లోక్సభలో తెలంగాణ బిల్లు పెట్టేందుకు స్పీకర్ కార్యాలయం సన్నద్ధం అవుతోంది. భారీగా మార్షల్స్ మోహరించారు.
న్యూఢిల్లీ : లోక్సభలో తెలంగాణ బిల్లు పెట్టేందుకు స్పీకర్ కార్యాలయం సన్నద్ధం అవుతోంది. సీమాంధ్ర ప్రాంత ఎంపీలు తెలంగాణ బిల్లును వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో ఏమైనా అవాంఛనీయ సంఘటనలు జరగవచ్చేమో అనే అనుమానంతో ముందు జాగ్రత్త చర్యగా పార్లమెంట్ వెలుపల, లోపల కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ప్రతి ఎంపీని భద్రతా సిబ్బంది నిశితంగా పరిశీలిస్తోంది. లోక్సభలో భారీ స్థాయిలో మార్షల్స్ మోహరించారు.
తెలంగాణ బిల్లు సభలో పెడితే ఆత్మాహుతి చేసుకుంటానన్న ఎంపీ సబ్బం హరి వ్యాఖ్యలతో స్పీకర్ మీరాకుమార్ అప్రమత్తం అయ్యారు. ఎలాంటి సంఘటనలు చోటుచేసుకుంటాయో ఊహించలేమని, ఏ సంఘటన ఎదురైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని లోక్ సభ సిబ్బందిని స్పీకర్ నిన్ననే అప్రమత్తం చేశారు. దాంతో భారీ సంఖ్యలో భద్రతా సిబ్బంది టీ. బిల్లు రక్షణగా నిలుస్తున్నారు.