సచివాలయంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, ఉన్నతాధికారుల సమావేశమయ్యారు.
హైదరాబాద్: సచివాలయంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, ఉన్నతాధికారుల సమావేశమయ్యారు. రాష్ట్ర విభజనలో ఇప్పటి దాక జరిగిన పురోగతిపై చర్చించారు. ఉద్యోగుల శాశ్వత విభజనపై కమలనాధన్ కమిటీ రేపు భేటీ కానుంది.
ఈ నేపథ్యంలో ఎక్కడి ఉద్యోగులు అక్కడే పనిచేసేలా చర్యలు తీసుకోవాలని కమలనాధన్ ను కలిసి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ సంఘాల నేతలు విజ్ఞప్తి చేశారు. అవసరం మేరకు సూపర్ న్యూమరీ పోస్టులను సృష్టించాలని కోరారు.