర్చలు'
తెలంగాణలో ఏకీకృత ఫీజు, కామన్ ఎంట్రెన్స్ పరీక్షల నిర్వహణకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వానికి విజ్క్షప్తి చేసినట్లు మెడికల్ కాలేజీల యాజమాన్యాల ప్రతినిధి మల్లారెడ్డి తెలిపారు. రాష్ట్రంలోని మెడికల్ కాలేజీల యాజమాన్యాలు బృందం శుక్రవారం హైదరాబాద్‌లో తెలంగాణ సీఎస్ రాజీవ్ శర్మతో భేటీ అయ్యారు. అనంతరం మల్లారెడ్డి విలేకర్లతో మాట్లాడారు. ఫీజు పెంపును ఆమోదించలేమని ప్రభుత్వం తమకు వెల్లడించిందని చెప్పారు. ఇదే అంశంపై ప్రభుత్వంతో మరోదఫా చర్చలు జరుగుతాయని మల్లారెడ్డి చెప్పారు. -
'సూపర్ న్యూమరీ పోస్టులు సృష్టించాలి'
హైదరాబాద్: సచివాలయంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, ఉన్నతాధికారుల సమావేశమయ్యారు. రాష్ట్ర విభజనలో ఇప్పటి దాక జరిగిన పురోగతిపై చర్చించారు. ఉద్యోగుల శాశ్వత విభజనపై కమలనాధన్ కమిటీ రేపు భేటీ కానుంది. ఈ నేపథ్యంలో ఎక్కడి ఉద్యోగులు అక్కడే పనిచేసేలా చర్యలు తీసుకోవాలని కమలనాధన్ ను కలిసి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ సంఘాల నేతలు విజ్ఞప్తి చేశారు. అవసరం మేరకు సూపర్ న్యూమరీ పోస్టులను సృష్టించాలని కోరారు.