GO 111
-
GO 111 రద్దుపై ఆకాశాన్ని అంటిన సంబరాలు.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
-
111 జీవో రద్దు ఓకే.. వాట్ నెక్ట్స్..?
హైదరాబాద్ మహానగర శివారులోని గ్రామాలకు ట్రిపుల్ వన్ ట్రబుల్స్ ఇక తప్పినట్టేనా? కొత్త విధివిధానాలు ఎలా ఉండబోతున్నాయి?. 84 గ్రామాలకు 111 జీవో నుంచి విముక్తి దొరికినట్టేనా ? జంట జలాశయలా పరిరక్షణకు కొత్త రూల్స్ ఎలా ఫామ్ చేయబోతున్నారు ? లోకల్ పబ్లిక్‌లో ఉన్న అనుమానాలేంటీ ? HMDA రూల్స్ ఎప్పటి నుంచి అమలులోకి వస్తాయి ? రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్ల, రాజేంద్రనగర్ నియోజకవర్గాల పరిధిలోని 84 గ్రామాల ప్రజలు జీవో 111తో రెండు దశాబ్ధాలుగా ఇబ్బందులు పడుతున్నారు. సీఎం కేసీఆర్ ట్రిపుల్ వన్ జీవో రద్దు చేస్తూ అసెంబ్లీలో ప్రకటించారు. క్యాబినెట్ మీటింగ్‌లో ఆమోద ముద్ర వేశారు. దీంతో జీవో పరిధిలోని గ్రామాల్లో సంబరాలు, సీఎం కేసీఆర్‌కు పాలాభిషేకాలు చేశారు. అంత వరకు ఓకే.. కానీ.. స్థానిక ప్రజలను అనేక అనుమానాలు వేధిస్తున్నాయి. జీవో ఎత్తివేసిన తర్వాత అనుమతులు ఎలా ఇస్తారు? గ్రీన్ జోన్ పరిధిలో ఏయే గ్రామాలను ఎంపిక చేస్తారు? గ్రీన్ జోన్ పరిధిని ఏ ప్రాతిపాదికన నిర్ణయిస్తారు? జంట జలాశయాలపైన ఉన్న గ్రామాల నుంచి మురుగునీరు జలాశయాల్లో కలవకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటారు? ఇప్పటికే కొన్ని గ్రామాల్లో అక్రమంగా లే అవుట్లు వెలిశాయి. వాటికి అనుమతులు ఎలా ఇస్తారు? ట్రిపుల్ వన్ జీవో రద్దు తర్వాత.. కొత్త విధివిధానాలు ఎలా ఉండబోతున్నాయనేది ఇంకా సస్పెన్స్ గానే మారింది. గండిపేట, హిమాయత్ సాగర్ జలాశయాల చుట్టూ 5 కిలోమీటర్ల పరిధిని గ్రీన్ జోన్‌గా నిర్ధారించే అవకాశాలున్నాయి. గ్రీన్ జోన్లో కాలుష్యం వెదజల్లే పరిశ్రమలకు అనుమతించే అవకాశం లేదు. ఇక మురుగునీరు జంటజలాశయాల్లో కలవకుండా 11 ఎస్టీపీలను నిర్మిస్తున్నారు. గండిపేట జలాశయం చుట్టూ 5, హిమాయత్ సాగర్ జలాశయం చుట్టూ 6 ఎస్టీపీలు నిర్మించాలని ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. జంట జలాశయాల పరిరక్షణపై పర్యావరణ వేత్తలు ఆందోళణ చెందాల్సిన పనిలేదని మాత్రం చెబుతున్నారు లోకల్ ఎంపీ రంజిత్ రెడ్డి చెబుతున్నారు. చదవండి: Telangana University: రిజిస్ట్రార్ నియామకంలో మళ్లీ వివాదం ఇక మొయినాబాద్, శంకర్ పల్లి, శంషాబాద్ మండలాల్లో ఇప్పటికే చాలా వరకు HMDA అనుమతులు లేకుండా అక్రమ లే అవుట్లు భారీగా వెలిశాయి. వాటి విషయంలో ఏ విధంగా ముందుకు వెళ్లాలనే దానిపై మున్సిపల్ శాఖ కసరత్తు చేస్తోంది. HMDA పరిధిలో దాదాపుగా పది వేల ఎకరాల్లో అక్రమ వెంచర్లు వెలిసినట్లు ప్రాథమిక అంచనా. 111 జీవో నేపథ్యంలో ఆ ప్లాట్లను ఇన్నాళ్లు నిషేధిత జాబితాలో ఉంచారు. వాటికి సంబంధించి నోటరీతో ఇన్నాళ్లు సరిపెట్టుకున్నారు. రిజిస్ట్రేషన్ల ప్రక్రియ చేయలేదు. జీవో రద్దు ప్రకటన తర్వాత. విధివిధానాలు ఖరారు కాకపోవడంతో రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ఇంకా ప్రారంభం కాలేదు. చదవండి: ఓవైపు విగ్రహాలకు అభిషేకం.. మరోవైపు ఈవో జలకాలాట అయితే గ్రామాల్లో తమ భూములు అమ్ముకోకుండా ఉన్న కొద్ది పాటి రైతులు మాత్రం జీవో రద్దుతో తమ భూములకు విలువ పెరుగుతుందని సంబరపడుతున్నారు. మొత్తంగా జీవో 111 రద్దు పరిధిలో HMDA కనీసం ఒక్క లేఅవుట్‌కు అధికారికంగా అనుమతి ఇచ్చే వరకు ఇక్కడ ప్రాంతవాసుల్లో అనుమానాలు మాత్రం క్లియర్ అయ్యేలా కనిపించని పరిస్థితి నెలకొంది. -
GO 111: మాస్టర్‌ప్లాన్ ఇప్పట్లో లేనట్టే!
హైదరాబాద్: జీఓ 111 పరిధిలో ఎలాంటి మాస్టర్‌ప్లాన్ లేకుండానే భూ వినియోగ మార్పిడికి ప్రభుత్వం సన్నాహాలు చేపట్టింది. హెచ్ఎండీఏ నిబంధనలకు అనుగుణంగానే అనుమతులను ఇవ్వనున్నట్లు ఇప్పటికే ప్రభుత్వం స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు 111 జీఓ పరిధిలోని 84 గ్రామాలకు ప్రత్యేకంగా మాస్టర్ ప్లాన్ రూపొందించే అవకాశం లేదు. ప్రస్తుతం బయో కన్జర్వేషన్ జోన్‌లోని భూములను చేంజ్ ఆఫ్ ల్యాండ్ యూజ్ (సీఎల్‌యూ) కింద వివిధ రకాలుగా వినియోగంలోకి అనుమతులను ఇస్తారు. ప్రభుత్వ అనుమతితో భూ యజమానులు తమ భూమిని పారిశ్రామిక, నివాస, వాణిజ్య, వ్యాపార అవసరాల కోసం మార్చుకోవచ్చు. ప్రస్తుతం హెచ్ఎండీఏ పరిధిలోని వ్యవసాయ భూములను, నాలా భూములను ప్రత్యేక కమిటీ ద్వారా చేంజ్ ఆఫ్ ల్యాండ్ యూజ్ ద్వారా నివాసయోగ్యమైన స్థలాలుగా మార్పు చేస్తున్నట్లుగానే జీఓ 111 పరిధిలోని బయో కన్జర్వేషన్ భూములను కూడా మార్చుకొనేందుకు సదుపాయం ఉంటుందని ఒక అధికారి వివరించారు. ప్రస్తుతం జంట జలాశయాలకు 10 కిలోమీటర్ల వరకు ఎలాంటి నిర్మాణాలను అనుమతించడం లేదు. బఫర్ జోన్ పరిధిని ఎంత వరకు అనుమతించాలనే అంశంపై మాత్రం స్పష్టత రావాల్సి ఉందని పేర్కొన్నారు. ముంచుకొస్తున్న ఎన్నికలు.. ► మాస్టర్‌ప్లాన్ రూపకల్పనకు పెద్ద ఎత్తున కసరత్తు చేయాల్సి ఉంటుంది. ఆసక్తిగల సంస్థల నుంచి టెండర్ల ఆహ్వానించడం మొదలుకొని మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసేవరకు కనీసం18 నెలల సమ యం పడుతుంది. ఈ ప్రక్రియలో ఏ మాత్రం జాప్యం జరిగినా 2 సంవత్సరాలు కూడా దాటవచ్చు. మరి కొద్ది నెలల్లో ఎన్నికలు తరుముకొస్తున్న దృష్ట్యా ఎలాంటి మాస్టర్ ప్లాన్ లేకుండానే భూముల బదలాయింపునకు అవకాశం కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది. టౌన్ ప్లానింగ్‌కు సంబంధించిన జీఓ 168 ప్రకారం సీఎల్‌యూ అందజేయనున్నారు. మంత్రి కేటీఆర్ నేతృత్వంలో హెచ్ఎండీఏ కమిషనర్ తదితర విభాగాలకు చెందిన ఉన్నతాధికారుల కమిటీ ఆమోదంతో భూమిని మార్పు చేస్తారు. ► మరోవైపు జీఓ 111 పరిధిలోని శంషాబాద్, మెయినాబాద్, గండిపేట, చేవెళ్ల, శంకర్పల్లి, షాబాద్, కొత్తూరు మండలాల పరిధిలోని 84 గ్రామాల్లో ఉన్న 1.32 లక్షల ఎకరాల భూములలో ఇప్పటికే సుమారు 70 శాతం భూములు సినీ, రాజకీయ, రియల్ ఎస్టేట్ వ్యాపారుల చేతుల్లోకి వెళ్లిపోయాయి. ప్రస్తుతం ఆయా వర్గా లకు చెందిన భూయజమానులు తమ అవసరాలకు అనుగుణంగా సీఎల్‌యూ తీసుకొనే అవ కాశం ఉంది. భూ వినియోగ మార్పిడికి అనుమ తిచ్చే క్రమంలో జల వనరులు, అడవులు, కొండలు, గుట్టలు, నాలాలు వంటి వాటిని పరిగణనలోకి తీసుకొని వెసులుబాటు కల్పించనున్నట్లు హెచ్ఎండీఏ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఎన్నికల తర్వాతే ఒకే నగరం–ఒకే ప్రణాళిక.. ● ప్రస్తుతం హైదరాబాద్ మహానగరం మొత్తం 5 మాస్టర్ప్లాన్లతో కూడి ఉంది. మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్ (ఎంసీహెచ్), సైబరాబాద్ డెవలప్మెంట్ అథారిటీ (సీడీఏ), హైదరాబాద్ ఎయిర్‌పోర్టు డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఏడీఏ), ఓఆర్ఆర్ మాస్టర్ప్లాన్లతో పాటు 2013లో హెచ్ఎండీఏ రూపొందించిన 2030–31 మాస్టర్ ప్లాన్ కూడా అమల్లో ఉంది. ఈ అయిదు ప్రణాళికల మధ్య సమన్వయం లేకపోవడంతో అనేక రకాలుగా సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. ● అన్నింటిని కలిసి ఒకే బృహత్తర ప్రణాళికను రూపొందించేందుకు ప్రభుత్వం గతంలోనే కార్యాచరణ చేపట్టింది. ఈ క్రమంలోనే గతేడాది జీఓ 111 తొలగించనున్నట్లు ప్రకటించిన అనంతరం ‘ఒకే నగరం–ఒకే ప్రణాళిక’ లక్ష్యంతో బృహత్తర ప్రణాళిక కోసం చీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలో కమిటీని నియమించారు. ఈ కమిటీ ఒకసారి సమావేశమైంది. కానీ ముందుకు వెళ్లలేదు. ఒకే నగరం – ఒకే ప్రణాళిక లక్ష్యంతో ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న మాస్టర్‌ప్లాన్ రూపకల్పన కోసం చర్యలు చేపట్టింది. ఎన్నికల తర్వాత ఈ ప్రతిపాదనను తిరిగి ముందుకు తెచ్చే అవకాశం ఉంది. -
జీవో 111 రద్దు.. 80 శాతం భూములు కేసీఆర్ బినామీ చేతుల్లోనే: రేవంత్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో బినామీ యాక్టు పర్ఫెక్ట్గా అమలవుతోందని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి విమర్శించారు. 111 జీవో ఎత్తివేత వెనక లక్షల కోట్ల కుంభకోణం ఉందని ఆరోపించారు. 111జీవో రద్దు ముమ్మాటికీ విధ్వంసమేనని, దీని వెనక సోమేష్ కుమార్, అరవింద్ కుమార్ హస్తం ఉందన్నారు. జీవో ఎత్తివేతపై విచారణ జరగాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ తరపున నిజనిర్ధారణ కమిటీ వేసి ఎక్కడెక్కడ ఎవరెవరూ భూములు కొన్నారో తేల్చుతామని పేర్కొన్నారు. కేసీఆర్ నిర్ణయాల వల్ల హైదరాబాద్ ఆగం యువరాజు స్నేహితులకు వేలకోట్లు దోచిపెట్టడానికి ఏ111 జీవో రద్దు చేశారని రేవంత్ రెడ్డి విమర్శలు గుప్పించారు. కేటీఆర్, కవిత, సంతోష్, రంజిత్‌రెడ్డిలకు పెద్ద మొత్తంలో భూములు ఉన్నాయని.. పేదల చేతిలో 20 శాతం భూములు కూడా లేవని తెలతిపారు. దావూద్‌నైనా క్షమించొచ్చు కానీ, కేసీఆర్, కేటీఆర్‌లను క్షమించలేమని మండిపడ్డారు. కేసీఆర్ అన్నింటిని అమ్ముతున్నాడని, పరిపాలనపై పట్టులేని వ్యక్తి నిర్ణయాల వల్ల హైదరాబాద్ ఆగం అవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. 111 జీవో రద్దు అణువిస్పోటనం ‘కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక జంట నగరాలను విధ్వంసం చేస్తున్నారు. కేటీఆర్ రియల్ ఎస్టేట్ మాఫియాను తయారుచేసుకున్నాడు. హిరోషిమా నాగసాకి లాగా హైదరాబాద్‌ను తయారు చేస్తున్నారు. హైదరాబాద్ చెరువులన్నీ మాయం అయ్యాయి. 111జీవో ప్రాంతంది తాగునీటి సమస్య కానేకాదు. 111 జీవో రద్దు అణువిస్పోటనం లాంటిది. దీని వెనక ధనదాహం, అవినీతి, దోపిడీ ఉన్నాయి. 111 జీవో పరిధిలో బీఆర్ఎస్ వాళ్ళు వందలాది ఎకరాల కొన్నారు. 80 శాతం భూములు కేసీఆర్ బినామీల చేతుల్లో ఉన్నాయి. పైపుల కంపెనీ కోసం 111 జీవో రద్దు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి స్థలం కేటాయించాలి కేసీఆర్ దోపిడీలో వాట లేకపోతే సీఎం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో బండి సంజయ్, కిషన్ రెడ్డిలు చెప్పాలి. బండి సంజయ్ రంకెలెయ్యడం కాదు. 111 జీవో రద్దుపై దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేయాలి. కేసీఆర్‌ను ఉప్పు కారం పెట్టి కొట్టినా తప్పులేదు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి ఇప్పటివరకు భూ కేటాయింపులు జరగలేదు. 5100 గజాల స్థలం కోసం పైసలు కట్టాం. అయినా భూ కేటాయింపు జరగలేదు. అందుకే ఇప్పటికీ కిరాయికి ఉంటున్నాం. మా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం కోసం భూమి కేటాయించాం. కేసీఆర్ తన పార్టీ ఆఫీసుకి 11 ఎకరాలు కేటాయించుకోడం దుర్మార్గం. మా కార్యాలయానికి స్థలం కేటాయించాలని డిమాండ్ చేస్తున్నాం. చదవండి: మాసబ్ చెరువును చెరబడుతున్న రియల్ మాఫియా.. మట్టికొట్టినా లెక్కలే! తెలంగాణ కాంగ్రెస్ కు 88 సీట్లు.. రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్‌కు 88 సీట్లు వస్తాయని రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా కాంగ్రెస్ అవతరిస్తుందన్నారు. చార్లెస్ శోభరాజ్, దావూద్ ఇబ్రహీం, బిల్లా, రంగా నలుగురుకి కేసీఆర్ సమానమాని, కేసీఆర్‌కు 100 రోజుల కౌంట్‌డౌన్ స్టార్ అయ్యిందన్నారు. కేసీఆర్ తో చేతులు కలిపాక జేడీఎస్ సీట్లు తగ్గాయన్నారు. ఈసారి జరగనున్న ఎన్నికలు పేద, ధనిక ప్రజల మధ్య జరుగుతాయి’ అని తెలిపారు. 11 జీవో రద్దు ఓ పెద్ద కుట్ర: భట్టి బీఆర్ఎస్ పార్టీ నేతలకే ఐదు వేల ఎకరాలున్నాయి. ముందు ముందు ఆ వివరాలు బయట పెడతానని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ఇప్పటికే బీఆర్ఎస్ నేతలు ఊర్లమీద పడి భూములు కొటున్నారని మండిపడ్డారు.111 జీవో ప్రాంతంలో ఎవరెవరికి భూములు ఉన్నాయో బయటపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. బినామీలు, రియల్ ఎస్టేట్ వాళ్ల కోసమే 111 జీవో ఎత్తి వేశారని విమర్శించారు. 111 జీవో రద్దు ఓ పెద్ద కుట్ర అని, దీనితో రైతులకు ఒరిగిందేమి లేదన్నారు. చదవండి: ఖమ్మం పిట్టలదొర పొంగులేటి: పువ్వాడ తీవ్ర వ్యాఖ్యలు -
111 జీవో రద్దుకు తెలంగాణ కేబీనెట్ ఆమోదం
-
111 జీఓ రద్దు ఎఫెక్ట్.. ఇక నో ఫాం హౌస్..! వారికి ఎయిర్‌పోర్టు మెట్రో సేవలు
సాక్షి, సిటీబ్యూరో: నిన్న వరకు పచ్చని పంట పొలాలు.. మామిడి, సపోటా.. జామ, గులాబీ, బంతి, చేమంతి ఇతర పూలు, పండ్ల తోటలతో కనువిందు చేసిన ఆ ప్రాంతంలో.. 111 జీఓ ఎత్తివేసి ఆంక్షలు తొలగించడం ద్వారా రాబోయే రోజుల్లో గెటెడ్ కమ్యూనిటీలు.. విల్లాలు.. విశాలమైన రోడ్లు, ఎత్తైన భవనాలతో రద్దీగా మారనుంది. ఇప్పటి వరకు పక్షుల కిలకిలారావాలకు.. ప్రశాంతతకు మారుపేరుగా నిలిచిన ఆ పరిసరాలు ఇకపై వాహనాలు, పారిశ్రామిక రణఘొణ ధ్వనులతో మార్మోగనుంది. స్వచ్ఛమైన గాలిని పంచిన ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ అలలు ఇకపై మురుగునీటి దుర్వాసనను వెదజల్లుతూ ముక్కుపుటాలను అదరగొట్టనున్నాయి. వాయు కాలుష్యంతో పగటి ఉష్ణోగ్రతల్లోనూ భారీ మార్పులు చోటు చేసుకునే అవకాశం లేకపోలేదు. ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్లకపోయినా.. ఈ ప్రాంతాన్ని ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా భవిష్యత్తులో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని పర్యావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. స్వచ్ఛమైన గాలి, నీటి కోసమే.. జంటనగరాలకు తాగునీరు అందించేందుకు అప్పటి నిజాం ప్రభుత్వం నగరానికి పశ్చిమాన ఆరు టీఎంసీల నీటినిల్వ సామర్థ్యంతో హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్‌లను నిర్మించారు. నగరవాసులకు ఏళ్ల తరబడి ఈ నీళ్లే జీవనాధారంగా మారాయి. జనాభాతో పాటు నగర విసీ్త్రర్ణం, తాగునీటి అవసరాలు కూడా అనూహ్యంగా పెరగడంతో ప్రభుత్వం సింగూరు, ప్రాణహిత నదుల నుంచి తాగునీటిని తరలించారు. ఆ తర్వాత ఇటు కృష్ణా, అటు గోదావరి నదుల నుంచి నీటిని తరలిస్తున్నారు. జంట జలాశయాల పరిరక్షణ కోసం అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1996లో 111 జీఓను తీసుకొచ్చింది. జంట జలాశయాల చుట్టూ పది కిలోమీటర్లు.. 7 మండలాలు.. 84 గ్రామాల పరిధిలో సుమారు 1.32 లక్షల ఎకరాల భూమిని ఈ జీఓ పరిధిలోకి తీసుకొచ్చింది. పంటల సాగు మినహా ఇక్కడ ఎలాంటి వాణిజ్య, పారిశ్రామిక కార్యకలాపాలు నిర్వహించకూడదని ఆంక్షలు విధించింది. ఫలితంగా నీరు కలుషితం కాకుండా సమస్త ప్రాణి కోటికి జీవనాధారంగా మారింది. అంతేకాదు నగరానికి పై భాగంలో నిర్మించిన ఈ నదుల్లోని నీటి అలలపై వీచే స్వచ్ఛమైన, చల్లని గాలి ఆ పరిసర ప్రాంతాలను అహ్లాదంగా మార్చింది. పండ్లు, పూల తోటలకు నెలవు.. జంట జలాశయాల చుట్టూ సారవంతమైన భూములు ఉండటంతో సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖులు ఇక్కడ భారీగా భూములు కొనుగోలు చేశారు. వీటి చుట్టూ ఫెన్సినింగ్లు, ప్రహరీలు ఏర్పాటు చేసుకున్నారు. ఫాంహౌస్‌లు నిర్మించి వీకెండ్లో కుటుంబ సభ్యులతో ఇక్కడికి వచ్చి సేదతీరే వారు. మిగిలిన ఖాళీ భూముల్లో పండ్లు, పూల తోటలు సాగు చేయించారు. ఎటూ చూసినా ఎత్తైన చెట్లు కన్పించేవి. ఇతర ప్రాంతాలతో పోలిస్తే ఇక్కడ పగటి ఉష్ణోగ్రతలు కూడా చాలా తక్కువ. వర్షాలు సమృద్ధిగా కురిసేవి. వాతావరణ కాలుష్యం కూడా చాలా తక్కువగా ఉండేది. ప్రస్తుతం 111 జీఓ ఆంక్షలను పూర్తిగా ఎత్తివేయడంతో పండ్లు, పూలు, కాయకూరల సాగుతో ఇప్పటి వరకు సిటిజన్ల అవసరాలు తీర్చిన ఈ ప్రాంతం.. భవిష్యత్తులో ఆ అవసరాలు తీర్చలేకపోచ్చని నిపుణులు ఆందోళన చెందుతున్నారు. పశ్చిమాన మరో కొత్త నగరం.. నగరానికి పశ్చిమ ప్రాంతంలో ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలకు పెద్ద ఎత్తున ల్యాండ్ బ్యాంక్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ ప్రాంతం ఇటు బెంగళూరు హైవేకు.. అటు ముంబై హైవేలకు మధ్యలో ఉండటం, అంతర్జాతీయ విమానాశ్రయంతో పాటు ఓఆర్ఆర్ ఉండటం పెట్టుబడిదారులకు కలిసి వచ్చే వచ్చే అంశం. తాజాగా ప్రభుత్వ నిర్ణయంతో ఇక్కడ బహుళ అంతస్తుల నిర్మాణాలు, గేటెడ్ కమ్యూనిటీలు, విల్లా ప్రాజెక్టులు పెద్ద ఎత్తున వచ్చే అవకాశం ఉంది. వ్యాపార, వాణిజ్య సముదాయాలు, స్టార్ హోటళ్లు వెలవనున్నాయి. మొత్తంగా ఇక్కడ మరో కొత్త నగరం ఆవిష్కృతమయ్యే అవకాశం ఉంది. జీఓ కారణంగా ఇప్పటి వరకు అభివృద్ధికి నోచుకోకుండా వెనుకబడిపోయిన ఆయా గ్రామాలు ఇకపై మరో కొత్త నగరంలో అంతర్భాగమై అభివృద్ధిలో దూసుకుపోనున్నాయి. వీరికి ఎయిర్‌పోర్టు మెట్రో సేవలు ప్రభుత్వం ఎత్తివేసిన జీఓ 111 ప్రాంతవాసులకు ఎయిర్‌పోర్టు మెట్రో సేవలు లభించనున్నాయి. ఔటర్ అంచున ఉన్న మంచిరేవుల, నార్సింగి, తెలంగాణ పోలీస్ అకాడమీ, హిమాయత్‌సాగర్, కిస్మత్‌పురా, బుద్వేల్, రాజేంద్రనగర్, కొత్వాల్‌గూడ, రాళ్లగూడ, తొండుపల్లి, శంషాబాద్, చిన్నగోల్కొండ, పెద్దగోల్కొండ, తదితర ప్రాంతాలకు మెట్రో సేవలు అందుబాటులోకి రానున్నాయి. మెట్రో సదుపాయంతో జీఓ 111 ప్రాంతానికి చెందిన ప్రజలు వివిధ ప్రాంతాల నుంచి రాయదుర్గం, అమీర్‌పేట్, సికింద్రాబాద్, ఎంజీబీఎస్, జేబీఎస్, సికింద్రాబాద్, నాంపల్లి రైల్వేస్టేషన్లు.. ఇలా ఎక్కడికై నా వెళ్లేందుకు అవకాశం లభిస్తుంది. ప్రస్తుతం నాగోల్ నుంచి రాయదుర్గం వరకు ఉన్నట్లుగానే శంషాబాద్ నుంచి రాయదుర్గం వరకు ప్రయాణికుల రద్దీ అత్యధికంగా ఉండవచ్చని నిపుణులు భావిస్తున్నారు. -
హైదరాబాద్‌లో ఆ ఏరియా ఇళ్లే కావాలి.. కొనుక్కునేందుకు ఎగబడుతున్న జనం?
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ రియల్టీ రంగంపై 111 జీవో ఎత్తివేత ప్రభావం గట్టిగానే పడనుంది. చదరపు అడుగు (చ.అ.) రూ.6 వేల కంటే ఎక్కువ ధర ఉన్న ప్రాజెక్ట్‌లలో కొనుగోళ్లకు కస్టమర్లు పునరాలోచనలో పడ్డారు. ఎక్కువ ధర పెట్టి అపార్ట్మెంట్లలో కొనుగోలు చేసే బదులు అదే ధరకు 111 జీవో పరిధిలోని గ్రామాలలో వ్యక్తిగత గృహాలు, విల్లాలు కొనుగోలు చేయవచ్చనే భావన కొనుగోలుదారులలో పెరిగిపోయింది. దీంతో పశ్చిమ హైదరాబాద్‌లోని హైరైజ్, లగ్జరీ ప్రాజెక్ట్‌లలో విక్రయాలు తగ్గిపోతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. పశ్చిమంలో 50 వేల యూనిట్లు.. హైదరాబాద్ స్థిరాస్తి రంగంలో పశ్చిమ హైదరాబాద్ కీలకమైనది. ఐటీ, ఐటీ ఆధారిత కంపెనీల కారణంగా ఈ ప్రాంతాలలో గృహ కొనుగోళ్లు, లాంచింగ్‌లు ఎక్కువగా ఉంటాయి. ఏటా హైదరాబాద్‌లోని రియల్టీ క్రయవిక్రయాలలో వెస్ట్ హైదరాబాద్ వాటా 60 శాతం ఉంటుంది. కూకట్పల్లి, మాదాపూర్, కొండాపూర్, గచ్చిబౌలి, రాయ దుర్గం, కోకాపేట, గోపన్‌పల్లి, నల్లగండ్ల వంటివి పశ్చిమ హైదరాబాద్ ప్రాంతాలలో సుమారు 10 కోట్ల చ.అ.లలో నివాస సముదాయాలు నిర్మాణంలో ఉన్నాయి. వీటిల్లో సుమారుగా 50 వేల యూనిట్లు ఉంటాయని అంచనా. 111 జీవో రద్దుతో ఆయా ప్రాజెక్ట్‌ల డెవలపర్లు డోలాయమానంలో పడ్డారు. ప్రీలాంచ్ నిర్మాణాలకు బ్రేక్.. కోకాపేట, నార్సింగి, పుప్పాలగూడ వంటి వెస్ట్ హైదరాబాద్‌లోని చాలా ప్రాంతాలలో డెవలపర్లు ప్రీలాంచ్లో విక్రయాలు చేశారు. ధర తక్కువకు వస్తుంది కదా అని కొనుగోలుదారులూ ఎగిరి గంతేసి బిల్డర్లతో అగ్రిమెంట్లు చేసుకున్నారు. ప్రస్తుతం ఆయా ప్రాజెక్ట్‌లన్నీ నిర్మాణ దశలో ఉన్నాయి. గత 3–4 నెలలుగా మార్కెట్ ప్రతికూలంగా మారడంతో లగ్జరీ ప్రాజెక్ట్‌లలో కొనుగోళ్లు క్రమంగా తగ్గుముఖం పట్టాయి. విక్రయాలు లేకపోవటం, నిధుల లేమి కారణంగా చాలా వరకు ప్రాజెక్ట్ నిర్మాణ పనులు నెమ్మదించాయి. తాజాగా 111 జీవో రద్దు ప్రకటించిన నాటి నుంచే పరిస్థితి మరింత క్లిష్టంగా మారింది. ప్రీలాంచ్లోని పలువురు కస్టమర్లు డెవలపర్‌తో చేసుకున్న ఒప్పందాలను రద్దు చేయమని నిర్మాణ సంస్థల ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. కట్టిన డబ్బులు తిరిగి ఇవ్వాలంటూ డెవలపర్లను కోరుతున్నారని స్పేస్ విజన్ గ్రూప్ సీఎండీ టీవీ నర్సింహా రెడ్డి తెలిపారు. స్పష్టత వచ్చేదాక స్తబ్ధుగానే.. జంట జలాశయాల పరిరక్షణ కోసం తెచ్చిన జీవో 111ను ప్రభుత్వం ఎత్తేసి 69 జీవో తీసుకొచ్చినా స్థానిక భూ యజమానులు మాత్రం వేచిచూసే ధోరణిలో ఉన్నారు. వెంటనే భూములు అమ్మడానికి ఆసక్తి చూపడంలేదు. నగరానికి అతి చేరువలో ఉన్న ఈ ప్రాంతంలో మునుముందు భూముల ధరలు మరింత పెరిగే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. ప్రభుత్వం గ్రీన్ జోన్, బఫర్ జోన్లు చేస్తామని ప్రకటించింది. దీంతో ఏయే ప్రాంతాలు గ్రీన్ జోన్లో ఉంటాయి? ఏ ప్రాంతాలు బఫర్ జోన్లో ఉంటాయనే విషయంలో స్పష్టత లేదు. దీంతో ఇప్పుడు భూములు ఎందుకు అమ్ముకోవాలని రైతులు ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది. అవసరాల కోసం కొందరు రైతులు భూములు అమ్మకానికి పెట్టినా గతం కంటే ఎక్కువ ధరలే చెబుతున్నారు. జీవో 69 విధివిధానాలను మాత్రం ఖరారు చేయలేదు. భవన నిర్మాణ నిబంధనలు, జలాశయాల సంరక్షణకు తీసుకోవాల్సిన చర్యలు, జోన్ల ఏర్పాటు, మాస్టర్ ప్లాన్ వంటి వాటిపై స్పష్టత వస్తే ఇక్కడి భూములకు మరింత గిరాకీ ఉంటుంది. ప్రభావిత ప్రాంతాలివే.. కొల్లూరు, తెల్లాపూర్, నల్లగండ్ల, గోపన్‌పల్లి, నానక్‌రాంగూడ, ఖానామెట్, నార్సింగి, కోకాపేట, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, పుప్పాలగూడ వంటి 111 జీవో పరిధిలోని 10 కి.మీ. క్యాచ్మెంట్ ఏరియాకు ఆనుకొని ఉన్న ప్రాంతాలలో ఈ ప్రభావం తీవ్రంగా ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. రెండున్నర దశాబ్ధాల కలను ప్రభుత్వం సాకారం చేసింది. 111 జీవోను ఎత్తివేస్తూ రాష్ట్ర క్యాబినేట్ నిర్ణయం తీసుకుంది. దీంతో 84 గ్రామాల్లోని 1.32 లక్షల ఎకరాలకు పైగా భూమి అందుబాటులోకి వస్తుంది. ఆహ్వానించదగ్గ పరిణామమే.. కానీ, ఆ ఫలాలు నిజంగా స్థానిక రైతులకు అందుతాయా అనేదే మిలియన్ డాలర్ల ప్రశ్న. నిర్మాణ నిబంధనల సాకు చూపి ఇప్పటికే 60 శాతానికి పైగా భూములు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్లిపోయాయి. దీంతో జీవో రద్దు ఫలాలు ఎవరికి దక్కుతాయనేది సుస్పష్టం. చదవండి👉 ఫ్లాష్‌బ్యాక్: ఆ నిర్ణయంతో..అతలాకుతలం -
111 జీవో ఎత్తివేత.. 84 గ్రామాల్లో సంబరాలు
జీవో 111 అంటే ఏంటి? అసలు దీని వెనుక ఉన్న కథేంటి? ఎందుకు జీవో ఎత్తివేయాలని ప్రభుత్వం ఎందుకు అనుకుంది? 111 జీవో రద్దుకు క్యాబినెట్ ఆమోద ముద్ర పడటంతో ఎవరికి ప్రయోజనం? ఎవరికి నష్టం ? అసెంబ్లీ వేదికగా గతంలో 111 జీవోపై కీలక నిర్ణయం కేసీఆర్ ప్రకటించారు. తాజాగా 111 జీవో రద్దు చేస్తూ క్యాబినెట్ ఆమోద ముద్ర వేసింది. 111 జీవో పరిధిలో పరిధిలో 1,32,600 ఏకరాల భూమి ఉంది. గతంలో జంట జలాశయ పరిరక్షణ కోసం ఈ జీవోను తెచ్చారు. హైదరాబాద్ నగరానికి ఇప్పుడు ఈ జలాశయాల నీరు అవసరం లేదని, ఇంకో వంద సంవత్సరాల వరకు హైదరాబాద్ కు నీటి కొరత ఉండదుని అందుకే ఇప్పుడున్న పరిస్థితుల్లో 111 జీవో అర్థరహితం అని కేసీఆర్ భావించారు. ఈ మేరకు అప్పట్లో ఒక నిపుణులు కమిటీ వేశారు. ఎక్స్పర్ట్స్ కమిటీ నివేదిక రాగానే 111 జీవో ఎత్తివేస్తాం అంటూ గతంలో సీఎం ప్రకటించారు. తాజాగా క్యాబినెట్ లో 111 రద్దుకు ఆమోద ముద్ర పడింది రియల్ ఎస్టేట్ రికార్డులు.. 111 వన్ జీవో.. చేవెళ్ల, రాజేంద్ర నగర్ నియోజకవర్గాల్లోని 84 గ్రామాల వ్యధ గుర్తుకు వస్తుంది. లక్ష 32 వేల ఎకరాల భూమి కథ ఇది... ఈ త్రిపుల్ వన్ జీవో. చాలా మంది పెద్దమనుషులు పెట్టుబడులకు కేరాఫ్ అడ్రస్ ఈ ప్రాంతం. ఒక్కసారి జీవో ఎత్తేస్తే… అక్కడ జరిగే రియల్ ఎస్టేట్ రికార్డులు సృష్టిస్తోంది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 1,32,000 ఎకరాల్లో విస్తరించి ఉంది GO.111. ఏకంగా 84 గ్రామాలు ఈ జీవో పరిధిలోకి వస్తాయి. కొన్ని దశాబ్దాలుగా ఈ గ్రామాల ప్రజలు త్రిబుల్ వన్ ఎత్తివేయాలని డిమాండ్ చేస్తున్నారు. హైదరాబాద్ పట్టణానికి నీరందించే జంట జలాశయాలు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్‌ను కాపాడేందుకు 1996లో అప్పటి ప్రభుత్వం జీవో 111ను తీసుకువచ్చింది. ఈ జీవో పరిధిలో నిర్మాణాలు చేయడంపై నిషేధం విధించింది. వ్యవసాయం తప్ప ఏ రంగానికి ఇక్కడ భూమి కేటాయింపు చేయకూడదు. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక త్రిబుల్ వన్ GO ఎత్తి వేస్తామంటూ ఎన్నికల హామీలు ఇచ్చాయి రాజకీయ పార్టీలు. దీంతో త్రిబుల్ వన్ జీరో పరిధిలో లావాదేవీలు పెద్ద ఎత్తున పెరిగాయి. చాలా ఏళ్లుగా పోరాటం.. రెండు తెలుగు రాష్ట్రాల్లోని బడా పారిశ్రామికవేత్తలు, రాజకీయ నాయకుల నుంచి రియల్ ఎస్టేట్ వ్యాపారుల వరకు చిన్నాపెద్ద అంతా 111 జీవోలో భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టారు. వెంచర్లు అక్రమ నిర్మాణాలతో రియల్ ఎస్టేట్ ట్రేడింగ్ భారీగా జరుగుతుంది. 111 జీవో ఎత్తివేయాలంటూ టీఆర్ఎస్ నేత పట్లోళ్ల కార్తీక్ రెడ్డి కోర్టులో చాలా ఏళ్లుగా పోరాడుతున్నారు. సీఎం కేసీఆర్ నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు ఈ ప్రాంత ప్రజలు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం కూడా జీవో ఎత్తివేయాలని ఉద్దేశంతోనే ఉంది. ఈ అంశం తెరపైకి వచ్చిన ప్రతిసారి రంగారెడ్డి ప్రజలంతా ఆశతో ఎదురు చూస్తూ ఉంటారు. హైకోర్టు కొద్ది రోజుల క్రితం ప్రభుత్వం వేసిన కమిటీ రిపోర్టు అడగడంతో.. సీఎం కేసీఆర్ 111 జీవోపై సమీక్ష జరిపారు. రిపోర్టు కోర్టుకు అందించేందుకు కొంత సమయం కావాలని అడగాలని నిర్ణయించుకుంది. అంతేకాకుండా జీవో పరిధిలో మరింత ఉండేలా, జంట జలాశయాలు కాలుష్యం బారిన పడకుండా ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. హైదరాబాద్ నగర వాతావరణ సమతుల్యతను పెంచేలా ప్రణాళికలు ఉండాలని సూచించారు. సంబరాలు మొత్తానికి 111జీవో పరిధిలో ఉన్న భూములు ఇక బంగారం కానున్నాయి. జీవో రద్దుతో 84 గ్రామాల్లోని ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారు. అజీజ్ నగర్ గ్రామస్థులు స్వీట్లు పంచి ఆనందం వ్యక్తం చేశారు. చదవండి: 111 పూర్తిగా రద్దు.. వీఆర్ఏల క్రమబద్ధీకరణ.. కేబినెట్ కీలక నిర్ణయాలివే.. -
‘జీవో 111’ ట్రబుల్ వన్.. ఆ 84 గ్రామాల్లో నిర్మాణాలపై ఆంక్షలు
సాక్షి, హైదరాబాద్: ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ జంట జలాశయాల పరిరక్షణ కోసం జారీ చేసిన 111 జీవోను రద్దు చేసి కొత్త మాస్టర్ ప్లాన్‌ను రూపొందిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించి ఏడాది కావస్తున్నా.. నేటికీ అడుగు ముందుకుపడలేదు. ప్రస్తుతం రాజధాని దాహార్తిని తీర్చేందుకు ఈ జంట జలాశయాల మీద ఆధారపడాల్సిన అవసరం లేదని భావించిన రాష్ట్ర ప్రభుత్వం.. 1996లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచి్చన 111 జీవోను రద్దు చేస్తూ గతేడాది ఏప్రిల్ 19న జీవో నంబర్ 69ను విడుదల చేసింది. జీవో పరిధిలోని 84 గ్రామాలకు ప్రత్యేకంగా మాస్టర్ ప్లాన్‌ను రూపొందిస్తామని ప్రకటించింది. కానీ నేటికీ ఆయా గ్రామాలు హెచ్ఎండీఏ మాస్టర్‌ప్లాన్ ప్రకారం జీవసంరక్షణ మండలి(బయో కన్జర్వేషన్ జోన్)లోనే కొనసాగుతున్నాయి. గతంలో ఉన్న ఆంక్షలే ఇప్పటికీ అమలులో ఉండడంతో నిర్మాణదారులకు ఇక్కట్లు తప్పడంలేదు. చిత్తశుద్ధిలేని కమిటీ.. కొత్త మాస్టర్ ప్లాన్‌ను సాధ్యమైనంత త్వరగా రూపొందిస్తామని చెప్పిన ప్రభుత్వం ఇందుకోసం సీఎస్ నేతృత్వంలో కమిటీని వేసింది. పురపాలక, ఆర్థిక, నీటిపారుదల శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, జలమండలి ఎండీ, కాలుష్య నియంత్రణ మండలి సభ్య కార్యదర్శి, హెచ్ఎండీఏ డైరెక్టర్ (ప్లానింగ్) సభ్యులుగా ఉండే ఈ కమిటీ.. ఏయే అంశాలను పరిశీలించి నివేదిక ఇవ్వాలన్న దానిపై విధివిధానాలను కూడా ఖరారు చేసింది. రెండు రిజర్వాయర్ల పరిరక్షణ, కాలుష్య నివారణకు అవసరమైన చర్యలను సూచించాలని అలాగే ప్రధాన మౌలిక సదుపాయాల కల్పనకు విధానాలను రూపొందించాలని ఆదేశించింది. మురుగు, వరద కాల్వల నిర్మాణం, మురుగునీటి నిర్వహణ ప్లాంట్ల (ఎస్టీపీలు) ఏర్పాటు, నిధుల సమీకరణ, లేఅవుట్లు, నిర్మాణాల అనుమతికి సంబంధించిన విధివిధానాలతో పాటు న్యాయపరమైన అంశాలనూ పరిశీలించాలని సూచించింది. ఈ మేరకు తొలిసారి భేటీ అయిన కమిటీ కేవలం ప్రాథమిక అంశాలను మాత్రమే చర్చించి మమ అనిపించింది. మాస్టర్‌ప్లాన్ రూపకల్పన బాధ్యతను కన్సల్టెన్సీకి అప్పగించాలని సూత్రప్రాయంగా నిర్ణయించినా ఇప్పటివరకు కార్యరూపం దాల్చలేదు. దీంతో జీవో 69 అమలుపై ఒక్కడుగు కూడా ముందుకు పడలేదు. నిర్మాణదారులకు ఇక్కట్లు.. జంట జలాశయాల చుట్టూ 10 కిలోమీటర్ల పరిధిలోని 84 గ్రామాల పరిధిలో 1.32 లక్షల ఎకరాల భూమి అందుబాటులో ఉంది. ఆయా భూముల్లో ఇప్పటికే సంపన్న వర్గాలు, పారిశ్రామికవేత్తలు, సినీ, రాజకీయ ప్రముఖులు, ఉన్నతాధికారులు తక్కువ ధరకు పెద్ద ఎత్తున స్థలాలను కొనుగోలు చేసి ఫామ్‌హౌస్‌లు, రిసార్ట్‌లను నిర్మించుకున్నారు. ఇవే కాకుండా అనధికారిక లే–అవుట్లూ వేల సంఖ్యలోనే ఉన్నాయి. అయితే ప్రస్తుతం 111 జీవో ఎత్తివేసినందున నిర్మాణాలపై ఆంక్షల్లేవని భావించి అనుమతుల కోసం స్థానిక పట్టణ, పంచాయతీలను ఆశ్రయిస్తున్న రియల్టర్లు/భవన నిర్మాణదారులకు నిరాశే మిగులుతోంది. పర్మిషన్లు జారీ చేయకపోవడంతో అభ్యంతరం వ్యక్తం చేస్తూ కొందరు ఏకంగా న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అయితే, 111 జీవో ఇంకా మనుగడలోనే ఉందని హైకోర్టుకు ప్రభుత్వం నివేదించడంతో 69 జీవో అమలుపై నీలినీడలు కమ్ముకున్నాయి. గ్రామస్తులు ఏదైనా నిర్మాణం చేపట్టేందుకు అనుమతులు కోసం వెళితే ఆంక్షల నెపంతో దరఖాస్తులను తిరస్కరిస్తున్నారని, అదే పలుకుబడి ఉన్న నాయకులు, ఆమ్యామ్యాలు సమర్పించుకునే డెవలపర్లకైతే ఎలాంటి అడ్డంకులు లేకుండా అనుమతులు ఇస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
కేటీఆర్ వెయ్యి ఎకరాల భూ కుంభకోణం చేశారు: రేవంత్ ఫైర్
సాక్షి, ఖమ్మం: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి హాత్ సే జోడో యాత్రలో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే ధరణి పోర్టల్‌పై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. 111 జీవో ప్రకారం కేటీఆర్ వెయ్యి ఎకరాల కుంభకోణం చేశారని ఆసక్తికర కామెంట్స్ చేశారు. కాగా, రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. తోట చంద్రశేఖర్‌కు కేటాయించిన భూములపై విచారణ చేయాలి. సీఎం కేసీఆర్ నీతిమండుడైతే విచారణకు సిద్ధం కావాలి. పేదలకు డబుల్ బెడ్ రూమ్స్ ఎందుకు ఇవ్వలేదు. రుణమాఫీ ఎందుకు అమలు చేయలేదు. ఫీజు రీయింబర్స్మెంట్ లేదు.. ఆరోగ్యశ్రీ కింద 850 కోట్ల బకాయి ఉంది. రైతులకు అనుకూలమైన విధానాలను కాంగ్రెస్ తెచ్చింది. కేసీఆర్ ఆడంబరంగా ఉచిత్ విద్యుత్ అన్నాడు.. కానీ ఇవ్వడంలేదు. ప్రైవేటు విద్యుత్ సంస్థల నుంచి 50 శాతం కమీషన్లు తీసుకున్నాడు. విద్యుత్ సంస్థలను నిర్వీర్యం చేశాడు. 2014 నుండి నేటి వరకు ఉచిత విద్యుత్ 20 వేల కోట్లు మొండి బకాయిగా మారింది. విద్యుత్ కార్యాలయం ఎర్రమంజిల్‌తో పాటు అన్ని తనాఖాలో ఉన్నాయి. యాదాద్రి పవర్ ప్లాంట్ కూడా సొంత మనుషులకు ఇప్పించి కుంభకోణాలకు పాల్పడ్డారు. రానున్నది కాంగ్రెస్ ప్రభుత్వమే. మేము అధికారంలోకి వచ్చాక భూముల సంగతి తెలుస్తాము అంటూ కామెంట్స్ చేశారు. -
కౌంటర్ దాఖలుకు 15 ఏళ్లా?
సాక్షి, హైదరాబాద్: జీవో 111పై దాఖలైన పిటిషన్లో రెండు వారాల్లోగా కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని, ఇదే చివరి అవకాశమని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు స్పష్టం చేసింది. 2007లో పిటిషన్ దాఖలు చేస్తే.. ఇప్పటివరకు స్పందించకపోవడాన్ని తీవ్రంగా తప్పుబట్టింది. హిమాయత్ సాగర్, ఉస్మాన్‌సాగర్ పరీవాహక ప్రాంత పరిరక్షణకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టలేదంటూ ఫోరం ఫర్ ఏ బెటర్ హైదరా బాద్(ఎన్జీవో), ఒమిమ్ మానెక్షా డెబారా పిటిషన్ దాఖలు చేశారు. జలాశయాల ఫుల్ ట్యాంక్ లెవల్(ఎఫ్టీఎల్) నుంచి 10 కిలోమీటర్ల వరకు రక్షణ కల్పించాల్సి ఉండగా.. ఆక్రమణలు, నిర్మాణాలు చోటుచేసుకున్నాయన్నారు. ఇది జీవో 111ను, సుప్రీంకోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించినట్లేనని పేర్కొన్నారు. ఇప్పటివ రకు నిర్మాణాలకు ఇచ్చిన అనుమతులన్నింటినీ రద్దు చేసేలా, కాలుష్యం బారి నుంచి జలాశయాలను రక్షించేలా ప్రభుత్వానికి ఆదేశాలివ్వాలని కోరారు. జీవో 111 వివాదం సుప్రీంకోర్టు, హైకోర్టుల్లో ఉండగానే ప్రభుత్వం ఆ జీవోను ఎత్తేస్తూ మరో జీవో 69 జారీ చేసిందని, దీనిని కొట్టేయాలని పిటిషనర్ ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ సీవీ భాస్కర్ రెడ్డి ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫున సీనియర్ అడ్వొకేట్ కేఎస్ మూర్తి వాదనలు వినిపించారు. జీవో 111లోని నిబంధనలు, పరిమితులన్నీ జీవో 69లో పొందిపరిచినట్లు సర్కార్ చెబుతోందని.. అయితే జలాశయాల పరిరక్షణ కోసం నియమించిన కమిటీ సూచనలు అందులో చేర్చలే దన్నారు. ఈ సూచనలను జీవో 69లో చేర్చేలా ఆదేశాలివ్వాలని విజ్ఞప్తి చేశారు. సుప్రీంకోర్టు కూడా జీవో 111లోని పరిమితులను మార్చవద్దని చెప్పిందని గుర్తు చేశారు. జీవో 69 తేవడం సుప్రీంకోర్టు ఉత్తర్వులకు విరుద్ధమేనని వెల్లడించారు. ప్రభుత్వం తరఫు న్యాయవాది వాదిస్తూ, కౌంటర్ వేసేందుకు 3 వారాల గడువు కావాలన్నారు. వాదనలు విన్న ధర్మాసనం.. 15 ఏళ్లుగా కౌంటర్ దాఖలు చేయక పోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు ఖర్చుల కింద రూ.25,000 చెల్లిస్తేనే వాయిదాకు అనుమతిస్తామంది. ఈ క్రమంలో హెచ్ఎండీఏ తరఫు న్యాయవాది రామారావు కలుగజేసుకుని.. జీవో 111ను సవాల్ చేసిన రిట్లతో పాటు ఆ జీవోను రద్దు చేయాలని కోరుతూ కూడా రిట్లు దాఖలయ్యాయని చెప్పా రు. జీవో 69 విషయంలో దాఖలైన ఇంప్లీడ్ పిటిషన్ కూడా ఉందన్నారు. కౌంటర్ వేసేందుకు గడువు ఇవ్వాలని కోరారు. దీంతో 2 వారాల గడువు ఇస్తూ విచారణను సెప్టెంబర్ 14కు వాయిదా వేసింది. -
69 జీఓను రద్దు చేయాలి: పలు సంఘాల సంయుక్త ప్రకటన
సాక్షి, హైదరాబాద్: జంట జలాశయాల పరిరక్షణకు ఉద్దేశించిన 111 జీఓను ఎత్తివేస్తూ ప్రభుత్వం జారీ చేసిన 69 జీఓను తక్షణం రద్దు చేయాలని పలు సంఘాల ప్రతినిధులు సంయుక్త ప్రకటన విడుదల చేశారు. 84 గ్రామాల పరిధిలో పట్టణీకరణ కోసం జారీచేసిన తాజా జీఓతో జంట జలాశయాలు మురుగు కాల్వల్లా మారతాయని ఆక్షేపించారు. నగర జనాభా 2050 నాటికి రెట్టింపవుతుందని, తాగునీటి అవసరం అనూహ్యంగా పెరుగుతుందన్నారు. పట్టణీకరణ వల్ల వర్షపునీటి ప్రవాహానికి అడ్డంకులు తలెత్తి వరదల ఉద్ధృతి పెరుగుతుందని ఆందోళన వ్యక్తంచేశారు. ప్రకటన విడుదల చేసినవారిలో హెచ్ఆర్ఎఫ్ ఉపాధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వి.బాల్‌రాజ్, తిరుపతయ్య, ఉభయ రాష్ట్రాల సమన్వయ కమిటీ సభ్యులు వి.వసంతలక్ష్మి, డబ్ల్యూఐసీసీఐ అధ్యక్షుడు లుబ్నాసర్వత్, సిటిజన్స్ ఫర్ హైదరాబాద్ ప్రతినిధి కాజల్ మహేశ్వరి, ఫ్రైడేస్ ఫర్ ఫ్యూచర్ ప్రతినిధి ఫరిహా ఫాతిమా, అనన్య సంగమేశ్వర్లున్నారు. (క్లిక్: హైదరాబాద్ కలెక్టర్‌గా అమయ్‌కుమార్) -
111 జీవో ఎత్తివేతతో జరిగేది ఇదే?
సాక్షి, హైదరాబాద్: సుదూర ప్రాంతాల నుంచి జంట జలాశయాలకు ఏటా వలస వచ్చే రాజహంసలు.. బాతులు.. కొంగలు.. గోరింకలు.. డేగలు తదితర పక్షుల జాడ క్రమంగా కనుమరుగు కానుందా? జీవో 111 ఎత్తివేతతో సుందర జలాశయాల చుట్టూ గృహ, వాణిజ్య, పారిశ్రామిక సముదాయాలు, కాంక్రీట్ మహారణ్యం పెరిగి.. శబ్ద, వాయు కాలుష్యం, పక్షుల సహజ ఆవాసాలైన జలాశయాలను కాలుష్య కాసారంగా మార్చేయనుందా? ఈ ప్రశ్నలకు పర్యావరణ వేత్తలు, పక్షి ప్రేమికులు అవుననే సమాధానమిస్తున్నారు. ► సైబీరియా.. యూరప్.. ఆఫ్రికా.. మయన్మార్, అఫ్గానిస్థాన్, పాకిస్థాన్ తదితర దేశాల నుంచి జంట జలాశయాలకు ఏటా అక్టోబరు నుంచి ఫిబ్రవరి మధ్య కాలంలో వేలాదిగా విభిన్న రకాల పక్షి ప్రజాతులు తరలివస్తాయి. హిమాయత్‌సాగర్‌కు సుమారు 200 వరకు గుజరాత్ నుంచి రాజహంసలు వలస రావడం పరిపాటే. మొత్తంగా ఈ జలాశయానికి 52 రకాలు, ఉస్మాన్‌సాగర్‌కు 92 రకాల పక్షి జాతులు వలస వస్తాయి. ► జలాశయాల చుట్టూ గృహ, వాణిజ్య, పారిశ్రామిక సముదాయాలు ఏర్పడిన పక్షంలో వలస పక్షులకు సమీప భవిష్యత్‌లో గడ్డు పరిస్థితులు తప్పవని పక్షి ప్రేమికులు ఆందోళన చెందుతున్నారు. విభిన్న రకాల గోరింక ప్రజాతులకూ ఇక్కట్లేనని చెబుతున్నారు. సుమారు పదివేల కిలోమీటర్ల దూరం నుంచి వలసవచ్చే బార్‌హెడ్‌గూస్ (బాతు) జాడ కూడా కనిపించదని స్పష్టం చేస్తున్నారు. ఆఫ్రికా ఖండం నుంచి వలస వచ్చే పైడ్ క్రస్టెడ్ కకూ అనే పక్షి రాక ఉండదని చెబుతున్నారు. వలస వచ్చే ప్రధాన పక్షి జాతులివే: గుజరాత్ రాజహంసలు (గ్రేటర్ ఫ్లెమింగోలు), పిన్‌టెయిల్డ్ డక్(బాతు), షౌలర్,గార్గినే టేల్, హ్యారియర్స్ డేగలు, ఫ్లైక్యాచెస్, గోరింక ప్రజాతికి చెందిన రోజీపాస్టర్స్, స్టార్‌లింక్స్, భార్మెడోగూస్ బాతు, పైడ్ క్రస్టడ్ కకూ వీటిలో ప్రధానంగా కొంగలు, బాతులు, డేగలు, గుడ్లగూబలు, నీటికోళ్లు తదితర జాతులున్నాయి. (క్లిక్: ఈ పిల్లిని ఎలా రక్షిస్తారు? పోలీసు ఫేస్బుక్లో పోస్టు చేస్తూ..) నగరీకరణ, కాలుష్యం పెరిగితే కష్టమే జంటజలాశయాల చుట్టూ సమీప భవిష్యత్‌లో పట్టణీకరణ ప్రభావం, శబ్ద, వాయు కాలుష్యాలకు అవకాశం ఉంది. దీంతో సుదూర ప్రాంతాల నుంచి నగరానికి వలస వచ్చే పక్షిజాతుల జాడ కనిపించదు. జీవవైవిధ్యం ప్రమాదంలో పడుతుంది. – డాక్టర్ శ్రీనివాసులు, ప్రొఫెసర్, జంతుశాస్త్ర విభాగం ఉస్మానియా విశ్వవిద్యాలయం -
ఇటు ఢమాల్!
నానక్‌రామ్‌గూడలో ఐదెకరాల్లో ఎత్తయిన ఆకాశహర్మ్యాన్ని నిర్మిస్తున్నాం. 800కు పైగా యూనిట్లు. ధర చదరపు అడుగుకు రూ. 8 వేలు. ప్రాజెక్టుకు పునాదిరాయి పడటం.. నిర్మాణ పనులు శరవేగంగా జరగడంతో ప్రతి నెలా 70–80 యూనిట్లు అమ్ముడుపోయేవి. 111 జీవో ఎత్తివేత ప్రకటనతో అమ్మకాలు తగ్గిపోయాయి. కనీసం రెండంకెల సంఖ్యను కూడా చేరుకోవట్లేదు... ఇదీ ఓ లగ్జరీ ప్రాజెక్టు డెవలపర్ ఆవేదన సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ స్థిరాస్తి రంగంపై జీవో 111 రద్దు ప్రభావం బాగా పడింది. ముఖ్యంగా నగర రియల్టీకి ఆయువు పట్టువైన పశ్చిమ హైదరాబాద్‌పై దీనిప్రభావం ఎక్కువగా ఉంది. ఈ ప్రాంతాల్లోని లగ్జరీ గృహాల విక్రయాలు క్రమంగా తగ్గుముఖం పట్టాయి. చదరపు అడుగు రూ.6 వేల కంటే ఎక్కువ ధర ఉన్న ప్రాజెక్టుల్లో కొనుగోళ్లకు కస్టమర్లు వెనకాడుతున్నారు. ధరలు తగ్గుతాయేమోనని ఆలోచిస్తున్నారు. ఎక్కువ ధరకు అపార్ట్మెంట్లలో ఫ్లాట్లు కొనే బదులు అదే ధరకు 84 గ్రామాల పరిధిలో వ్యక్తిగత గృహాలు, విల్లాలు కొనొచ్చని అనుకుంటున్నారు. దీంతో పశ్చిమ హైదరాబాద్‌లోని హై రైజ్, లగ్జరీ ప్రాజెక్టుల్లో విక్రయాలు పడిపోయాయి. రిజిస్ట్రేషన్ల ఆదాయమూ బాగా తగ్గింది. పశ్చిమంలో 50 వేల యూనిట్లు ఐటీ, ఐటీ ఆధారిత కంపెనీల వల్ల పశ్చిమ హైదరాబాద్‌లో గృహ కొనుగోళ్లు, లాంచింగ్‌లు ఎక్కువగా ఉంటాయి. నగర రియల్టీలో ఈ ప్రాంతం వాటా 60 శాతం. కూకట్పల్లి, మాదాపూర్, కొండాపూర్, గచ్చిబౌలి, రాయదుర్గం, కోకాపేట, గోపన్‌పల్లి, నల్లగండ్ల వంటి ప్రాంతాల్లో సుమారు 10 కోట్ల చద రపు అడుగుల్లో నివాస సముదాయాలు నిర్మాణం లో ఉన్నాయి. వీటిల్లో సుమారు 50 వేల యూనిట్లు ఉంటాయని అంచనా. 111 జీవో పరిధిలో లేకపోవడంతో కొల్లూరు, తెల్లాపూర్, నల్లగండ్ల, గోపన్‌పల్లి, నానక్‌రామ్‌గూడ, నార్సింగి, కోకాపేట, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, పుప్పాలగూడల్లో భూముల ధరలు ఎక్కువగా ఉండేవి. ఈ ప్రాంతాల్లో గతేడాది జీహెచ్ఎంసీ 83 హై రైజ్ భవనాలకు అనుమతిచ్చింది. ఇందులో 13 ఆకాశహర్మ్యాలు 30 అంతస్తుల కంటే ఎత్తయినవి. అయితే తాజాగా జీవోను ఎత్తేయడంతో అమ్మకాలు నేలచూపులు చూస్తున్నాయి. ప్రీలాంచ్ ఒప్పందాలు రద్దు గతంలో కోకాపేట, నార్సింగి, పుప్పాలగూడ ప్రాంతాల్లో చాలా వరకు నిర్మాణ సంస్థలు ప్రీలాంచ్లో భారీగా అమ్మకాలు జరిపేవి. తక్కువ ధరకు వస్తుందని కొనుగోలుదారులూ మొగ్గు చూపేవారు. 111 జీవో రద్దుతో వీరంతా ఆయా నిర్మాణ సంస్థల ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. ఒప్పందం రద్దు చేసుకొని కట్టిన డబ్బులు ఇవ్వాలని డెవలపర్లను కోరుతున్నారు. -
రాత్రికిరాత్రే..ఈ ఏరియాలో నెల కిందట ఎకరా రూ. 2 కోట్లు.. ఇప్పుడు రూ. 5 కోట్ల పైనే
జీవో 111 ఎత్తివేత స్థిరాస్తి వ్యాపారంపై మిశ్రమ ప్రభావం చూపిస్తోంది. ఓవైపు 111 పరిధిలోని గ్రామాల్లో భూముల ధరలు అమాంతం పెరిగిపోయాయి. రియల్ ఊపందుకొని మరింతగా ధరలు పెరగొచ్చని రైతులు, భూ యజమానులు ఎదురుచూస్తున్నారు. మరోవైపు పశ్చిమ హైదరాబాద్ పరిధిలో పరిస్థితి ఇంకోలా ఉంది. కొనుగోళ్లు అమాంతం పడిపోయాయి. ఈ ఏరియాల్లో ప్లాట్లు, అపార్ట్మెంట్లు కొనేవారు వేచిచూసే ధోరణిలో ఉన్నారు. ధరలు తగ్గొచ్చని అనుకుంటున్నారు. సాక్షి, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం పెద్దమంగళారంలో ఓ రైతు తన నాలుగెకరాల పొలాన్ని అమ్మకానికి పెట్టాడు. 2 నెలల క్రితం ఎకరాకు రూ.2 కోట్లు వచ్చినా అమ్మాలని భావించాడు. అంతలోనే జీవో 111 ఎత్తివేతపై అసెంబ్లీలో ప్రకటన చేయడం.. తర్వాత ఉత్తర్వులు రావడంతో భూమి ధరను అమాంతం పెంచేశాడు. ఇప్పుడు ఎకరాకు రూ.5 కోట్లకు బేరం పెట్టాడు... ఇది ఈ ఒక్క గ్రామంలోనే కాదు. 111 జీవో పరిధిలోని 84 పల్లెల్లోనూ ఇదే పరిస్థితి. నిన్నమొన్నటి వరకు జీవో 111ను సవరిస్తారో లేదోనని సందిగ్ధంలో ఉన్న భూ యజమానులు, రైతులు.. తాజాగా ప్రభుత్వం జీవోను రద్దు చేయడంతో ధరలు ఒక్కసారిగా పెంచేశారు. 111 జీవో పరిధిలో లేని ప్రాంతాలతో సమాంతరంగా ఇక్కడ రేట్లు పెరిగాయి. విధివిధానాలపైనే అందరి దృష్టి ఆ 84 గ్రామాల పరిధిలోని మాస్టర్‌ప్లాన్‌పై ఇంకా స్పష్టత ఇవ్వలేదు. మాస్టర్‌ప్లాన్ రూపొందిస్తే గానీ గ్రీన్ జోన్, రెసిడెన్షియల్, కమర్షియల్, ఇండస్ట్రియల్, రిక్రియేషన్ జోన్లపై సందిగ్ధత తొలగనుంది. మాస్టర్‌ప్లాన్ అభివృద్ధిపై తొలిసారి భేటీ అయిన కమిటీ.. నెల రోజుల్లో దీనికి తుదిరూపు ఇవ్వాలని నిర్ణయించింది. ప్లాన్ కొలిక్కి వస్తే భూ విలువలపై స్పష్టత వస్తుందని, అప్పటివరకు ఆగాలని రియల్టర్లు, కొనుగోలుదారులు అనుకుంటున్నట్టు తెలుస్తోంది. రాత్రికి రాత్రే మారిన సీను! ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ జలాశయాల పరిరక్షణకు 1996లో ప్రభుత్వం జీవో 111ను జారీ చేసింది. తద్వారా జీవో పరిధిలోని 84 గ్రామాల్లో నిర్మాణాలు, ఇతరత్రా అభివృద్ధి పనులపై ఆంక్షలు పెట్టింది. అయితే జీవో 111 జీవో ఎత్తివేతకు సంబంధించి గత నెల 15న అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ప్రకటన చేయడమే తరువాయి ఈ ప్రాంతాల్లో భూముల ధరలకు రెక్కలొచ్చాయి. వారం రోజుల క్రితం జీవో 111ను ఎత్తేస్తూ కొత్తగా జీవో 69ను ఇవ్వడంతో ధరలు చుక్కలను తాకాయి. నిన్న మొన్నటివరకు ఎకరా రూ.1 కోటి నుంచి రూ. 2 కోట్లు పలికిన భూములు తాజాగా రూ.3 కోట్ల నుంచి 5 కోట్లకు చేరాయి. ఐటీ కారిడార్‌కు దగ్గర్లో ఉండటంతో రియల్టీ సంస్థలు కూడా భూ నిధి సేకరణలో తలమునకలయ్యాయి. రైతులు మాత్రం భూ విక్రయాలపై ఆచితూచి అడుగులేస్తున్నారు. అమ్మకాలపై తొందరపడకుండా కొన్నాళ్లు వేచిచూడాలని భావిస్తున్నట్లు కనిపిస్తోంది. -
ప్రకృతిపై ప్రభుత్వానికి పట్టింపు లేదా?
హైదరాబాద్ జీవనంలో అతి ముఖ్యమైన నీటి వనరుల నిర్వహణలో ఆధునిక ప్రభుత్వాలు తలా తోక లేని విధానాలతో భవిష్యత్తుని అగమ్య గోచరం చేస్తున్నాయి. ప్రజల దాహార్తిని తీర్చే జంట జలాశయాలు హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ ఇప్పుడు హుస్సేన్ సాగర్ దుఃస్థితి దిశగా పయనిస్తు న్నాయి. ప్రకృతితో కూడిన ప్రజా సంక్షేమ పాలన చేయకుండా ప్రకృతి వనరులను కైంకర్యం చేసుకుని, వ్యక్తిగత సంపద సృష్టించుకుంటున్నారు. జీవో 111 రద్దు చెరువులే అస్తిత్వంగా కలిగిన తెలంగాణా సంస్కృతి మీద దాడి. గొలుసు కట్టు చెరువుల ద్వారా తక్కువ ఖర్చుతో దాహార్తిని తీర్చే అవకాశం ఉండగా, ఈ వ్యవస్థను నాశనం చేస్తూ, గోదావరి నుంచి నీళ్ళు తెస్తున్నాం అనే కలను ప్రజల మీద రుద్దే ప్రయత్నం చేస్తున్నది. 1985కి పూర్వం చెరువులు, కుంటలు నగర నివాసితుల నీటి అవసరాలను తీర్చేవి. 400 యేండ్ల క్రితం తవ్విన హుస్సేనసాగర్ చెరువు ఒక 30 ఏళ్ళ కాలంలో క్రమంగా విషపూరితం అయిపొయింది. 1990 తరువాత అసలు ఆ నీటిని ఉపయోగించే పరిస్థితి లేకుండా పోయింది. తెలంగాణా రాష్ట్రం ఏర్పడక ముందూ, తరువాతా కూడా ప్రభుత్వాలు ఈ చెరువు పరిస్థి తిని మెరుగుపరచడంలో విఫలం అయ్యాయి. తాగు నీటికి కాకున్నా ఇతర అవసరాలకు వినియోగించే స్థాయికి కూడా తీసుకురాలేక పోవడం సాంకేతిక పరిమితులతో పాటు పరిపాలనా లోపం స్పష్టంగా కనపడుతున్నది. నగరం నడి బొడ్డున కాలుష్య జలాలతో నిండి ఉన్న చెరువుతో జీవించక తప్పని దుస్థితి తెలంగాణా ప్రజలకు వచ్చింది. ప్రకృతి వనరుల నాశనం వల్ల విపరీతంగా నష్టపోయేది సామాన్య ప్రజలే. 1908లో మూసి నదికి వరదలు వచ్చి హైదరాబాద్ అతలా కుతలం అయ్యింది. ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరిగింది. వరదలను నివారించటానికి అప్పటి నిజాం ప్రభుత్వం మూసీ నది ఏర్పడక ముందు ఉన్న రెండు పాయల మీద రెండు చెరువులను నిర్మించింది. మూíసీ నది మీద నిర్మించిన ఉస్మాన్ సాగర్ చెరువు 1920లో పూర్తయింది. ఇది తరువాత గండిపేట్గా ప్రసిద్ధి చెందింది. పైన అనంతగిరి గుట్టల నుంచి జాలువారే ఈ నీళ్ళు గండిపేట్ నీళ్ళుగా ప్రాచుర్యం పొందాయి. ఇవి రుచిగా ఉంటాయి. ఆరోగ్యానికి మంచివి అని నానుడి ఏర్పడింది. ప్రత్యేకంగా, తమ ప్రాంతంలో కలుషిత నీటితో సతమతమయ్యే ఆంధ్ర ప్రాంత ప్రజలు ఈ నీటి ప్రాశస్త్యాన్ని గుర్తించారు. వలసలు ఈ ప్రాంతానికి ఆ కారణంగా కూడా జరిగి నాయి. ఈసా నది మీద కట్టిన హిమాయత్ సాగర్ చెరువు 1927లో పూర్తయింది. ఈ రెండు చెరువులు కట్టిన ప్రాథమిక ఉద్దేశం హైదరాబాద్ నగరాన్ని వరద నుంచి కాపాడటానికే. మంచి నీటిని అందించటం కూడా ఈ ప్రణాళికలో భాగమే. ఈ చెరువులు కలుషితం కాకుండా వీటి పరివాహక ప్రాంతంలో అప్పట్లోనే నిజాం ప్రభుత్వం కొన్ని పరిమితులు విధించింది. వీటి పరివాహక ప్రాంతంలో ఉన్న ఊర్లకు ఇవి వర్తింప జేశారు. అయితే ఆ పరిమితుల మీదా, వాటి ప్రభావం మీదా పూర్తి స్థాయి సమాచారం ఎక్కడా చరిత్రలో కనపడదు. హుస్సేన్ సాగర్ కలుషితం అయిన నేపథ్యంలో, ఈ జంట జలాశయాలు కూడా కలుషితం కావద్దనే ఉద్దేశంతో 1989లో ప్రభుత్వం ఒక ఉత్తర్వు జారీ చేసింది (జీవో 50. జనవరి 28. 1989). ఈ ఉత్తర్వు, ఈ జంట జలాశయాల నీటి పరివాహక ప్రాంతం మొత్తాన్నీ పరిరక్షించాలని నిర్దేశించింది. ప్రస్తుతం, ఈ ఉత్తర్వు పూర్తి ప్రతి అందుబాటులో లేదు. కానీ, దాని ప్రస్తావన తదుపరి ఉత్తర్వులలో ఉంది. దీనిలో ఉన్న అంశాల మీద అభ్యంతరాలు వ్యక్తమైన నేపథ్యంలో 1993లో ఒక సాంకేతిక కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ఇచ్చిన మొదటి నివేదిక ఆధారంగా 1994లో ఈ చెరువుల పరిరక్షణకూ, నీటి నాణ్యత రక్షణకూ ఇంకొక ఉత్తర్వు జారీ అయ్యింది (జీవో 192. మార్చ్ 31, 1994). ఈ కమిటీ ఇచ్చిన రెండవ నివేదిక ఆధారంగా 1996 మార్చ్ 8న ఇంకో కొత్త జీవోను ప్రభుత్వం విడుదల చేసింది. అది 111 జీవోగా ప్రాచుర్యం పొందింది. ఈ ఉత్తర్వులో పరివాహక ప్రాంతంలో 10 కిలోమీటర్ల పరిధిలోని 84 గ్రామాలలో కొత్త నిర్మాణాల మీద పరిమితులు విధించారు. పరిశ్రమల ఏర్పాటుని పూర్తిగా నిషేధించారు. వాణిజ్య భవనాల నిర్మాణం వద్దన్నారు. ఇండ్ల నిర్మాణం మీద, కొత్త లేఅవుట్ల మీద ఆంక్షలు పెట్టారు. మంచి నీటి చెరువులకు చేటు తెచ్చే కాలుష్య కార్యకలాపాలు నిర్దేశించే విధంగా ఈ ఉత్తర్వులు రూపొందించారు. ఈ ఉత్తర్వు ఒక విధంగా 314 చదరపు కిలోమీటర్లకు మాస్టర్ ప్లాన్ వంటిది. కొంత జోన్ల గురించి ప్రస్తావన ఉన్నా, పూర్తిగా జోనల్ విధానం లేదు. గ్రామకంఠంలో ఆంక్షలు లేవు. కాకపోతే, అంతస్తుల మీద పరిమితులు ఉన్నాయి. ‘ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్’ కూడా నిర్వ చించారు. ఈ ఉత్తర్వు జారీ చేసిన రెండు నెలలలోనే ప్రభుత్వమే ఉల్లంఘనలకు నాంది పలికింది. ఒక పరిశోధన ల్యాబ్‌కు అనుమతిచ్చారు. అప్పట్లో ఇది ఎవరికీ తెలవదు. ఆ సంస్థ భవన నిర్మాణం 2002లో హిమాయత్ నగర్ గ్రామం దగ్గర మొదలు పెడితే తెలిసింది. ఇంకొక ఫ్యాక్టరీకి అనుమతి ఇచ్చారు. దాని మీద సుప్రీం కోర్టులో హోరాహోరీ పోరాటం జరిగింది. ఆఖరున సుప్రీం కోర్టు అన్ని కాలుష్య కార్యకలాపాలు నిలిపి వేయాల్సిందే అని 2000 సంవత్సరంలో తీర్పు ఇచ్చింది. హైదరాబాద్ విమానాశ్రయం కూడా ఈ ఉత్తర్వు పరిధిలోకి వస్తుంది. ప్రైవేటు భాగస్వామ్యంతో ఏర్పడిన ఈ విమానాశ్రయానికి 5 వేల ఎకరాలు ప్రభుత్వం ధారాదత్తం చేస్తే, అందులో 2 వేల ఎకరాలు 111 జీవో పరిధిలోకి వస్తుంది అని అభ్యంతరం వ్యక్తం చేస్తూ కోర్టులో వ్యాజ్యం వేస్తే, అనేక వాదనల తరువాత ఈ వ్యాజ్యం కొట్టివేశారు. అంతకు ముందే, హైదరాబాద్ ఎయిర్పోర్ట్ డెవెలప్మెంట్ అథారిటీ పేరిట ఆ ప్రాంతంలో జోనల్ నిబంధనలు తీసుకొచ్చారు. ఈ అథారిటీ పరిధిలో దాదాపు 1,700 ఎకరాలను బయో కన్జర్వేషన్ జోన్‌గా గుర్తించి (జీవో 111 పరిధిలో) నిర్మాణాల మీద పరిమితులు విధించారు. అయినా ఈ రెండు చెరువుల పరివాహక ప్రాంతంలో అక్రమ నిర్మాణాలు ఆగలేదు. 2007లో ఈ విషయమై సుప్రీం కోర్టులో వ్యాజ్యం దాఖలు అయ్యింది. అంతకుముందే 2005లో (జీవో 952. నవంబర్ 25, 2005) ప్రభుత్వం ‘ఈపీటీఆర్ఐ’, ‘ఏపీïపీసీబీ’లతో కూడిన కమిటీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీ నివేదిక ఆధారంగా రెండు చెరువుల కట్ట దాటి కూడా కొన్ని ఆంక్షలు విధించారు. ఆ మేరకు చెరువుల కట్ట కింద పారే మంచి నీటి కాలువలను సంరక్షించాలని ఇంకా కొన్ని అదనపు ఆంక్షలు చేరాయి. దాంతో ఇంకొక 86 గ్రామాలు దీని పరిధిలోకి వచ్చాయి. జీవో 111 కొనసాగించాలని సుప్రీం కోర్టు పునరుద్ఘాటించింది. 2015లో జాతీయ హరిత ట్రిబ్యునల్ ఎదుట జీవో 111ను సవాలు చేస్తూ, అక్రమ నిర్మాణాలు పెరుగుతున్నయంటూ వ్యాజ్యాలు వచ్చాయి. తెలంగాణా ప్రభుత్వం 2016లో (జీవో 839. డిసెంబర్ 7, 2016) ముగ్గురు అధికారులతో కమిటీ ఏర్పాటు చేసి, ఈ కమిటీ నిర్ణయం మేరకు తమ వాదన, నిర్ణయం ఉంటుందని కోర్టుకు తెలిపింది. కాగా ఆ కమిటీ 2019 వరకు నివేదిక ఇవ్వకపోవడం, ప్రభుత్వం స్పందించకపోవటంతో ఎన్జీటీ 111 జీవో కొనసాగింపు ఉంటుందని తీర్పు ఇచ్చింది. ధనికులు, పారిశ్రామికవేత్తలు, సినీ ప్రముఖులు ఇక్కడ వందల ఎకరాలు కొనుక్కుని ఫార్మ్‌హౌస్‌లు కట్టుకుని, నిర్మాణాల మీద ఉన్న ఆంక్షలను తుంగలో తొక్కారు. వీరిని నియంత్రించని ప్రభుత్వం చిన్న చితక కుటుంబాల మీద తన ప్రతాపం ఇప్పటికీ చూపెడుతోంది. వారి నిర్మాణాలకు ఎటువంటి ఆంక్ష లేకున్నా వారిని ఇబ్బంది పాలు జేస్తూ, పలుకుబడి ఉన్నవారు ఏమి చేసినా పట్టించుకోకపోవటం అలవా టైంది. ఈ విషయంగా జీవో 111 పట్ల అపోహలు పెంచారు. దీన్ని చూపెట్టి చిన్న, సన్నకారు రైతుల నుంచి భూమి బదలాయింపు చేసుకోవడం, అసైన్డ్ భూములను కబ్జా చేసుకోవడం మొదలైంది. ప్రశ్నించిన వారికి 111 బూచి చూపెట్టడంతో దాని పట్ల వ్యతిరేకత వచ్చింది. మీడియాలో కూడా అసందర్భ వ్యాఖ్యలతో అది ఇంకా పెరిగింది. తెరాస అధ్యక్షుడు, కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, 2014 చేవెళ్ళ ఎన్నికల బహిరంగ సభలో 111 జీవో ఎత్తివేతకు హామీ ఇస్తూ, ఎకరాకు రూ.20 లక్షల ధర కూడా ఇప్పిస్తానని ఒక విచిత్రమైన వాగ్దానం చేయడం ఆశ్చర్యపరిచింది. తరువాత కూడా చేవెళ్ళ, ఆ పరిసర ప్రాంతానికి వెళ్ళినప్పుడల్లా దాన్ని ఎత్తివేస్తామని ప్రకటన చేస్తూనే ఉన్నారు. తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు తరువాత కూడా స్వయంగా ముఖ్యమంత్రి ఈ జీవో పట్ల వ్యతిరేక భావం పెంచి పోషిస్తున్న పరిస్థితి! 2022 మార్చి శాసనసభ బడ్జెట్ సమావేశాలలో చివరిరోజు ముఖ్యమంత్రి ఈ రెండు చెరువుల కాలం చెల్లిపోయింది కాబట్టి జీవో 111 ఎత్తివేస్తామని ప్రకటించారు. అయితే ఈ 111 ఎత్తివేత వల్ల 1,32,600 ఎకరాల ఆంక్షలు తొలిగిపోయి మార్కెట్లోకి వస్తాయి; దాని వలన రియల్ ఎస్టేట్ పరిస్థితి గందరగోళంగా మారు తుంది కాబట్టి ఒక నిపుణుల కమిటీ సిఫారసుల మేరకు క్రమంగా ఆంక్షలు ఎత్తివేస్తామని హామీ ఇచ్చారు. తదుపరి, ఈ హామీని కూడా తుంగలో తొక్కుతూ ఏప్రిల్ మొదటి వారంలో మంత్రివర్గ సమావేశంలో జీవో 111 ఎత్తివేతకు తీర్మానం ఆమోదం పొందింది అని ముఖ్యమంత్రి పత్రికా సమావేశంలో ప్రకటించారు. నిపుణుల కమిటీ వేయకుండా, కమిటీ నివేదిక లేకుండానే తెలంగాణా మంత్రివర్గం జీవో ఎత్తివేతకు ఆమోదం తెలపడం విస్మయం కలిగించింది. అంత తొందరపాటు దేనికోసం అనే ప్రశ్న వచ్చింది. శాసనసభలో ముఖ్యమంత్రి ప్రకటన తరువాత చాలామంది నిపుణుల కమిటీ మీద ఆశలు పెట్టుకున్నారు. నిపుణుల కమిటీ ప్రజలతో సంప్రదింపులు చేయాలనీ డిమాండ్ చేశారు. ఆ ఆశలను తుంచివేస్తూ ఆకస్మికంగా ఏప్రిల్ 19న 111 జీవోను రద్దు చేస్తూ, 69 జీవోను ప్రభుత్వం విడుదల చేసింది. అయితే దీని మీద ఉన్న తేదీ మాత్రం ఏప్రిల్ 12ది. వారం రోజుల ముందు జీవో వచ్చింది; లేదా, జీవోకి బ్యాక్ డేట్ ఇచ్చారు. కోట్ల రూపాయల రియల్ ఎస్టేట్ పెట్టుబడుల నేపథ్యంలో ఈ వారం రోజుల ఆలస్యం అనుమానాలను రేకెత్తిస్తుంది. గందరగోళం ఏర్పడుతుంది అని స్వయంగా ముఖ్యమంత్రి జాగ్రత్త చెప్పి, నిపుణుల కమిటీ లేకుండా, శాస్త్రీయ నివేదిక మంత్రిమండలి ముందు పెట్టకుండా, వారం రోజులు ఆలస్యంగా ప్రజల ముందుకు కొత్త జీవో తేవడం వంటి చర్యల వల్ల అవినీతికి ఆస్కారం ఏర్పడింది. విచారణ చేస్తే వాస్తవాలు తెలుస్తాయి. తెలంగాణా రాష్ట్రం కొరకు జరిగిన ఉద్యమంలో అనేక అన్యా యాల ప్రస్తావన వచ్చింది. అందులో ఒకటి: హైదరాబాద్ నగరంలో స్థానికుల, మూలవాసుల నుంచి వలసదారులు ఏ విధంగా ప్రభు త్వాలను, అధికారులను అడ్డు పెట్టుకుని దోచుకున్నారనేది. తెలం గాణా రాష్ట్రంలో చెరువులను కాపాడుకోవాలనీ, హైదరాబాద్ నగర అభివృద్ధిలో తెలంగాణా మూలవాసుల భాగస్వామ్యం పెంచాలనీ, తెలంగాణా భూములు అన్యాక్రాంతం కాకుండా పరిరక్షించుకోవాలనీ ఆనాటి ఉద్యమం ఆకాంక్షించింది. తెలంగాణ అస్తిత్వం చెరువుల చుట్టూ ఉంది; ఇంకుడు గుంతలు కాదు, చెరువుల మీద ప్రభుత్వ పెట్టుబడులు పెరగాలని ఉద్యమకారులు డిమాండ్ చేశారు. ఆధునిక అభివృద్ధి పేరిట జరుగుతున్న వనరుల దోపిడీని ప్రశ్నించడం మలి దశ తెలంగాణా ఉద్యమం కంటే ముందే పుట్టింది. జీవో 111 రద్దును తెలంగాణా సంçస్కృతి మీద దాడిగా భావించవచ్చు. తెలంగాణకు నీటి నిర్వహణలో ఎవరూ పాఠాలు చెప్పే పని లేదు. గొలుసు కట్టు చెరువుల ద్వారా హైదరాబాద్ వంటి మహా నగర దాహార్తిని తక్కువ ఖర్చుతో తీర్చే అవకాశం ఉండగా, తెలంగాణా ప్రభుత్వం ఈ వ్యవస్థను నాశనం చేస్తూ, గోదావరి నుంచి నీళ్ళు తెస్తున్నాం అనే కలను ప్రజల మీద రుద్దే ప్రయత్నం చేస్తున్నది. ఈ విపరీత అప్రజాస్వామిక, ప్రకృతి వ్యతిరేక చర్య వల్ల తెలంగాణా సాంస్కృతిక వారసత్వ సంపద మీద, భవిష్యత్తు తరాల నీటి మీద తీవ్ర ప్రభావం ఉంటుంది. ఈ రెండు చెరువుల వినాశనం తెలంగాణకే చేటు చేస్తుంది. వ్యాసకర్త: డాక్టర్ దొంతి నరసింహారెడ్డి విధాన విశ్లేషకులు -
111 జీవో ఎత్తివేత.. ఆంక్షలు తొలగిస్తూ జీవో నంబర్ 69 జారీ
సాక్షి, హైదరాబాద్/రంగారెడ్డి జిల్లా: రాష్ట్ర రాజధానికి తాగునీటిని అందించిన ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ జలాశయాల పరిరక్షణ కోసం గతంలో జారీ చేసిన 111 జీవోను ప్రభుత్వం రద్దు చేసింది. ఆ రిజర్వాయర్ల ద్వారా నగరానికి సరఫరా అయ్యే తాగునీరు అతి తక్కువ అని, ఇకపై వాటిపై ఆధార పడాల్సిన అవసరం లేదని పేర్కొంది. అయినా జలాశయాల పరిరక్షణకు చర్యలు తీసుకుంటామని ప్రకటించింది. ఈ మేరకు సీఎస్ సోమేశ్‌కుమార్ బుధవారం జీవో నంబర్ 69 జారీ చేశారు. ఈ జలాశయాల పరిరక్షణకు చేపట్టాల్సిన చర్యలపై మార్గదర్శకాలు రూపొందించేందుకు ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. అప్పట్లో పరిరక్షణ కోసం.. హైదరాబాద్ నగరాన్ని మూసీ వరదల నుంచి రక్షించేందుకు, అదే సమయంలో తాగునీటిని అం దించేలా నిజాం హయంలోనే ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ జలాశయాలను నిర్మించారు. అప్పటి నుంచీ హైదరాబాద్‌కు ప్రధాన నీటి వనరులుగా ఉన్న ఈ రిజర్వాయర్ల పరిరక్షణ కోసం 1996లో ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం జీవో 111ను జారీ చేసింది. జలాశయాలకు చుట్టూ 10 కిలోమీటర్ల పరిధిలోని 84 గ్రామాల పరిధిలో ఉన్న 1,32,000 ఎకరాల విస్తీర్ణంలో.. పరిశ్రమలు, హో టళ్లు, వాణిజ్య సముదాయాలు, నివాసాలు, నిర్మా ణాలపై నియంత్రణలు విధించింది. కొన్నేళ్లుగా నగరం విపరీతంగా విస్తరించడం, తాగునీటి కోసం కృష్ణా, గోదావరి జలాలను తరలించడం నేపథ్యంలో.. 111 జీవో ఎత్తివేయాలన్న డిమాండ్ మొదలైంది. ఈ జీవోను సమీక్షిస్తామని టీఆర్ఎస్ సర్కారు కూడా పలుమార్లు ప్రకటించింది. తాజా గా జీవో ఎత్తివేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. సీఎస్ ఆధ్వర్యంలో కమిటీ.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో ఏర్పాటైన కమిటీలో.. మున్సిపల్, ఆర్థిక, నీటిపారుదల శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, వాటర్ బోర్డు ఎండీ, కాలుష్య నియంత్రణ బోర్డు మెంబర్ సెక్రటరీ, హెచ్ఎండీఏ డైరెక్టర్ (ప్లానింగ్) సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీ ఏయే అంశాలను పరిశీలించి నివేదిక ఇవ్వాలన్న దానిపై విధివిధానాలనూ ప్రభుత్వం ఖరారు చేసింది. రెండు రిజర్వాయర్ల పరిరక్షణ, కాలుష్య నివారణకు అవసరమైన చర్యలను సూచించాలని.. ప్రధాన మౌలిక సదుపాయాల కల్పనకు విధానాలు రూపొందించాలని ఆదేశించింది. మురుగు, వరద కాల్వల నిర్మాణం, అవసరమైన నిధుల సమీకరణ, లేఅవుట్లు, భవన నిర్మాణాల అనుమతికి విధించాల్సిన నియంత్రణలు, న్యాయపరమైన అంశాలను పరిశీలించాలని పేర్కొంది. సాధ్యమైనంత త్వరగా నివేదిక ఇవ్వాలని సూచించింది. 84 గ్రామాలకు విముక్తి: సబిత 111 జీవో ఎత్తివేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయటంపై సీఎం కేసీఆర్‌కు విద్యాశాఖ మంత్రి సబిత ధన్యవాదాలు తెలిపారు. ప్రజలకిచ్చిన మాట ప్రకారం ఇటీవల కేబినెట్లో తీర్మానం చేసి, 69 జీవో విడుదల చేయటంతో 84 గ్రామాల ప్రజలకు శాశ్వత విముక్తి లభించిందన్నారు. జంట జలాశయాలు కలుషితం కాకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటూ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో కమిటీ వేయటం శుభ పరిణామమన్నారు. 111 జీవో ఎత్తివేస్తామని గత నెల 15న సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించడంతోనే ఈ ప్రాంతాల్లో ఒక్కసారిగా భూముల ధరలకు రెక్కలొచ్చాయి. ప్రభుత్వం నుంచి స్పష్టత రావడంతో కొనుగోలుదారులు, రియల్టర్లు భూములు కొనేందుకు ఎగబడ్డారు. మరోవైపు ఇప్పటికే సంపన్న వర్గాలు, పారిశ్రామికవేత్తలు, ప్రముఖులు, ప్రజాప్రతినిధులు జీవో 111 ప్రాంతాల్లో తక్కువ ధరకే భారీగా భూములు కొనుగోలు చేసి.. ఫామ్‌హౌజ్‌లు, రిసార్టులుగా మార్చుకున్నారు. వేల ఎకరాలు వారి చేతుల్లోనే ఉన్నట్టు అంచనా. అనధికారిక లేఅవుట్లు కూడా పెద్ద సంఖ్యలోనే ఉన్నాయి. ఇప్పడు వీటి ధరలు చుక్కలను తాకనున్నాయి. మరోవైపు ఇప్పటివరకు కోట్లు పలికిన గచ్చిబౌలి, కొండాపూర్, కోకాపేట, నార్సింగి తదితర ప్రాంతాల్లో భూముల ధరల్లో కొంతకాలం స్తబ్దత నెలకొనే అవకాశం ఉందని రియల్ఎస్టేట్ వర్గాలు చెప్తున్నాయి. 1.32 లక్షల ఎకరాలు రెడీ... గ్రేటర్ హైదరాబాద్ విస్తీర్ణం 217 చదరపు కిలోమీటర్లుకాగా.. 111 జీవో పరిధిలోని భూమి విస్తీర్ణం 538 చదరపు కిలోమీటర్లు కావడం గమనార్హం. జీవో 111 కింద 84 గ్రామాల్లోని 1,32,600 ఎకరాల భూములు ఉన్నాయి. ఇందులో 32 వేల ఎకరాల ప్రభుత్వ భూమి కూడా ఉంది. ఆంక్షల ఎత్తివేతతో ఈ భూములన్నీ అందుబాటులోకి రానున్నాయి. 27 ఏళ్లుగా పోరాటాలు తమ అభివృద్ధి అడ్డంకి మారిందని, హైదరాబాద్‌ను ఆనుకుని ఉన్నా భూములకు ధరలేకుండా పోయిందంటూ 111 జీవో పరిధిలోని గ్రామాల ప్రజలు 27 ఏళ్లుగా ఆందోళన వ్యక్తం చేస్తూనే ఉన్నారు. జీవోను రద్దు చేయాలంటూ అన్ని గ్రామాల సర్పంచులు రెండుసార్లు మూకుమ్మడిగా తీర్మానాలు చేసి పంపారు. ఇన్నేళ్ల తర్వాత గండిపేట, శంకర్పల్లి, శంషాబాద్, మొయినాబాద్, చేవెళ్ల, కొత్తూరు మండలాల ప్రజలకు ఊరట కలిగింది. భారీగా కంపెనీలు, నిర్మాణాలు.. జీవో ఎత్తివేత ద్వారా నిర్మాణాలపై ఆంక్షలు తొలగిపోవడంతో ఈ ప్రాంతంలో భారీగా పెట్టుబడులు రానున్నాయి. ఐటీ హబ్‌గా అవతరించిన గచ్చిబౌలికి ఈ ప్రాంతాలు చేరువలో ఉండటంతో ఐటీ కంపెనీల స్థాపనకు అవకాశం ఏర్పడనుంది. ఈ ప్రాంతాలకు బహుళ అంతస్తుల నిర్మాణాలు, జాతీయ, అంతర్జాతీయ కంపెనీలు వస్తాయని.. భూముల ధరలు, ఉపాధి అవకాశాలు భారీగా పెరుగుతాయని అంటున్నారు. కోర్టును ఆశ్రయిస్తాం జంట జలాశయాల ఎగువన విల్లాలు, గేటెడ్ కమ్యూనిటీలు, రిసార్ట్స్, పబ్స్, బార్లు, బహుళ అంతస్తుల భవంతులు, హోటళ్లు, పరిశ్రమలు ఏర్పాటైతే జలాశయాలు కాలుష్యకాసారంగా మారుతాయి. మరో మూసీలా మారే ప్రమాదం పొంచి ఉంది. జీవో 111 తొలగింపులో అనేక న్యాయపరమైన చిక్కులు కూడా ఉన్నాయి. ఈ అంశంపై కోర్టును ఆశ్రయిస్తాం. – సజ్జల జీవానందరెడ్డి, లుబ్నా సార్వత్ పర్యావరణవేత్తలు -
GO 111: 84 గ్రామాలకు జీవో 111 నుంచి విముక్తి
సాక్షి, హైదరాబాద్: వివాదాస్పదమైన జీవో 111ను ఎత్తేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించి ఓ అధికారిక ఉత్తర్వులను జారీ చేసింది ప్రభుత్వం. జీవో 111 పరిధి నుంచి 84 గ్రామాలకు విముక్తి కలిగిస్తున్నట్లు.. తెలంగాణ ప్రభుత్వం బుధవారం 69 పేరిట కొత్త జీవో జారీ చేసింది. ఇకపై జంట జలాశయాల పరిరక్షణకు చర్యలు తీసుకోనున్నారు. ఇందులో భాగంగా.. ఎస్టీపీల నీరు జంట జలాశయాల్లో కలవకుండా జాగ్రత్తలు తీసుకోనున్నారు. అంతేకాదు.. జంట జలాశయాల చుట్టుపక్కల గ్రామాల్లో సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నారు. తద్వారా భూగర్భ జలాలు కలుషితం కాకుండా చర్యలు తీసుకోనున్నారు. జంట జలాశయాల పరిరక్షణకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేసింది తెలంగాణ సర్కార్. కమిటీ సభ్యులుగా మున్సిపల్, ఫైనాన్స్ శాఖల ప్రిన్సిపల్ సెక్రటరీలు, వాటర్ బోర్డ్ ఎండి, పొల్యూషన్ కంట్రోల్ మెంబర్ సెక్రటరీ, HMDA డైరెక్టర్ ఉంటారు. జంట జలాశయాల పరిరక్షణకు తీసుకోవాల్సిన మార్గదర్శకాల రూపకల్పన చేయనున్న సీఎస్ నేతృత్వంలోని ఈ కమిటీ. ► గ్రీన్ జోన్ ల గుర్తింపు ► మురుగు నీరు వెళ్లే టాక్ లైన్స్ ఏర్పాటు ప్లానింగ్ ► STP లను ఎక్కడెక్కడ ఏర్పాటు చేయాలనే దానిపై నివేదిక ► 84 గ్రామాల్లో భవనాల నిర్మణాలకు సంబంధించిన ప్లానింగ్ ఎలా ఉండాలి ► వీటిపై ఖచ్చితమైన మార్గదర్శకాలు తయారు చేయనుంది ఈ కమిటీ. -
జీవో111 పరిధిలో సీఎం సంబంధీకుల భూములు
సాక్షి, హైదరాబాద్: జీవో111 పరిధిలోని భూములను సీఎం సంబంధీకులు, ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందినవారు కొనుగోలు చేయడం వల్లే.. రాష్ట్ర ప్రభుత్వం ఆ జీవోను ఎత్తేసిందని మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి అన్నారు. ఇప్పటికే దాదాపు 25 వేల ఎకరాలు చేతులు మారాయని ఆయన ఆరోపించారు. 2014 తర్వాత ఈ పరిధిలో భూములు కొనుగోలు చేసిన ప్రాంతాలను గ్రీన్జోన్లుగా ప్రకటించాలని, అంతకుముందు నుంచి భూములున్న వారిని గ్రీన్‌జోన్ పరిధిలోకి తీసుకురావొద్దని అన్నారు. ఈ ప్రాంతాన్ని ‘సస్టెయినబుల్ డెవలప్మెంట్ జోన్’గా మార్చాలని డిమాండ్ చేశారు. జీవో 111ను ఎత్తేస్తూ రాష్ట్ర కేబినెట్ నిర్ణ యం నేపథ్యంలో కొండా విశ్వేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ.. ఇక్కడ సాగులో ఉన్న కూరగాయలు, వరి ఇతర పంటలకు వాడుతున్న పురుగు, కలుపు నివారణ మందులతోనే కాలుష్యం వ్యాపిస్తోందన్నారు. అందుకే అతి తక్కువ కాలుష్యాన్ని వ్యాప్తి చేసే పరిశ్రమలు పెట్టాలని తాను సూచించినట్లు గుర్తు చేశారు. హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్ జంట జలాశయాల్లో కాలుష్యాలు చేరకుండా ఇచ్చిన జీవో 111కు, పర్యావరణ పరిరక్షణకు పెద్దగా సంబంధం లేదని, 11కి.మీనుంచి అనేక కాలుష్యకారక పరిశ్రమలు ఉన్నాయని తెలిపారు. 1974లో అప్పటి కేంద్రం తెచ్చిన ‘సెంట్రల్ వాటర్‌యాక్ట్’ను వికారాబాద్ దాకా అమలు చేయాలని డిమాండ్ చేశారు. -
కేసీఆర్ కీలక నిర్ణయం.. నెరవేరనున్న 26 ఏళ్ల కల
మొయినాబాద్: జీవో 111 ఎత్తివేతకు రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకోవడంతో ఆ జీవో పరిధిలోని ప్రాంతాల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. తమ 26 ఏళ్ల కల నెరవేరనుందని, అభివృద్ధికి అడ్డు తొలగిపోనుందని స్థానికులు చెబుతున్నారు. 84 గ్రామాల్లోని సుమారు లక్షా 32 వేల ఎకరాల భూ మికి విముక్తి లభిస్తుందని అంటున్నారు. నిజాం కాలంలో హైదరాబాద్‌కు తాగునీరు అందించడం కోసం నిర్మించిన ఉస్మాన్‌సాగర్ (గండిపేట), హిమాయత్‌సాగర్ జలాశయాల్లో నీళ్లు కలుషితం కాకుండా ఉండటం కోసం 1996లో అప్పటి ప్రభు త్వం 111 జీవోను తీసుకొచ్చింది. జలాశయాల ఎగువ ప్రాంతంలోని 84 గ్రామాలను జీవో పరిధిలో చేర్చి కొన్ని నిబంధనలను విధించింది. అయితే దీనివల్ల ఈ ప్రాంతంలో అభివృద్ధి కుం టు పడుతోందని, భూములకు ధరలు పెరగడం లేదని స్థానిక రైతులు, రాజకీయ పార్టీల నాయకులు ఎన్నో ఏళ్ల నుంచి ఆందోళనలు చేస్తున్నారు. జీవో ఎత్తివేయాలనే డిమాండ్ స్థానికంగా మరింత ఊపందుకోవడంతో ఎన్నికల సమయంలో రాజ కీయ పార్టీలు ఈ మేరకు హామీ ఇచ్చాయి. సీఎం కేసీఆర్ కూడా జీవో 111 ఎత్తివేతకు హామీ ఇచ్చా రు. (చదవండి: హెచ్చార్సీలో మంత్రి హరీశ్‌రావుపై కేసు ) ఈ నేపథ్యంలోనే నెల రోజుల క్రితం అసెంబ్లీలో.. హైదరాబాద్ నగరానికి ప్రస్తుతం కృష్ణా, గోదా వరి నీళ్లు సరఫరా అవుతున్నందున జంట జలాశయాల నీటిని వినియోగించడంలేదని, అందువల్ల జీవో 111ను ఎత్తేస్తామని ప్రకటించారు. తాజాగా రాష్ట్ర కేబినెట్ కూడా ఈ మేరకు నిర్ణయం తీసుకోవడంతో జీవో పరిధిలోని రైతులు ఆనందోత్సవాల్లో మునిగిపోయారు. మొయినాబాద్ మండల కేం ద్రంతో పాటు పలు గ్రామాల్లో బాణసంచా పేల్చి, మిఠాయిలు పంచుకున్నారు. 111 జీవో ఎత్తివేతతో ఇక్కడ భూముల ధరలు పెరుగుతాయని, అభివృద్ధి జరుగుతుందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. శుభపరిణామం: ఎంపీ రంజిత్‌రెడ్డి జీవో 111 ఎత్తివేస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకోవ డం శుభ పరిణామమని చేవెళ్ల ఎంపీ గడ్డం రంజిత్ రెడ్డి అన్నారు. ఈ మేరకు మంగళవారం రాత్రి ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. గత లోక్‌సభ ఎన్నికల సందర్భంగా సీఎం కేసీఆర్ 111 జీవో ఎత్తివేతపై హామీ ఇచ్చారని.. ప్రస్తుతం ఆ హామీని నెరవేర్చే దిశగా నిర్ణయం తీసుకున్నారని పేర్కొ న్నారు. చేవెళ్ల ప్రజల తరఫున ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. 26 ఏళ్ల కల సాకారం అవుతోంది జీవో 111 కారణంగా తమ ప్రాంతం అభివృద్ధిలో వెనుకబడిపోయిందని మొయినాబాద్ మండలం అజీజ్‌నగర్‌కు చెందిన కొత్త నర్సింహారెడ్డి చెప్పారు. ఆ జీవో ఎత్తేయాలని ఏళ్ల తరబడి పోరాటాలు చేశామని తెలిపారు. సీఎం కేసీఆర్ చొరవతో జీవో రద్దు కానుండటంతో 26 ఏళ్ల కల ఇప్పుడు సాకారం అవుతోందని చెప్పారు. (చదవండి: జీవో 111ను ఎత్తేస్తున్నాం.. కేబినెట్ కీలక నిర్ణయాలు వెల్లడించిన సీఎం కేసీఆర్) -
జీవో 111ను ఎత్తేస్తున్నాం: సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైన జీవో 111ను ఎత్తేస్తూ తెలంగాణ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మంగళవారం కేబినెట్ సమావేశం ముగిసిన అనంతరం.. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు స్వయంగా ప్రకటించారు. సీఎం కేసీఆర్ అధ్యక్షతన రాష్ట్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ మేరకు ఆ నిర్ణయాలను పాత్రికేయ సమావేశంలో స్వయంగా సీఎం కేసీఆర్ వెల్లడించారు. గత హామీ మేరకు జీవో 111ని ఎత్తివేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుందని ఆయన వెల్లడించారు. సీఎస్ ఆధ్వర్యంలో త్వరలోనే ఓ కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు.. త్వరలోనే ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు జారీ చేస్తామని ఆయన వెల్లడించారు. ►అలాగే మే 20 నుంచి జూన్ 5వ తేదీ వరకు పల్లె, పట్టణ ప్రగతిని చేపట్టనున్నట్లు వెల్లడించారు. ధాన్యం కొనుగోలు చేయాలని తెలంగాణ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ► రాష్ట్రంలో ఆరు ప్రైవేట్ యూనివర్సిటీల ఏర్పాటుకు అనుమతి. అలాగే త్వరలోనే అన్ని యూనివర్సిటీల్లో నియామకాలు చేపడతామని తెలిపారు. ప్రస్తుతం మూడున్నర వేలకు పైగా ఖాళీలు ఉన్నాయని తెలిపారు. ఇబ్బందులు, ఆరోపణల నేపథ్యంలో.. ఇతర రాష్ట్రాల తరహాలో కామన్ బోర్డు ఏర్పాటు చేసి నియామకాల్ని పూర్తి చేస్తామని సీఎం కేసీఆర్ తెలిపారు. ► హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ దేశంలోనే నాలుగో స్థానంలో నిలిచింది. ఎయిర్‌పోర్ట్‌లో రెండు అదనపు టెర్మినల్స్ ఏర్పాటునకు గ్రీన్‌సిగ్నల్. ► ఉమ్మడి రాష్ట్రంలో భూగర్భ జలాలపైనే ఆధారపడ్డారు ►వడ్లు కొనడం చేతకాదు అని కేంద్రం చెప్పొచ్చు కదా ►దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణలో సాగు అయ్యింది ►కేంద్రంలో రైతు వ్యతిరేక ప్రభుత్వం అధికారంలో ఉంది ►దేశ రాజధానిలో 13 నెలలపాటు రైతులు ఉద్యమాలు చేశారు ►వ్యవసాయ చట్టాలు తెచ్చి మళ్లీ తోకముడిచింది ►చివరకు దేశ ప్రధాని రైతులకు క్షమాపణలు చెప్పాల్సిన పరిస్థితి ►ఎరువుల దరలను భారీగా పెంచారు ►పనికిమాలిన విద్యుత్ సంస్కరణలు ప్రవేశపెట్టారు ►రాష్ట్రాలను దివాళా తీయించేందుకు కేంద్రం ప్రయత్నిస్తోంది ►బలమైన కేంద్రం, బలహీనమైన రాష్ట్రాలు అనే సిద్ధాంతంతో పనిచేస్తోంది. ►ఆహార భద్రత బాధ్యత నుండి కేంద్రం తప్పించుకునే ప్రయత్నం ►కేంద్రం బాధ్యతను గుర్తుచేయడం రాష్ట్రంగా మా బాధ్యత ►అందుకే ఢిల్లీ వేదికగా కేంద్రంపై పోరాటం చేశాం ►బ్యాంకులను దివాళా తీయించడమే మోదీ ఘనత ► యాసంగి ధాన్యం మొత్తం రాష్ట్రమే కొనుగోలు చేస్తుంది ►ధాన్యం కొనుగోలుపై సీఎస్ నేతృత్వంలోని సబ్ కమిటీ ►రైతులు ఎవరూ కూడా ధాన్యాన్ని తక్కువ ధరకు అమ్మకండి ►రూ. 1960 కనీస మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేస్తాం ►మొత్తం 3,4 రోజుల్లోనే ధాన్యం కొంటాం ►6 ప్రైవేట వర్శిటీలకు కేబినెట్ ఆమోదం ►త్వరలోనే అన్ని వర్శిటీల్లో నియామకాలు ►వర్శిటీల్లో 3,500 వరకూ నియామకాలకు నిర్ణయం ►దేశ ప్రజలను చైతన్యపరచాల్సిన అవసరం ఉంది -
ప్రజాఉద్యమాలతోనే ముకుతాడు
సాక్షి, హైదరాబాద్: హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్ జలాశయాలను కాపాడుకోవాలనే పట్టుదలతో ప్రజాభిప్రాయం ఉద్యమరూపం తీసుకుంటే ఏదైనా సాధించవచ్చని పర్యావరణవేత్త కెప్టెన్ జె.రామారావు చెప్పారు. ఏదైనా అంశంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమై, ప్రజాగ్రహం పెల్లుబుకుతుందో అప్పుడే ప్రభుత్వాలు దిగివచ్చి తమ తప్పులను సరిచేసుకుంటాయన్నారు. కోర్టులు కలగజేసుకోవడం కంటే ప్రజాందోళనతోనే జీవో 111ను, ఈ జంట రిజర్వాయర్లను కాపాడుకోవచ్చని స్పష్టంచేశారు. తెలుగు రాష్ట్రాలకు ప్రాణ వాయువును అం దిస్తూ ఊపిరితిత్తులుగా నిలిచిన నల్లమల అటవీ ప్రాంతాల్లో యురేనియం నిల్వల అన్వేషణ, వెలికితీతను ప్రజల మద్దతుతో అడ్డుకోగలిగామన్నారు. అయితే, జీవో 111పై మాత్రం ప్రజా ఉద్యమాన్ని నిర్మించలేకపోయామని ‘సాక్షి’కిచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో రామారావు చెప్పారు. ఇంటర్వ్యూ ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే... ఇప్పటికే ఎన్నో ఉల్లంఘనలు... జీవో 111 పేరిట కఠిన నిబంధనలున్నా ఈ జంట జలాశయాల క్యాచ్మెంట్ పరిధిలో అనేక అక్రమ కట్టడాలు వెలిశాయి. కాలేజీలు, కాటేజీలు, ఇళ్లు ఇలా అనేకం వచ్చేశాయి. ప్రభుత్వమే ఈ జీవోను ఉల్లంఘించి పోలీస్స్టేషన్లు తదితరాలు నిర్మిం చింది. ఇప్పుడు ఈ జీవోను ఎత్తేయడం ద్వారా అక్రమ నిర్మాణాలను ‘లీగలైజ్’చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇప్పటికే ఈ జలాశయాల్లోకి మురుగు, ఇతర రూపాల్లోని కాలుష్యాలు క్రమంగా పెరుగుతున్నాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే మరింత చేటే. వీటికి కొద్దో గొప్పో రక్షణగా ఉన్న ఈ జీవోను ఎత్తేస్తే ఇవి కూడా హుస్సేన్‌సాగర్ మాదిరి కాలుష్య కాసారమవుతాయి. రియల్ ఎస్టేట్ కారణంగానే... రియల్ ఎస్టేట్ వ్యాపారం ఒక్కసారిగా పెరిగిపోవడంతో ఇక్కడి భూముల విలువలకు రెక్కలొచ్చాయి. రియల్టర్లు, వ్యాపారవేత్తల ఒత్తిళ్లకు ప్రభు త్వం తలొగ్గే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ జంట జలాశయాలు నగర తాగునీటి వనరులుగా కొన సాగాలనే ఉద్దేశంతో జీవో 111ను తెచ్చారు. వీటికి 10 కి.మీ పరిధిలో కాలుష్యకారక పరిశ్రమలు, ఇతర కట్టడాలు నిర్మించకుండా ఆంక్షలు విధించారు. మంచి ఉద్దేశంతో ఇవన్నీ పెట్టినా ఆ తర్వాత ఉల్లంఘనలు పెరిగిపోయాయి. సర్కార్‌కు పీసీబీ జీ హుజూర్ పర్యావరణ చట్టాలు, నీటివనరులను కాపాడే విషయంలో కేంద్ర మార్గదర్శకాలు వంటివి ఉన్నా కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ)కి స్వతంత్ర ప్రతిపత్తి లేకపోవడంతో ప్రభుత్వ అధీనంలోని సంస్థగానే మిగిలిపోతోంది. అందువల్ల ఎన్ని ఉల్లంఘనలు జరుగుతున్నా చూసీచూడనట్టు వదిలేయడంతో ఈ సంస్థ ప్రభుత్వం చెప్పినట్టుగా నడుచుకుంటుందనేది స్పష్టమౌతోంది. కేవలం తాగునీటితోనే ముడిపడలేదు ►ఈ జలాశయాల పరిరక్షణ కేవలం తాగునీటితోనే ముడిపడలేదు. పర్యావరణం, పచ్చ దనం, జీవవైవిధ్యంతోపాటు వాతావరణ మార్పుల నియంత్రణలో వీటి భాగస్వామ్యాన్ని అందరూ గ్రహించాలి. పర్యావరణం అంటే గాలి, నీరు, భూమి.. వాటితో ముడిపడిన పచ్చదనం, జీవవైవిధ్యం మొత్తంగా మనచుట్టూ ఆరోగ్యకరమైన వాతావరణం ఏర్పడటం. అందువల్ల వీటిలో దేనిని కాపాడుకోకపోయినా పర్యావరణం నాశనమైనట్టే. ఏదో కేవలం తాగునీటి వనరుల కోసం ఈ జలాశయాలపై ఆధారపడడం లేదని చెప్పి జీవో 111ను ఎత్తేస్తామనడం ఎంతమాత్రం సరికాదు. -
111 జీవో ఎత్తివేస్తే.. భూముల ధరలకు రెక్కలు
సాక్షి, రంగారెడ్డి జిల్లా: జీవో 111 ఎత్తివేత ప్రభావం భూముల విలువలపై దీర్ఘకాలం పాటు కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. జాతీయ, అంతర్జాతీయ ఐటీ సంస్థలు, ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీల దృష్టి జీవో 111 ప్రాంతాలపై పడనుండడం జీహెచ్ఎంసీ పరిధిలోని ఇతర ప్రాంతాల భూలావాదేవీలపై ప్రభావం చూపనుంది. ఈ జీవో ఎత్తివేస్తామని సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించిన నేపథ్యంలో.. జీవో పరిధిలోనికి వచ్చే ప్రాంతాల్లో అప్పుడే భూముల ధరలకు రెక్కలు రాగా అవి చుక్కలనంటుతాయనే చర్చ జరుగుతోంది. శంకర్పల్లి, చేవెళ్ల, శంషాబాద్, మొయినాబాద్, రాజేంద్రనగర్, షాబాద్ మండలాల్లో ప్రస్తుతం గరిష్టంగా ఎకరం ధర రూ.5 కోట్ల నుంచి రూ.10 కోట్ల వరకు పలుకుతుండగా సమీప భవిష్యత్తులోనే అది రూ.15–20 కోట్ల వరకు పెరగనుందని రియల్ నిపుణులు అంచనా వేస్తున్నారు. అదే సమయంలో ప్రస్తుతం గజం రూ.లక్షకు పైగా పలుకుతున్న కొండాపూర్, గచ్చిబౌలి, మాదాపూర్, కోకాపేట, నార్సింగి (ఐటీ కారిడార్) వంటి ప్రాంతాలతో పాటు రాజధాని నలుదిక్కులా ఉండే ఇతర శివార్లలో కొంత స్తబ్దత నెలకొనే అవకాశముందని అంటున్నారు. అడ్డగోలు ధరలకు తాత్కాలికంగా కళ్లెం జీవో పరిధిలో 84 గ్రామాలు ఉండగా వీటి పరిధిలో 1,32,600 ఎకరాల భూమి ఉంది. ఇందులో 18,332 ఎకరాలు ప్రభుత్వ, 9,235 ఎకరాల అసైన్డ్, 2,660 ఎకరాల సీలింగ్, 1,256 ఎకరాల భూదాన, ఇలా.. మొత్తం 31,483 ఎకరాల ప్రభుత్వ భూము లు ఉన్నాయి. 111 జీవో ఎత్తివేయడం, సవ రించడం వల్ల ఆ భూములన్నీ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ భూములను చేజిక్కిం చుకుని తమ సంస్థలను నెలకొల్పాలని జాతీయ, అంతర్జాతీయ ఐటీ అనుబంధ సంస్థలు, రియల్ ఎస్టేట్ కంపెనీలు భావిస్తున్నాయి. వాస్తవానికి హైదరాబాద్ విస్తీర్ణం 217 చదరపు కిలోమీటర్లు కాగా, అదే 111 జీవో పరిధిలోని భూ విస్తీర్ణం 538 చ.కి.మీ.గా ఉంది. అంటే హైదరాబాద్ విస్తీర్ణం కంటే.. జీవో ఎత్తివేత, సవరణల కారణంగా అందుబాటులోకి వచ్చే భూవిస్తీర్ణమే అధికం అన్నమాట. న్యాయపరమైన చిక్కులు లేకుండా, ఓ ప్రణాళిక బద్ధంగా, పర్యావరణహితంగా సరికొత్త మాస్టర్‌ప్లాన్‌తో ప్రభుత్వం ముందుకెళ్తే..హైదరాబాద్ లాంటి మరో అద్భుత, అహ్లాదకరమైన నగరం కళ్ల ముందు ఆవిష్కృతమయ్యే అవకాశం ఉంది. అంతేకాదు పెద్దయెత్తున భూమి అందుబాటులోకి రానుండటంతో ఇప్పటివరకు పలు ప్రాంతాల్లో అడ్డగోలుగా పెరుగుతున్న భూముల ధరలకు తాత్కాలికంగా కళ్లెం పడుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. భూముల అమ్మకంపై రైతుల్లో పునరాలోచన జీవో కారణంగా ఈ జోన్ పరిధిలోని నిర్మాణాలపై ఆంక్షలు ఉన్నప్పటికీ..గతకొంత కాలంగా ఫాం హౌస్‌ల పేరుతో ఇక్కడ కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారం సాఫీగానే సాగుతోంది. భూముల ధరలకు రెక్కలు రావడంతో శిఖం భూములన్నీ కబ్జాకు గురయ్యాయి. ఇప్పటికే ఇక్కడ అనేక అక్రమ నిర్మాణాలు వెలిశాయి. 426 లే అవుట్లలో 10,907 ఇళ్లు, గ్రామాల్లో 4,527 ఇళ్లు, 1,920 వాణిజ్య భవనాలు వెలిశాయి. కోర్టు ఆదేశాల మేరకు అధికారులు అప్పుడప్పుడు స్పందించి అక్రమ నిర్మాణాలు కూల్చివేసినా.. ఆగకపోగా మరింత పెరుగుతూనే ఉన్నాయి. దీనికి తోడు స్థానికుల డిమాండ్ నేపథ్యంలో ఈ జీఓను ఎత్తి వేయనున్నట్లు ఇటీవల సీఎం కేసీఆర్ ప్రకటించడంతో భూములకు మరింత డిమాండ్ ఏర్పడింది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ భూములు అమ్ముకోవడం కంటే..మరికొంత కాలం ఎదురు చూడటమే ఉత్తమని రైతులు భావిస్తున్నారు. అడ్వాన్సులు తీసుకున్న కొందరు డబ్బులు తిరిగి ఇచ్చేస్తున్నారు. గతంలో ఒక్కో డాక్యుమెంట్ రైటర్ రోజుకు సగటున 10–15 రాస్తే..ప్రస్తుతం ఒకటి, రెండు డాక్యుమెంట్లకే పరిమితమవుతుండటం ఇందుకు నిదర్శనం. -
జీవన ‘సాగరాలవి’.. ఆ ఆలోచన సరికాదు
సాక్షి, హైదరాబాద్: హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్ జంట జలాశయాలు హైదరాబాద్ నగరానికి ‘జీవనరేఖ (లైఫ్‌లైన్)’గా ఉన్నాయని, వాటి పరిరక్షణ అత్యంత కీలకమని జేఎన్టీయూ ఎన్విరాన్ మెంటల్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్, ఎన్విరాన్మెంటల్ కమిటీ మాజీ చైర్మన్ ఎం.అంజిరెడ్డి పేర్కొన్నారు. జలాశయాలకు ఏమాత్రం నష్టం జరగకుండా ఉం డేలా సాంకేతిక నిపుణులతో ఏర్పాటు చేసిన కమిటీ సూచనలతో జీవో 111కు సవరణలు చేయవచ్చని సూచించారు. అంతేతప్ప జలాశయాలతో ఉపయోగం లేదనడం, ఎత్తేయాలనడం సరికాదని అభిప్రాయపడ్డారు. కొన్ని దశాబ్దాల కిందటి వరకు మంచినీటి వనరుగా ఉన్న హుస్సేన్‌సాగర్ కాలుష్య కాసారంగా మారిపోయిందని, భవిష్యత్‌లో జంట జలాశయాలకు ఆ దుస్థితి రాకుండా చూడాలని చెప్పారు. రిజర్వాయర్లను మాత్రమేకాకుండా, వాటి చుట్టూ ఉన్న పరిసరాలను కూడా పర్యావరణ చట్టాలు, కేంద్ర నిబంధనల మేరకు పరిరక్షించాల్సి ఉందన్నారు. జీవో 111, జంట జలాశయాల అంశాలపై అంజిరెడ్డి ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చా రు. ఇందులో ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే.. సుస్థిర అభివృద్ధి చర్యలు చేపట్టాలి జీవో 111 పరిధిలోని 84 గ్రామాల్లో ఉన్న 1.34 లక్షల ఎకరాలకు సంబంధించిన భౌగోళిక పరిస్థితులు, ఎగువ నుంచి వచ్చే జలాలు, డ్రైనేజీ వ్యవస్థలు, చెరువుల నెట్వర్క్ తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని.. ఈ ప్రాంతాల్లో సుస్థిర అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలి. చెరువులు, పర్యావరణ వ్యవస్థలకు నష్టం జరగకుండా చూడాలి. జలాశయాలకు నష్టం కలిగిస్తూ ఇక్కడి భూమిని అభివృద్ధి చేయాలని ఎక్కడా లేదు. టెక్నికల్ కమిటీ క్షుణ్నంగా పరిశీలించాలి 111 జీవో పరిధిలోని గ్రామాల రైతులకు నష్టం జరగకుండా ‘సాంకేతిక నిపుణుల కమిటీ’ప్రతి ఊరిలో భూమిని పరిశీలించాలి. వాగుల నెట్వర్క్ ఎలా ఉంది, అక్కడి నీరు ఎక్కడికి వెళుతుందనేది చూడాలి. ఆ ప్రకారం ఏయే ఏరియాలు, ఏయే సర్వే నంబర్లలో నిర్మాణాలకు అనుమతులు ఇవ్వగలమో, జీవో 111కు ఏమేర సడలింపులు ఇవ్వాలో నిర్ణయిస్తే.. జంట జలాశయాలకు నష్టం వాటిల్లదు. దీనికి సంబంధించి చాలా కచ్చితంగా 1.34 లక్షల ఎకరాలను పరిశీలించాలి. ఫామ్‌హౌజ్‌లకు వీలుగా చట్టాలు చేయొచ్చు జీవో 111ను ఎత్తేయకుండా.. దీని పరిధిలో ఫామ్‌హౌజ్‌లు ఏర్పాటు చేసుకునేందుకు చట్టమే చేయొచ్చు. ఉదాహరణకు పదెకరాల స్థలముంటే.. అందులో 20 శాతం దాకా ఎలాంటి నిర్మాణాలు చేపట్టవచ్చనే మార్గదర్శకాలు నిర్దేశించవచ్చు. ఆ నిర్మాణాల నుంచి వృధా జలాలు బయటికి రాకుండా.. శుద్ధి చేయడం, ఇతర అవసరాలకు వినియోగించడంపై నిబంధనలు పెట్టవచ్చు. దిగువ ప్రాంతాల్లో అనుమతులిచ్చాం! 111 జీవోకు సంబంధించి 2007–13 మధ్య నేను చైర్మన్‌గా ఉన్న ఏపీ ఎక్స్పర్ట్ అప్రైజల్ కమిటీ (ఎన్విరాన్మెంటల్ కమిటీ).. జంట జలాశయాలకు నష్టం కలిగించని దిగువ ప్రాంతం (డౌన్ స్ట్రీమ్స్)లో అనుమతులిచ్చింది. అయితే 20వేల చదరపు మీటర్లు దాటే నిర్మాణాలకు సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ (ఎస్టీపీ) ఉంటేనే అనుమతులిచ్చే విషయాన్ని కచ్చితంగా పాటించాం. ఘన, ద్రవ వ్యర్థాల నివారణ చర్యలు చేపట్టేలా చూశాం. దీనికి సంబంధించి ప్రతీ ఫైల్ తప్పకుండా మున్సిపల్ శాఖ ఆమోదం పొందాకే మా దగ్గరకు వచ్చేలా చర్యలు తీసుకున్నాం. ఇలాంటి సహజ రక్షణ ఎక్కడా లేదు ‘‘హైదరాబాద్ వంటి వినూత్న లక్షణాలు, భౌగోళిక పరిస్థితులు, సహజ రక్షణ ఉన్న నగరం మరొకటి లేదు. కొండలు, గుట్టలు, ఇతర సహజ లక్షణాలతో ఉన్న క్యాచ్మెంట్ ఏరియాలతో కూడిన హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్ రిజర్వాయర్లు.. హైదరాబాద్ నగరానికి ‘జీవనరేఖ’ (లైఫ్‌లైన్)గా ఉపయోగపడుతున్నందున వాటి సంరక్షణ కీలకంగా మారింది. వీటి పరిధిలో పర్యావరణ వ్యవస్థలను, బయో కన్జర్వేషన్ జోన్లను కాపాడాలి. -
ఎత్తేస్తారా.. సడలిస్తారా?.. అన్ని వర్గాల్లో ఆసక్తికర చర్చ
సాక్షి, హైదరాబాద్: జీవో 111 ఎత్తివేత సులభమేనా? దీని అవసరం తీరిపోయిందా? దశాబ్దాల తరబడి జంట నగరాల ప్రజల దాహార్తిని తీర్చిన జంట జలాశయాల ప్రాధాన్యత తగ్గిపోయిందా? జీవో 111ను ఎత్తివేస్తామన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటన నేపథ్యంలో ఇలాంటి ప్రశ్నలెన్నో ఉత్పన్నమవుతున్నాయి. మిగతా అంశాల విషయం ఎలా ఉన్నా.. హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్‌ల పరిరక్షణ దృష్ట్యా ఆ జలాశయాల చుట్టూ 10 కిలోమీటర్ల పరివాహక ప్రాంతంలో ఎటువంటి పరిశ్రమలు, భారీ నిర్మాణాలకు అనుమతి ఇవ్వరాదంటూ జారీ చేసిన జీవో 111 ఎత్తివేత మాత్రం అంత సులభం కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. 1996లో జీవో తెచ్చిన చంద్రబాబు ప్రభుత్వమే.. 1997లో దానికి తూట్లు పొడిచేందుకు ప్రయత్నించి విఫలం కావడాన్ని న్యాయ నిపుణులు గుర్తుచేస్తున్నారు. హైకోర్టులో దీనికి సంబంధించిన ఒక కేసు 15 ఏళ్లుగా కొనసాగుతుండటాన్ని కూడా వారు ప్రస్తావిస్తున్నారు. కాగా ఒకవైపు గ్లోబల్ వార్మింగ్ నేపథ్యంలో.. ఒక గంట వ్యవధిలోనే కుంభవృష్టి పడుతూ నగరాన్ని వరదలు అతలాకుతలం చేస్తున్న పరిస్థితి. మరోవైపు ఐటీ పరిశ్రమ, రియల్ ఎస్టేట్ రంగం ఈ ప్రాంతంలో విస్తృతంగా అభివృద్ధి చెందడానికి అవకాశాలు పుష్కలంగా ఉన్న ప్రాంతంలో భూమి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం..జీవో ఎత్తివేయాలని కోరుతున్న పరీవాహక ప్రాంత రైతుల విన్నపాలు పరిగణనలోకి తీసుకుని ముందుకు వెళుతుందా? లేక పర్యావరణవేత్తల హెచ్చరికల దృష్ట్యా ఏవైనా కొన్ని సవరణలు, సడలింపులు దిశగా అడుగులు వేస్తుందా? జీవోలో సవరణలు/ఎత్తివేతకు న్యాయస్థానాలు అంగీకరిస్తాయా? అనేది చర్చనీయాంశంగా మారింది. జీవో తెచ్చిన ఏడాదికే తూట్లు పొడిచే యత్నం జంట జలాశయాల పరీవాహక ప్రాంతంలో ఓ ఆయిల్ కంపెనీ ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలంటూ చంద్రబాబునాయుడు ప్రభుత్వం 1997లో కేంద్రానికి సిఫారసు చేసింది. ఈ వివాదం అప్పట్లో సుప్రీంకోర్టు దాకా వెళ్లింది. హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్‌లను కాపాడుకోవాల్సిన ఆవశ్యతకను వివరిస్తూ అత్యున్నత న్యాయస్థానం స్పష్టమైన తీర్పునిచ్చింది. జలాశయాలకు సమీపంలో పరిశ్రమలకు అనుమతులు ఇవ్వరాదని తేల్చిచెప్పింది. పరిశ్రమలకు అనుమతులు ఇవ్వడం ద్వారా వాటి నుంచి వెలువడే రసాయనాలు, ఇతర వ్యర్థాలతో జలాశయాలు కలుషితం అవుతాయని పేర్కొంది. ఈ నేపథ్యంలో జీవో 111ను ఎత్తివేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల తీసుకున్న తాజా నిర్ణయం కూడా మరోసారి వివాదంగా మారే సూచనలు కన్పిస్తున్నాయి. 15 ఏళ్లుగా హైకోర్టులో.. జీవో 111ను మరింత సమర్ధవంతంగా అమలు చేయాలంటూ పర్యావరణ పరిరక్షణ కోసం కృషి చేస్తున్న డాక్టర్ ఎస్.జీవానందరెడ్డి 2007లో హైకోర్టులో దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యం ఇంకా విచారణ దశలో ఉంది. జీవో 111 పరిధిలో నిర్మాణాలు చేపట్టిన దాదాపు 30 సంస్థలను ఆయన ప్రతివాదులుగా చేరుస్తూ ఈ పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో జీవో 111ను ఎత్తివేయడం సులభమేమీ కాదని న్యాయ నిపుణులు పేర్కొంటున్నారు. జీవో 111కు సవరణలు చేయవచ్చేమో కానీ, పూర్తిగా ఎత్తేసే ప్రయత్నం చేస్తే జాతీయ స్థాయిలో ఉద్యమానికి దారితీస్తుందని పర్యావరణవేత్తలు పేర్కొంటున్నారు. ఆ నీళ్లకు కిలో లీటర్‌కు రూ.12–14 ఖర్చు కృష్ణా, గోదావరి నీటిని హైదరాబాద్‌కు తరలిస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం ఈ జలాశయాల అవసరం లేదన్న రాష్ట్ర ప్రభుత్వ వాదన సమంజసంగా లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. హైదరాబాద్‌కు కృష్ణా, గోదావరి నదుల నుంచి మంచినీటి సరఫరా భారీ వ్యయంతో కూడుకున్నదని, హైదరాబాద్‌కు ఒక కిలోలీటర్ నీటిని తరలించేందుకు రూ.12–14 ఖర్చు అవుతుందని నిపుణులు పేర్కొంటున్నారు. ఈ జంట జలాశయాల నుంచి సరఫరా చేసే లీటరు నీరు రూ.1.25 కంటే తక్కువని జలమండలి లెక్కలే చెబుతున్నాయి. మరోవైపు వరదలు వచ్చినప్పుడు నీటిని తరలించేందుకు ఏర్పాటు చేసిన లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుల ఆధారంగా నగరానికి నీటి తరలింపునకు ఏర్పాటు చేస్తున్నారని, వరదలు రాకపోతే పరిస్థితి ఏమిటని నిపుణులు అంటున్నారు. నివేదిక ఇవ్వని జీవోపై అధ్యయన కమిటీ.. జీవో 111 పరిధిలో ఓ నిర్మాణానికి సంబంధించి దాఖలైన పిటిషన్‌ను విచారించిన జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) జీవో 111పై అధ్యయనం చేసేందుకు నిపుణులతో కమిటీ వేయాలని 2016లో రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఎన్జీటీ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం హైపవర్ కమిటీని ఏర్పాటు చేసింది. 45 రోజుల్లో నివేదిక ఇవ్వాలని కమిటీని ఆదేశించింది. అయితే ఆరేళ్లు గడిచినా కమిటీ ఇప్పటికీ నివేదిక సమర్పించలేదు. మరోవైపు వట్టినాగులపల్లికి చెందిన కొందరు రైతులు ఇటీవల హైకోర్టును ఆశ్రయించారు. తమ గ్రామానికి చెందిన కొన్ని సర్వే నంబర్లు పరీవాహక ప్రాంతంలో లేకపోయినా జీవో 111 పరిధిలో చేర్చారని ఆరోపించారు. కొన్ని సర్వే నంబర్లను జీవో 111 పరిధి నుంచి తొలగించాలని పర్యావరణ పరిరక్షణ శిక్షణ, పరిశోధన సంస్థ (ఈపీటీఆర్ఐ) నివేదిక ఇచ్చినా రాష్ట్ర ప్రభుత్వం స్పందించడం లేదని వారు పేర్కొన్నారు. హైకోర్టు అనుమతి తప్పనిసరి జీవో 111ను మరింత సమర్థవంతంగా అమలు చెయ్యాలని, ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ పరీవాహక ప్రాంతంలో ఉన్న అక్రమ కట్టడాలను తొలగించాలంటూ 2007 లోనే హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. మరోవైపు ఈ జీవో సవరణలకు అనుమతి కోరుతూ 2010లో రాష్ట్ర ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది ఈ పిటిషన్ పలుమార్లు విచారణకు వచ్చినా హైకోర్టు అనుమతి ఇచ్చేందుకు నిరాకరించింది. ఈ నేపథ్యంలో ఆ జీవోకు సవరణలు చేయాలన్నా, ఎత్తివేయాలన్నా హైకోర్టు అనుమతి తీసుకోవడం తప్పనిసరి. – జనార్ధన్ గౌడ్, న్యాయవాది జీవో ఆవశ్యకమన్న సుప్రీంకోర్టు హైకోర్టు, సుప్రీంకోర్టులో జీవో 111కు సంబంధించిన విచారణలు జరిగిన నేపథ్యంలో ఇప్పుడు ఆ జీవోను ఎత్తేయడం అంత సులభమైన విషయం కాదు. జీవో ట్రిపుల్ వన్ అత్యంత ఆవశ్యకమని అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది. పలువురు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు సైతం ఈ జీవోను సమర్థవంతంగా అమలు చేయాల్సిన ఆవశ్యకతను గుర్తు చేశారు రాష్ట్ర ప్రభుత్వం ఈ జీవోను ఎత్తేసే ప్రయత్నం చేస్తే పర్యావరణ అసమతుల్యత ఏర్పడే అవకాశం ఉంది. – బి.కొండారెడ్డి, బార్ కౌన్సిల్ సభ్యులు సవరణకు పలు ధర్మాసనాల విముఖత జీవో ట్రిపుల్ వన్ను సవరించాలంటూ దాఖలైన పిటిషన్లపై ఉత్తర్వులు జారీ చేసేందుకు గతంలో పలు హైకోర్టు ధర్మాసనాలు విముఖత వ్యక్తం చేశాయి. శ్రీనగర్‌లోని దాల్ లేక్ పరిసరాల్లో ఎటువంటి నిర్మాణాలు చేపట్టరాదన్న నిబంధనలను సవరించి అక్కడ నిర్మాణాలకు అనుమతి ఇచ్చారని.. ఈ కేసు విచారణ సందర్భంగా ఓ న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. అదే తరహాలో జీవో ట్రిపుల్ వన్ను సవరించే ప్రయత్నం జరుగుతోందని ఆయన అప్పట్లో అభిప్రాయం వ్యక్తం చేశారు.