సాక్షి, హైదరాబాద్: వివాదాస్పదమైన జీవో 111ను ఎత్తేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించి ఓ అధికారిక ఉత్తర్వులను జారీ చేసింది ప్రభుత్వం. జీవో 111 పరిధి నుంచి 84 గ్రామాలకు విముక్తి కలిగిస్తున్నట్లు.. తెలంగాణ ప్రభుత్వం బుధవారం 69 పేరిట కొత్త జీవో జారీ చేసింది.
ఇకపై జంట జలాశయాల పరిరక్షణకు చర్యలు తీసుకోనున్నారు. ఇందులో భాగంగా.. ఎస్టీపీల నీరు జంట జలాశయాల్లో కలవకుండా జాగ్రత్తలు తీసుకోనున్నారు. అంతేకాదు.. జంట జలాశయాల చుట్టుపక్కల గ్రామాల్లో సివరేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నారు. తద్వారా భూగర్భ జలాలు కలుషితం కాకుండా చర్యలు తీసుకోనున్నారు.
జంట జలాశయాల పరిరక్షణకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేసింది తెలంగాణ సర్కార్. కమిటీ సభ్యులుగా మున్సిపల్, ఫైనాన్స్ శాఖల ప్రిన్సిపల్ సెక్రటరీలు, వాటర్ బోర్డ్ ఎండి, పొల్యూషన్ కంట్రోల్ మెంబర్ సెక్రటరీ, HMDA డైరెక్టర్ ఉంటారు. జంట జలాశయాల పరిరక్షణకు తీసుకోవాల్సిన మార్గదర్శకాల రూపకల్పన చేయనున్న సీఎస్ నేతృత్వంలోని ఈ కమిటీ.
► గ్రీన్ జోన్ ల గుర్తింపు
► మురుగు నీరు వెళ్లే టాక్ లైన్స్ ఏర్పాటు ప్లానింగ్
► STP లను ఎక్కడెక్కడ ఏర్పాటు చేయాలనే దానిపై నివేదిక
► 84 గ్రామాల్లో భవనాల నిర్మణాలకు సంబంధించిన ప్లానింగ్ ఎలా ఉండాలి
► వీటిపై ఖచ్చితమైన మార్గదర్శకాలు తయారు చేయనుంది ఈ కమిటీ.
Comments
Please login to add a commentAdd a comment