Why Telangana Government Withdraw 111 GO? - Sakshi
Sakshi News home page

111 జీవో ఎత్తివేత.. 84 గ్రామాల్లో సంబరాలు

Published Fri, May 19 2023 9:36 AM | Last Updated on Mon, May 22 2023 6:33 PM

Why Telangana Govt Withdraw 111 GO - Sakshi

జీవో 111 అంటే ఏంటి? అసలు దీని వెనుక ఉన్న కథేంటి? ఎందుకు జీవో ఎత్తివేయాలని ప్రభుత్వం ఎందుకు అనుకుంది? 111 జీవో రద్దుకు క్యాబినెట్ ఆమోద ముద్ర పడటంతో ఎవరికి ప్రయోజనం? ఎవరికి నష్టం ? 

 అసెంబ్లీ వేదికగా గతంలో 111 జీవోపై కీలక నిర్ణయం కేసీఆర్ ప్రకటించారు.  తాజాగా 111 జీవో రద్దు చేస్తూ క్యాబినెట్ ఆమోద ముద్ర వేసింది. 111 జీవో పరిధిలో పరిధిలో 1,32,600 ఏకరాల భూమి ఉంది. గతంలో జంట జలాశయ పరిరక్షణ కోసం ఈ జీవోను తెచ్చారు. హైదరాబాద్ నగరానికి ఇప్పుడు ఈ జలాశయాల నీరు అవసరం లేదని, ఇంకో వంద సంవత్సరాల వరకు హైదరాబాద్ కు నీటి కొరత ఉండదుని అందుకే ఇప్పుడున్న పరిస్థితుల్లో 111 జీవో అర్థరహితం అని కేసీఆర్‌ భావించారు. ఈ మేరకు అప్పట్లో ఒక నిపుణులు కమిటీ వేశారు. ఎక్స్‌పర్ట్స్ కమిటీ నివేదిక రాగానే 111 జీవో ఎత్తివేస్తాం అంటూ గతంలో సీఎం ప్రకటించారు. తాజాగా క్యాబినెట్ లో 111 రద్దుకు ఆమోద ముద్ర పడింది

రియల్ ఎస్టేట్ రికార్డులు..
111 వన్ జీవో.. చేవెళ్ల, రాజేంద్ర నగర్ నియోజకవర్గాల్లోని 84 గ్రామాల వ్యధ గుర్తుకు వస్తుంది.  లక్ష 32 వేల ఎకరాల భూమి  కథ ఇది... ఈ త్రిపుల్ వన్ జీవో. చాలా మంది పెద్దమనుషులు పెట్టుబడులకు కేరాఫ్ అడ్రస్ ఈ ప్రాంతం.  ఒక్కసారి జీవో ఎత్తేస్తే… అక్కడ జరిగే రియల్ ఎస్టేట్ రికార్డులు సృష్టిస్తోంది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 1,32,000 ఎకరాల్లో విస్తరించి ఉంది GO.111. ఏకంగా 84 గ్రామాలు ఈ జీవో పరిధిలోకి వస్తాయి. కొన్ని దశాబ్దాలుగా ఈ గ్రామాల ప్రజలు త్రిబుల్ వన్ ఎత్తివేయాలని డిమాండ్ చేస్తున్నారు.

హైదరాబాద్ పట్టణానికి నీరందించే జంట జలాశయాలు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్‌ను కాపాడేందుకు 1996లో అప్పటి ప్రభుత్వం జీవో 111ను తీసుకువచ్చింది. ఈ జీవో పరిధిలో నిర్మాణాలు చేయడంపై నిషేధం విధించింది. వ్యవసాయం తప్ప ఏ రంగానికి ఇక్కడ భూమి కేటాయింపు చేయకూడదు. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక త్రిబుల్ వన్ GO ఎత్తి వేస్తామంటూ ఎన్నికల హామీలు ఇచ్చాయి రాజకీయ పార్టీలు. దీంతో త్రిబుల్ వన్ జీరో పరిధిలో లావాదేవీలు పెద్ద ఎత్తున పెరిగాయి.

చాలా ఏళ్లుగా పోరాటం..
రెండు తెలుగు రాష్ట్రాల్లోని బడా పారిశ్రామికవేత్తలు, రాజకీయ నాయకుల నుంచి రియల్ ఎస్టేట్ వ్యాపారుల వరకు చిన్నాపెద్ద అంతా 111 జీవోలో భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టారు. వెంచర్లు అక్రమ నిర్మాణాలతో రియల్ ఎస్టేట్ ట్రేడింగ్ భారీగా జరుగుతుంది. 111 జీవో ఎత్తివేయాలంటూ టీఆర్ఎస్ నేత పట్లోళ్ల కార్తీక్ రెడ్డి  కోర్టులో చాలా ఏళ్లుగా పోరాడుతున్నారు. సీఎం కేసీఆర్ నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు ఈ ప్రాంత ప్రజలు. 

మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం కూడా జీవో ఎత్తివేయాలని ఉద్దేశంతోనే ఉంది. ఈ అంశం తెరపైకి వచ్చిన ప్రతిసారి రంగారెడ్డి ప్రజలంతా ఆశతో ఎదురు చూస్తూ ఉంటారు. హైకోర్టు కొద్ది రోజుల క్రితం ప్రభుత్వం వేసిన కమిటీ రిపోర్టు అడగడంతో.. సీఎం కేసీఆర్ 111 జీవోపై సమీక్ష జరిపారు. రిపోర్టు కోర్టుకు అందించేందుకు కొంత సమయం కావాలని అడగాలని నిర్ణయించుకుంది. అంతేకాకుండా జీవో పరిధిలో మరింత ఉండేలా, జంట జలాశయాలు కాలుష్యం బారిన పడకుండా ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. హైదరాబాద్ నగర వాతావరణ సమతుల్యతను పెంచేలా ప్రణాళికలు ఉండాలని సూచించారు. 

సంబరాలు
మొత్తానికి 111జీవో పరిధిలో ఉన్న భూములు ఇక బంగారం కానున్నాయి. జీవో రద్దుతో 84 గ్రామాల్లోని ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారు. అజీజ్ నగర్ గ్రామస్థులు స్వీట్లు పంచి ఆనందం వ్యక్తం చేశారు.

చదవండి: 111 పూర్తిగా రద్దు.. వీఆర్‌ఏల క్రమబద్ధీకరణ.. కేబినెట్‌ కీలక నిర్ణయాలివే..

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement