
( ఫైల్ ఫోటో )
సాక్షి, ఖమ్మం: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి హాత్ సే జోడో యాత్రలో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే ధరణి పోర్టల్‌పై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. 111 జీవో ప్రకారం కేటీఆర్ వెయ్యి ఎకరాల కుంభకోణం చేశారని ఆసక్తికర కామెంట్స్ చేశారు.
కాగా, రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. తోట చంద్రశేఖర్‌కు కేటాయించిన భూములపై విచారణ చేయాలి. సీఎం కేసీఆర్ నీతిమండుడైతే విచారణకు సిద్ధం కావాలి. పేదలకు డబుల్ బెడ్ రూమ్స్ ఎందుకు ఇవ్వలేదు. రుణమాఫీ ఎందుకు అమలు చేయలేదు. ఫీజు రీయింబర్స్‌మెంట్ లేదు.. ఆరోగ్యశ్రీ కింద 850 కోట్ల బకాయి ఉంది. రైతులకు అనుకూలమైన విధానాలను కాంగ్రెస్ తెచ్చింది. కేసీఆర్ ఆడంబరంగా ఉచిత్ విద్యుత్ అన్నాడు.. కానీ ఇవ్వడంలేదు. ప్రైవేటు విద్యుత్ సంస్థల నుంచి 50 శాతం కమీషన్‌లు తీసుకున్నాడు. విద్యుత్ సంస్థలను నిర్వీర్యం చేశాడు.
2014 నుండి నేటి వరకు ఉచిత విద్యుత్ 20 వేల కోట్లు మొండి బకాయిగా మారింది. విద్యుత్ కార్యాలయం ఎర్రమంజిల్‌తో పాటు అన్ని తనాఖాలో ఉన్నాయి. యాదాద్రి పవర్ ప్లాంట్ కూడా సొంత మనుషులకు ఇప్పించి కుంభకోణాలకు పాల్పడ్డారు. రానున్నది కాంగ్రెస్ ప్రభుత్వమే. మేము అధికారంలోకి వచ్చాక భూముల సంగతి తెలుస్తాము అంటూ కామెంట్స్ చేశారు.