
సాక్షి, హైదరాబాద్: బండి సంజయ్ దీక్ష భగ్నం, అరెస్టుతో మొదలైన రాజకీయవేడి ఇప్పట్లో చల్లారే సూచనలు కనిపించడం లేదు. ఆ ఘటనకు సంబంధించి ప్రభుత్వ ఉన్నతాధికారులు, పోలీసులకు ప్రివిలేజ్ కమిటీ సమన్లు జారీ చేయడం చర్చనీయాంశంగా మారింది. అధికారులు ప్రభుత్వపరం గానే సమాధానం ఇవ్వాల్సి ఉన్నా.. రాజ కీయ పరిణామాలపై అందరి దృష్టి పడింది. దీక్ష భగ్నం తర్వాతి పరిణామాల నేపథ్యం లో పలువురు బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు తెలంగాణకు వచ్చి టీఆర్‌ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ లక్ష్యంగా విమ ర్శలు చేశారు.
పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్‌తోపాటు పలువురు టీఆర్ ఎస్ నేతలు ఆ విమర్శలను తిప్పికొట్టారు కూడా. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఈడీ, సీబీఐ వంటి సంస్థలను అడ్డుపెట్టుకుని విపక్ష పార్టీలపై బెదిరింపులకు పాల్పడు తోందని ఆరోపణలు గుప్పించారు. ఈ క్రమంలో ప్రివిలేజ్ కమిటీ నోటీసులకు ఏం సమాధానమిస్తారు, కమిటీ ఏం చేస్తుందన్న ది ఉత్కంఠగా మారింది. బీజేపీ నేతలు ఈ అంశంపై రాజకీయ విమర్శలు చేస్తే.. తా ము కూడా స్పందించాల్సి వస్తుందని టీఆర్‌ఎస్‌కు చెందిన ఓ ముఖ్య నేత వెల్లడిం చారు. ఈ అంశాన్ని తాము రాజకీయం చేయదలుచుకోలేదని వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment