Marshals
-
New Parliament Dress Code: పార్లమెంట్ ఉద్యోగులకు కొత్త యూనిఫామ్..
న్యూఢిల్లీ: పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలకు సమయం సమీపిస్తోంది. ఈ నెల 18 నుంచి 22వ తేదీ వరకూ ఐదురోజులపాటు ఈ సమావేశాలు పార్లమెంట్లో నూతన భవనంలో జరుగుతాయి. మొదటి రోజు పాత భవనంలోనే సమావేశం నిర్వహించి, రెండో రోజు (ఈ నెల 19న) వినాయక చవితి సందర్భంగా పూజా కార్యక్రమాలు నిర్వహించి, కొత్త భవనంలోకి లాంఛనంగా అడుగుపెడతారు. కొత్త భవనానికి తరలివెళ్తున్న నేపథ్యంలో పార్లమెంట్ ఉద్యోగులు, సిబ్బంది ధరించే యూనిఫామ్‌ను మార్చాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. అసలు సిసలైన భారతీయత ఉట్టిపడేలా ఈ దుస్తులు ఉంటాయని సమాచారం. నెహ్రూ జాకెట్లు, ఖాకీ రంగు ప్యాంట్లు ఉంటాయని అధికారులు చెబుతున్నారు. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ(నిఫ్ట్) నిపుణులు ఈ యూనిఫామ్‌లను డిజైన్ చేస్తున్నారు. ఉన్నతాధికారులు ధరించే నెహ్రూ జాకెట్ ముదురు గులాబీ రంగులో కమలం పువ్వు డిజైన్‌తో ఉంటుందని సమాచారం. ఉభయ సభల మార్షల్స్ డ్రెస్‌ను కూ డా మారుస్తున్నారు. వారు మణిపురి తలపాగాలు ధరిస్తారు. సెక్యూరిటీ సిబ్బంది ధరించే సఫారీ సూట్లలోనూ మార్పులుంటాయి. సైని కులు ధరించే డ్రెస్ లాంటిది వారికి ఇవ్వబోతున్నారు. NIFT designed New dress code for Parliament staff includes 1. Modi Jacket 2. Cream shirt with Lotus emblem 3. Khaki trousers 😂😂 pic.twitter.com/RWlP93mNha — Mac (@pattaazhy) September 12, 2023 ఎన్నికల గుర్తు ముద్రించడం ఏమిటి?: కాంగ్రెస్ పార్లమెంట్ సిబ్బంది యూనిఫామ్‌పై ‘కమలం’ను ముద్రించబోతున్నారంటూ వచ్చిన వార్తలపై కాంగ్రెస్ పార్టీ ఎంపీ మాణిక్కం ఠాగూర్ స్పందించారు. జాతీయ జంతువు పులి, జాతీయ పక్షి నెమలి బొమ్మ కాకుండా కమలం గుర్తు ముద్రించడం ఏమిటని కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. బీజేపీ ఎన్నికల గుర్తు కాబట్టే కమలాన్ని ముద్రిస్తున్నారని ఆరోపించారు. ఈ మేరకు ‘ట్విట్టర్’లో పోస్టు చేశారు. ఇది కూడా చదవండి: జీ20 నిర్వహణకు రూ.4,100 కోట్లా -
మార్షల్స్‌పై దాడి: అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం
సాక్షి, న్యూఢిల్లీ: బుధవారం రాజ్యసభలో చెలరేగిన రగడపై అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. పార్లమెంట్ సమావేశాలు అనుకున్న గడువు కంటే ముందే ముగియడానికి మీరంటే మీరే కారణమని అధికార, విపక్షాలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నాయి. ఇక బుధవారం రాజ్యసభలో మార్షల్స్‌పై జరిగిన దాడికి సంబంధించి విపక్ష నేతలు.. మోదీ ప్రభుత్వంపై విమర్శల వర్షం కురిపించారు. బయట సిబ్బందిని తీసుకొచ్చి ఎంపీలపై దాడి చేయించారని కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆరోపించారు. మహిళా ఎంపీలపై దాడి పార్లమెంట్ ప్రతిష్టను దిగజార్చడమేనని వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని రాహుల్ మండిపడ్డారు. ఈ క్రమంలో15 ప్రతిపక్ష పార్టీలతో కలిసి రాహుల్ గాంధీ నిరసన తెలిపారు. తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఇలాంటి పరిణామాలు చూడలేదన్నారు శరద్ పవార్. విపక్ష నేతల ఆరోపణలకు ఎనిమిది మంది కేంద్ర మంత్రులతో మోదీ ప్రభుత్వం కౌంటర్ ఇచ్చింది. -
మార్షల్స్‌పై దాడి వీడియోలు విడుదల చేసిన కేంద్రం
సాక్షి, న్యూఢిల్లీ: నిన్న రాజ్యసభలో పెనుదుమారమే చెలరేగింది. పెగాసస్ నిఘా, కొత్త వ్యవసాయ సాగు చట్టాలపై చర్చించాలంటూ ఆందోళన చేపట్టిన విపక్ష సభ్యులపై కేంద్రం బయటి వ్యక్తులను తీసుకువచ్చి.. దాడి చేయించిందంటూ ప్రతిపక్ష సభ్యులు ఆరోపణలు చేశారు. విపక్షాల ఆరోపణలకు కేంద్రం ధీటుగా బదులిచ్చింది. బుధవారం నాటి రగడకు సంబంధించిన వీడియోని విడుదల చేసింది. దీనిలో విపక్ష నేతలు మార్షల్స్‌పై దాడి చేస్తున్న దృశ్యాలున్నాయి. దారుణమైన విషయం ఏంటంటే.. మహిళా మార్షల్స్‌పై విపక్ష సభ్యులు దాడి చేయడం వీడియోలో చూడవచ్చు. రాజ్యసభలో విపక్ష సభ్యుల అనుచిత ప్రవర్తనపై కేంద్ర మంత్రులు మండిపడ్డారు. తమ ప్రవర్తనకు చింతిస్తూ విపక్ష సభ్యులు తక్షణమే క్షమాపణ చెప్పాలని కేంద్ర మంత్రులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా కేంద్ర సమాచార ప్రసార, క్రీడా శాఖమంత్రి అనురాగ్ ఠాకూర్ మాట్లాడుతూ.. ‘‘ప్రజలు తమ సమస్యల గురించి పార్లమెంటులో చర్చిస్తారని ఎదురుచూస్తారు.. కానీ ఈ పార్లమెంట్ సమావేశాలలో విపక్షాలు అరాచకం సృష్టించాయి. ప్రతిపక్ష పార్టీల ఎంపీలు… దేశంలోని వ్యక్తులు, పన్ను చెల్లింపుదారుల డబ్బు వృధా అవుతున్నా దాని గురించి పట్టించుకోలేదు. నిన్న రాజ్యసభలో జరిగిన సంఘటన ఖండించదగినది. మొసలి కన్నీళ్లు కార్చే బదులు, వారు తమ ప్రవర్తన పట్ల క్షమాపణ చెప్పాలి’’ అని డిమాండ్ చేశారు. విపక్ష సభ్యుల ప్రవర్తన దారుణం: ప్రహ్లాద్ జోషి పార్లమెంటులో విపక్ష సభ్యుల ప్రవర్తన దారుణం అన్నారు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి. నిన్నటి రగడపై విపక్ష సభ్యులు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యాన్ని హత్య చేశామని రాహుల్ అంటున్నారు.. పార్లమెంటులో ఏం జరిగిందో అందరూ చూశారు. సభ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని చైర్మన్‌ను కోరతాం అన్నారు ప్రహ్లాద్ జోషి. రాజ్యసభలో విపక్షాల రగడ.. బుధవారం రాజ్యసభలో ప్రతిపక్షాలు నిరసన తెలుపుతూ చైర్మన్ వెల్‌లోకి వెళ్లిన సందర్భంగా వారిని కంట్రోల్ చేసేందుకు మార్షల్స్ లోపలికి వచ్చారు. ఈ సందర్భంగా ప్రతిపక్ష ఎంపీలకు, మార్షల్స్‌కు మధ్య తోపులాట జరిగింది. అయితే మగ మార్షల్స్ తమపై చేయిచేసుకున్నారని కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు మహిళా ఎంపీలు ఆరోపిస్తున్నారు. పార్లమెంట్లో ఎంపీలపై దాడి చేయడం ఇదే తొలిసారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీలపై దాడి చేయడానికి బయటి వాళ్లను సభలోకి తీసుకొచ్చారని ఆరోపించారు. ఇది ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయడమేనని రాహుల్ అన్నారు. -
మహిళా మార్షల్‌పై విపక్ష ఎంపీల దాడి
-
మార్షల్స్‌పై టీడీపీ సభ్యుల దాడి ఎథిక్స్ కమిటీకి..
సాక్షి, అమరావతి: మార్షల్స్‌పై టీడీపీ సభ్యులు దాడి చేసి అమానుషంగా ప్రవర్తించిన తీరును ఎథిక్స్ కమిటీకి రిఫర్ చేస్తున్నట్లు స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రకటించారు. మంగళవారం టీడీపీ సభ్యుల్ని సస్పెండ్ చేసినప్పుడు మార్షల్స్ వచ్చి సభ వెలుపలికి తీసుకెళ్లే సమయంలో వారిపై విపక్ష టీడీపీ సభ్యులు చేయి చేసుకోవడం పట్ల స్పీకర్ ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై స్పీకర్ తమ్మినేని బుధవారం సభలో మాట్లాడుతూ శాసనసభలో జరిగిన ఉదంతం చాలా దురదృష్టకరమన్నారు. సభ తీసుకునే నిర్ణయాన్ని మార్షల్స్ అమలు చేస్తారన్నారు. శాసనసభ్యులుగా సభలో అడుగుపెట్టినప్పుడే సభ నియమాలు, సంప్రదాయాలకు కట్టుబడి సభ్యులు వ్యవహరించాలని, అయితే గడిచిన మూడు రోజులుగా సభ జరుగుతున్న తీరు ఆక్షేపణీయమని అన్నారు. తమ పట్ల టీడీపీ సభ్యులు ప్రవర్తిస్తున్న తీరు గురించి మార్షల్స్ తనను కలసి వినతిపత్రం ఇచ్చారని, వారి పట్ల టీడీపీ సభ్యులు ప్రవర్తిస్తున్న తీరు ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఈ విషయంపై బుధవారం ఉదయం శాసనసభ వ్యవహారాల మంత్రితో మాట్లాడానని, విచారణ జరిపించి అవసరమైన చర్యలు తీసుకోవాలని సభ నిర్ణయించినట్లు స్పీకర్ చెప్పారు. -
టీడీపీ ఎమ్మెల్యేలపై స్పీకర్‌కు మార్షల్స్ ఫిర్యాదు
సాక్షి, అమరావతి : టీడీపీ ఎమ్మెల్యేల దాడిపై స్పీకర్ తమ్మినేని సీతారాంకి మార్షల్స్ ఫిర్యాదు చేశారు. సస్పెండైన టీడీపీ ఎమ్మెల్యేలను తీసుకెళ్లడానికి వస్తే తమపై దాడి చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. మార్షల్స్ ఇచ్చిన ఫిర్యాదుపై విచారణ చేయిస్తానని స్పీకర్ తమ్మినేని సీతారాం పేర్కొన్నారు. కాగా, సభకు నిరంతరం అంతరాయం కలిగిస్తున్నారనే కారణంగా టీడీపీకి చెందిన 12 మంది ఎమ్మెల్యేలను స్పీకర్ తమ్మినేని ఒక్క రోజు పాటు సస్పెండ్ చేశారు. సభ నుంచి వెళ్లాలని స్పీకర్ ఆదేశించినప్పటికీ టీడీపీ సభ్యులు అక్కడే ఉన్నారు. దీంతో మార్షల్స్ వచ్చి వారిని తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ సందర్భంగా టీడీపీ ఎమ్మెల్యేలు మార్షల్స్‌పై దాడి చేశారు. -
తక్షణమే మార్షల్స్‌కు చంద్రబాబు లోకేష్ క్షమాపంణ చెప్పాలి
-
‘మార్షల్స్’పై దద్దరిల్లిన మండలి
సాక్షి, అమరావతి: తనిఖీల పేరుతో మార్షల్స్ తమపై దాడులు చేస్తున్నారని, ఇలాగైతే సభకు ఎలా వస్తామంటూ టీడీపీ సభ్యులు.. మార్షల్స్‌పై టీడీపీ సభ్యులే దాడి చేస్తున్నారంటూ వైఎస్సార్సీపీ సభ్యులు వాదోపవాదాలకు దిగడంతో శాసన మండలి శుక్రవారం దద్దరిల్లింది. సభ్యులను ఆపి తనిఖీలు చేయకూడదని చైర్మన్ హోదాలో అహ్మద్ షరీఫ్ చీఫ్ మార్షల్‌కు రూలింగ్ ఇచ్చినా పరిగణనలోకి తీసుకోకుండా శుక్రవారం కూడా మార్షల్స్ అదే ధోరణి అవలంబించారంటూ టీడీపీ సభ్యులు వెల్‌లోకి వెళ్లి ఆందోళనకు దిగారు. తనిఖీల పేరిట మార్షల్స్ దాడులకు పాల్పడినట్లు తమ వద్ద వీడియో క్లిప్పింగ్‌లున్నాయని, వాటిని సభలో ప్రదర్శించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని మండలిలో ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు, ఎమ్మెల్సీలు మండలి చైర్మన్ అహ్మద్ షరీఫ్‌కు ఫిర్యాదు చేశారు. టీడీపీ సభ్యులు కోరిన విధంగా వారిచ్చిన వీడియో క్లిప్పింగ్‌లను సభలో ప్రదర్శించేందుకు అనుమతిస్తున్నట్లు చైర్మన్ ప్రకటించారు. ఆ క్లిప్పింగ్‌ను ఎలా అనుమతిస్తారు: బొత్స పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. సభ్యులు ఇచి్చన వీడియో క్లిప్పింగ్‌లను సభలో ప్రదర్శించేందుకు ఎలా అనుమతి ఇస్తారని అభ్యంతరం వ్యక్తం చేశారు. కొత్త సంప్రదాయం తీసుకురావడం మంచిది కాదని, సభా ప్రాంగణంలో అధికారికంగా తీసిన వీడియో క్లిప్పింగ్‌లను ప్రదర్శిస్తే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని అన్నారు. పీడీఎఫ్ సభ్యుడు విఠపు బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ సభ్యులు ఇచి్చన వీడియో, సభా ప్రాంగణంలో అధికారికంగా తీసిన వీడియోలను వేర్వేరుగా ప్రదర్శించి సభ్యులపై మార్షల్స్ దాడి చేసినట్లు ఉంటే చర్యలు తీసుకోవాల్సిందేనన్నారు. రెండు క్లిప్పింగ్‌లను ప్రదర్శించేందుకు అనుమతిస్తున్నట్లు చైర్మన్ షరీఫ్ ప్రకటించారు. వైఎస్సార్సీపీ సభ్యుడు షేక్ మహమ్మద్ ఇక్బాల్ మాట్లాడుతూ టీడీపీ సభ్యులు మార్షల్స్‌పై దాడి చేసినట్లు స్పష్టంగా వీడియో క్లిప్పింగ్‌లున్నాయని, సభా ప్రాంగణంలో మార్షల్స్‌పై జరిగిన దాడిని అసెంబ్లీ స్పీకర్, మండలి చైర్మన్లపై దాడిగా భావించాలని అన్నారు. ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ మాట్లాడుతూ ప్రజా సమస్యలపై చర్చించకుండా అడ్డుకునేందుకు టీడీపీ సభ్యులు ఎత్తుగడ వేశారన్నారు. సంతృప్తి చెందాకే ‘మండలి’లో ప్రదర్శన ఎమ్మెల్సీలు, మార్షల్స్ మధ్య నెలకొన్న వివాదానికి సంబంధించి ఏ వీడియోనైనా శాసనమండలిలో ప్రదర్శించటానికి ముందు.. చైర్మన్ చాంబర్లో వాటిని చూసి, సంతృప్తి చెందాకే నిర్ణయం తెలియజేస్తామని చైర్మన్ స్థానంలో కూర్చున్న డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం రూలింగ్ ఇచ్చారు. మార్షల్స్ తమ పట్ల దురుసుగా ప్రవర్తించారని ఆరోపిస్తూ టీడీపీ ఎమ్మెల్సీలు కొన్ని వీడియోలు ఇచ్చి, వాటిని సభలో ప్రదర్శించాలని, సభ్యుల హక్కులను, గౌరవ మర్యాదలను కాపాడాలని నినాదాలు చేస్తూ సభలో ఆందోళనకు దిగారు. -
బాస్టర్డ్ అంటారా?
సాక్షి, అమరావతి: శాసనసభా ప్రాంగణంలో గురువారం అసెంబ్లీ సిబ్బంది, మార్షల్స్‌పై దౌర్జన్యం ఘటనకు సంబంధించి టీడీపీ సభ్యులు, ఇతరులపై చర్యలు తీసుకునే అధికారాన్ని సభాపతి తమ్మినేని సీతారాంకు అప్పగిస్తూ సభ శుక్రవారం తీర్మానం చేసింది. సభా వ్యవహారాలశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ప్రవేశపెట్టిన ఈ తీర్మానాన్ని వైఎస్సార్ సీపీ సభ్యులు జక్కంపూడి రాజా, గొల్ల బాబూరావు, అంబటి రాంబాబు, అప్పలరాజు, వరప్రసాద్ బలపరిచారు. ఈ అంశంపై దాదాపు రెండున్నర గంటలకుపైగా తీవ్ర భావోద్వేగాల మధ్య సభలో చర్చ జరిగింది. మార్షల్స్‌ను విపక్ష నేత చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్, టీడీపీ సభ్యులు దుర్భాషలాడిన వీడియోలను సభలో పలుమార్లు ప్రదర్శించారు. వాస్తవాలు సభ ముందుంచిన తర్వాతైనా చంద్రబాబు క్షమాపణ చెప్పాలని వైఎస్సార్ సీపీ సభ్యులు డిమాండ్ చేశారు. ఉదయం తొమ్మిది గంటలకు సభ ప్రారంభం కాగానే స్పీకర్ తొలుత ప్రశ్నోత్తరాలు చేపట్టగా మంత్రి పేర్ని నాని ఈ అంశాన్ని ప్రస్తావించారు. విపక్ష ఎమ్మెల్యేలు, సభ్యులు కాని వారు మూకుమ్మడిగా పెద్ద ఎత్తున శాసనసభకు ప్రదర్శనగా వచ్చారని, భద్రతా కారణాల దృష్ట్యా మార్షల్స్ ఒక్కొక్క ఎమ్మెల్యేను గుర్తించి పంపే ప్రయత్నం చేయగా అడ్డుకుని దాడికి దిగారని, పిడిగుద్దులు గుద్దారని, అనుచితంగా మాట్లాడారని నాని తెలిపారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను సభలో చూపించారు. నేర ప్రవృత్తి కలిగిన వ్యక్తుల మాదిరిగా వ్యవహరించడంపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ దశలో టీడీపీ సభ్యుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి జోక్యం చేసుకుంటూ అవన్నీ నిజం కాదన్నారు. ముఖ్యమంత్రిని ఉద్దేశించి ఆయన ఆరోపణలు చేయడం మరింత వివాదాస్పదమైంది. వీటిని రికార్డుల నుంచి తొలగించాలని స్పీకర్ ఆదేశించారు. మార్షల్‌గా ఉన్నా.. వారి బాధలు తెలుసు: ఆర్థర్ విపక్షం తీరు పట్ల వైఎస్సార్ సీపీ సభ్యులు కొరుముట్ల శ్రీనివాస్, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆర్థర్, కొడాలి నాని, కన్నబాబు తదితరులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. తానూ గతంలో మార్షల్‌గా ఉన్నానని, వారి బాధలేంటో తెలుసని, బాధ్యత కలిగిన వ్యక్తులు ఇలా ప్రవర్తిస్తే ఎలా? అని ఆర్థర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటన బయట జరిగిందని టీడీపీ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి పేర్కొనటంపై స్పీకర్ స్పందిస్తూ ఇది సభా ప్రాంగణంలోనే జరిగిందని స్పష్టం చేశారు. మంత్రి కన్నబాబు అసెంబ్లీ నిబంధనావళిని చదివి వినిపిస్తూ ప్రదర్శనగా రావడం సరికాదన్నారు. చంద్రబాబు క్షమాపణ చెప్పాలని, అసెంబ్లీలోకి వచ్చే ప్రయత్నం చేసిన సభ్యులు కానివారిపై చర్యలు తీసుకోవాలని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ పేర్కొన్నారు. సభలో వీడియోల ప్రదర్శన మార్షల్స్ తమనే అవమానపరిచారని టీడీపీ సభ్యులు పేర్కొనడంతో గురువారం అసెంబ్లీ గేట్ వద్ద జరిగిన ఘటనల వీడియోలను సభలో ప్రదర్శించారు. అందులో చీఫ్ మార్షల్‌ను చంద్రబాబు, లోకేష్, టీడీపీ సభ్యులు ‘రాస్కెల్, యూజ్లెస్ ఫెలో, బా...ర్డ్’ అంటూ దూషిస్తున్నట్లుగా ఉంది. అనంతరం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మాట్లాడుతూ మార్షల్స్ పట్ల టీడీపీ తీరును ఖండించారు. టీడీపీ సభ్యులు తాము ఆ మాట అనలేదని అనడంతో సభలో పలుమార్లు ఈ వీడియోలను ప్రదర్శించారు. అసెంబ్లీ గేట్లు కారాగారం మాదిరిగా ఉన్నాయన్న చంద్రబాబు వ్యాఖ్యలపై మంత్రి బుగ్గన స్పందిస్తూ ‘ఆ గేట్లు ఏర్పాటు చేసింది మీరే కదా’ అని వ్యాఖ్యానించారు. అంతా చూశారు: స్పీకర్ తమ్మినేని అసెంబ్లీ గేటు వద్ద చోటు చేసుకున్న దృశ్యాలను సభలో అంతా చూశారని, ప్రతిపక్ష నేత చంద్రబాబు వాడిన మాటల్లో అన్ పార్లమెంటరీ పదాలు ఉన్నాయని స్పీకర్ తమ్మినేని సీతారాం పేర్కొన్నారు. ఇది ప్రజాస్వామ్య వ్యవస్థకు మంచిది కాదని హితవు పలికారు. హుందాగా వ్యవహరించాలని, ఆవేశంలో మాట్లాడితే ఆ మాటలను వెనక్కి తీసుకోవాలని సూచించారు. సభ్యులు కానివారు అసెంబ్లీ ఆవరణలోకి ప్రవేశిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డీజీపీని ఆదేశించామన్నారు. సభలో పలువురు టీడీపీ సభ్యులు మాట్లాడిన అన్‌పార్లమెంటరీ వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగిస్తున్నట్టు తెలిపారు. అనంతరం మార్షల్స్‌పై విపక్ష సభ్యులు దౌర్జన్యానికి దిగటంపై చర్యలు తీసుకునే అధికారాన్ని స్పీకర్‌కి అప్పగిస్తూ సభా వ్యవహారాల మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. -
స్పీకర్‌దే తుది నిర్ణయం : బుగ్గన
సాక్షి, అమరావతి : అసెంబ్లీ ప్రాంగణంలో గురువారం జరిగిన ఘటనకు బాధ్యులైన సభ్యులు, సభ్యులు కానివారిపై చర్యలు తీసుకునే అధికారాన్ని స్పీకర్ తమ్మినేని సీతారాంకు అప్పగిస్తూ శాసనసభలో తీర్మానం చేశారు. ఈ మేరకు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి సభలో తీర్మానం ప్రవేశపెట్టారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడులో ఈ ఘటనపై ఎలాంటి పశ్చాత్తాపం లేదని బుగ్గన విమర్శించారు. ప్లకార్డులు తీసుకురాకూడదన్నది సభ రూల్స్‌లో ఉందని గుర్తుచేశారు. చంద్రబాబు పెట్టిన అసెంబ్లీ ద్వారాలు.. ఆయనకే కారాగారంలా కన్పిస్తున్నాయా అని ఎద్దేవా చేశారు. బుగ్గన ప్రవేశపెట్టిన తీర్మానానికి వైఎస్సార్సీపీ సభ్యులు జక్కంపూడి రాజా, గొల్లపూడి బాబురావు, అంబటి రాంబాబు, అప్పలరాజు, వరప్రసాద్ బలపరిచారు. చంద్రబాబుకు స్పీకర్ సూచన.. అంతకుముందు స్పీకర్ మాట్లాడుతూ.. నిన్న జరిగిన దృశ్యాలు సభలో అందరు చూశారని.. చంద్రబాబు మాటల్లో అన్ పార్లమెంటరీ పదాలు ఉన్నాయని తెలిపారు. ఇది పార్లమెంటరీ వ్యవస్థకు మంచి కాదని హితవు పలికారు. అసెంబ్లీలో హుందాగా వ్యవహరించాలని.. ఆవేశంగా మాట్లాడితే ఆ మాటలను వెనక్కి తీసుకోవాలని సూచించారు. సభ్యులు కానివారు అసెంబ్లీ ఆవరణలోకి వచ్చినట్టు గుర్తిస్తే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డీజీపీని ఆదేశించారు. ఈ సందర్భంగా స్పీకర్ ప్రసంగానికి టీడీపీ సభ్యులు అడ్డుతగిలే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో వారి ప్రవర్తనపై స్పీకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు ఎవరిపైన ద్వేషం లేదని స్పష్టం చేశారు. మార్షల్స్‌ను వారి వాదనలు చెప్పాల్సిందిగా కోరినట్టు వెల్లడించారు. మార్షల్స్, పోలీసులు సభ్యులకు భద్రత కల్పించేందుకే ఉన్నారని తెలిపారు. అరాచక శక్తుల ద్వారా సభకు ఇబ్బంది కలగవద్దని సూచించారు. చంద్రబాబు గౌరవంగా ఈ ఎపిసోడ్‌కు ముగింపు పలకాలన్నదే తన ఉద్దేశమని స్పష్టం చేశారు. ఈ తీర్మానం బలపరిచే సందర్భంగా జక్కంపూడి రాజా మాట్లాడుతూ.. చంద్రబాబు వ్యాఖ్యలు సిగ్గుతో తలవంచుకునేలా ఉన్నాయని మండిపడ్డారు. చంద్రబాబు పబ్లిసిటీ పిచ్చి వల్లే నిన్నటి ఘటన జరిగిందని ఆరోపించారు. చంద్రబాబు ఆయన రావాల్సిన గేటు నుంచి కాకుండా మరో గేటు నుంచి ఎందుకు వచ్చారని ప్రశ్నించారు. గొల్ల బాబురావు మాట్లాడుతూ.. చంద్రబాబుకు ప్రభుత్వ ఉద్యోగులంటే చులకన భావం అని తెలిపారు. నిన్నటి సంఘటన అధికారులకు జరిగిన అవమానంగా భావిస్తున్నట్టు చెప్పారు. 70 ఏళ్ల వయసు వచ్చినా చంద్రబాబులో ఎలాంటి మార్పు లేదని విమర్శించారు. అంబటి రాంబాబు మాట్లాడుతూ.. చంద్రబాబు సభలో గందరగోళం సృష్టించాలని చూస్తున్నారని మండిపడ్డారు. సభలో మాట్లాడకూడని పదాలు కూడా ఆయన మాట్లాడుతున్నారని తెలిపారు. చేసిన తప్పుపై విచారం వ్యక్తం చేయమంటే.. టీడీపీ సభ్యులు సభను పక్కదోవ పట్టిస్తున్నారని ఆగ్రహాం వ్యక్తం చేశారు. చంద్రబాబుపై చర్యలు తీసుకోవాల్సిందేనని కోరారు. సీదిరి అప్పలరాజు మాట్లాడుతూ.. సానుభూతి కోసం చంద్రబాబు డ్రామాలు చేస్తున్నారని మండిపడ్డారు. అందుకే చంద్రబాబు క్షమాపణలు చెప్పడం లేదని వ్యాఖ్యానించారు. వరప్రసాద్ మాట్లాడుతూ.. చంద్రబాబుకు రాజకీయాల్లో ఉండే అర్హత లేదన్నారు. -
ప్రతిపక్ష నేత వ్యవహరించాల్సిన తీరు ఇదేనా?
సాక్షి, అమరావతి : అసెంబ్లీ ఆవరణలో మార్షల్స్‌పై టీడీపీ సభ్యులు దౌర్జన్యానికి దిగడాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తప్పుబట్టారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఎంత దారుణంగా ప్రవర్తించారన్నదానికి ఈ ఘటన నిదర్శమని తెలిపారు. ప్రతిపక్ష నేత వ్యవహరించాల్సిన తీరు ఇదేనా అని ప్రశ్నించారు. టీడీపీ సభ్యుల దౌర్జన్యానికి సంబంధించిన వీడియోను అసెంబ్లీలో ప్రదర్శించారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ.. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తాను సభలోకి ప్రవేశించాల్సిన గేటు అసలు అది కాదు. ఆయన గేటు నెంబర్ 2 నుంచి సభలోకి రావాల్సి ఉంది. కానీ అందరితో కలిసి ఆందోళన చేయాలని చంద్రబాబు చూశారు. ప్రోటోకాల్ ప్రకారం సభ్యులను మాత్రమే లోనికి పంపేందుకు మార్షల్స్ ప్రయత్నించడం. కానీ చంద్రబాబు నాయుడు మార్షల్స్‌ను బాస్టడ్ అని దూషించడం దారుణం. లోకేశ్ చీఫ్ మార్షల్స్‌ను యూజ్లెస్ అంటూ తిట్టారు. ఉద్యోగుస్తులను అనరాని మాటలు అన్నార’ని తెలిపారు. చంద్రబాబు క్షమాపణ చెప్పాలి : బుగ్గన టీడీపీ సభ్యులు అధికారులు గొంతు పట్టుకుని దౌర్జన్యానికి దిగారని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి నిన్న అధికారులను పిలిచి మాట్లాడినట్టు చెప్పారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు సభలోని రావడానికి ఎలాంటి ఇబ్బంది లేదని స్పష్టం చేశారు. సభ్యుల రక్షణ కోసమే మార్షల్స్ ఉన్నారని గుర్తుచేశారు. అలాంటిది మార్షల్స్‌ను టీడీపీ సభ్యులు దుర్భాషలాడారని సభ దృష్టికి మరోసారి తీసుకువచ్చారు. నిన్నటి ఘటనపై చట్టపరంగా కఠినచర్యలు తీసుకోవాలని కోరారు. రాష్ట్ర చరిత్రలో ఇప్పటివరకు ఇలాంటి ఘటన జరగలేదని గుర్తుచేశారు. చీఫ్ మార్షల్స్‌ను ఇంత దారుణంగా తిడతారా అని చంద్రబాబును ప్రశ్నించారు. ఇంత జరిగినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదని అన్నారు. చంద్రబాబు తన మాటలను ఉపసంహరించుకోని.. క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. -
టీడీపీ సభ్యుల తీరు బాధ కలిగించింది
-
టీడీపీ సభ్యులపై చర్యలు తీసుకోవాలి : పేర్ని నాని
సాక్షి, అమరావతి : అసెంబ్లీ ఆవరణలో గురువారం టీడీపీ సభ్యుల తీరు బాధ కలిగించిందని మంత్రి పేర్ని నాని అన్నారు. శుక్రవారం మంత్రి అసెంబ్లీలో మాట్లాడుతూ.. అసెంబ్లీలో మార్షల్‌పై టీడీపీ సభ్యులు దుర్భాషలాడారని సభ దృష్టికి తీసుకువచ్చారు. సభ్యులు కానివారిని లోనికి అనుమతించరని టీడీపీ సభ్యులకు తెలియదా అని ప్రశ్నించారు. గౌరవ సభ్యులు సభలో హుందాగా వ్యవహరించాలని కోరారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు మెప్పుకోసం టీడీపీ సభ్యులు తాపత్రయపడుతున్నారని విమర్శించారు. మార్షల్స్‌పై దుర్భాషలాడిన టీడీపీ సభ్యులపై చర్యలు తీసుకోవాలని స్పీకర్ తమ్మినేని సీతారాంను కోరారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ.. మార్షల్స్ సభ్యుల భద్రత కోసమే ఉన్నారని తెలుసుకోవాలని టీడీపీ సభ్యులకు సూచించారు. ఇది పార్టీల వ్యవహారం కాదని.. ఇది సభ అని హితవు పలికారు. సభ్యులు గుంపుగా వస్తున్నప్పుడు ముందస్తు జాగ్రత్తగా మార్షల్స్ తగిన చర్యలు తీసుకుంటారని అన్నారు. అన్నింటిని పరిశీలించిన నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈనాడు సంస్థలో చంద్రబాబు ఒక ఉద్యోగి : కొడాలి నాని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఉద్దేశపూర్వకంగానే ఎమ్మెల్యేల గేటు నుంచి వచ్చారని మంత్రి కొడాలి నాని విమర్శించారు. శుక్రవారం ఆయన సభలో మాట్లాడుతూ.. టీడీపీ సభ్యులు ఫ్లకార్డులు, పోస్టర్లతో దౌర్జన్యంగా లోనికి వచ్చేందుకు యత్నించారని మంత్రి తెలిపారు. చంద్రబాబే మార్షల్స్‌ను తోసుకుని లోపలికి వచ్చేందుకు ప్రయత్నించారని చెప్పారు. ఈనాడు సంస్థలో చంద్రబాబు ఒక ఉద్యోగి అని విమర్శించారు. టీడీపీలోకి అడ్డగోలుగా చొరబడి.. ఆ వ్యవస్థను నాశనం చేసిన వ్యక్తి చంద్రబాబు అని ఆరోపించారు. చీఫ్ మార్షల్ బంట్రోతు కాదు.. : ఆర్థర్ స్పీకర్ ఆదేశానుసారం చీఫ్ మార్షల్ వ్యవహరిస్తారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే టీ ఆర్థర్ తెలిపారు. శుక్రవారం ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ.. చీఫ్ మార్షల్ రుల్‌బుక్‌లో ఉన్న రూల్స్ అనుసరిస్తారని చెప్పారు. చీఫ్ మార్షల్ బంట్రోతు కాదని.. డీఎస్పీ స్థాయి అధికారని తెలుసుకోవాలని హితవు పలికారు. చీఫ్ మార్షల్ గొంతుపట్టుకొని వ్యవహరించిన తీరు బాధాకరమని అన్నారు. సభలో టీడీపీ సభ్యులు కావాలనే గందరగోళం సృష్టిస్తున్నారని విమర్శించారు. టీడీపీ సభ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. -
అసెంబ్లీ మార్షల్స్‌తో టీడీపీ నేతల వీరంగం
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు నాలుగో రోజు కొనసాగుతున్నాయి. అయితే అసెంబ్లీ ప్రాంగణంలోకి ప్లకార్డులు తీసుకువెళ్లడానికి అనుమతి లేదన్న మార్షల్స్‌పై టీడీపీ నేతలు దురుసుగా ప్రవర్తించారు. దీంతో అసెంబ్లీ గేట్ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. అసెంబ్లీలోకి ప్లకార్డులు తీసుకెళితే ఏం చేస్తారంటూ టీడీపీ నేతలు వీరంగం సృష్టించారు. అక్కడతో ఆగకుండా చంద్రబాబునాయుడు, లోకేష్, టీడీపీ నేతలు అసెంబ్లీ గేట్లు నెట్టుకొని వెళ్లారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు టీడీపీ నేతల వద్ద ప్లకార్డులు లాక్కున్నారు. మార్షల్స్ తీరుపై చంద్రబాబు, లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తమాషా చేస్తున్నారా.. ఏ కేసులు పెట్టుకుంటారో పెట్టుకోండి అగ్రహించారు. -
ఖబర్దార్: టీడీపీ నేతల హెచ్చరికలు
సాక్షి, అమరావతి : అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న క్రమంలో టీడీపీ నాయకులు మార్షల్స్‌తో అనుచితంగా ప్రవర్తించారు. అసెంబ్లీ వద్ద నిబంధనలకు విరుద్ధంగా టీడీపీ నేతలు ప్లకార్డులు పట్టుకుని లోపలకి వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో మార్షల్స్ వారిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో లోపలికి ప్లకార్డులు తీసుకువెళ్తాం అంటూ వాళ్లు మార్షల్స్‌తో గొడవపడ్డారు. అయినప్పటికీ మార్షల్స్ ప్లకార్డులను లోపలికి అనుమతించకపోవడంతో.. టీడీపీ నాయకులు ఖబర్దార్ అంటూ వారిని హెచ్చరించారు. -
రాజ్యసభ: పాత యూనీఫాంనే ఫాలో అయ్యారు!
న్యూఢిల్లీ: రాజ్యసభ మార్షల్స్ కొత్త యూనిఫాంపై విమర్శలు లేవనెత్తడంతో.. సోమవారం తిరిగి పాత భారతీయ సంప్రదాయ వస్త్రధారణనే తిరిగి కొనసాగించారు. రాజ్యసభలో మార్షల్స్‌కు ఆర్మీ తరహా యూనీఫాంను ప్రవేశపెట్టడంపై పలు పార్టీలు, ఆర్మీ అధికారులు తీవ్ర విమర్శలు చేశారు. దీంతో మార్షల్స్ సరిగ్గా వారం రోజుల తర్వాత.. వివాదాస్పద యూనీఫాంను పక్కనబెట్టి మళ్లీ పాత సంప్రదాయిక దుస్తుల్లో కనిపించారు. అయితే ఈసారి గతానికి కాస్త భిన్నంగా తలపై ధరించే 'పగ్రి' లేకుండా.. ముదురు రంగు బంధ్గాల సూట్స్ ధరించి రాజ్యసభలో కనిపించారు. Copying and wearing of military uniforms by non military personnel is illegal and a security hazard. I hope @VPSecretariat, @RajyaSabha & @rajnathsingh ji will take early action. https://t.co/pBAA26vgcS — Vedmalik (@Vedmalik1) November 18, 2019 -
మహిళల భద్రతపై కేజ్రీవాల్ మరో నిర్ణయం
న్యూఢిల్లీ : ఢిల్లీ ట్రాన్స్‌పోర్టు కార్పొరేషన్(డిటిసి) బస్సులో ప్రయాణం చేసే మహిళలకు మరింత రక్షణ కల్పించేందుకు మంగళవారం నుంచి మరో 13వేల మంది మార్షల్స్ పనిచేస్తారని ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్ సోమవారం తెలిపారు. ఇప్పటికే మహిళలకు రక్షణగా 3400 మంది మార్షల్స్ పనిచేస్తున్నట్లు తెలిపారు. కొత్తగా ఎంపిక చేసిన 13 వేలమంది మార్షల్స్ మంగళవారం నుంచే విధుల్లో చేరతారని ఆయన స్పష్టం చేశారు. దేశానికి రాజధానిగా ఉన్న ఢిల్లీలో మహిళలకు కనీస భద్రత కల్పించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఢిల్లీలోని త్యాగరాజ స్టేడియంలో నిర్వహించిన వేడుకలో కేజ్రీవాల్ మాట్లాడుతూ.. మహిళల రక్షణే మా మొదటి ప్రాధాన్యత అని వెల్లడించారు. ఇది మా ప్రభుత్వం సొంతంగా తీసుకున్న నిర్ణయం. ఇప్పటివరకు ప్రపంచంలో ఏ నగరంలో లేని విధంగా మేము మహిళలకు రక్షణగా మార్షల్స్‌ను నియమించామని తెలిపారు. 'ఈ రోజు మీ అందరిముందు ఒక విషయం చెప్పదలుచుకున్నాను. బస్సులో ప్రయాణం చేస్తున్న ప్రతీ మహిళకు రక్షణ కల్పించడమే మీ బాధ్యత. ఇది చూసి ప్రతీ మహిళ ప్రభుత్వ బస్సును సొంత వాహనంగా భావించేలా విశ్వాసం కల్గిస్తారని ఆశిస్తున్నా' అంటూ కొత్తగా ఎంపిక చేసిన మార్షల్స్‌తో పేర్కొన్నారు. కాగా, ఢిల్లీ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ (డిటిసి) బస్సుల్లో మహిళలకు ఉచితంగా ప్రయాణించే పథకాన్ని ప్రభుత్వం రూపొందించడానికి ఒక రోజు ముందు ముఖ్యమంత్రి నుంచి ఈ ప్రకటన రావడం విశేషం. -
మార్షల్స్ నెట్టేయడంతోనే..
సాక్షి, హైదరాబాద్: గవర్నర్ ప్రసంగంలో కొన్ని అంశాలు లేనందున తాము నిరసన తెలిపే ప్రయత్నం చేశామని.. కానీ మార్షల్స్ తమను నెట్టివేయడంతోనే అసెంబ్లీలో ఘటన జరిగిందని సీఎల్పీ నేత జానారెడ్డి పేర్కొన్నారు. స్వామిగౌడ్ ప్రసంగం ముగిశాక గవర్నర్‌ను దగ్గరుండి తీసుకెళ్లారని.. అప్పుడు స్వామిగౌడ్ బాగానే ఉన్నట్టు వీడియోలో స్పష్టంగా కనిపిస్తోందని చెప్పారు. కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరించి.. కాంగ్రెస్ ఏదో చేసినట్టుగా చిత్రీకరిస్తోందని ఆరోపించారు. అసెంబ్లీ ఘటన నేపథ్యంలో కోమటిరెడ్డిపై చర్యలు తీసుకోవాలని అధికారపక్షం నిర్ణయించినట్లు సమాచారం అందడంతో.. సోమవారం మధ్యాహ్నం జానారెడ్డి, భట్టి విక్రమార్క, జీవన్‌రెడ్డి విలేకరులతో మాట్లాడారు. తాను నిల్చున్న టేబుల్ విరిగి తనపై పడిందని, అందుకే టేబుల్ మారానని.. తమ సభ్యుల నుంచి దూరంగా వెళ్లేందుకు కాదని జానారెడ్డి చెప్పారు. పార్లమెంటులో టీఆర్ఎస్ సభ్యులు కూడా పేపర్లు చించారని గుర్తుచేశారు. గవర్నర్ ప్రసంగంలో రాష్ట్ర ప్రజల సమస్యలను ప్రస్తావించకపోవడం తమను అసహనానికి గురిచేసిందని భట్టివిక్రమార్క వివరించారు. అసెంబ్లీలో జరిగిన ఘటనకు సీఎందే బాధ్యత అని జీవన్‌రెడ్డి పేర్కొన్నారు. రెండు సార్లు భేటీ.. బడ్జెట్ సమావేశాల్లో వ్యవహరించాల్సిన తీరుపై చర్చించేందుకు కాంగ్రెస్ శాసనసభాపక్షం రెండు సార్లు సమావేశమైంది. సమావేశాలు ప్రారంభం కావడానికి ముందు సమావేశమయ్యారు. గవర్నర్ ప్రసం గం సందర్భంగా అనుసరించాల్సిన వ్యూహం పై చర్చించారు. సభలో పోడియం వద్దకు వెళ్లి నిరసన తెలపాలని నిర్ణయించారు. ఈ మేరకు నిరసన తెలిపారు. అయితే కోమటిరెడ్డి మైకు విసరడం, అది వివాదాస్పదంగా మారడంతో.. అనంతరం మరోసారి సీఎల్పీ భేటీ జరిగింది. అసెంబ్లీలో ఘటనపై ఎలా వ్యవహరించాలన్న దానిపై చర్చించారు. తర్వాత సీఎల్పీ నేతలు మీడియా పాయింట్ వద్ద ప్రభుత్వంపై ఎదురుదాడికి యత్నించారు. బీఏసీ సమావేశంలోనూ జానా తమ వాదనను వినిపించారు. -
‘ప్రభుత్వం రెచ్చగొట్టేలా వ్యవహరించింది’
హైదరాబాద్ :ఆంధ్రప్రదేశ్ శాసనసభ ప్రివిలేజ్ కమిటీకి శుక్రవారమిక్కడ సమావేశమైంది. అసెంబ్లీ వర్షకాల సమావేశాల్లో జరిగిన పరిణామాలపై చర్చ జరిగింది. 45 రోజుల్లో స్పీకర్‌కు నివేదిక ఇవ్వాలని సభా హక్కుల కమిటీ నిర్ణయించింది. ఈ భేటీ ముగిసిన అనంతరం వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ.. తమ పార్టీ ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం కుట్ర పన్నిందన్నారు. అందులో భాగంగానే యనమల తీర్మానం ప్రవేశపెట్టారని, వర్షాకాల సమావేశాల్లో ప్రభుత్వం రెచ్చగొట్టేలా వ్యవహరించిందన్నారు. సభ్యులను సస్పెండ్ చేశాకే సభలోకి మార్షల్స్ రావాలని, అయితే మార్షల్స్తోనే సభను నడపాలని ప్రభుత్వం యత్నించిందని పెద్దిరెడ్డి వ్యాఖ్యానించారు. స్పీకర్, గవర్నర్‌పై దాడి చేసిన చరిత్ర టీడీపీ నేదలదని, ఎన్టీఆర్‌ను సీఎం పదవి నుంచి దించాక కనీసం మాట్లాడే అవకాశం కూడా ఇవ్వలేదని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. అందులో మంత్రి యనమల పాత్ర కూడా ఉందని పెద్దిరెడ్డి అన్నారు. తాము రెండేళ్లుగా ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్నామని, అదే అంశంపై సభలో చర్చకు పట్టుబట్టామన్నారు. అసెంబ్లీలో తాము ఎవరిపైనా దరుసుగా ప్రవర్తించలేదని, ఎమ్మెల్యేలెవరిపైనా చర్యలు తీసుకోవద్దని సమావేశంలో కోరినట్లు పెద్దిరెడ్డి తెలిపారు. -
స్పీకర్ అనుమతి లేకుండానే మార్షల్స్ వస్తారా?
హైదరాబాద్ : ప్రత్యేక హోదా తప్ప రాష్ట్ర అభివృద్ధికి మరో మార్గం లేదని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. అసెంబ్లీ సమావేశాలు 15 నిమిషాలు వాయిదా అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ హోదా ఇవ్వబోమని కేంద్రం స్పష్టం చేసినా చంద్రబాబు నాటకాలు ఆడుతున్నారని మండిపడ్డారు. ఏ అంశంపైన అయినా చర్చకు సై అంటున్న ప్రభుత్వం హోదాపై చర్చకు మాత్రం నై అంటుందోని ఎద్దేవా చేశారు. అసలు సభలోకి మార్షల్స్ ఎందుకు వచ్చారని కోటంరెడ్డి ప్రశ్నించారు. అసెంబ్లీ చరిత్రలో సభలోకి మార్షల్స్ రావడం ఇదే తొలిసారి అని, స్పీకర్ ఆదేశాలు లేకుండానే సభలోకి మార్షల్స్ వస్తారా అని ఆయన అన్నారు. ఎమ్మెల్యే అంజాద్ బాషా మాట్లాడుతూ ఐదుకోట్లమంది ప్రజల జీవన్మరణ సమస్య ప్రత్యేక హోదా అన్నారు. ప్రత్యేక ప్యాకేజీతో చంద్రబాబుకు తప్ప ఎవరికీ ఉపయోగం ఉండదన్నారు. శనివారం జరగనున్న బంద్‌లో అన్నివర్గాల ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని అంజాద్ బాషా విజ్ఞప్తి చేశారు. ఏపీ ప్రజలంతా ప్రత్యేక హోదా కోరుకుంటున్నారని కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి పేర్కొన్నారు. స్వాతంత్ర్యానికి ముందు చంద్రబాబు పుట్టుంటే బ్రిటిష్ వాళ్లతో కలిసిపోయేవారన్నారు. సుజనా చౌదరి, సీఎం రమేష్ వంటి కాంట్రాక్టర్లకు మేలు చేసేందుకే ప్యాకేజీ అని విమర్శించారు. హోదా రాకపోతే నిరుద్యోగులకు ఉద్యోగాలు ఎలా వస్తాయని జగ్గిరెడ్డి ప్రశ్నలు సంధించారు. -
'కేంద్రం ముష్టి వేస్తే చంద్రబాబు స్వాగతిస్తారా'
హైదరాబాద్: కేంద్రం ముష్టి వేస్తే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు స్వాగతిస్తారా అని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే కోన రఘుపతి మండిపడ్డారు. చంద్రబాబు తీరుపై యువకులు రగిలిపోతున్నారని ఆయన అన్నారు. యువకులు, ఏపీ ప్రజల పక్షాన నిలబడి తాము పోరాడుతున్నామని రఘుపతి తెలిపారు. అసెంబ్లీ 15 నిమిషాల వాయిదా అనంతరం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు శాసనసభ ప్రాంగణంలో మీడియాతో మాట్లాడారు. మార్షల్స్‌ను పెట్టి ప్రతిపక్షాన్ని బుల్డోజ్ చేస్తారా అని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే కోరుముట్ల శ్రీనివాసులు ధ్వజమెత్తారు. అధికారపక్షం ఎన్నికుట్రలు చేసినా ప్రత్యేక హోదా పై తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ప్రత్యేక హోదా వస్తేనే నిరుద్యోగులకు మేలు జరుగుతుందని తెలిపారు. మార్షల్స్‌ను ముందే మోహరించడంలో అంతరార్ధమేమిటని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ముస్తఫా అన్నారు. ఏదో ఒకరకంగా సభను అడ్డుకోవాలనేది ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తోందని తెలిపారు. -
ఎన్టీఆర్ భవన్‌లా నడిపిస్తున్నారు...
హైదరాబాద్ : శాసనసభను ఎన్టీఆర్ భవన్‌లా నడిపిస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్ అన్నారు. అసెంబ్లీ 15 నిమిషాల వాయిదా అనంతరం ఆయన శాసనసభ ప్రాంగణంలో మీడియాతో మాట్లాడారు. టీడీపీకి నచ్చినట్లుగా సభను నడుపుతూ, సమావేశాలను వాయిదాల మీద వాయిదాలు వేస్తున్నారన్నారు. మార్షల్స్ స్పీకర్‌ను చుట్టుముట్టి కనిపించకుండా చేస్తున్నారన్నారు. మార్షల్స్‌తో తమను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఎమ్మెల్యే సురేష్ అన్నారు. పోలవరం ప్రాజెక్ట్‌పై చంద్రబాబు చెప్పినవన్నీ అబద్ధాలే అని, వాస్తవాన్ని మసి పూసి మారేడుకాయ చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. *ప్రత్యేక హోదాపై చర్చకు ప్రభుత్వం ఎందుకు భయపడుతుందని ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి ప్రశ్నించారు. చర్చ జరగకుండా ఎందుకు కుట్ర పన్నుతోందని ఆమె అన్నారు. *ఎమ్మెల్యేలని కూడా చూడకుండా మార్షల్స్ దురుసుగా వ్యవహరిస్తున్నారి ఎమ్మెల్యే పుష్పవాణి అన్నారు. తమ పట్ల మార్షల్స్ ప్రవర్తించిన తీరు దారుణమన్నారు. *ఎమ్మెల్యేలను ఏదో ఒకరకంగా బయటకు తోసేయాలనేది ప్రభుత్వ లక్ష్యమని, అందుకే మార్షల్స్‌తో సభను నడిపిస్తున్నారని మేకా ప్రతాప్ అప్పారావు ధ్వజమెత్తారు. *ప్రజలను మోసం చేయడం చంద్రబాబుకు అలవాటు అని ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. హోదాపై చర్చ అంటేనే ప్రభుత్వం పారిపోతోందని, మార్షల్స్ తో సభ నడపాలని చూడటం దుర్మార్గమన్నారు. -
వైఎస్ఆర్ సీపీ సభ్యులపై మార్షల్స్ అత్యుత్సాహం
హైదరాబాద్ : ప్రత్యేక హోదాపై చర్చ చేపట్టాలంటూ పోడియంను చుట్టు ముట్టిన వైఎస్ఆర్ సీపీ సభ్యులపై మార్షల్స్ అత్యుత్సాహం ప్రదర్శించారు. ప్రతిపక్ష సభ్యులపై దౌర్జన్యం చేశారు. స్పీకర్ పోడియం వద్ద ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అని నినాదాలు చేస్తుండగా ప్రతిపక్ష సభ్యులను లాగిపడేసే ప్రయత్నం చేశారు. దీంతో మార్షల్ తీరును సభ్యులు తీవ్రంగా ప్రతిఘటించారు. ఈ సమయంలో ఇద్దరి మధ్య తీవ్ర తోపులాట జరిగింది. ఈ సందర్భంగా స్పీకర్...మార్షల్స్ ప్లీజ్ డునాట్ టచ్ ది మెంబర్స్ అని సూచించారు. అయితే పోడియం వద్ద శాంతియుతంగా ఆందోళన చేస్తున్న...తమపై మార్షల్స్ అకారణంగా దాడి చేశారని వైఎస్ఆర్ సీపీ సభ్యులు అన్నారు. తాము స్పీకర్‌పై దాడికి యత్నించలేదని, అయితే స్పీకర్ దగ్గర మార్షల్స్‌ను పెట్టాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. ఈ చర్య శాసనసభ్యులను అగౌరపరిచేలా ఉందన్నారు. -
పోలీసుల దురుసు ప్రవర్తన.. రోజాకు గాయాలు
హైదరాబాద్: అసెంబ్లీ ఆవరణలో వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే రోజా పట్ల పోలీసులు దురుసుగా ప్రవర్తించడంతో ఆమె గాయపడ్డారు. పోలీసులు రోజాను అదుపులోకి తీసుకుంటుండగా ఆమె కిందపడిపోయారు. శనివారం ఉదయం అసెంబ్లీకి వచ్చిన రోజాను గేటు వద్ద మార్షల్స్ అడ్డుకున్నారు. రోజా అసెంబ్లీ ఆవరణలోకి వెళ్లేందుకు మార్షల్స్ నిరాకరించారు. దీంతో వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు మార్షల్స్‌తో వాగ్వాదానికి దిగారు. అనంతరం పోలీసులు జోక్యం చేసుకుని రోజాను బలవంతంగా అసెంబ్లీ ప్రాంగంణం నుంచి బయటకు పంపేందుకు ప్రయత్నించారు. పోలీసుల దురుసు ప్రవర్తన వల్ల రోజా గాయపడ్డారు. తర్వాత ఆమె సొమ్మసిల్లిపోయారు. వ్యాన్ లోంచి కిందకు దించేటప్పుడు కూడా ఆమె స్పృహలేని పరిస్థితిలోనే ఉన్నారు. ఆమెను మహిళా కానిస్టేబుళ్లు చేతుల మీదుగా తీసుకురావాల్సి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ శాసనసభ మూడో రోజు సమావేశాలు ఈ రోజు ప్రారంభమయ్యాయి. వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సభలో మాట్లాడుతూ.. రోజాపై సస్పెన్షన్ ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. వైఎస్ఆర్ సీఎల్పీ కార్యాలయానికి వచ్చిన రోజాను అసెంబ్లీ బయట మార్షల్స్ ఎలా అడ్డుకుంటారని ప్రశ్నించారు. నిన్న రోజాను ఏడాది పాటు అసెంబ్లీ నుంచి సస్పెన్షన్ చేసిన సంగతి తెలిసిందే. -
మార్షల్స్గా ఏపి పోలీసులు
హైదరాబాద్: శాసనసభ సమావేశాలకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు ఏపి శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాద్ చెప్పారు. బడ్జెట్ సమావేశాల భద్రతపై డిజిపి జెవి రాముడుతో స్పీకర్ చర్చించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఇరు రాష్ట్రాల అసెంబ్లీ సమావేశాల జరిగినా ఇబ్బందులుండవని చెప్పారు. ఏపీ అసెంబ్లీ మార్షల్స్గా ఏపి పోలీసులు ఉంటారన్నారు. మిగిలిన భద్రతంతా హైదరాబాద్ సీటీ పోలీస్ చూసుకుంటుందని తెలిపారు. ట్రాఫిక్ ఆంక్షలు, 144 సెక్షన్ నిబంధనలు నగర పోలీసులు చూసుకుంటారని కోడెల చెప్పారు.