రంగారెడ్డి జిల్లా పరిధిలోని రెండు చెరువుల పరిరక్షణ కోసం తీసుకొచ్చిన జీవో 111 వల్ల రైతులు ఇబ్బందులు పడుతు న్నారని, దాన్ని పునర్‌సమీక్షించాలని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు.
సాక్షి, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా పరిధిలోని రెండు చెరువుల పరిరక్షణ కోసం తీసుకొచ్చిన జీవో 111 వల్ల రైతులు ఇబ్బందులు పడుతు న్నారని, దాన్ని పునర్‌సమీక్షించాలని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు.
గాంధీ భవన్‌లో శనివారం విలేకరులతో మాట్లాడుతూ..శాస్త్రీయఅధ్యయనం చేయకుండా 1996 లో చంద్రబాబు సీఎంగా ఉన్నçప్పుడు ఈ జీవో తెచ్చారన్నారు. జాతీయగ్రీన్ ట్రిబ్యున ల్, హైకోర్టులు కూడా జీవోను సమీక్షించా లని ఆదేశాలివ్వడాన్ని స్వాగతిస్తున్నామని, 20 ఏళ్లుగా రైతులు చేస్తున్న పోరాటం ఫలించిందన్నారు. ప్రధాని మోదీకి బ్రాండ్ అంబాసిడర్‌గా సీఎం కేసీఆర్ మాట్లాడుతున్నారని టీపీసీసీ ఉపాధ్య క్షుడు మల్లు రవి విమర్శిం చారు. నోట్ల రద్దు దిక్కుమా లిన నిర్ణయమని వ్యాఖ్యా నించిన సీఎం కేసీఆర్.. ఢిల్లీ వెళ్లి రాగానే మోదీ జపం చేస్తున్నారన్నారు. సామాన్య ప్రజల కష్టాల గురించి పట్టించుకోకుండా కేసీఆర్ మాట్లాడటం దారుణమన్నారు.