‘ప్రభుత్వం రెచ్చగొట్టేలా వ్యవహరించింది’ | peddireddy ramachandrareddy slams ap government | Sakshi
Sakshi News home page

‘ప్రభుత్వం రెచ్చగొట్టేలా వ్యవహరించింది’

Published Fri, Sep 23 2016 4:02 PM | Last Updated on Sat, Aug 18 2018 5:15 PM

‘ప్రభుత్వం రెచ్చగొట్టేలా వ్యవహరించింది’ - Sakshi

‘ప్రభుత్వం రెచ్చగొట్టేలా వ్యవహరించింది’

హైదరాబాద్ :ఆంధ్రప్రదేశ్ శాసనసభ ప్రివిలేజ్ కమిటీకి శుక్రవారమిక్కడ సమావేశమైంది. అసెంబ్లీ వర్షకాల సమావేశాల్లో జరిగిన పరిణామాలపై చర్చ జరిగింది. 45 రోజుల్లో స్పీకర్కు నివేదిక ఇవ్వాలని సభా హక్కుల కమిటీ నిర్ణయించింది. ఈ భేటీ ముగిసిన అనంతరం వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ.. తమ పార్టీ ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం కుట్ర పన్నిందన్నారు. అందులో భాగంగానే యనమల తీర్మానం ప్రవేశపెట్టారని, వర్షాకాల సమావేశాల్లో ప్రభుత్వం రెచ్చగొట్టేలా వ్యవహరించిందన్నారు. సభ్యులను సస్పెండ్ చేశాకే సభలోకి మార్షల్స్ రావాలని, అయితే మార్షల్స్తోనే సభను నడపాలని ప్రభుత్వం యత్నించిందని పెద్దిరెడ్డి వ్యాఖ్యానించారు.

స్పీకర్, గవర్నర్పై దాడి చేసిన చరిత్ర టీడీపీ నేదలదని, ఎన్టీఆర్ను సీఎం పదవి నుంచి దించాక కనీసం మాట్లాడే అవకాశం కూడా ఇవ్వలేదని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. అందులో మంత్రి యనమల పాత్ర కూడా ఉందని పెద్దిరెడ్డి అన్నారు. తాము రెండేళ్లుగా ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్నామని, అదే అంశంపై సభలో చర్చకు పట్టుబట్టామన్నారు. అసెంబ్లీలో తాము ఎవరిపైనా దరుసుగా ప్రవర్తించలేదని, ఎమ్మెల్యేలెవరిపైనా చర్యలు తీసుకోవద్దని సమావేశంలో కోరినట్లు పెద్దిరెడ్డి తెలిపారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement