
20 ఏళ్ల పోరాటం ఫలించింది : మాజీ మంత్రి
హైదరాబాద్: జీవో నెంబర్ 111పై 20 ఏళ్ల పోరాటం ఫలించిందని మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు సబితా ఇంద్రారెడ్డి చెప్పారు. హైదరాబాద్లో శనివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ జీవో నెంబర్ 111ను పునః సమీక్షించే అధికారాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్జీటీ ఇచ్చిందన్నారు. జీవోను పునః సమీక్షించాలని గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలివ్వడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. వెంటనే ప్రభుత్వం స్పందించి నివేదిక ఇవ్వాలని సబితా సూచించారు.
హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్ పరివాహక ప్రాంతాల్లోని 84 గ్రామాలకు నీరు అందించే అంశంపై జీవో నెంబర్ 111లో పేర్కొన్నారు. దీనిపై అధ్యయనం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.