
సాక్షి, న్యూఢిల్లీ: బుధవారం రాజ్యసభలో చెలరేగిన రగడపై అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. పార్లమెంట్ సమావేశాలు అనుకున్న గడువు కంటే ముందే ముగియడానికి మీరంటే మీరే కారణమని అధికార, విపక్షాలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నాయి. ఇక బుధవారం రాజ్యసభలో మార్షల్స్‌పై జరిగిన దాడికి సంబంధించి విపక్ష నేతలు.. మోదీ ప్రభుత్వంపై విమర్శల వర్షం కురిపించారు.
బయట సిబ్బందిని తీసుకొచ్చి ఎంపీలపై దాడి చేయించారని కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆరోపించారు. మహిళా ఎంపీలపై దాడి పార్లమెంట్ ప్రతిష్టను దిగజార్చడమేనని వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని రాహుల్ మండిపడ్డారు. ఈ క్రమంలో15 ప్రతిపక్ష పార్టీలతో కలిసి రాహుల్ గాంధీ నిరసన తెలిపారు. తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఇలాంటి పరిణామాలు చూడలేదన్నారు శరద్ పవార్. విపక్ష నేతల ఆరోపణలకు ఎనిమిది మంది కేంద్ర మంత్రులతో మోదీ ప్రభుత్వం కౌంటర్ ఇచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment