privileges committee
-
ప్రివిలేజెస్ కమిటీ చైర్మన్‌గా భూమన
సాక్షి, అమరావతి: అసెంబ్లీ ప్రివిలేజెస్ కమిటీ చైర్మన్‌గా ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి నియమితులయ్యారు. పలు అసెంబ్లీ కమిటీలు, జాయింట్ కమిటీలను ఏర్పాటు చేస్తూ అసెంబ్లీ కార్యదర్శి సోమవారం రెండు బులెటిన్లు విడుదల చేశారు. ప్రివిలేజెస్ కమిటీ చైర్మన్‌గా ఉన్న కాకాణి గోవర్ధన్‌రెడ్డి మంత్రివర్గంలో చేరడంతో ఆయన స్థానంలో కరుణాకర్‌రెడ్డిని నియమించారు. సభ్యులుగా ఎమ్మెల్యేలు భాగ్యలక్ష్మి, కోన రఘుపతి, అబ్బయ్యచౌదరి, సుధాకర్‌బాబు, వెంకట చినఅప్పలనాయుడు, అనగాని సత్యప్రసాద్‌ను నియమించారు. రూల్స్ కమిటీ చైర్మన్‌గా స్పీకర్ తమ్మినేని సీతారాం, పిటిషన్స్ కమిటీ చైర్మన్‌గా డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి, హామీల కమిటీ చైర్మన్‌గా కైలే అనిల్‌కుమార్, ఎథిక్స్ కమిటీ చైర్మన్‌గా శిల్పా చక్రపాణిరెడ్డిని నియమించారు. అసెంబ్లీ, కౌన్సిల్‌కు పలు జాయింట్ కమిటీలను కూడా నియమించారు. ఎమినిటీస్, వన్యప్రాణి–పర్యావరణ పరిరక్షణ కమిటీల చైర్మన్‌గా తమ్మినేని, ఎస్సీల సంక్షేమ కమిటీ చైర్మన్‌గా గొల్ల బాబూరావు, ఎస్టీల సంక్షేమ కమిటీ చైర్మన్‌గా బాలరాజు, మైనారిటీల సంక్షేమ కమిటీ చైర్మన్‌గా ముస్తఫా, మహిళ, శిశు, దివ్యాంగులు, వృద్ధుల సంక్షేమ కమిటీ చైర్‌పర్సన్‌గా జొన్నలగడ్డ పద్మావతి, సబార్డినేట్ లెజిస్లేషన్ కమిటీ చైర్మన్‌గా మర్రి రాజశేఖర్, బీసీల సంక్షేమ కమిటీ చైర్మన్‌గా రమే‹Ùయాదవ్, లైబ్రరీ కమిటీ చైర్మన్‌గా పి.రామసుబ్బారెడ్డిని నియమించారు. -
సీఎస్, డీజీపీ, కరీంనగర్ సీపీలకు నోటీసులు.. టీఆర్ఎస్లో ‘ప్రివిలేజ్’ సంకటం!
సాక్షి, హైదరాబాద్: బండి సంజయ్ దీక్ష భగ్నం, అరెస్టుతో మొదలైన రాజకీయవేడి ఇప్పట్లో చల్లారే సూచనలు కనిపించడం లేదు. ఆ ఘటనకు సంబంధించి ప్రభుత్వ ఉన్నతాధికారులు, పోలీసులకు ప్రివిలేజ్ కమిటీ సమన్లు జారీ చేయడం చర్చనీయాంశంగా మారింది. అధికారులు ప్రభుత్వపరం గానే సమాధానం ఇవ్వాల్సి ఉన్నా.. రాజ కీయ పరిణామాలపై అందరి దృష్టి పడింది. దీక్ష భగ్నం తర్వాతి పరిణామాల నేపథ్యం లో పలువురు బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు తెలంగాణకు వచ్చి టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ లక్ష్యంగా విమ ర్శలు చేశారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్‌తోపాటు పలువురు టీఆర్ ఎస్ నేతలు ఆ విమర్శలను తిప్పికొట్టారు కూడా. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఈడీ, సీబీఐ వంటి సంస్థలను అడ్డుపెట్టుకుని విపక్ష పార్టీలపై బెదిరింపులకు పాల్పడు తోందని ఆరోపణలు గుప్పించారు. ఈ క్రమంలో ప్రివిలేజ్ కమిటీ నోటీసులకు ఏం సమాధానమిస్తారు, కమిటీ ఏం చేస్తుందన్న ది ఉత్కంఠగా మారింది. బీజేపీ నేతలు ఈ అంశంపై రాజకీయ విమర్శలు చేస్తే.. తా ము కూడా స్పందించాల్సి వస్తుందని టీఆర్ఎస్కు చెందిన ఓ ముఖ్య నేత వెల్లడిం చారు. ఈ అంశాన్ని తాము రాజకీయం చేయదలుచుకోలేదని వ్యాఖ్యానించారు. -
ప్రివిలేజ్ కమిటీ ఏకాభిప్రాయానికి వచ్చింది: ఛైర్మన్ కాకాణి
సాక్షి, అమరావతి: ప్రతిపక్ష ఎమ్మెల్యేలు అచ్చెన్నాయుడు, నిమ్మల రామానాయుడు సభను తప్పుదోవ పట్టించారని ప్రివిలేజ్ కమిటీ ఏకాభిప్రాయానికి వచ్చిందని కమిటీ ఛైర్మన్ కాకాణి గోవర్ధన్‌రెడ్డి అన్నారు. ఆయన అధ్యక్షతన మంగళవారం ప్రివిలేజ్ కమిటీ సమావేశం ముగిసింది. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్ష ఎమ్మెల్యేలు అచ్చెన్నాయుడు, నిమ్మలపై చర్యలు తీసుకోవాలని నివేదిక ఇస్తామని తెలిపారు. నోటీసుల సమయంలో అందుబాటులో లేనని కూన రవి చెబుతున్నారని తెలిపారు. అందుబాటులో ఉన్నారని ఫిర్యాదు చేసినవారు తెలిపారని పేర్కొన్నారు. ఆధారాలు సమర్పించాలని ఇరువురికీ చెప్పామని, ఆధారాల పరిశీలన తర్వాత కూన రవిపై చర్యల విషయంలో నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. నిమ్మగడ్డ తనపై వచ్చిన ఫిర్యాదుపై మరింత సమాచారం కోరారు అని తెలిపారు. కోర్టు పరిధిలో ఉన్నంత మాత్రాన ప్రివిలేజ్ కమిటీలో చర్చించకూదనేం లేదన్నారు. నిమ్మగడ్డకు ఈ వ్యవస్థపై అవగాహన ఉండకపోవచ్చు అని అన్నారు. సభను తప్పుదోవ పట్టించారన్న శ్రీకాంత్‌రెడ్డి ఫిర్యాదుపై.. అచ్చెన్నాయుడు, నిమ్మలపై చర్యలకు కమిటీ సిఫార్సు చేయనుంది. మద్యం షాపులపై అచ్చెన్నాయుడు సభను తప్పుదోవ పట్టించారని, వృద్ధాప్య పెన్షన్ల విషయంలో నిమ్మల సభను తప్పుదోవ పట్టించారని కమిటీ నిర్ధారణ చేసింది. స్పీకర్‌ను దూషించారనే ఫిర్యాదుపై అచ్చెన్నాయుడు క్షమాపణలు చెప్పడంతో పరిగణలోకి తీసుకొని ప్రివిలేజ్ కమిటీ క్షమించిన విషయం తెలిసిందే. -
స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు: క్షమాపణ కోరిన అచ్చెన్నాయుడు
సాక్షి, విజయవాడ: ఏపీ అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ సమావేశమైంది. ఛైర్మన్ కాకాణి గోవర్థన్‌రెడ్డి అధ్యక్షతన భేటీ జరిగింది. టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడిపై వచ్చిన ఫిర్యాదుపై ప్రివిలేజ్ కమిటీ విచారణ జరిపింది. కమిటీ ముందు హాజరైన అచ్చెన్నాయుడు క్షమాపణ కోరారు. ఎమ్మెల్యే జోగి రమేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కమిటీ విచారణ చేపట్టింది. గతంలో స్పీకర్ తమ్మినేనిపై అచ్చెన్నాయుడు అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అచ్చెన్నాయుడు అనుమతి లేకుండా న్యాయవాదిని తీసుకురాగా, ప్రివిలేజ్ కమిటీ అభ్యంతరం తెలిపింది. కమిటీ సభ్యుల అభిప్రాయం మేరకు తదుపరి నిర్ణయం: కాకాణి సమావేశం అనంతరం ప్రివిలైజ్ కమిటీ చైర్మన్ కాకాని గోవర్ధన్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, అచ్చెన్నాయుడు తన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నారని.. ఆయన వివరణను కమిటీ సభ్యులకు పంపిస్తామని తెలిపారు. కమిటీ సభ్యుల అభిప్రాయం మేరకు తదుపరి నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. కూన రవి అందుబాటులో లేనని సమాచారం ఇచ్చారని.. మరొక అవకాశం ఇస్తే కమిటీ ముందు హాజరవుతానని తెలిపారని కాకాణి చెప్పారు. నిమ్మగడ్డ రమేష్, రామానాయుడులపై 21న జరిగే సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని కాకాణి తెలిపారు. ఇవీ చదవండి: ఏపీఈఏపీ సెట్ ఫలితాలు విడుదల సాక్షి ఎఫెక్ట్: పెట్రోల్ బంకుల్లో అధికారుల తనిఖీలు -
గీతపై ఫిర్యాదు ప్రివిలేజెస్ కమిటీకి
ప్రాథమిక విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని స్పీకర్ సూచన సాక్షి, న్యూఢిల్లీ: అరకు ఎంపీ కొత్తపల్లి గీతపై వచ్చిన పార్టీ ఫిరాయింపు ఫిర్యాదును లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ ప్రివిలేజెస్ కమిటీకి పంపారు. కొత్తపల్లి గీత వైఎస్సార్ కాంగ్రెస్ నుంచి ఎంపీగా గెలిచి ఆంధ్రప్రదేశ్‌లోని అధికార టీడీపీలో చేరారని వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత మేకపాటి రాజమోహన్ రెడ్డి గత ఏడాది లోక్‌సభ స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. రాజ్యాంగంలోని పదో షెడ్యూలులో పొందుపరిచిన నిబంధనల మేరకు కొత్తపల్లి గీతపై అనర్హత వేటు వేయాలని కోరారు. ఈ నేపథ్యంలో స్పీకర్ కొత్తపల్లి గీతను∙వివరణ కోరారు. ఆమె పంపిన వివరణపై తిరిగి మేకపాటి రాజమోహన్‌రెడ్డి ప్రతిస్పందన కోరారు. ఈ ప్రక్రియ ముగిసిన నేపథ్యంలో జూలై 4న ఈ అంశాన్ని లోక్‌సభ సభ్యుల (ఫిరాయింపును అనుసరించి అనర్హత) నిబంధనలు–1985లోని 7(4) నిబంధన కింద స్పీకర్ ప్రివిలేజెస్ కమిటీకి పంపుతూ ప్రాథమిక విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని సూచించారు. -
చేయని తప్పుకు రోజాకు 14 నెలలు శిక్షా?
-
చేయని తప్పుకు రోజాకు 14 నెలలు శిక్షా?
విజయవాడ: చేయని తప్పుకు ఎమ్మెల్యే రోజాను శాసనసభ నుంచి సస్పెండ్ చేశారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పుష్ప శ్రీవాణి అన్నారు. మహిళల సమస్యలపై నిలదీస్తున్న రోజా గొంతు నొక్కాలని చూస్తున్నారని వ్యాఖ్యానించారు. ఆమె శనివారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. కొత్త రాజధానిలో తెలుగుదేశం ప్రభుత్వం కొత్త సంప్రదాయాలకు తెర తీస్తోంది. ప్రజా సమస్యలపై పోరాడుతున్న ప్రతిపక్షానికి సభలో మాట్లాడటానికి అవకాశం ఇస్తుందని భావించాం. అయితే ప్రతిపక్ష నేతపై ఏ రకంగా వ్యక్తిగత విమర్శలు చేస్తోందో గమనించే ఉంటారు. సమస్యలను లేవనెత్తితే...ఆ అంశాలను పక్కదాని పట్టించేందుకు ప్రభుత్వం వ్యక్తిగత దూషణలకు దిగుతోంది. ఎమ్మెల్యే రోజాపై మరో ఏడాదిపాటు సస్పెన్షన్ కొనసాగించాలని ప్రివిలేజ్ కమిటీ సిఫార్సు చేయడం దారుణం. చేయని తప్పుకు రోజా 14 నెలలు శిక్ష అనుభవించారు. మళ్లీ కొత్తగా ఎమ్మెల్యే అనిత అంశాన్ని తెరమీదకు తెచ్చి మరో ఏడాది సస్పెండ్ చేయాలని చూడటం దారుణం. రోజా చేసిన తప్పేంటి?. టీడీపీ సర్కార్ హయాంలో ఎమ్మార్వో వనజాక్షిపై దాడి, రితేశ్వరి ఆత్మహత్యం అంశం, కాల్‌మనీ దారుణాలపై అసెంబ్లీ సాక్షిగా నిలదీశారనే కక్షపూరితంగా సస్పెండ్ చేశారు. తాజాగా అనంతపురం జిల్లాలో పయ్యావుల కేశవ్ వర్గం ఓ మహిళపై దౌర్జన్యానికి పాల్పడ్డారు. ఆ అంశాన్ని నిలదీసిందుకా? లేక విశాఖలో బీచ్ ఫెస్టివల్ నిర్వహిస్తామంటే అడ్డుకున్నందుకా రోజాను సస్పెండ్ చేసింది. రోజాను చూస్తే చంద్రబాబుకు ఎందుకంత భయం?. దళితల కోసం ఏనాడు పోరాటం చేయని అనితా ఈరోజు రాజకీయ మైలేజ్ కోసం రోజాను ఇరికిస్తున్నారు. హత్య చేసిన ఖూనీకోరుకు ఒకేసారి శిక్షవేస్తారు. అలాగే దోషికి శిక్ష విధించేటప్పుడు చివరి కోరిక అడుగుతారని... అలాంటిది ఏకపక్షంగా సస్పెన్షన్ చేసిన రోజాను... ప్రభుత్వం వివరణ అడగకపోవడం మహిళగా సిగ్గుపడుతున్నా. మహిళల పట్ల ప్రభుత్వ వైఖరిని ప్రజలు గమనిస్తున్నారు.’ అని అన్నారు. -
ఎమ్మెల్యే రోజాపై కక్ష సాధింపు కుట్రలు
విజయవాడ: ఎమ్మెల్యే రోజాపై టీడీపీ కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి అన్నారు. మరో ఏడాదిపాటు ఆమెపై సస్పెన్షన్ కొనసాగించాలని కుట్ర చేస్తున్నారని ఆయన శనివారమిక్కడ వ్యాఖ్యానించారు. మహిళా సమస్యలపై రోజా రాజీలేని పోరాటం చేస్తున్నారని, ఆమెను ఎదుర్కొనే ధైర్యం లేకనే ...గొంతు నొక్కాలని చూస్తున్నారని విశ్వేశ్వరరెడ్డి అన్నారు. రోజా మనస్ఫూర్తిగా క్షమాపణ చెప్పలేదని అని ప్రివిలేజ్ కమిటీ ఎలా నిర్ణయానికి వస్తుందని ఆయన అడిగారు. ప్రివిలేజ్ కమిటీ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం విచారకరమని, ఇలాంటి చర్యల వల్ల కమిటీ పై గౌరవం తుగ్గుతోందని ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి అన్నారు. టీడీపీ ఎమ్మెల్యే అనితను తన వ్యాఖ్యలు బాధించి ఉంటే విచారం వ్యక్తం చేస్తున్నానని రోజా తెలిపారన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా రోజా సస్పెన్షన్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని విశ్వేశ్వరరెడ్డి సూచించారు. అలాగే అసెంబ్లీ స్పీకర్ అనుమతి లేకుండా వీడియోలు విడుదల చేసినవారిపై ఇప్పటివరకూ ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఎమ్మెల్యే రోజా అనని మాటలను అన్నట్లుగా మార్పులు చేసి ఆ వీడియోను సోషల్ మీడియాలో పెట్టారన్నారు. ఆ వీడియో ఫుటేజ్‌లను ప్రభుత్వ చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులు...టీడీపీ కార్యాలయంలో విడుదల చేశారని, ఈ విషయాన్ని స్పీకర్ దృష్టికి తీసుకు వెళ్లామన్నారు. అయితే వాటితో తనకు సంబంధం లేదని, తాను ఎలాంటి అనుమతి ఇవ్వలేదని స్పీకర్ దానిపై విచారణకు ఆదేశించారన్నారు. అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ ఇచ్చిన వీడియోకు... ఆ వీడియోకు ఎలాంటి సంబంధం లేదన్నారు. వాళ్లు ఆరోపిస్తున్న క్లిప్పింగ్స్ అందులో లేవనే విషయం స్పష్టంగా అర్థం అవుతుందన్నారు. రోజాపై దుష్ప్రచారం చేయడానికి కుట్ర పన్నుతున్నారని, అలాంటి పరిణామం శాసనసభ గౌరవానికి మంచిది కాదన్నారు. టీడీపీ చర్యలను ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. -
ఏపీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం
అమరావతి: ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు గురువారం ఉదయం ప్రారంభం అయ్యాయి. సమావేశాలు ఆరంభం కాగానే ప్రశ్నోత్తరాల కార్యక్రమం మొదలైంది. ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి. మరోవైపు ప్రివిలేజ్ కమిటీ ఇవాళ శాసనసభలో నివేదిక సమర్పించనుంది. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజాపై స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఏడాది పాటు సస్పెన్షన్ విధించిన విషయం తెలిసిందే. -
‘హోదా’ కోసం పోరాడితే బందిపోట్లా?
వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి అభ్యంతరం సభా హక్కుల కమిటీ ముందు వాదనలు సాక్షి, హైదరాబాద్: ‘‘ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్న ఎమ్మెల్యేలను బందిపోట్లతో పోలుస్తారా? టీడీపీ వైఖరి ఇదేనా?’’ అని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి సభా హక్కుల(ప్రివిలేజెస్) కమిటీ ముందు అభ్యంతరం వ్యక్తం చేశారు. సెప్టెంబర్ 8, 9, 10 తేదీల్లో ఏపీ శాసనసభలో జరిగిన సంఘటనలపై గొల్లపల్లి సూర్యారావు అధ్యక్షతన ఏర్పాటైన ప్రివిలేజెస్ కమిటీ ముందు గురువారం భాస్కర్‌రెడ్డి హాజరై తన వాదనలు వినిపించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రావణ్‌కుమార్ (కమిటీ సభ్యుడు) చేసిన వ్యాఖ్యలపై ఆయన అభ్యంతరం తెలిపారు. ‘‘కొందరు బందిపోట్లు ఒక గ్రామాన్ని దోపిడీ చేసిన తరువాత.. ఇలా ఎందుకు చేశారని ఎవరైనా ప్రశ్నిస్తే రాష్ట్ర ప్రజల మేలు కోసం దోపిడీ చేశాం అన్నట్లుగా ఉంది మీరంతా (వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు) అసెంబ్లీలో వ్యవహరించిన తీరు’’ అని శ్రావణ్ వ్యాఖ్యానించగా చెవిరెడ్డి తీవ్ర నిరసన తెలిపారు. రాష్ట్ర ప్రజల భవిష్యత్తుతో ముడిపడి ఉన్న ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్న తమను బందిపోట్లు అని ఎలా అంటారని చెవిరెడ్డి ప్రశ్నించారు.మరో సభ్యుడు కురుగొండ్ల రామకృష్ణ.. భాస్కర్‌రెడ్డికి అడ్డుతగులుతూ ‘‘మీరంతా తప్పు చేసి కమిటీ ముందుకు వస్తున్నారు’’ అని అన్నారు. ‘‘మీరు ముందుగానే మేము తప్పు చేశామనే నిర్ణయానికి వచ్చినపుడు ఇక నేనెందుకు వాదనలు వినిపించాలి. ఇక మేం ఏం చెప్పినా ప్రయోజనం ఏముంటుంది’’ అంటూ ఈ విచారణను తాను వాకౌట్ చేస్తున్నానని చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ప్రకటించారు. అర్ధంతరంగా బయటకు వచ్చేశారు. అనంతరం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు. ఏ తప్పూ చేయలేదు: కొడాలి నాని శాసనసభ సమావేశాల్లో తానెలాంటి తప్పూ చేయలేదని, తనపై చర్య తీసుకోవడానికి వీల్లేదని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కొడాలి నాని స్పష్టం చేశారు. ఆయన గురువారం సభా హక్కుల కమిటీ ముందు హాజరై తన వాదన వినిపించారు. అనంతరం మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు. ముగిసిన ప్రివిలేజెస్ కమిటీ విచారణ ఆంధ్రప్రదేశ్ శాసనసభలో సెప్టెంబర్ 8, 9, 10 తేదీల్లో చోటు చేసుకున్న సంఘటనలపై ఏర్పాటైన ప్రివిలేజెస్ కమిటీ తన విచారణను గురువారం పూర్తి చేసింది. తమ నివేదికను జనవరి మొదటి వారంలో స్పీకర్ కోడెల శివప్రసాదరావుకు సమర్పించనున్నట్లు కమిటీ చైర్మన్ గొల్లపల్లి సూర్యారావు వెల్లడించారు.విచారణ ముగిశాక సూర్యారావు మీడియాతో మాట్లాడారు. విచారణ పూర్తయినట్లేనని వెల్లడించారు. ఇంకెవరనీ పిలవాల్సిన అవసరం లేదన్నారు. -
హోదా కోసమే మా నిరసన
- మేమెవరినీ అగౌరవ పర్చలేదు - మాకు దురుద్దేశం లేదు - రెండోరోజు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేల వివరణ - సభా హక్కుల కమిటీ ముందు ఐదుగురి హాజరు - నేడు కూడా ఇద్దరు కమిటీ సభ్యుల డుమ్మా సాక్షి, హైదరాబాద్: ‘ప్రత్యేక హోదా అంశం తీవ్రతను చాటి చెప్పాలనే ఉద్దేశంతోనే శాసనసభలో మేం నిరసన వ్యక్తం చేశాం... దీని వెనుక ఎలాంటి దురుద్దేశం లేదు... ఎవరినీ అగౌరవపర్చలేదు... సీఎం చంద్రబాబు స్వయంగా రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని తీర్మానాలు చేసి పంపి తానే కేంద్ర మంత్రి అరుణ్‌జైట్లీ ప్రకటనకు స్వాగతం పలికితే మాకు కడుపులో భగ్గుమనదా... అందుకే అసెంబ్లీలో ప్రతిపక్షంగా ప్రజల తరఫున హోదాపై చర్చకు పట్టు బట్టాం. మేం చేసిం దేమీ తప్పుగా భావించడం లేదు...హోదా సాధనకు ఎంత దూరమైనా పోరాటం చేస్తాం’ అని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు రెండో రోజు ఏపీ శాసనసభా హక్కుల కమిటీ ముందు హాజరై తమ వివరణ ఇచ్చారు. గత అసెంబ్లీ సమావేశాల్లో హోదా అంశంపై చర్చ జరగాలంటూ నిరసన తెలిపిన నేపథ్యంలో 12 మంది విపక్ష ఎమ్మెల్యేలకు హక్కుల కమిటీ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఆ మేరకు తొలిరోజైన మంగళవారం ఆరుగురికి గాను నలుగురు ఎమ్మెల్యేలు , రెండో రోజైన బుధవారం మరో ఆరుగురికి గాను ఐదుగురు హాజరై తమ వాదనలు వినిపించారు. రెండో రోజున ఆళ్ల రామకృష్ణారెడ్డి (మంగళగిరి), బూడి ముత్యాలనాయుడు (మాడుగుల), కంబాల జోగులు (రాజాం), కిలివేటి సంజీవయ్య (సూళ్లూరుపేట), ముత్తిరేవుల సునీల్‌కుమార్ (పూతలపట్టు) విడివిడిగా కమిటీ ముందుకు వచ్చారు. అంతకుముందే వారు తమ వివరణలను తెలియజేస్తూ కమిటీకి లేఖలు అందజేశారు. విదేశీ పర్యటనలో ఉన్నందున హాజరు కాలేకపోతున్నానని పిన్నెల్లి రామకృష్ణారెడ్డి (మాచర్ల) లేఖ పంపారు. సభా హక్కుల కమిటీకి చైర్మన్ గొల్లపల్లి సూర్యారావుతో సహా ఐదుగురు సభ్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, జ్యోతుల నెహ్రూ, శ్రావణ్‌కుమార్, బి.సి.జనార్థన్‌రెడ్డి బుధవారం హాజరైనప్పటికీ మరో ఇద్దరు టీడీపీ సభ్యులు నందమూరి బాలకృష్ణ, కురుగొండ్ల రామకృష్ణ గైర్హాజరయ్యారు. డిసెంబర్ 2న మళ్లీ కమిటీ సమావేశం కావాలని, ఇప్పుడు హాజరు కాని ఎమ్మెల్యేలు పిన్నెల్లి , కొడాలి నాని, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని ఆ రోజు పిలవాలని నిర్ణయించారు. బుధవారం కమిటీ ముందు ఎమ్మెల్యేలు హాజరై వివరణ ఇచ్చినపుడు చోటు చేసుకున్న అంశాల పూర్వాపరాలు విశ్వసనీయ సమాచారం ప్రకారం ఇలా ఉంది. చంద్రబాబు మోసం వల్లే ఇదంతా: ఆళ్ల తొలుత సభ్యులొక్కొక్కరి చేత విడిగా కమిటీ ప్రమాణాలు చేయించింది. శాసనసభా వ్యవహారాల్లో తానెప్పుడూ సంయమనంతో వ్యవహరిస్తూ ఓపిగ్గానే ఉంటానని... ప్రత్యేక హోదా కావాలన్న ఆకాంక్ష ప్రజల్లో బలీయంగా ఉంటే వారి మనోభావాలను అసెంబ్లీలో కాక మరెక్కడ ప్రతిబింబింప జేయాలని ఆళ్ల రామకృష్ణారెడ్డి కమిటీ ముందు నివేదించారు. మీ నాయకుడు జగన్ మిమ్మల్ని ఇలా చేయమని ప్రేరేపించారా? ఆయనకు మైక్ ఇవ్వక పోతే ఇలా చేస్తారా? అని శ్రావణ్ ప్రశ్నించినపుడు... ‘ఒకళ్లు ప్రేరేపించడం ఏమిటి? హోదాపై మా వాణి వినిపించడానికి ఆరోజు అన్ని దార్లూ మూసేశారు. మేమేం చేయాలి?’ అని ఆళ్ల ప్రశ్నించారు. క్రాస్ ఎగ్జామినేషన్ వద్దు వారు ఇచ్చే వివరణ వినండి అని శ్రావణ్‌ను పెద్దిరెడ్డి వారించారు. కేంద్రానికి తెలియాలనే : సంజీవయ్య ప్రత్యేక హోదాపై రాష్ట్ర ప్రజల మనోభావాలేమిటో, సమస్య తీవ్రత ఎలా ఉందో కేంద్ర ప్రభుత్వానికి తెలియజెప్పడానికే అసెంబ్లీలో అలా చేయాల్సి వచ్చిందని కిలివేటి సంజీవయ్య చెప్పారు. వీడియో దృశ్యాల్లో తొలుత సంజీవయ్య ఎక్కడ ఉన్నదీ సభ్యులెవరూ గుర్తించలేదు. సంజీవయ్యే జోక్యం చేసుకుని తానెక్కడ ఉన్నదీ వారికి చూపారు. అలా ఎందుకు చేశారని గొల్లపల్లి ప్రశ్నించినపుడు... ‘పోడియంను ఎమ్మెల్యేలు చుట్టుముట్టడం కొత్తేమీ కాదని అందరికీ తెలుసు. బయట ప్రజల్లో ప్రత్యేక హోదా ఆకాంక్ష బలీయంగా ఉన్నపుడు అసెంబ్లీలో చర్చకు తావివ్వకుంటే స్పీకర్‌ను ఒప్పించేందుకే అలా చేయాల్సి వచ్చింది. సభలో అలాంటి సంఘటనలు జరక్కూడదు. కానీ చర్చకు తావివ్వడం లేదన్న ఆవేశంలో అలా చేయక తప్పలేదు’ అని సంజీవయ్య వివరణ ఇచ్చారు. హోదా కోసమే: సునీల్‌కుమార్ తాము అసెంబ్లీలో నిరసన తెలపడం వెనుక ప్రత్యేక హోదా కావాలన్న బలీయమైన ఆకాంక్షే తప్ప ఇంకేమీ లేదని తమకు ఎలాంటి దురుద్దేశం లేదని సునీల్‌కుమార్ అన్నారు. మీరు గొడవ చేస్తే ప్రత్యేక హోదా వస్తుందా? అని గొల్లపల్లి ప్రశ్నించగా... ‘మౌనంగా ఉంటే తమ ప్రకటనతో సంతృప్తిగా ఉన్నారని కేంద్ర ప్రభుత్వం భావించే అవకాశం ఉంది. సమస్య తీవ్రత బయట ప్రజల్లో ఎంత ఉందో తెలియ జెప్పడానికే అలా చేయాల్సి వచ్చింది’ అని సునీల్ కుమార్ తెలిపారు. తప్పనిస్థితిలో...: ముత్యాలనాయుడు వాస్తవానికి అసెంబ్లీలో ఇలాంటి పరిస్థితులు రాకూడదని తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే తాము నిరసనకు దిగాల్సి వచ్చిందని బూడి ముత్యాలనాయుడు తెలిపారు. వీడియో దృశ్యాలు చూపించినపుడు నాయుడు 8వ తేదీనాటి క్లిప్పింగ్‌లో ప్లకార్డు పట్టుకుని వెనుక నుంచుని ఉన్నారు. 9వతేదీన ఆయన దృశ్యాల్లో లేరు. 10వ తేదీన మాత్రం స్పీకర్ పోడియం దగ్గర నుంచుని ఉన్నట్లుగా తల మాత్రం కనిపించింది. వీటిపై వివరణ అడిగినపుడు సభలో ప్లకార్డు ప్రదర్శించడం తప్పని భావించడం లేదన్నారు. సభలో వాయిదా తీర్మానం ఇచ్చినా అనుమతించరు, చర్చకు అవకాశం కల్పించలేదు ఇక ప్రతిపక్ష ఎమ్మెల్యేలుగా మా నిరసన ఎలా తెలియ జేయాలని కంబాల జోగులు ఆవేదన వ్యక్తంచేశారు. ప్రత్యేక హోదా కావాలన్న ప్రజల ఆకాంక్షకు అనుగుణంగానే నిరసన తెలిపామని చెప్పారు. -
ప్రాణత్యాగానికి సిద్ధం: వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధన కోసం అవసరం అయితే ప్రాణత్యాగానికైనా సిద్ధమేనని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ ప్రివిలేజెస్ కమిటీ సమావేశం ఎదుట హాజరైన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రత్యేక హోదా కోసమే అసెంబ్లీని స్తంభింపచేశామన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం హోదాపై తమ పోరు కొనసాగుతుందని స్పష్టం చేశారు. అవసరం అయితే వందసార్లు బల్లలు ఎక్కుతానని, వెయ్యిసార్లు మైకు లాగుతానని ఆళ్ల రామకృష్ణారెడ్డి అన్నారు. టీడీపీ బెదిరింపులకు భయపడేది లేదని, ఎమ్మెల్యేలుగా ప్రజల ఆకాంక్షలనే తెలియచేశామన్నారు. ఎమ్మెల్యేల ఫిరాయింపుల కేసును పట్టించుకోని ప్రభుత్వం తమ విషయంలో మాత్రం అత్యుత్సాహం ప్రదరిస్తోందని ముత్యాలనాయుడు, సునీళ్ కుమార్, సంజీవయ్య, జోగులు అన్నారు. మరోవైపు ప్రివిలేజెస్ కమిటీ చైర్మన్ గొల్లపల్లి సూర్యారావు మాట్లాడుతూ మొత్తం 12మంది ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చామని, నిన్న, ఇవాళ విచారణకు హాజరు కాని మరో ముగ్గురిని డిసెంబర్ 2న విచారిస్తామన్నారు. అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లోగా స్పీకర్‌కు నివేదిక సమర్పిస్తామని ఆయన తెలిపారు. -
వివరణ ఇచ్చిన వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు
-
వివరణ ఇచ్చిన వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ శాసనసభ ప్రివిలేజెస్ కమిటీ ఎదుట అయిదుగురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఎమ్మెల్యేలు ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) మంగళగిరి), బూడి ముత్యాల నాయుడు (మాడుగుల), డాక్టర్ ఎం.సునీల్ కుమార్ (పూతలపట్టు), కిలేటి సంజీవయ్య (సూళ్లూరుపేట), కంబాల జోగులు(రాజాం) బుధవారం కమిటీ ఎదుట హాజరై తమ అభిప్రాయాలు వెల్లడించారు. గత అసెంబ్లీ సమావేశాల్లో జరిగిన పరిణామాలపై వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు వివరణ ఇచ్చారు. మరోవైపు వ్యక్తిగత కారణాలతో హాజరు కాలేకపోతున్నానని ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రివిలేజ్ కమిటీకి సమాచారం ఇచ్చారు. అనంతరం ఎమ్మెల్యేలు మీడియాతో మాట్లాడుతూ ప్రివిలేజెస్ కమిటీ ఎదుట హాజరై ... తమ అభిప్రాయాలు వెల్లడించామన్నారు. ప్రతిపక్ష పార్టీగా ప్రత్యేక హోదాపై అసెంబ్లీలో తమ గళం వినిపించామన్నారు. హోదా వచ్చేవరకూ తమ పార్టీ పోరాటం కొనసాగిస్తుందని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు స్పష్టం చేశారు. -
‘ప్రభుత్వం రెచ్చగొట్టేలా వ్యవహరించింది’
-
‘ప్రభుత్వం రెచ్చగొట్టేలా వ్యవహరించింది’
హైదరాబాద్ :ఆంధ్రప్రదేశ్ శాసనసభ ప్రివిలేజ్ కమిటీకి శుక్రవారమిక్కడ సమావేశమైంది. అసెంబ్లీ వర్షకాల సమావేశాల్లో జరిగిన పరిణామాలపై చర్చ జరిగింది. 45 రోజుల్లో స్పీకర్‌కు నివేదిక ఇవ్వాలని సభా హక్కుల కమిటీ నిర్ణయించింది. ఈ భేటీ ముగిసిన అనంతరం వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ.. తమ పార్టీ ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం కుట్ర పన్నిందన్నారు. అందులో భాగంగానే యనమల తీర్మానం ప్రవేశపెట్టారని, వర్షాకాల సమావేశాల్లో ప్రభుత్వం రెచ్చగొట్టేలా వ్యవహరించిందన్నారు. సభ్యులను సస్పెండ్ చేశాకే సభలోకి మార్షల్స్ రావాలని, అయితే మార్షల్స్తోనే సభను నడపాలని ప్రభుత్వం యత్నించిందని పెద్దిరెడ్డి వ్యాఖ్యానించారు. స్పీకర్, గవర్నర్‌పై దాడి చేసిన చరిత్ర టీడీపీ నేదలదని, ఎన్టీఆర్‌ను సీఎం పదవి నుంచి దించాక కనీసం మాట్లాడే అవకాశం కూడా ఇవ్వలేదని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. అందులో మంత్రి యనమల పాత్ర కూడా ఉందని పెద్దిరెడ్డి అన్నారు. తాము రెండేళ్లుగా ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్నామని, అదే అంశంపై సభలో చర్చకు పట్టుబట్టామన్నారు. అసెంబ్లీలో తాము ఎవరిపైనా దరుసుగా ప్రవర్తించలేదని, ఎమ్మెల్యేలెవరిపైనా చర్యలు తీసుకోవద్దని సమావేశంలో కోరినట్లు పెద్దిరెడ్డి తెలిపారు. -
అనితపై అనుచిత వ్యాఖ్యలు చేయలేదు
♦ చేయని వ్యాఖ్యలకు బాధపడితే... వాటిని ఉపసంహరించుకుంటా ♦ సభా హక్కుల సంఘం ముందు ఎమ్మెల్యే రోజా వివరణ ♦ అసెంబ్లీలో తప్పుగా మాట్లాడలేదని స్పష్టీకరణ ♦ ఎమ్మెల్యే అనితను అడ్డం పెట్టుకొని తనను వేధిస్తున్నారని అనుమానం సాక్షి, హైదరాబాద్: టీడీపీ ఎమ్మెల్యే వంగలపూడి అనితపై తాను ఎలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయలేదని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆర్.కె.రోజా చెప్పారు. చేయని వ్యాఖ్యలను చేసినట్లుగా భావించి బాధపడితే, వాటిని ఉపసంహరించుకుంటానని స్పష్టం చేశారు. ఆమె బుధవారం అసెంబ్లీలో సభా హక్కుల సంఘం(ప్రివిలేజెస్ కమిటీ) ముందు హాజరై తన వివరణ ఇచ్చారు. తనపై రోజా డిసెంబర్ 18న అసెంబ్లీలో అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ అనిత ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఈ వ్యవహారంపై విచారణ జరపాలని స్పీకర్ కోడెల శివప్రసాదరావు సభా హక్కుల సంఘాన్ని ఆదేశించారు. ఏడాదిపాటు సభ నుంచి సస్పెన్షన్‌కు గురైన రోజాను గొల్లపల్లి సూర్యారావు అధ్యక్షతన ప్రివిలేజెస్ కమిటీ మూడుసార్లు విచారణకు పిలవగా ఆమె అనివార్య కారణాల వల్ల హాజరు కాలేకపోయారు. బుధవారం కమిటీ ముందు హాజరైన రోజా గంటకు పైగా సుదీర్ఘంగా తన వివరణ ఇచ్చారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం వివరాలిలా ఉన్నాయి.... అనిత అంటే ద్వేషం లేదు భగవద్గీత సాక్షిగా తాను అసెంబ్లీలో ఏ తప్పూ చేయలేదని రోజా పేర్కొన్నారు. ఎమ్మెల్యే అనితను అగౌరవపర్చలేదని, మహిళల హక్కుల కోసం పోరాడుతున్న తాను మరో మహిళను ఎలా కించపరుస్తానని అన్నారు. అనిత అంటే తనకు ద్వేషం లేదని కమిటీకి నివేదించారు. విద్యార్థిని రిషితేశ్వరి ఆత్మహత్య, కాల్‌మనీ వ్యవహారంపై పోరాటం చేస్తున్న తనను కొందరు వ్యక్తులు అనితను అడ్డం పెట్టుకుని ఉద్దేశపూర్వకంగా వేధిస్తున్నారని కమిటీ ముందు రోజా అనుమానం వ్యక్తం చేశారు. అసెంబ్లీ వాయిదా పడిన తరువాత చోటుచేసుకున్న సంఘటనల వీడియో క్లిప్పింగ్‌లు ఎలా లీకయ్యాయి? సోషల్ మీడియాలో ఎలా వచ్చాయి? అని అసెంబ్లీ కార్యదర్శిని ఆమె గట్టిగా ప్రశ్నించినట్లు సమాచారం. నేను తప్పు మాట్లాడినట్లు సంకేతాలు పంపారు అసెంబ్లీలో చోటుచేసుకున్న పరిణామాలపై రోజా సవివరంగా, నిబంధనల సహితంగా సభ్యుల ముందు వివరణ ఇచ్చారు. తాను తప్పు మాట్లాడకపోయినా ఏదో తప్పు మాట్లాడినట్లుగా చిత్రీకరిస్తూ ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు పంపారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అసెంబ్లీ కార్యదర్శి వైఖరిని ఆమె ప్రశ్నించారు. తన సస్పెన్షన్‌పై న్యాయపోరాటం చేస్తూ సుప్రీంకోర్టు, హైకోర్టుకు తిరుగుతూ ఉన్నప్పుడే సభా సంఘం ముందు హాజరు కావాలని లేఖలు ఎలా పంపుతారని అన్నారు. మొత్తం మీద ఈ వ్యవహారంలో బలవుతున్నది ఇద్దరు మహిళలేనని వాపోయారు. తాను అనని మాటలను అన్నట్లుగా అనిత బాధపడి ఉంటే ఉపసంహరించుకుంటానని పేర్కొన్నారు. గోరంట్ల బుచ్చయ్య చౌదరి, మంత్రి అచ్చెన్నాయుడు సభలో తమను ఉద్దేశించి పదేపదే చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా రోజా ప్రస్తావించారు. ‘పాతేస్తాం’ అంటూ ప్రతిపక్ష సభ్యులను ఉద్దేశించి అధికార పక్ష సభ్యులు చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలను సభా హక్కుల సంఘం ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదని ప్రశ్నించారు. వంగలపూడి అనిత ఇచ్చిన సభా హక్కుల నోటీసుకు సంబంధించి మాత్రమే దర్యాప్తు చేయాలని స్పీకర్ తమను ఆదేశించారని, అధికార పక్ష సభ్యులు చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తమ పరిధిలోకి రావని రోజాకు కమిటీ సభ్యులు వివరించినట్లు తెలిసింది. తాను తప్పు చేయలేదనడానికి సంబంధించిన ఆధారాలన్నింటినీ రోజా హక్కుల సంఘం ముందుంచారు. వారంలోగా నివేదిక ఇస్తాం: గొల్లపల్లి ఎమ్మెల్యే రోజా ఇచ్చిన వివరణను పూర్తిగా రికార్డు చేశామని, వారంలోగా స్పీకర్‌కు నివేదిస్తామని సభా హక్కుల సంఘం చైర్మన్ గొల్లపల్లి సూర్యారావు మీడియాతో చెప్పారు. ఈ దశలో ఇంతకంటే ఎక్కువ చెప్పలేనన్నారు. స్పీకర్ సూచనల ప్రకారం తాము ఈ దర్యాప్తును చేపట్టామన్నారు. గతంలో కూడా రోజాను కమిటీ ముందుకు రావాల్సిందిగా కోరితే అనివార్య కారణాల వల్ల రాలేకపోయానంటూ వివరణ ఇచ్చారని తెలిపారు. కమిటీ ముందు గంటకు పైగా ఆమె ఇచ్చిన వివరణను పరిశీలించామని, మరోమారు సమావేశం కావాలని నిర్ణయించామన్నారు.వివాదం సమసినట్లేనా? అని విలేకరులు ప్రశ్నించగా... స్పీకర్‌కు సమర్పించాక నివేదిక శాసనసభకు వెళుతుందని, అప్పుడు నిర్ణయం జరుగుతుందని గొల్లపల్లి పేర్కొన్నారు. సంఘం సభ్యులు కె.రామకృష్ణ, బీసీ జనార్దన్‌రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బండారు సత్యనారాయణమూర్తి పాల్గొన్నారు. -
ప్రివిలేజ్ కమిటీ ఎదుట ఎమ్మెల్యే రోజా
హైదరాబాద్ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆర్కె రోజా బుధవారం సభా హక్కుల కమిటీ ఎదుట హాజరయ్యారు. టీడీపీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత ఫిర్యాదు నేపథ్యంలో ప్రివిలేజ్ కమిటీ రోజాకు నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. అనిత చేసిన ఫిర్యాదులపై రోజా వివరణ ఇవ్వనున్నారు. కాగా ప్రివిలేజ్ కమిటీ గతంలో ఇదే అంశంపై ఎమ్మెల్యే రోజాకు రెండుసార్లు నోటీసు ఇచ్చింది. అయితే వివిధ కారణాల వల్ల విచారణఖు హాజరు కాలేకపోతున్నట్లు ఆమె లేఖ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ప్రివిలేజ్ కమిటీ మరోసారి రోజాకు నోటీసులు ఇవ్వటంతో ఇవాళ ఆమె విచారణకు హాజరయ్యారు.