Tight security
-
ఓవైపు పోలింగ్.. మరోవైపు కంచెలేసి హైఅలర్ట్ పరిస్థితులు
వాషింగ్టన్ డీసీ: అమెరికాలో అధ్యక్ష ఎన్నికల పోలింగ్ కొనసాగుతున్న వేళ.. మునుపెన్నడూ లేని రీతిలో హైఅలర్ట్ పరిస్థితులు కనిపిస్తున్నాయి. అమెరికా నిఘా సంస్థల హెచ్చరికల నేపథ్యంతో.. పలు రాష్ట్రాలు అప్రమత్తం అయ్యాయి. వాష్టింగన్ సహా మొత్తం 18 రాష్ట్రాలు భారీ స్థాయిలో నేషనల్ గార్డ్స్‌ను మోహరించాయి.గత ఎన్నికల టైంలో ఫలితాల తర్వాత క్యాపిటల్ భవనం వద్ద జరిగిన దాడి ఘటన అమెరికా చరిత్రకు మాయని మచ్చగా మిగిలిపోయింది. ట్రంప్ అనుకూల వర్గమే ఈ దాడికి పాల్పడిందనే అభియోగాలు నమోదయ్యాయి. అగ్రరాజ్యంలో అంతర్యుద్ధం తలెత్తిందా? అనే స్థాయిలో చర్చ జరిగింది అంతటా. ఈ నేపథ్యంలో ట్రంప్ మూడోసారి అధ్యక్ష పదవికి పోటీపడుతుండడం, ఈ మధ్యకాలంలో చోటుచేసుకున్న పరిణామాల నడుమ మరోసారి ఆ తరహా ఘటనలు జరగకుండా భద్రతా వర్గాలు అప్రమత్తం అయ్యాయి.బుల్లెట్‌ప్రూఫ్ గ్లాసులు, గ్రిల్‌తో కూడిన భారీ గేట్లు, ఆయుధాలతో ప్రత్యేక దళాలు(స్వాట్), భారీగా మోహరించిన నేషనల్ గార్డ్స్, ఎన్నికల సిబ్బంది చేతికి అందుబాటులో పానిక్ బటన్స్(ఎమర్జెన్సీ).. సుమారు లక్ష పోలింగ్ స్టేషన్ల వద్ద కనిపిస్తున్న దృశ్యాలివి. ఏఐ టెక్నాలజీ సాయంతో నిఘాను పటిష్టంగా అమలు చేస్తున్నారు. పోలింగ్ ముగిసే సమయం నుంచే ఫలితాలు వెలువడే అవకాశం ఉండడంతో.. ఆ భద్రతను మరింత పటిష్ట పరిచే అవకాశాలే కనిపిస్తున్నాయి. వీటికి తోడు కౌంటింగ్ సమయంలో హింసాత్మక ఘటనలు చోటుచేసుకునే అవకాశం ఉందని నిఘా సంస్థలు అంచనాల నడుమ.. నేషనల్ గార్డ్స్‌లోని సివిల్ సర్వీస్ ట్రూప్స్‌తోపాటు సైబర్ నిపుణులు కూడా రంగంలోకి దిగారు. -
సిట్ విచారణ నిలిపివేత
తిరుమల: తిరుమల లడ్డూలో నెయ్యి కల్తీ అంటూ అసత్య ఆరోపణలు చేసిన చంద్రబాబు.. ఆ ఆరోపణలపై విచారణ కోసం ఆయనే ఏర్పాటు చేసిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) విచారణ నిలిచిపోయింది. డీజీపీ ద్వారకా తిరుమలరావు తిరుమలలో మంగళవారం ప్రకటించారు. తిరుమల లడ్డూలో నెయ్యి కల్తీ ఆరోపణలపై సిట్ దర్యాప్తును నిలిపివేస్తున్నామని.. సుప్రీం కోర్టులో విచారణ జరుగుతుండటం వల్ల దర్యాప్తును ఆపుతున్నామని తెలిపారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై పోలీస్, టీటీడీ విజిలెన్స్ అధికారులతో తిరుమలలో మంగళవారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. శ్రీవారి లడ్డులో కల్తీ నెయ్యి వాడిన కేసు తీవ్రత వల్లే సిట్ వేశామని.. మూడు రోజుల పాటు టీటీడీలో సిట్ దర్యాప్తు సాగిందన్నారు. ప్రస్తుతానికి సిట్ విచారణను తాత్కాలికంగా నిలిపివేస్తున్నామన్నారు. ఈ నెల 3వ తేదీన సుప్రీంకోర్టు ఇచ్చే ఆదేశాల ప్రకారం దర్యాప్తుపై తదుపరి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. 3 రోజుల దర్యాప్తు వివరాలను సిట్ చీఫ్ తమకు అందజేశారని చెప్పారు.బ్రహ్మోత్సవాల్లో పటిష్ట భద్రత బ్రహ్మోత్సవాలకు సంబంధించి భద్రతా ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించామని డీజీపీ తెలిపారు. 5,145 మంది పోలీస్ సిబ్బందిని బ్రహోత్సవాలకు వినియోగిస్తున్నామన్నారు. గరుడ వాహనం రోజున ప్రత్యేకంగా మరో 1,264 మందిని భద్రత కోసం నియమిస్తున్నట్టు చెప్పారు. తిరుమలలో 24 ప్రాంతాలలో పార్కింగ్ స్థలాలను గుర్తించామని, వీటిలో 8 వేల వాహనాలను పార్కింగ్ చేసుకోవచ్చన్నారు. దసరాకు 6,100 ప్రత్యేక బస్సులు భక్తులకు రవాణా ఇబ్బందులు లేకుండా తిరుమలకు అదనంగా ఆర్టీసీ బస్సులు నడుపుతున్నట్టు ఆర్టీసీ ఇన్చార్జి ఎండీ ద్వారకా తిరుమలరావు చెప్పారు. దసరా నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా 6,100 ప్రత్యేక బస్సులు నడుపుతున్నామని.. వీటిలో అదనపు చార్జీలు వసూలు చేయడం లేదని చెప్పారు. -
శంభీపూర్ రాజు నివాసం వద్ద భారీ పోలీస్ బందోబస్తు
-
ప్రధాని మోదీ పర్యటనకు పటిష్ట భద్రత
సాక్షి, అమరావతి/విమానాశ్రయం (గన్నవరం): రాష్ట్రానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రానున్న నేపథ్యంలో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. 10 వేల మంది భద్రతా బలగాలతో పటిష్ట బందోబస్తు నెలకొల్పారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు బుధవారం ప్రమాణ స్వీకారం చేసే కార్యక్రమంలో పాల్గొనేందుకు ప్రధాని మోదీ రానున్నారు. ఆయనతోపాటు కేంద్ర హోం మంత్రి అమిత్ షా, పలువురు కేంద్ర మంత్రులు, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. అమిత్ షా మంగళవారం రాత్రికే విజయవాడ చేరుకున్నారు.కాగా.. ప్రధాని మోదీ, ఇతర ప్రముఖులు బుధవారం ఉదయం రాష్ట్రానికి రానున్నారు. ప్రధాన మంత్రి మోదీ పర్యటనకు భద్రత కల్చించేందుకు ప్రత్యేక భద్రతా విభాగం (ఎస్పీజీ) బలగాలు రెండు రోజుల క్రితమే రాష్ట్రానికి చేరుకున్నాయి. గన్నవరం సమీపంలోని కేసరపల్లిలో సభా ప్రాంగణాన్ని ఇప్పటికే తమ ఆ«దీనంలోకి తీసుకున్నాయి. మరో 10 వేల మంది పోలీసు బలగాలను ప్రధాన మంత్రి పర్యటన కోసం వినియోగిస్తున్నారు. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసం నుంచి గన్నవరంలోని కేసరపల్లి వరకు 22 కి.మీ. వరకు దారి పొడవునా ఇరువైపులా భద్రతా బలగాలు మోహరించాయి.గన్నవరం విమానాశ్రయం పరిసర ప్రాంతాల్లోనూ బలగాలు నిఘాను పటిష్టపరిచాయి. కేసరపల్లి ప్రాంతాన్ని నో ఫ్లై జోన్‌గా ప్రకటించారు. డ్రోన్లు గానీ బెలూన్లు గానీ ఎగుర వేయకూడదని స్పష్టం చేశారు. కోల్కత్తా–చెన్నై జాతీయ రహదారిపై ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. అధికారిక పాస్‌లు ఉన్న వాహనాలు మినహా.. ఇతర వాహనాలను ఆ మార్గంలో అనుమతించబోమని ప్రకటించారు. విజయవాడలోని కమాండ్ కంట్రోల్ కేంద్రంగా భద్రతా ఏర్పాట్లను నిశితంగా పరిశీలిస్తున్నారు. డీజీపీ హరీశ్‌కుమార్ గుప్తా, అదనపు డీజీ శంకభాత్ర బాగ్చీ, విజయవాడ పోలీస్ కమిషనర్ పీహెచ్డీ రామకృష్ణ, ఏలూరు, గుంటూరు ఐజీలు అశోక్‌కుమార్, సర్వశ్రేష్ఠ త్రిపాఠి భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఎస్పీజీ ఐజీ సమీక్ష ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని ఎస్పీజీ ఐజీ నవనీత్‌కుమార్ మెహతా అధికారులకు సూచించారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో మంగళవారం భద్రతా ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా విమానాశ్రయంలో ముందస్తు భద్రత సమన్వయం (ఏఎస్ఎల్) నిర్వహించారు. అనంతరం ఎయిర్పోర్ట్ నుండి ప్రమాణ స్వీకార వేదిక వరకు పీఎం కాన్వాయ్ ట్రయిల్‌రన్ నిర్వహించారు. తొలుత పీఎం కాన్వాయ్ రాకపోకలకు సంబంధించి రూట్‌మ్యాప్‌పై అధికారులతో మెహతా చర్చించారు. వ్యవసాయ శాఖ కమిషనర్ సీహెచ్ హరికిరణ్, డీఐజీ గోపీనాథ్‌జెట్టి, జిల్లా ఎస్పీ అద్నాన్ నయిం అస్మీ, అదనపు ఎస్పీ జి.వెంకటేశ్వరరావు, డీఎంహెచ్ఓ డాక్టర్ సుహసిని పాల్గొన్నారు. -
భారీ బందోబస్త్..కౌంటింగ్ కు కౌంట్ డౌన్
-
నిఘా నీడలో... భారత్–పాకిస్తాన్ టి20 ప్రపంచకప్ మ్యాచ్
న్యూయార్క్: అమెరికా గడ్డపై తొలిసారి జరగనున్న టి20 ప్రపంచకప్‌లో మ్యాచ్‌ల కోసం పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. ముఖ్యంగా జూన్ 9న భారత్, పాకిస్తాన్ మధ్య ఇక్కడి ‘నాసా కౌంటీ క్రికెట్ స్టేడియం’లో జరిగే మ్యాచ్ భద్రతకు సంబంధించి అదనపు దృష్టి పెట్టారు. ఈ మ్యాచ్‌కు తీవ్రవాద ముప్పు ఉన్నట్లు సమాచారం ఉంది. దాంతో అన్ని వైపుల నుంచి పోలీసులు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ‘గతంలో ఎన్నడూ చూడని భద్రతా ఏర్పాట్లు ఇక్కడ కనిపించబోతున్నాయి’ అని ఒక పోలీస్ ఉన్నతాధికారి చెప్పారు. బహిరంగ ప్రదేశాల్లో పెద్ద సంఖ్యలో జనాలను లక్ష్యంగా చేస్తూ ఏకవ్యక్తి చేసే ‘వుల్ఫ్ అటాక్’ తరహా దాడులకు ఆస్కారం ఉందని భావిస్తుండటంతో వాటిని నివారించేందుకు అడుగడుగునా పోలీసులను మోహరిస్తున్నారు. మ్యాచ్ జరిగే రోజు ఐసన్ హోవర్ పార్క్ పరిసరాలన్నీ పోలీసుల ఆ«దీనంలో ఉంటాయి. ఈ వివరాలను నాసా కౌంటీ ఎగ్జిక్యూటివ్ బ్రూస్ బ్లేక్‌మన్, పోలీస్ కమిషనర్ ప్యాట్రిక్ రైడర్ వెల్లడించారు. తాము ఏ విషయంలో కూడా ఉదాసీనత ప్రదర్శించబోమని వారు స్పష్టం చేశారు. ‘ప్రతీ రోజూ నాసా కౌంటీ సహా ఇతర నగరాలకు కూడా బెదిరింపు కాల్స్ వస్తుంటాయి. మేం ఏ ఒక్కదాన్ని తేలిగ్గా తీసుకోం. అన్నింటినీ సీరియస్‌గా పరిశీలిస్తాం. అందుకే భారత్, పాక్ మ్యాచ్ జరిగే రోజు అదనంగా పెద్ద సంఖ్యలో పోలీసు సిబ్బందిని ప్రత్యేకంగా నియమించాం. ఆ రోజు స్టేడియంలో కనీవినీ ఎరుగని భద్రతతో అభిమానులంతా సురక్షితంగా ఉంటారని హామీ ఇస్తున్నా’ అని రైడర్ చెప్పారు. మరోవైపు ఐసీసీ కూడా ప్రేక్షకుల భద్రతే తమకు ముఖ్యమని, ఈ విషయంలో స్థానిక పోలీసులతో కలిసి పని చేస్తున్నామని పేర్కొంది. సుదీర్ఘ సాధన... తొలి రోజు ఫిట్నెస్ ట్రెయినింగ్‌పైనే దృష్టి పెట్టిన భారత క్రికెట్ జట్టు రెండో రోజు పూర్తి స్థాయి నెట్ ప్రాక్టీస్‌కు హాజరైంది. ఆటగాళ్లంతా దాదాపు మూడు గంటల పాటు సాధన చేశారు. నాసా కౌంటీ గ్రౌండ్‌కు దాదాపు ఐదు మైళ్ల దూరంలో ఉన్న కాంటియాగ్ పార్క్‌లో ఈ ప్రాక్టీస్ సాగింది. ఇక్కడ ఆరు డ్రాప్ ఇన్ పిచ్‌లు ఉండగా భారత్ మూడు పిచ్‌లను వినియోగించుకుంది. రెండు పిచ్‌లపై బ్యాటర్లు సాధిన చేయగా, మరో పిచ్‌ను బౌలింగ్ కోసమే టీమిండియా కేటాయించింది. రోహిత్, గిల్, సూర్యకుమార్, పాండ్యా, దూబే, పంత్, జడేజా బ్యాటింగ్‌లో శ్రమించారు. కోహ్లి ఇంకా జట్టుతో చేరకపోగా... ఆలస్యంగా అమెరికాకు వచ్చిన యశస్వి జైస్వాల్, సంజూ సామ్సన్, రింకూ సింగ్, యుజువేంద్ర చహల్ మాత్రం సాధనకు దూరంగా ఉన్నారు. -
అన్నమయ్య జిల్లాలోని అన్ని పోలింగ్ స్టేషన్లలో భారీ బందోబస్తు
-
సీఎం జగన్ కు భద్రతా పెంపు
-
డ్రోన్లతో నిఘా..భద్రతాబలగాల మధ్య అయోధ్య
-
కట్టుదిట్టమైన భద్రతా వలయంలో అయోధ్య
-
దావూద్ ఇబ్రహీం ఆరోగ్యం విషమం!
కరాచీ: అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం ఆసుపత్రి పాలైనట్లు తెలుస్తోంది. అతని ఆరోగ్యం విషమంగా ఉన్నట్లు పలు కథనాలు వెలువడుతున్నాయి. తీవ్ర ఆనారోగ్యంతో ఉన్న దావూద్‌ను సోమవారం పాకిస్తాన్‌లోని కరాచీలో ఓ ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారట. అయితే అతనిపై విష ప్రయోగం జరిగినట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ విషయంపై అధికారికంగా ఎటువంటి స్పష్టత లేనట్లుగా తెలుస్తోంది. అతను మరో రెండు రోజుల పాటు ఆసత్రిలో ఉండి చికిత్స తీసుకొనున్నట్లు సమాచారం. పాక్ మీడియా కథనాల ప్రకారం.. ఆస్పత్రి లోపల దావూద్ ఇబ్రహీం కట్టుదిట్టమైన భద్రత నడుమ చికిత్స తీసుకుంటున్నాడు. ఆస్పత్రిలోని ఒక ఫ్లోర్ మొత్తం దావూద్ ఒక్కడే పేషెంట్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే అతన్ని చూడటానికి కుటుంబసభ్యులు, ఆస్పత్రి ఉన్నతాధికారులకు మాత్రమే అనుమతి ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఈ మాఫియా డాన్ గురించి ఈ ఏడాది జనవరిలో అతని సోదరి ఆసక్తికర విషయాలు చెప్పింది. రెండో వివాహం చేసుకున్నప్పటి నుంచి దావూద్ కరాచీలోనే ఉంటున్నట్లు ఎన్ఐఏ(జాతీయ దర్యాప్తు సంస్థ) విచారణలో ఆమె తెలిపింది. మరోవైపు.. దావూద్ ఇబ్రహీం, అతని అనుచరులు.. పాకిస్థాన్‌లోని కరాచీ విమానాశ్రయాన్ని తమ ఆధీనంలోకి తీసుకోవాలని ప్రయత్నించినట్లు ఎన్ఐఏ ఛార్జిషీట్లో పేర్కొంది. చదవండి: ‘మధ్యధరా’లో పడవ మునిగి 60 మంది మృతి -
రాజమండ్రి సెంట్రల్ జైలు వద్ద భారీ భద్రత
-
G20 సదస్సు...ఢిల్లీకి జో బిడెన్
-
రాజభవన్ దగ్గర భారీగా భద్రత పెంపు
-
సీఎం రాక సందర్భంగా గట్టి భద్రతను ఏర్పాటు చేస్తున్న పోలీసులు
-
మోదీ హైదరాబాద్ పర్యటన..భారీ భద్రత
-
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద భారీ భద్రత..
-
విశాఖ: జీ20 కోసం పటిష్టమైన భద్రత
సాక్షి, విశాఖ: మార్చి 28, 29వ తేదీల్లో జరిగే జీ20 సదస్సు కోసం పటిష్ట భద్రత ఏర్పాటు చేసినట్లు నగర సీపీ సీహెచ్ శ్రీకాంత్ వెల్లడించారు. జీ20 సదస్సుకు విదేశాల నుంచి 250 మంది ప్రతినిధులు హాజరు అవుతారనే అంచనా. ఈ నేపథ్యంలో.. సదస్సు కోసం హాజరయ్యే విదేశీ ప్రతినిధులకు పటిష్ట భద్రత కల్పించనున్నట్లు సీపీ వెల్లడించారు. విదేశీ ప్రతినిధులు బస చేసే హోటళ్ల వద్ద ప్రత్యేక పర్యవేక్షణ ఏర్పాటు ఉంటుందని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా నిఘా పటిష్టంగా ఏర్పాటు చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. -
పాతబస్తీలో కొనసాగుతున్న పోలీసుల గస్తీ
-
నో కాంట్రవర్సీ కామెంట్స్.. ఆద్యంతం నవ్వులు పండించిన మునావర్
సాక్షి, మైదరాబాద్: ఆద్యంతం ఉత్కంఠ, ఉద్రి క్తత, అరెస్టుల నడుమ ప్రముఖ స్టాండప్ కమెడియ న్ మునావర్ ఫారూఖీ శనివారం హైదరాబాద్‌లో నిర్వహించిన కామెడీ లైవ్ షో ‘డోంగ్రీ టు నోవేర్’ ప్రశాంతంగా ముగిసింది. మునావర్ గతంలో హిందూ దేవతలను కించపరిచారని... అందుకే నగరంలో ఆయన షోను జరగనివ్వబోమంటూ బీజేపీ, వీ హెచ్‌పీ హెచ్చరించిన నేపథ్యంలో మాదాపూర్‌లోని శిల్పకళావేదిక, పరిసర ప్రాంతాల్లో 1,500 మంది పోలీసులు బందోబస్తు చేపట్టారు. సైబరాబాద్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర శిల్పకళా వేదికను సందర్శించి బందోబస్తును పర్యవేక్షించారు. సాయంత్రం 4 గంటల సమయంలో బీజేవైఎం, బీజేపీకి చెందిన 80 మంది శిల్పకళా వేదిక వద్దకు వచ్చే ప్రయత్నం చేయగా పోలీసులు అరెస్ట్ చేశారు. ఐటీ కారిడా ర్లోని ఆయా పోలీస్స్టేషన్ల పరిధిలో మరో 20 మందిని అదుపులోకి తీసుకున్నారు. దాదాపు మూడు గంటల పాటు ఉద్రిక్తత నెలకొంది. చదవండి: మునావర్ కామెడీ షో: శిల్పకళా వేదిక వద్ద టెన్షన్.. టెన్షన్ షోను అడ్డుకునేందుకు ఎస్ఓటీ పోలీస్ డ్రెస్‌లో వచ్చిన బీజేపీ కార్యకర్తను కొడుతున్న పోలీసులు అరగంట ముందే ప్రారంభం... షో తిలకించేందుకు వచ్చిన వారిని సాయంత్రం 4:30 నుంచి లోపలకు అనుమతించారు. సెల్ఫోన్ల లో టికెట్ క్యూఆర్ కోడ్‌ను చూపడంతోపాటు వ్యక్తి గత ధ్రువీకరణ పత్రాలు తనిఖీ చేశాకే లోపలికి అనుమతించారు. మంచినీళ్ల సీసాలనూ తీసుకెళ్లనీ యలేదు. శిల్పకళా వేదిక లోపల సైతం పోలీసులు కాపలా ఉన్నారు. ఆందోళనకారులను అడ్డుకొనేందుకు స్టేజీ వద్ద బారికేడ్లను ఏర్పాటు చేశారు. ఆన్లైన్లో టికెట్లు విక్రయించిన సంస్థలు సాయంత్రం 6:30కి షో ప్రారంభమవుతుందని ప్రకటించినప్పటికీ 35 నిమిషాల ముందే మొదలైంది. 2,080 టికెట్లు అమ్ముడయ్యాయి. మునావర్ శిల్పకళా వేదికను ఆనుకొని ఉన్న ట్రైడెంట్ హోటల్ లో బస చేసి అక్కడి నుంచి మధ్యాహ్నం 3కే బుల్లెట్ ప్రూఫ్ కారులో శిల్పకళా వేదికకు చేరుకున్నారు. నవ్వులు పండించిన మునావర్: ‘డోంగ్రీ టు నోవేర్’ ఆద్యంతం నవ్వులు పండించింది. శిల్పకళా వేదిక హాస్యప్రియుల హర్షధ్వానాలతో దద్దరిల్లింది. ఇద్దరు స్నేహితులు ముంబై నుంచి ఢిల్లీకి వెళ్లడం, అక్కడ వారికి ఎదురైన అనుభవాలను హాస్య రూ పంలో మునావర్ వివరించడం సభికులను ఆకట్టు కుంది. ఢిల్లీ నుంచి ముంబై తిరిగి రావడం, వచ్చాక చోటుచేసుకున్న ఘటనలను వ్యంగ్యాస్త్రాలతో వర్ణించడం రెండు, మూడు ఘటనలను గంటన్నర పాటు వివరిస్తూ కడుపుబ్బ నవ్వించారు. ఎక్కడా ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేయలేదు. షో ను ఆస్వాదించినట్లు అభిమానులు తెలిపారు. -
విజయవాడ రైల్వే స్టేషన్ దగ్గర భారీ బందోబస్తు
-
విశాఖ రైల్వే స్టేషన్ లో టైట్ సెక్యూరిటీ
-
స్ట్రాంగ్ రూమ్‌ల దగ్గర భద్రత కట్టుదిట్టం
-
అయోధ్యలో పటిష్ట భద్రత
అయోధ్య: బాబ్రీ మసీదు కూల్చివేత దినం (డిసెంబర్ 6) సమీపిస్తుండటంతో అయోధ్యలో భద్రత పెంచారు. శాంతి, సహనం, సౌభ్రాతృత్వాన్ని ప్రజలు ప్రదర్శిస్తారని భావిస్తున్నట్లు అయోధ్య డిప్యూటీ కలెక్టర్ అనూజ్ ఝా చెప్పారు. బాబ్రీ మసీదు కూల్చివేత దినం రోజున కొందరు ఉత్సవాలు జరుపుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే అయోధ్యను నాలుగు విభాగాలుగా విభజించి భద్రతా బలగాలను మోహరించారు. పలుచోట్ల సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. అయోధ్య జిల్లాలో డిసెంబర్ 28 వరకూ 144 సెక్షన్ అమల్లో ఉండనుంది. -
గణేష్ ఉత్సవాలకు రెట్టింపు భద్రత
-
ప్రారంభమైన అమర్నాథ్ యాత్ర
కశ్మీర్ : జమ్ముకశ్మీర్‌లోని పవిత్ర అమర్నాథ్ గుహను దర్శించుకునేందుకు తొలి యాత్ర ప్రారంభమైంది. అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య సోమవారం ఉదయం 5.30 గంటలకు అనంతనాగ్ జిల్ల అభివృద్ధి అధికారి ఖలీద్ జహింగీర్ జెండా ఊపి యాత్రను ప్రారంభించారు. ఆదివారం జమ్ము బేస్ క్యాంపు నుంచి బల్తాల్ బేస్ క్యాంప్‌కు బయలుదేరిన యాత్రికుల బృందం ఈరోజు యాత్రను ప్రారంభించారు. తొలి బృందంలో 2800మంది భక్తులు ఉన్నారు. 46 రోజుల పాటు సాగే ఈ యాత్రలో పాల్గొనేందుకు ఈసారి దేశ వ్యాప్తంగా 1.5లక్షలకు పైగా భక్తుల పేర్లు నమోదు చేసుకున్నారు. ఈ సారి యాత్రను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు దాడులు చేపట్టవచ్చని నిఘా వర్గాలు హెచ్చరించిన విషయం తెలిసిందే. దాంతో అప్రమత్తమైన కేంద్రం ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది. యాత్రకు దాదాపు 30వేల మందికి పైగా పోలీసులు, సైనిక సిబ్బందితో ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేసింది. నిత్యం సీఆర్పీఎఫ్ సిబ్బంది సీసీ కెమెరాలు, డ్రోన్లతో దారి పొడవునా పహారా కాయనున్నట్లు అధికారులు తెలిపారు. అలానే అమర్నాథ్ బోర్డు ఈ ఏడాది నూతనంగా ‘యాత్రి నిర్వహణ వ్యవస్థ’ను ఏర్పాటు చేసింది. దీని ద్వారా ప్రతి యాత్రికుడి మార్గాన్ని లోకేట్ చేసేందుకు అవకాశం కల్గుతుందని అధికారులు తెలిపారు. -
ఏపీ, తెలంగాణలో అదనపు బలగాలు
న్యూఢిల్లీ: శ్రీలంకలో ఉగ్రఘాతుకం నేపథ్యంలో దక్షిణాది రాష్ట్రాల్లో భద్రతను అధికారులు కట్టుదిట్టం చేశారు. ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు, గోవాలోని సున్నితమైన ప్రాంతాల్లో ముందుజాగ్రత్త చర్యగా భద్రతను పెంచారు. అలాగే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలు, చర్చిల వద్ద భారీగా అదనపు బలగాలను మోహరించారు. కాగా, ఉగ్రదాడి జరగొచ్చని భారత నిఘావర్గాలే శ్రీలంకను ముందుగా హెచ్చరించాయా? అన్న విషయమై భారత నిఘా సంస్థలు మౌనం పాటిస్తున్నాయి. (శ్రీలంకలో మారణ హోమం; ఆగని కన్నీళ్లు) శ్రీలంకలో చిక్కుకున్న ఏలూరు వాసులు అంతా క్షేమమని సమాచారం ఏలూరు టౌన్: శ్రీలంకలోని ట్రిన్‌కోమలి శక్తిపీఠం సందర్శనకు వెళ్లిన 18 మందితో కూడిన భక్త బృందం వరుస బాంబు పేలుళ్ల ఘటనతో అక్కడ చిక్కుకుపోయింది. ఏలూరు, పరిసర ప్రాంతాలకు చెందిన 18 మంది శ్రీలంకలోని జాఫ్నా, కొలంబో, ట్రిన్‌కోమలి శక్తిపీఠం, అశోకవనం తదితర క్షేత్రాలను సందర్శించేందుకు ఈనెల 18న బయలుదేరి వెళ్లారు. వీరితోపాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన మరో 15 మంది భక్తులు శ్రీలంక వెళ్లినట్టు ఇక్కడకు సమాచారం అందింది. ఈస్టర్ రోజున కొలంబోలో వరుస బాంబు పేలుళ్లు చోటుచేసుకోవడంతో వారి కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. భక్త బృందంలోని మురళీకృష్ణతో సోమవారం రాత్రి 9 గంటల సమయంలో ‘సాక్షి’ విలేకరి మాట్లాడగా.. ఏలూరుకు చెందిన 18 మంది భక్తులు క్షేమంగా ఉన్నారని చెప్పారు. తామంతా కొలంబో ఎయిర్ పోర్టుకు వెళ్తున్నట్టు తెలిపారు. మంగళవారం తామంతా ఏలూరు చేరుకుంటామని, ఎటువంటి ఆందోళన అవసరం లేదని స్పష్టం చేశారు. బాంబు పేలుళ్లు జరగటానికి ముందు రోజున తామంతా కొలంబోలోని హోటల్లో ఉన్నామని తెలిపారు. భగవంతుడి దయతో శనివారం రాత్రి ఆ ప్రాంతం నుంచి బయలుదేరి జాఫ్నాకు వెళ్లడంతో ప్రాణాలతో బయటపడ్డామని చెప్పారు. (చదవండి: లంకకు ఇప్పట్లో వద్దు బాబోయ్ ..!) -
నిఘా నీడలో పాలమూరు
సాక్షి,మహబూబ్‌నగర్ క్రైం: ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో గ్రామాలు, పట్టణాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసుశాఖ బందోబస్తు పటిష్టం చేసింది. జిల్లా కేంద్రంతో పాటు ప్రధాన రోడ్లపై ఉదయం, సాయంత్రం తనిఖీ చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 8 చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి ప్రతివాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం వదులుతున్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో కార్డెన్ సెర్చ్ పట్టణాలు, గ్రామాలతో పాటు సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేక తనిఖీలతో కార్డెన్ సెర్చ్ నిర్వహిస్తున్నారు. ప్రజలు తమ ఓటు హక్కును నిర్భయంగా వినియోగించుకునేందుకు గ్రామాల్లో సభలు, కేంద్ర బలగాలతో ఫ్లాగ్ మార్చ్ నిర్వహిస్తున్నారు. ఎన్నికల్లో మద్యం, నగదు పంపిణీ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, ప్రజలు సమాచారం అందించాలని అవగాహన కల్పిస్తున్నారు. రౌడీషీటర్లపై నిఘా రోజురోజుకు ఎన్నికల వాతావరణం వేడెక్కుతోంది. హత్యలు, అపహరణ, రౌడీయిజం, దౌర్జన్యాలు, కుమ్ములాటలు, గొడవలు, బెదిరింపులు, భూ దందాలు చేసేవారితోపాటు నిత్య నేరాలకు పాల్పడుతున్న రౌడీషీటర్లు ఎన్నికల్లో రెచ్చిపోకుండా వారిని కట్టడి చేయడానికి ముందస్తు చర్యలు తీసుకున్నారు. గత ఎన్నికల్లో ఓటర్లు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో రాత్రి వేళ అడ్డాలు వేయడం, మందు పార్టీలు నిర్వహించడం, ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు నాయకుల ప్రయత్నాల్లో సహకారం అందించడం లాంటి పనులకు పాల్పడిన వారిపై నిఘా పెట్టారు. స్టేషన్లవారీగా రౌడీషీటర్లు, గ్యాంగ్స్టర్లు, హిస్టరీ షీటర్లు వారి అనుచరులపై దృష్టి పెట్టి ఎక్కడికక్కడ కట్టడి చేస్తున్నారు. వివిధ రకాల నేర ప్రవృత్తి ఉన్న రౌడీషీటర్లను బైండోవర్ కేసుల్లో భాగంగా పిలిచి తహసీల్దార్ ఎదుట హాజరు పరుస్తూ రూ.లక్ష నుంచి రూ.ఐదు లక్షల వ్యక్తిగత పూచీకత్తుతో వదిలిపెడుతున్నారు. 419 మంది బైండోవర్ ఇప్పటివరకు జిల్లా వ్యాప్తంగా 129 కేసుల్లో 419 మంది పాత నేరస్తులను బైండోవర్ చేశారు. ఇందులో రౌడీషీటర్లు, లొంగిపోయిన తీవ్రవాదులు, సానుభూతిపరులు ఉన్నారు. రౌడీషీటర్లలో ఒకరిద్దరు చోటామోటా నేతలు కూడా ఉండటం గమనార్హం.జిల్లాలో అనుమతి ఉన్న తుపాకులు కల్గిన వ్యక్తులు ఉంటే తక్షణం వారి ఆయుధాలను స్థానిక పోలీసులకు అప్పగించాలని ఎస్పీ రెమారాజేశ్వరి పిలుపునివ్వడంతో 368 తుపాకులు డిపాజిట్ అయ్యాయి. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు 129 కేసులు నమోదుకాగా 419 మంది వ్యక్తులను బైండోవర్ చేశారు. అదేవిధంగా తనిఖీల్లో 1,252 లీటర్ల మద్యం, రూ.97లక్షల 51వేల 500నగదును సీజ్ చేశారు. ఇప్పటి వరకు పోలీసులు 8వేల వాహనాలు తనిఖీ చేసి 180 మంది అనుమానిత డ్రైవర్ల వివరాలు సేకరించారు. రౌడీ షీటర్లపై నజర్ జిల్లాలో సుమారు 800 మందికిపైగా రౌడీషటర్లు ఉన్నట్లు సమాచారం. వ్యవస్థీకృత నేరాలు, దందాలు, బెదిరింపులు, హత్యలు, రౌడీయిజం, దౌర్జన్యాలు, అక్రమ వ్యాపారాలు, అసాంఘిక కార్యకలాపాలు చేస్తున్నారు. నేరాల తీవ్రత ఆధారంగా వారిపై పోలీసులు రౌడీషీట్లను తెరిచారు. ఈ ప్రక్రియ నాలుగైదు దశాబ్ధాలుగా కొనసాగుతోంది. 20ఏళ్ల కిందట రౌడీషీట్ నమోదై నేరాలను కొనసాగిస్తున్న వారి నుంచి కొత్తగా రౌడీషీట్ ఉన్న ఈ జాబితాలో ఉన్నారు. ఎన్నికలు, పండగలు, గణేష్ నవరాత్రి ఉత్సవాలు సందర్భంగా ముందస్తుగా వారి పోలీస్ స్టేషన్‌కు పిలిపించడం బైండోవర్ చేయడం వంటివి కొనసాగుతుండటం సాధారణం. జిల్లాలో నేరస్థుల సర్వే నిర్వహించనప్పుడు ఎన్నికల్లో నేరాలకు పాల్పడిన వారి వివరాలను సేకరించారు. తాజా ఫొటోలతో వారిపై నమోదైన నేరాలు, శిక్షలు, ప్రస్తుత జీవన విధానం, ప్రవర్తన కుటుంబ వివరాలు సేకరించి నేరాలను బట్టి కొత్తగా హిస్టరీ షీట్ పొందుపరుస్తున్నారు. వీరిలో కొందరు రౌడీషీటర్లు నేరాలు మానుకుని చిన్న, చిన్న వ్యాపారాలు చేసుకుంటున్నారు. మతపరమైన అల్లర్ల సందర్భంగా రౌడీషీటర్‌గా నమోదైన వారు ఎన్నికల్లో పాల్గొన్నా వారి వివరాలను తీసుకున్నారు. జిల్లాలో కొంత మందిని పీడీ యాక్టు ఉపయోగించి జైళ్లకు పంపించారు. ఎన్నికలు సమీపిస్తున్న సందర్భంగా రౌడీషీటర్లలో ఎంత మంది జైల్లో ఉన్నారు.. ఎంతమంది బెయిల్‌పై బయట ఉన్నారన్న వివరాలను పోలీస్‌స్టేషన్ వారీగా సేకరించారు. రౌడీషీటర్ల ఫోన్ నెంబర్లు వారి అనుచరుల వివరాలు సైతం సేకరిస్తున్నారు. బైండోవర్‌కు రంగం సిద్ధం జిల్లాలో కొందరు ఆజ్ఞాతంలోకి వెళ్లిపోగా కొందరు వివిధ ప్రాంతాలకు వలస వెళ్లి జీవితాన్ని సాగిస్తున్నారు. కొందరు ప్రాంతాలు, పోలీస్స్టేషన్లు పరిధి మారారు. ఇలాంటి వారు ఏయే పోలీస్ స్టేషన్ పరిధి మారారో షీటర్ ప్రస్తుత ఫొటోతో కలిపి పూర్తి వివరాలను సంబంధిత పోలీస్‌స్టేషన్‌కు బదిలీ చేశారు. స్టేషన్ పరిధిలోని రౌడీషీటర్లు, హిస్టరీ, షీటర్లు, సస్పెక్ట్ షీటర్లను స్టేషన్‌కు పిలిపించి కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నారు. నిఘా పెంచాం జిల్లా మొత్తం పోలీసుల నిఘాలో ఉంది. ఎవరైనా పనికట్టుకుని గొడవలు సృష్టిస్తే కఠినంగా వ్యవహరిస్తాం. ప్రతి రోజు వాహనాల తనిఖీలు, గ్రామాల సందర్శన కొనసాగుతోంది. సీసీ కెమెరాల ద్వారా ఎన్నికల పరిశీలన చేస్తున్నాం. ఎక్కడైనా గొడవలు జరిగితే వెంటనే సమాచారం అందించాలి. – రెమారాజేశ్వరి, మహబూబ్‌నగర్ ఎస్పీ -
అనుక్షణం.. అప్రమత్తం
సాక్షి, సిటీబ్యూరో : నగర శివార్లతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో మిళితమై ఉన్న సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఎన్నికలకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్టు కమిషనర్ వీసీ సజ్జనార్ పేర్కొన్నారు. ఎన్నికలు సాఫీగా జరిగేందుకు అమలుచేస్తున్న చర్యల పై ‘సాక్షి’కి ఆయన వివరించారు. చేవేళ్ల, మల్కాజిగిరితో పాటు సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోకి కొన్ని ప్రాంతాలు వచ్చే హైదరాబాద్, సికింద్రాబాద్, మహబూబ్‌నగర్, మెదక్ లోక్‌సభ స్థానాల్లో ప్రశాంత పోలింగ్ కోసం చర్యలు తీసుకుంటున్నామన్నారు. భారీ భద్రత నీడలో.. కమిషనరేట్ పరిధిలోని 4,500 మంది విధుల్లో నిమగ్నమవుతున్నారు. 10 కంపెనీల పారామిలిటరీ బలగాల సేవల్నీ వినియోగిస్తున్నాం. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికో ఏసీపీని ఇన్చార్జిగా నియమిం చాం. ఎన్నికల సమయంలో జిల్లా ఎన్నికల అధికారులతో సమన్వ యం చేసుకోవల్సిన బాధ్యతను అప్పగించాం. ప్రజల్లో ఆత్మవిశ్వా సం నింపేందుకు కీలక ప్రాంతాల్లో ఫ్లాగ్‌మార్చ్ నిర్వహిస్తున్నాం. భద్ర త పరంగా ఎలాంటి ఆందోళన లేకుండా ఓటర్లు పోలింగ్‌లో పాల్గొనవచ్చు. నిరంతర నిఘా.. వివిధ ప్రాంతాల్లో 11 తనిఖీ కేంద్రాలను ఏర్పాటు చేసి నిరంతర నిఘా ఉంచాం. అక్రమంగా తరలిస్తు న్న నగదుపై దృష్టి సారించాం. మద్యం తరలిం పుపై నిఘా ఉంచాం. వీటికితోడు స్టాటిక్ సర్వైలైన్స్ బృందాలు, సంచార తనిఖీ బృందాలు, క్వి క్ రెస్పాన్స్ టీమ్‌లు, స్ట్రైకింగ్ ఫోర్స్ బృం దా లు పనిచేస్తున్నాయి. కమిషనరేట్ పరిధి లోని రౌడీషీటర్ల బైండోవర్లపై ఆయా ఠాణాల పోలీసులు దృష్టి సారించారు. లైసెన్స్ గన్లు కలిగిన వారు తమ ఆయుధాలను ఇప్పటికే ఆయా పోలీసు స్టేషన్లలో డిపాజి ట్ చేశారు. -
సరిహద్దులో చెక్ పెడదాం
సాక్షి, నారాయణపేట: సార్వత్రిక ఎన్నికల్లో డబ్బు, మద్యం తరలింపునకు తెలంగాణ, కర్ణాటక రాష్ట్ర సరిహద్దులో అడ్డుకట్ట వేయాలని పేట కలెక్టర్ ఎస్.వెంకట్రావు, కర్ణాటక రాష్ట్రం యాద్గిర్ కలెక్టర్ కూర్మారావు అన్నారు. శుక్రవారం ఇరు రాష్ట్రాల సరిహద్దు అయిన పేట శివారులోని జలాల్పూర్ స్టేజీ సమీపంలో చెక్‌పోస్టును పేట ఎస్పీ చేతన, యాద్గీర్ ఎస్పీ సోనియావనే రిషికేశ్ భగవాన్‌లతో కలిసి పరిశీలించారు. అనంతరం జలాల్పూర్ గ్రామ ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన ఇరు రాష్ట్రాల అధికారుల తో నిర్వహించిన కోఆర్డినేషన్ సమావేశంలో కలెక్టర్లు మాట్లాడారు. తెలంగాణ, కర్ణాటక సరిహద్దులో ఉన్న చెక్‌పోస్టుల వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని పోలీసు అధికారులు, సిబ్బందికి సూచించారు. తెలంగాణ నుంచి వెళ్లి, వచ్చే వాహనాలను ఈ ప్రాంత పోలీసులు పరిశీలించి వాటిని రిజిష్ట్రర్‌లో నమోదు చేయాలన్నారు. అలాగే కర్ణాటక నుంచి వచ్చి వెళ్లే వాహనాలను ఆ రాష్ట్ర పోలీసులు రికార్డు చేయాలన్నా రు. ఏదైనా అనుమానాలు వస్తే వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వాలన్నారు. విధుల్లో ఎవరైనా తప్పు చేస్తే కఠిన చర్య లు తప్పవని హెచ్చరించారు. ఏప్రిల్ 11 న ఎన్నికలు ముగిసినా 23 వరకు చెక్‌పోస్టును కొనసాగించాలని ఆదేశించారు. ఎవరికీ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఇరు రాష్ట్రాల పోలీ సులు అధికారులు, సిబ్బంది సహకరించుకోవాలని కోరారు. సమావేశంలో పేట సీఐ సంపత్‌కుమార్, ఎక్సైజ్ సీఐ నాగేందర్, ఎంపీడీఓ వెంకటయ్య, ఎస్ఐ శ్రీనివాసులు పాల్గొన్నారు. -
ఎన్నికల భద్రత కట్టుదిట్టం..!
సాక్షి, చింతపల్లి : అసెంబ్లీ ఎన్నికల మాదిరిగానే లోక్‌సభ ఎన్నికలు ప్రశాంత నిర్వహించాలని పోలీస్ శాఖ భావిస్తోంది. ఇందుకోసం గత నెలరోజుల నుంచి అధికారులు క్షేత్రస్థాయిలో భద్రత ఏర్పా ట్లు పర్యవేక్షిస్తున్నారు. నియోజకవర్గంలో ఆయా కేంద్రాల పరిధిలో రూట్లు సిద్ధం చేశారు. గ్రామాల్లో పోలీస్ కవాతు నిర్వహించి ప్రజల్లో మనోధైర్యాన్ని పెంచుతున్నారు. ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీస్‌శాఖ సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై దృష్టి సారిస్తోంది. నియోజకవర్గంలో మొత్తం 282 పోలింగ్ కేంద్రాలు ఉండగా అందులో సుమారు 30కిపైగా కేంద్రాలను అధికారులు సమస్యాత్మకమైవిగా గుర్తించా రు. ఎన్నికల తేదీల నాటికి ఆయా గ్రామాల్లో పరిస్థితుల ఆధారంగా అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకోవాలని పోలీసులు భావిస్తున్నారు. గతంలో నేర చరిత్ర కలిగిన ప్రతి ఒక్కరిని బైండోవర్ చేసే పనిలోపడ్డారు. తనిఖీ కేంద్రాలు.. మద్యం, డబ్బు అక్రమ తరలింపును నిరోధించడానికి సరిహద్దు జిల్లాల పోలీసులు పరస్పరం సహకరించుకోవాలని నిర్ణయించారు. ఈ మేరకు మాల్ వెంకటేశ్వరనగర్ పంప్‌హౌజ్ వద్ద, కొండభీమనపల్లి వద్ద, పోలేపల్లి సమీపంలో చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు. ఈ తనిఖీ కేంద్రాలు ఎన్నికలు పూర్తయ్యే వరకు 24 గంటల పాటు పని చేయనున్నాయి. ఇతర జిల్లాల నుంచి వచ్చే ప్రతి వాహనాన్ని ఆపి తనిఖీ చేసిన తర్వాతనే జిల్లాలోకి అనుమతిస్తున్నారు. ఓటరు చైతన్య కార్యక్రమాలు.. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల గ్రామాల్లో పోలీసులు ఇప్పటికే అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఓటర్లలో చైతన్యం నింపి శాంతియుత వాతావరణానికి సహకరించాలని కోరుతున్నారు. ఆయా గ్రామాల్లో ఇప్పటికే రూట్ మార్చ్‌లను సిద్ధం చేసి అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించారు. గత ఎన్నికల సమయంలో ఘర్షణలు, కవ్వింపు చర్యలు, మద్యం, డబ్బులు పంపిణీ వంటి కార్యక్రమాలు చేపట్టిన వ్యక్తులను బైండోవర్ చేస్తున్నారు. సమస్యాత్మక ప్రాం తాలకు పోలీసులు వీలైనన్ని సార్లు వెళ్లి పరిస్థితులు అంచనా వేసేపనిలో పడ్డారు. గ్రామాల్లో అనుమానిత వ్యక్తుల కదలికలపై నిఘా పెట్టారు. ఎన్నికల్లో అవసరమైతే అదనపు బలగాలను ఉపయోగించనున్నారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే వారే కాకుండా కొన్ని రిజర్వ్ బలగాలను కూడా అందుబాటులో ఉంచుతారు. అయితే ఎన్నికల తే దీ సమిపిస్తుండడంతో పోలీస్ యంత్రాంగం పరి స్థితులను బట్టి అదనపు బలగాలను అక్కడికి తరలించే వీలుంది. ఆయా గ్రామాల్లో వీడియో చిత్రీకరణ చేస్తూ పరిస్థితిని అంచనా వేస్తున్నారు. -
కలవనీయకుండా కట్టడి
సాక్షి,విశాఖపట్నం: ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై హత్యాయత్నానికి పాల్పడి జైలులో ఉన్న జనుపల్లి శ్రీనివాసరావును చూడటానికి ఎవరూ రాకపోవడంపై పలు అనుమానాలు తలెత్తున్నాయి. నిందితుడ్ని పలకరించడానికి అటు తల్లిదండ్రులుగాని ఇటు తోబుట్టువులు, బంధువులుగానీ రాకపోవడాన్ని చూసి జైలు సిబ్బంది ఆశ్చర్యపోతున్నారు. అతన్ని ఎవరైనా కలిస్తే నిజాలు బయటకొస్తాయనే భయంతో టీడీపీ నేతలే ఎవరినీ అటువైపు కన్నెత్తి చూడకుండా కట్టడి చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రత్యేకంగా తూర్పుగోదావరి జిల్లా ఠానేలంక నుంచి విశాఖ వరకు ప్రత్యేక దృష్టిపెట్టిన కొందరు టీడీపీ నేతలు జైలువైపు ఎవరూ వెళ్లకుండా కంచెలా వ్యవహరిస్తున్నారని చెబుతున్నారు. హైఅలర్ట్ బ్లాకులో నిందితుడు రిమాండ్ ఖైదీగా శ్రీనివాస్‌ను విశాఖ సమీపంలోని ఆరిలోవ సెంట్రల్ జైలులో నక్సలైట్లను ఉంచే చిత్రావతి (హై అలర్ట్) బ్లాకులో ఒంటరిగా ఉంచారు. నిందితుడిని సెంట్రల్ జైలు డిప్యూటీ సూపరింటెండెంట్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. నలుగురు హెడ్వార్డర్లు నిరంతరాయంగా కాపలా ఉంటున్నారు. సాధారణంగా రిమాండు ఖైదీని వారానికి రెండుసార్లు కలిసేందుకు అవకాశం ఉంటుంది. కానీ, శ్రీనివాసరావును కలిసేందుకు ఇప్పటివరకూ ఎవరూ రాకపోవడంపై జైలు సిబ్బంది విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఎంత కరడుగట్టిన నేరస్తుడినైనా చూసేందుకు కుటుంబ సభ్యులు ఎవరో ఒకరు వస్తారని.. కానీ, ఇతని విషయంలో ఎవరూ రావడంలేదని వారు చెబుతున్నారు. పోలీసు కస్టడీలో ఉన్న సమయంలో విచారణలో భాగంగా తల్లిదండ్రులు శ్రీనివాసరావుతో మాట్లాడారు. ఆ తర్వాత నుంచి ఇప్పటివరకూ ఎవరూ నిందితుడి వైపు కన్నెత్తి చూడలేదు. ఠానేలంకలో టీడీపీ నేతలు,పోలీసుల హుకుం శ్రీనివాసరావు స్వగ్రామమైన ఠానేలంకలో వీరిపై టీడీపీ నేతలు డేగకన్ను వేయడంవల్లే ఎవరూ బయటకు రావడానికి సాహసించడంలేదని సమాచారం. అలాగే, శ్రీనివాసరావు రక్తసంబం«ధీకులు ఎవరూ బయటకు వెళ్లవద్దని, కొత్తవారితో మాట్లాడవద్దని హుకుం జారీచేసినట్లు తెలిసింది. ఇదేరీతిలో పోలీసుల నుంచి కూడా హెచ్చరికలు జారీ చేయించినట్లు తెలుస్తోంది. అందువల్లే శ్రీనివాసరావుతో మాట్లాడేందుకు ఎవరు రావడంలేదని సమాచారం. ఎవరైనా మాట్లాడితే కుట్ర కోణం ఎక్కడ బయటకు పొక్కుతుందో అనే అనుమానాం ప్రభుత్వ పెద్దల్లో ఉందని, అందువల్లే అన్ని రకాలుగా కట్టడి చేస్తున్నట్లు సమాచారం. -
పోలీసుల వలయంలో కర్నూలు
-
పాతబస్తీలో ప్రశాంతంగా ప్రార్ధనలు
సాక్షి, హైదరాబాద్: రంజాన్ మాసం చివరి శుక్రవారం సందర్భంగా పాతబస్తీలో ముస్లిం సోదరుల ప్రార్థనలు ప్రశాంతంగా ముగిశాయి. పాతబస్తీలో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. భద్రతా ఏర్పాట్లను సీపీ అంజనీకుమార్ పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నగరంలో శనివారం రంజాన్ ప్రార్థనలకు 5 వేల మందితో పటిష్ట భద్రత ఏర్పాటు చేశామన్నారు. సిటీలోని 600 మసీదుల వద్ద సెక్యూరిటీ పెంచినట్టు తెలిపారు. 50 సమస్యాత్మక మందిరాల వద్ద సీసీ కెమెరాలు, మఫ్టీ పోలీసులతో నిఘా పెట్టామన్నారు. అదేవిధంగా సిటీలో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని వెల్లడించారు. -
పాతబస్తీలో భద్రత కట్టుదిట్టం
హైదరాబాద్ : మొహర్రం నేపథ్యంలో బుధవారం పాతబస్తీలో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. దాదాపు 2,500 మంది పోలీసులతోపాటు 2 కంపెనీల కేంద్ర బలగాలను రంగంలోకి దించారు. అలాగే ఐదు బాంబు స్క్వాడ్స్‌తోపాటు 10 షీ టీమ్స్‌తో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. అలాగే అనుమానిత వాహనాలను పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఎక్కడ ఎటువంటి అవాంచనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు గట్టి చర్యలు చేపట్టారు. -
పార్టీ బలోపేతం కోసం బీజేపీ కృషి
-
భద్రాచలంలోని హెలిపాడ్ వద్ద భారీ బందోబస్తు
ఖమ్మం: మావోయిస్టుల కార్యకలాపాల పై సమీక్ష నిర్వహించడానికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాలకు చెందిన పోలీస్ ఉన్నతాధికారులు ఆదివారం భద్రచాలంలో సమావేశం కానున్నారు. అందులోభాగంగా భద్రాచలంలో ఏర్పాటు చేసిన హెలిపాడ్ వద్ద భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. కాగా బూటకపు ఎన్కౌంటర్లకు నిరసనగా నేడు తెలంగాణ బంద్‌కు మావోయిస్టులు పిలుపు నిచ్చిన విషయం తెలిసిందే. -
కన్హయ్య కుమార్, ఉమర్ ఖలీద్ కు భద్రత పెంపు
న్యూఢిల్లీ : నాగపూర్‌లో దాడి నేపథ్యంలో జేఎన్‌యూ విద్యార్థి నాయకుడు కన్హయ్య కుమార్, ఉమర్ ఖలీద్లకు ప్రభుత్వం భద్రతను పెంచింది. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 125వ జయంతి సందర్భంగా మహారాష్ట్రలోని నాగపూర్‌లో కన్హయ్య కుమార్, ఉమర్ ఖలీద్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ప్రసంగిస్తున్న వారిపై చెప్పులు, బూట్లతో ప్రజలు దాడిచేశారు. అంతేకాకుండా కన్హయ్య కుమార్‌కి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అలాగే బజరంగ్ దళ్ కార్యకర్తలు కన్హయ్య కుమార్ కారును నాగపూర్ నగరంలో ప్రవేశించకుండా అడ్డుకున్నారు. దాంతో పలువురు బజరంగ్ దళ్ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కన్హయ్య, ఉమర్ ఖలీద్లకు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసింది. -
బ్రస్సెల్స్ దాడి భయంతో బూట్లు, బెల్టులు విప్పించి..
న్యూఢిల్లీ: అమెరికా, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో సాధారణ విమాన ప్రయాణికులతో పాటు వీఐపీలను సైతం క్షుణ్నంగా తనిఖీ చేస్తుంటారు. వీఐపీలకు దుస్తులు విప్పించి తనిఖీలు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. దీనిపై వీఐపీలు ఆగ్రహం వ్యక్తం చేయడం, వివాదాస్పదమైన ఘటనలు కూడా ఉన్నాయి. బెల్జియం రాజధాని బ్రస్సెల్స్ విమానాశ్రయంలో ఉగ్రవాదదాడి నేపథ్యంలో భారత్‌లోని ప్రధాన విమానాశ్రయాల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేయడంతో పాటు గతంలో కంటే తనిఖీలను ముమ్మరం చేశారు. ప్రయాణికుల బూట్లు, బెల్టులు విప్పించి క్షుణ్నంగా తనిఖీలు చేస్తున్నారు. ఢిల్లీ, ముంబై, బెంగళూరు, హైదరాబాద్, కోల్‌కతా, చెన్నై, అహ్మదాబాద్ వంటి ప్రధాన విమానాశ్రయాల్లో భద్రతను పెంచారు. ప్రయాణికులు విమానంలోకి ప్రవేశించే ముందు పలు దశల్లో సీఐఎస్ఎఫ్, స్థానిక పోలీసులు వారిని క్షుణ్నంగా తనిఖీలు చేస్తున్నారు. ఉగ్రవాదుల నుంచి ముప్పు పొంచిఉందున్న కేంద్ర నిఘా వర్గాల సమాచారం మేరకు భారీ భద్రత చర్యలు తీసుకున్నట్టు ఓ అధికారి చెప్పారు. బ్రస్సెల్స్ విమానాశ్రయంలో ఆత్మాహుతి దాడుల్లో రెండు పేలుళ్లు సంభవించగా, పేలని బెల్టు బాంబును భద్రత బలగాలు గుర్తించి నిర్వీర్యం చేశాయి. ఈ నేపథ్యంలో భారత్‌లో ప్రయాణికుల కదలికలపై నిఘా పెంచడంతో పాటు తనిఖీలను ముమ్మరం చేశారు. -
ఆ ముగ్గురికి పటిష్ట భద్రత
న్యూఢిల్లీ: జేఎన్‌యూ ఘటనలో రాజద్రోహం కేసు ఎదుర్కొంటున్న జేఎన్‌యూ విద్యార్థి సంఘం అధ్యక్షుడు కన్హయ్యతోపాటు రిమాండ్‌లో ఉన్న మరో ఇద్దరు విద్యార్థుల వివరాలపై గోప్యత పాటించాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. పటిష్టమైన భద్రత కల్పించాలని ఢిల్లీ పోలీసులను కన్హయ్య బెయిల్ పిటిషన్ విచారణ సందర్భంగా కోర్టు ఆదేశించింది. దీంతో పాటు ఉమర్ , అనిర్బన్ భట్టాచార్యలు పటియాలా కోర్టుకు విచారణకు వస్తున్నప్పుడు తమకు రక్షణ కల్పించాలని కోరటంతో కోర్టు వద్ద భద్రతపై స్పష్టంగా ఉండాలని ఆదేశించింది. కన్హయ్య బెయిల్ పిటిషన్ తదుపరి విచారణను 29కి వాయిదా వేసింది. కాగా ఉమర్, అనిర్బన్‌లను మూడురోజుల పోలీసు రిమాండ్‌ను తరలిస్తూ సిటీ కోర్టు ఆదేశించింది. కార్యక్రమాన్ని నిర్వహించింది కన్హయ్యే! అఫ్జల్ గురు ఉరికి వ్యతిరేకంగా ఏర్పాటుచేసిన కార్యక్రమాన్ని కన్హయ్యే నిర్వహించాడని పోలీసులు కోర్టుకు తెలిపారు. అతనితోపాటు అరెస్టుచేసిన ఇద్దరు, మరికొందరు విదేశీయులు దేశ వ్యతిరేక నినాదాలు చేశారన్నారు. కొత్త వీడియోలో బయటి వ్యక్తులు ఫిబ్రవరి 9న దేశ వ్యతిరేక నినాదాలు చేసింది బయటి వ్యక్తులేననే ఆధారాలతో కొత్త వీడియో తెరపైకి వచ్చింది. విదేశీ శక్తులు వీడియోలు ఉన్నాయంటూ పోలీసులు కోర్టుకు చూపించిన ఈ వీడియోతో కేసు కొత్త మలుపు తిరగనుంది. కాగా, లొంగిపోయిన ఉమర్ ఖలీద్, అనిర్బన్ భట్టాచార్యలను ఢిల్లీ పోలీసులు బుధవారం ఐదుగంటలపాటు ప్రశ్నించారు. ప్రభుత్వం భయపడుతోంది.. రాహుల్: జేఎన్‌యూ వివాదం విషయంపై పార్లమెంటులో తను లేవనెత్తే ప్రశ్నలకు ప్రభుత్వం దగ్గర సమాధానం లేక భయపడుతోందని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. ఇదిలాఉండగా, జేఎన్‌యూలో విద్యార్థుల మెదళ్లను అక్కడి ప్రొఫెసర్లే కలుషితం చేస్తున్నారని మాజీ ఇన్ఫోసిస్ డెరైక్టర్ మోహన్దాప్ అన్నారు. కన్హయ్య, జర్నలిస్టులపై దాడికి యత్నించిన అడ్వకేట్ విక్రమ్ సింగ్‌ను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. విద్యార్థులపై కేసులు వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు, ప్రొఫెసర్లు జేఎన్‌యూలో కాగడా ర్యాలీ నిర్వహించారు. క్యాండిల్ ర్యాలీ ఉద్రిక్తం న్యూఢిల్లీ: హెచ్‌సీయూలో ఆత్మహత్య చేసుకున్న రోహిత్ వేములకు న్యాయం చేయాలంటూ ఢిల్లీలోని ఇండియాగేట్ వద్ద జరిగిన కొవ్వొత్తుల ర్యాలీ ఉద్రిక్తంగా మారింది. ఈ ర్యాలీలో రోహిత్ తల్లి రాధిక, సోదరుడు రాజా, విద్యార్థులు పాల్గొన్నారు. అయితే ర్యాలీకి అనుమతి తీసుకోకపోవటంతో పోలీసులు అడ్డుకున్నారు. ‘అమ్మతోపాటు ర్యాలీలో పాల్గొన్న విద్యార్థినులను ఈడ్చేశారు’ అని రాజా తెలిపారు. వీరిని అరెస్టు చేసి తిలక్‌నగర్ పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లిన పోలీసులు గంటసేపటి తర్వాత వదిలిపెట్టారు. ఢిల్లీకి రోహిత్ కుటుంబం మకాం ఢిల్లీలోనే నివాసముండాలని రోహిత్ తల్లి రాధిక తెలిపారు. రాజాకు ఉద్యోగం ఇచ్చేందుకు ఢిల్లీ సర్కారు అంగీకరించటంతో.. త్వరలోనే ఢిల్లీకి మారతామన్నారు. రోహిత్ ఫెల్లోషిప్ ఆగడంతో ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నామని తెలపడంతో అప్లైడ్ జియాలజీలో పీజీ పూర్తిచేసిన రాజాకు ఉద్యోగం ఇస్తామని కేజ్రీవాల్ భరోసా ఇచ్చారన్నారు. -
నౌకాదళ ప్రదర్శనకు పటిష్ట భద్రత
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: దేశంలో రెండోసారి ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న అంతర్జాతీయ నౌకాదళ ప్రదర్శన(ఐఎఫ్ఆర్) భద్రతపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారిం చింది. ఉగ్రవాద దాడులు జరిగే అవకాశం ఉందన్న నిఘా వర్గాల హెచ్చరికలతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. ఈ కార్యక్రమానికి పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు. నేవీకి చెందిన మెరైన్ కమెండో దళం ‘మార్కోవ్స్’కు సముద్ర జలాలపై భద్రత బాధ్యతను అప్పగించారు. విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం జిల్లా కళింగపట్నం వరకు మార్కోవ్స్ బృందాలు సముద్రతలంపై గస్తీ కాయనున్నాయి. ప్రత్యేక భద్రతా దళం(ఎస్పీజీ) ఉన్నతాధికారుల బృందం గురువారం విశాఖపట్నంలో పర్యటించింది. నేవీ, పోలీసు, రెవెన్యూ ఉన్నతాధికారులతో ప్రత్యేకంగా సమావేశమైంది. భద్రతా ఏర్పాట్లను సమీక్షించింది. విశాఖపట్నంలో ఫిబ్రవరి 4 నుంచి 8 వరకు నిర్వహించనున్న ఐఎఫ్ఆర్కు రాష్ట్రపతి, ప్రధానమంత్రి సహా 5 వేల మంది దేశ, విదేశీ ప్రతినిధులు హాజరుకానున్నారు. 1.50 లక్షల మంది సాధారణ ప్రజలు ఈ కార్యక్రమాన్ని తిలకించనున్నారు. -
కఠారి ప్రవీణ్‌కు పోలీసు భద్రత
సీఎంసీ నుంచి సతీష్ డిశ్చార్జ్ మేయర్ సన్నిహితులపై పోలీసు దృష్టి చిత్తూరు : చిత్తూరు మేయర్ దంపతుల హత్య నేపథ్యంలో వారి కుమారుడు కఠారి ప్రవీణ్‌కు పోలీసులు గట్టి భద్రత కల్పించారు. కార్పొరేటర్ కందాతో పాటు మోహన్‌కు నమ్మినబంటుగా ఉన్న ప్రసన్న, మేయర్ కుమారుడు ప్రవీణ్, మేయర్ తమ్ముళ్లు గోపి, కిషోర్‌ను సైతం హత్య చేయాలని వ్యూహరచన చేసినట్లు ఇప్పటికే పోలీసులకు లొంగిపోయిన దుండగులు అంగీకరించారు. దీంతో మేయర్ ఇంటి వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి ప్రవీణ్‌కు పోలీసు భద్రత కల్పించారు. ఇక హత్య జరిగిన సమయంలో దుండగుల దాడిలో గాయపడిన సతీష్ శుక్రవారం వేలూరు సీఎంసీ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. ఇతన్ని చిత్తూరు డీఎస్పీ లక్ష్మీనాయుడు విచారణ చేశారు. ఇతనికి సైతం పోలీసు భద్రతను కల్పించారు. ఆ సన్నిహితులు ఎవరో..? అనురాధ, మోహన్ల హత్యకు వారి వెంటే ఉన్న వ్యక్తుల సహకారం ఉండొచ్చని అనుమానిస్తున్నట్టు ఓ పోలీసు అధికారి పేర్కొన్నారు. వారి సహకారం లేనిదే అంత పక్కాగా మేయర్ దంపతుల పర్యటన వివరాలు తెలిసే అవకాశం లేదని, దుండగులు సైతం దర్జాగా మేయర్ చాంబర్లోకి వెళ్లడం వెనుక మేయర్ దంపతులకు సన్నిహితులైన వారే చింటూకు చేరవేసినట్లు ప్రాథమికంగా పోలీసులు భావిస్తున్నారు. ఫోన్ కాల్ జాబితా ఆధారంగా ఈ వివరాలు తేలనున్నాయి. -
వరంగల్ ఉప ఎన్నికకు గట్టి భద్రత
-
రోమ్ నగరాన్ని టార్గెట్ చేసిన ఐసిస్
-
డేగ కన్ను.. షార్ప్ షూటర్స్.. షట్ డౌన్
శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లో అన్ని రకాల భద్రతా బలగాల బూట్ల చప్పుళ్లు వినిపిస్తున్నాయి.. ప్రధాని నరేంద్రమోదీ శనివారం జమ్మూకశ్మీర్ లోయలో పర్యటించి ఓ ర్యాలీలో పాల్గొననున్న నేపథ్యంలో రాష్ట్ర పోలీసు బలగాలు కేంద్ర బలగాలు, మిలటరీ పకడ్బందీ రక్షణ చర్యల్లో మునిగిపోయింది. ప్రధాని పర్యటన ప్రశాంతంగా సాగేందుకు అనుగుణంగా భద్రతను కట్టుదిట్టం చేసింది. పలు చోట్ల ఆంక్షలు విధించింది. ముఖ్యంగా తిరుగుబాటుదారులు ఉన్న ప్రాంతాలపై డేగ కన్ను ఉంచింది. నిరసనలు ఎదురవకుండా, నల్ల జెండాలవంటి ప్రదర్శనవంటి కార్యక్రమాలకు అవకాశం లేకుండా శరవేగంగా చర్యలు పూర్తి చేసింది. దీంతోపాటు ప్రధాని షేర్ ఈ కశ్మీర్ క్రికెట్ స్టేడియంలో నిర్వహించనున్న సభలో ప్రధాని పాల్గొననున్న నేపథ్యంలో ఆ వైపు వచ్చే రహదారులన్నింటిపై గట్టి నిఘా ఏర్పాటుచేసి ఆంక్షలు విధించింది. అనుమానిత వ్యక్తుల కదలికలను ఎప్పటికప్పుడు పసిగట్టేలా సీసీటీవీల ఏర్పాటుతోపాటు మొత్తం మూడు కిలోమీటర్ల దూరంమేరకు ఉన్న ఎత్తయిన భవంతులపై షార్ప్ షూటర్స్ ను కూడా సిద్ధం చేసి ఉంచారు. ఇప్పటికే వందలమందిని ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. స్కూళ్లు, కాలేజీలు ఇతర వ్యాపార సంస్థలు మూసి వేశారు. మూడు రోజులుగా తక్కువమంది ప్రజలు మాత్రమే సభ నిర్వహించే ప్రాంతాల్లో తిరిగేందుకు అనుమతిస్తుండగా శనివారం పూర్తిగా ఆ ప్రాంతంలో నిషేధం విధించారు. -
ఖాకీల నిఘా నీడలో శంకుస్ధాపన ప్రాంతం
-
మూడో వన్డేపై 'పటేల్' మేఘాలు
- మ్యాచ్ వేదికగా నిరసనలకు హార్దిక్ అండ్ కో సన్నాహాలు - రాజ్ కోట్ లో మొబైల్ ఇంటర్నెట్ పై నిషేధం - అసాధారణ భద్రత నడుమ నేడు భారత్- దక్షిణాఫ్రికా మూడో వన్ డే రాజ్‌కోట్: పటేల్ రిజర్వేషన్ ఉద్యమకారుల బెదిరింపుల నేపథ్యంలో ఆదివారం రాజ్ కోట్ లో జరగనున్న భారత్- దక్షిణాఫ్రికా మూడో వన్ డే మ్చాచ్ కు కనీవినీ ఎరుగని రీతిలో భద్రత కల్పించారు. ఇప్పటికే 50 వేల మంది పటేల్ ఉద్యమకారులు మ్యాచ్ టికెట్లు కొనుగోలు చేసినట్లు తెలియరావడంతో అటు పోలీసులు, ఇటు సౌరాష్ట్ర క్రికెటల్ అసోసియేషన్ ను గుబులు వెంటాడుతూనే ఉంది. అయితే ఎట్టిపరిస్థితుల్లోనూ మ్యాచ్ నిరాటంకంగా సాగుతుందని వారు భరోసా ఇస్తున్నారు. పటేల్ ఉద్యమకారులు కూడా ఇంతే గట్టిగా నిరసన తెలుపుతామని ప్రకటించారు. ముందస్తు చర్యల్లో భాగంగా రాజ్ కోట్ జిల్లా వ్యాప్తంగా మొబైల్ ఇంటర్నెట్ పై పోలీసులు నిషేధం విధించారు. రాత్రి 10 గంటల వరకు ఈ నిషేధం ఉంటుందని తెలిపారు. జిల్లా కేంద్రం శివారులోని ఖందేరీలోగల సౌరాష్ట్రా క్రికెట్ అసోసియేషన్ (ఎస్ సీఏ) స్టేడియానికి ప్రేక్షకులు వచ్చే అన్ని మార్గాల్లో నిఘా పెంచారు. కనీవినీ ఎరుగని రీతిలో నిఘా డ్రోన్ కెమెరాలు, నాలుగు వేల సాయుధబలగాలతో మ్యాచ్ కు భద్రతా ఏర్పాట్లు చేశారు. నేటి మధ్యాహ్నం 1:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. తనతో సహా 50 వేల మంది పటేల్ ఉద్యమకారులు ఇప్పటికే మ్యాచ్ టికెట్లను పొందామని హార్ధిక్ పటేల్ చెప్పారు. ఒకవేళ స్టేడియం లోపలికి తమను అనుమతించకుంటే.. మరో రూపంలో సత్తా చాటేందుకు పటీదార్ అనామత్ ఆందోళన్ సమితి (పాస్) కార్యకర్తలు, పటేల్ కులస్తులంతా సిద్ధంగా ఉన్నారని తెలిపారు. పోలీసుల భద్రతా ఏర్పాట్లలో ముఖ్యాంశాలు.. - ప్రత్యేకంగా రూపొందించిన మూడు డ్రోన్ కెమెరాలతో ప్రేక్షకుల కదలికలపై నిరంతర నిఘా - స్టేడియం లోపల, వెలుపల 90కిపైగా సీసీ టీవీ కెమెరాల ఏర్పాటు - రెండు వేల మంది సాధారణ పోలీసులు - మూడు కంపెనీల స్టేట్ రిజర్వు పోలీస్ ఫోర్స్ (ఎస్ ఆర్ పీఎఫ్) బలగాల మోహరింపు - ఒక కంపెనీ ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ (ఆర్ఏఎఫ్) - మూడు బృందాల క్విక్ రెస్పాన్స్ సెల్ (క్యూఆర్ సీ) - ఐదుగురు సూపరింటెండెంట్ ల పర్యవేక్షణ స్టేడియంలో విధులు నిర్వహించే భద్రతా సిబ్బంది ఎవరైనా నిఘాను వదిలేసి మ్యాచ్ ను చూసినట్లయితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని రాజ్ కోట్ రేంజ్ ఐజీ డీఆర్ పటేల్ స్పష్టం చేశారు. ఎస్ సీఏ సెక్రటరీ నిరంజన్ షా మీడియాతో మాట్లాడుతూ రిజర్వేషన్లపై క్రికెట్ మ్యాచ్ లో నిరసన తెలపడం సరైన చర్యకాదని, క్రీడలను క్రీడలుగానే చూడాలని అన్నారు. స్టేడియంలో నిరసనలు వద్దని తాను హార్దిక్ పటేల్ కు ఫోన్ చేసి విన్నవించినట్లు తెలిపారు. -
సాయంత్రం వరకు నిమజ్జన వేడుకలు
-
గణేషుడి శోభాయాత్రకు పటిష్ట భద్రత
-
గుజరాత్లో తీవ్ర ఉద్రిక్తత
-
అంతా సిద్ధం
రేపు బీబీఎంపీ ఎన్నికల పోలింగ్ ఓటు హక్కు వినియోగించుకోనున్న 73 లక్షల మంది పోలింగ్ శాతం పెంచేందుకు చర్యలు 1900కు పైగా అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు 20 వేల మంది పోలీసులతో కట్టుదిట్టమైన భద్రత బెంగళూరు :బహత్ బెంగళూరు మహానగర పాలికె(బీబీఎంపీ) ఎన్నికల పోలింగ్‌ను శాంతి, భద్రతల నడుమ పూర్తి పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ శ్రీనివాసాచారి వెల్లడించారు. ఈ ఎన్నికల్లో ఓటర్లంతా నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. గురువారమిక్కడి ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన మీట్ ది ప్రెస్‌లో విలేకరులు అడిగిన ప్రశ్నలకు శ్రీనివాసాచారి సమాధానమిచ్చారు. కార్యక్రమంలో నగర పోలీస్ కమిషనర్ మేఘరిక్, బీబీఎంపీ కమిషనర్ కుమార్ నాయక్‌లు సైతం పాల్గొని పోలింగ్ ఏర్పాట్లను వివరించారు. ఈ సందర్భంగా ఎన్నికల కమిషనర్ మాట్లాడుతూ....బీబీఎంపీ పరిధిలోని 198 వార్డులకు ఇప్పటికే ఒక వార్డులో ఏకగ్రీవంగా ఎన్నిక కాగా, మిగిలిన 197 వార్డులకు ఈనెల 22న పోలింగ్ జరగనుందని వెల్లడించారు. రాష్ట్ర ఎన్నికల కమీషన్‌తో పాటు బీబీఎంపీ, పోలీసు శాఖలు సంయుక్తంగా ఎన్నికలఏర్పాట్లను నిర్వహిస్తున్నాయని తెలిపారు. గత బీబీఎంపీ ఎన్నికల్లో కేవలం 44శాతం పోలింగ్ మాత్రమే జరిగిందని, ఈ ఎన్నికల్లో పోలింగ్‌ను 60శాతానికి పెంచడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని చెప్పారు. ఎన్నికల్లో పూర్తి పారదర్శకత కోసం ఐఏఎస్ స్థాయిలోని ఏడుగురు అధికారులను ప్రత్యేక మానిటరింగ్ అధికారులుగా నియమించినట్లు పేర్కొన్నారు. ఇదే సందర్భంలో 53 మంది ప్రత్యేక ఎన్నికల అధికారులను సైతం నియమించినట్లు తెలిపారు. 197వార్డుల్లో పోలింగ్ కోసం మొత్తం 6,759 పోలింగ్ బూత్‌లను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఓటు హక్కును వినియోగించుకోనున్న 73లక్షల మంది ఓటర్లు.... ఇదే కార్యక్రమంలో పాల్గొన్న బీబీఎంపీ కమిషనర్ కుమార్ నాయక్ సైతం ఓటర్ల వివరాలను వెల్లడించారు. కొత్తగా ఓటు హక్కును పొందిన 3.5లక్షల మంది ఓటర్లతో కలిపి నగరంలో మొత్తం 73,88,256 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోనున్నారని చెప్పారు. వీరిలో 38,76,244 మంది పురుష ఓటర్లు కాగా, 35,10,828 మంది మహిళా ఓటర్లు. ఇటీవలే సహకార సంఘాల ఎన్నికలు జరిగిన నేపథ్యంలో ఓటర్ల ఎడమ చేతి బొటనవేలికి సిరాగుర్తు వేయనున్నట్లు తెలిపారు. నోటా ఓటును వినియోగించుకోవాలనుకునే ఓటర్లు ఫారం నంబర్ 27ను నింపి తమ నోటా ఓటును నమోదుచేయవచ్చని సూచించారు. అనంతరం నగర పోలీస్ కమిషనర్ మేఘరిక్ మాట్లాడుతూ....ఎన్నికల కోసం 20వేల మంది పోలీసులతో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. నగరంలో 2,069 పోలింగ్ బూత్‌లను సమస్యాత్మకమైనవిగా, 1,909పోలింగ్ బూత్‌లను అత్యంత సమస్యాత్మకమైనవిగా గుర్తించినట్లు తెలిపారు. ఈ పోలింగ్ బూత్‌లలో మరింత ఎక్కువగా భద్రతా ఏర్పాట్లు చేపట్టినట్లు మేఘరిక్ వెల్లడించారు. -
పాతబస్తీలో భారీ బందోబస్తు
-ఐబీ హెచ్చరికల నేపథ్యంలో తనిఖీలు ముమ్మరం -భవానీనగర్‌లో బ్యాగు కలకలం.. -రెయిన్‌బజార్‌లో పట్టుబడిన నలుగురు దుండగులు హైదరాబాద్ : ఐబీ హెచ్చరికల నేపథ్యంలో దక్షిణ మండలం పోలీసులు పాతబస్తీలో గట్టి భద్రతా చర్యలు చేపట్టారు. శుక్రవారం పాతబస్తీ రెయిన్‌బజార్ పోలీస్‌స్టేషన్ పరిధిలో నలుగురు అనుమానితులు పట్టుబడటం...వారి వద్ద ఎలాంటి గుర్తింపు పత్రాలు లేని విదేశీయులు కావడంతో దక్షిణ మండలం పోలీసులు మరింత అప్రమత్తమయ్యారు. పట్టుబడిన వారిలో ఇద్దరు బంగ్లాదేశ్‌కు, ఒకరు పాకిస్తాన్, మరొకరు మయన్మార్లకు చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. ఈ నలుగురికి హుజీ తీవ్రవాద సంస్థతో సంబంధాలున్నట్లు పోలీసులు వెల్లడిస్తున్నారు. అయితే చాంద్రాయణగుట్ట పోలీసు స్టేషన్ పరిధిలో పలు కేసులతో సంబంధం ఉన్న మరో పది మంది అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకుని.. పోలీస్ స్టేషన్‌కు తరలించి ప్రశ్నిస్తున్నారు. అలాగే భవానీనగర్ పోలీసు స్టేషన్ పరిధిలో అనుమానాస్పద బ్యాగ్ శుక్రవారం కలకలం రేపింది. ఆ బ్యాగ్‌లో బాంబు ఉండ వచ్చని స్థానికులు ఆందోళన చెందారు. దాంతో పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వెంటనే స్పందించిన అది ఖాళీ బ్యాగ్ అని తేల్చేయడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ నేపథ్యంలో దక్షిణ మండలంలోని చార్మినార్, ఫలక్‌నుమా, మీర్‌చౌక్, సంతోష్‌నగర్ పరిధిలో భద్రతను పటిష్టం చేశారు. అదనపు బలగాలతో నిఘా ముమ్మరం... అన్ని ప్రాంతాల్లోనూ అదనపు బలగాలతో నిఘా ముమ్మరం చేశారు. పంద్రాగస్టు వేడుకలలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావివ్వకుండా అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. రెండు కంపెనీల ర్యాపిడ్ యాక్షన్ ఫోర్సును బందోబస్తు కోసం వినియోగిస్తున్నారు. జనసమ్మర్ధం ఉన్న ప్రదేశాల్లో డాగ్ స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్లతో తనిఖీలు నిర్వహిస్తున్నారు. -
దేశవ్యాప్తంగా బారీ భద్రత!
-
హెలికాప్టర్లతో నిఘా
సాక్షి ప్రతినిధి, ఏలూరు : పుష్కరాలకు మునుపెన్నడూ లేనిరీతిలో అత్యాధునిక పరిజ్ఞానంతో పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నట్టు జిల్లా ఎస్పీ భాస్కర్ భూషణ్ వెల్లడించారు. బుధవారం ‘సాక్షి’ ప్రతినిధితో ఆయన మాట్లాడుతూ.. తొలిసారిగా సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ పుష్కరాలకు పోలీసు శాఖ సన్నద్ధమవుతోందన్నారు. పుష్కరాల తొలి రోజు నుంచి చివరి రోజు వరకు శాంతి భద్రతల పర్యవేక్షణకు అవసరమైతే హెలికాప్టర్లను విని యోగించాలని భావిస్తున్నామని తెలిపారు. నిరంతర పర్యవేక్షణకు రెండు డ్రోన్లు, 16 నైట్‌విజన్ బైనాక్యులర్లు, 167 సీసీ కెమెరాలను వినియోగిస్తామని చెప్పారు. బందోబస్తు కోసం జిల్లాలోని సిబ్బందితోపాటు కృష్ణా, గుంటూరు జిల్లాల నుంచి వచ్చే అదనపు సిబ్బందితో కలిపి మొత్తం 4,500 మందిని వినియోగిస్తున్నట్టు చెప్పారు. కొవ్వూరు, నరసాపురం సబ్ డివిజన్లలో పుష్కరాల బందోబస్తును అడిషనల్ ఎస్పీ స్థాయి అధికారి పర్యవేక్షిస్తారని చెప్పారు. ఏ కేటగిరీ ఘాట్లలో డీఎస్పీలు, బీ కేటగిరీ ఘాట్లలో సీఐలు, సీ కేటగిరీ ఘాట్లలో ఎస్సైలతో బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. తాను కొవ్వూరులో ఉంటూ నరసాపురం సహా అన్ని పుష్కర ప్రాంతాల్లో పరిస్థితుల్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తానని చెప్పారు. ఆలయాల వద్ద భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని అదనపు సిబ్బందిని నియమిస్తామని చెప్పారు. ఆరు జోన్లుగా విభజన జిల్లాను 6 జోన్లుగా విభజించి పుష్కరాల బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నామని ఎస్పీ తెలిపారు. ట్రాఫిక్, ఘాట్ల వద్ద బందోబస్తు, శాంతిభ్రదతల పర్యవేక్షణ, ఆలయాలు, ఇతరత్రా సౌకర్యాల కింద ఆరు విభాగాలుగా విడగొట్టి, ఒక్కో జోన్‌కు డీఎస్పీ స్థాయి అధికారిని బాధ్యులుగా పెడతామని చెప్పారు. కొవ్వూరు, నరసాపురం పట్టణాల్లో పుష్కర ఘాట్ల వరకు ఎటువంటి వాహనాలకు అనుమతి లేదని ఎస్పీ స్పష్టం చేశారు. ద్విచక్ర వాహనాలను సైతం అనుమతించేది లేదన్నారు. ఏలూరు నుంచి కొవ్వూరు వచ్చే వాహనాలను పుష్కరనగర్ వద్ద, నిడదవోలు, రాజమండ్రి నుంచి వచ్చే వాహనాలను రోడ్ కం రైల్ బ్రిడ్జి వద్ద నిలిపివేస్తామని చెప్పారు. అక్కడి నుంచి ఆర్టీసీ ఉచిత బస్సుల్లో ఘాట్లకు వెళ్లాలన్నారు. వీవీఐపీ వాహనాలను ఘాట్ల వరకు అనుమతించాలా లేదా అనే విషయమై ఉన్నతాధికారులతో సంప్రదింపులు చేస్తున్నామని చెప్పారు. చోరీల నియంత్రణపై ప్రత్యేక దృష్టి పుష్కరాలకు లక్షలాది మంది వస్తున్న నేపథ్యంలో దొంగలు తమ చేతివాటం చూపించే అవకాశం ఉందని ఎస్పీ అన్నారు. అన్ని పుష్కర ఘాట్ల వద్ద ఇప్పటివరకు చోరీల చరిత్ర ఉన్న వాళ్ల ఫొటోలు ప్రదర్శిస్తామని చెప్పారు. భక్తులు విలువైన వస్తువులు, బంగారు ఆభరణాలతో రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పిల్లలు, వృద్ధులు తప్పిపోకుండా జాగ్రత్త వహించాలని సూచించారు. శాంతిభద్రతల పరంగా ఇబ్బందులు ఎదురైతే ఏ సమయంలోనైనా 94407 96688 నంబర్‌కు ఫోన్ చేసి తనతో మాట్లాడవచ్చన్నారు. -
వైభవంగా హనుమాన్ శోభాయాత్ర
-
వన్డేకు భద్రత కట్టుదిట్టం
ఉప్పల్: రాజీవ్‌గాంధీ స్టేడియంలో ఆదివారం భారత్, శ్రీలంక మధ్య జరిగే వన్డే మ్యాచ్‌కు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు సైబరాబాద్ కమిషనర్ సీవీ ఆనంద్ అన్నారు. గురువారం స్టేడియంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మ్యాచ్‌కు సంబంధించిన భద్రతా ఏర్పాట్లను వెల్లడించారు. 1500 మంది పోలీస్ సిబ్బంది, బాంబ్ డిస్పోజబుల్ స్క్వాడ్‌తో పాటు పరిసరాల్లో 56 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి నిఘాను మరింత పటిష్టం చేసినట్లు చెప్పారు. మ్యాచ్ సమయంలో ప్రేక్షకులు మైదానంలోకి సెల్ ఫోన్లు, కెమెరాలు, బ్యాగ్‌లు, తినుబండారాలవంటి ఎలాంటి వస్తువులు తీసుకు రావద్దని కమిషనర్ సూచించారు. మ్యాచ్ సందర్భంగా వాహనాల పార్కింగ్ వివరాలను కూడా ఆయన ప్రకటించారు. మెట్రో పనులు జరుగుతున్న దృష్ట్యా హబ్సిగూడ టు ఉప్పల్ రోడ్డుకు ఇరువైపులా ఎలాంటి పార్కింగ్‌కు అనుమతి లేదని చెప్పారు. హబ్సిగూడ వైపు వచ్చే భారీ వాహనాలకు, అదే విధంగా సికింద్రాబాద్ నుంచి ఉప్పల్ వైపునకు, ఎల్బీనగర్‌నుంచి హబ్సిగూడ, ఉప్పల్ నుంచి హ బ్సిగూడ వెళ్లే మార్గంలో భారీ వాహనాలకు కూడా మ్యాచ్ రోజున అనుమతి లేదని తెలిపారు. పార్కింగ్ ప్రాంతాలు ఇవే... గేట్-2, గేట్-3 అండ్ గేట్ -11 ద్వారా వెళ్లేవారు రామంతాపూర్ రోడ్డుకు ఇరువైపులా తమ వాహనాలను పార్క్ చేసుకోవచ్చు. వికలాంగులు, గేట్-3 ద్వారా స్టేడియంలోకి వెళ్లేవారు రామంతాపూర్ రోడ్డులోనే పార్కు చేసుకోవాలి. ప్రత్యేక పార్కింగ్ కు అనుమతి ఉన్న వారు, గేట్ -4 అండ్ 9 ద్వారా వెళ్లేవారు హబ్సిగూడ నుంచి ఏక్ మినార్ మజీద్ ద్వారా ప్రవేశించాలి. కాంప్లిమెంటరీ పాస్‌లు ఉన్నవారు రామంతాపూర్ రోడ్డులో ఎల్జీ గోడౌన్ ప్రాంతంలో పార్కింగ్ చేసుకోవాలి. -
భద్రత కట్టుదిట్టం చేయండి
న్యూఢిల్లీ: దీపావళి పండగ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. దీపావళి సందర్భంగా భద్రతను కట్టుదిట్టం చేయాలని కేంద్రం అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. దేవాలయాలు, ఆధ్యాత్మిక కేంద్రాలు, సున్నితమైన ప్రాంతాల్లో భద్రతను పెంచాలని హెచ్చరించింది. -
ఎన్నికలకు భారీ బందోబస్తు ఏర్పాట్లు
-
సజావు ఎన్నికలకు పటిష్ట బందోబస్తు
-
ఈశాన్యవాసులకు గట్టి భద్రత
న్యూఢిల్లీ: నగరంలో ఈశాన్య వాసులపై జరుగుతున్న వరుస దాడులను నియంత్రించేందుకు ఢిల్లీ పోలీసులు నడుం బిగించారు. ఇటీవల కాలంలో ఈశాన్యరాష్ట్రాల వాసులపై నగరంలో దాడుల పరంపర కొనసాగుతోంది. దీనిపై సాక్షాత్తు రాష్ట్రపతి సైతం విచారం వ్యక్తం చేశారు. అంతేకాక దేశవ్యాప్తంగా విమర్శలు, నిరసనలు వెల్లువెత్తుతుండటంతో పోలీసులు చర్యలకు ఉపక్రమించారు. వారి భద్రత నిమిత్తం కొత్త యూనిట్‌ను ఏర్పాటుచేయడంతోపాటు హెల్ప్‌లైన్ నంబర్ (1093)ను ఏర్పాటుచేసినట్లు ఢిల్లీ పోలీస్ కమిషనర్ బి.ఎస్.బస్సీ శనివారం తెలిపారు. దీనికోసం కంట్రోల్ రూంలో ఐదు లైన్లను ఏర్పాటుచేసినట్లు వివరించారు. పోలీసుల సహాయం కోసం 100కు ఫోన్ చేసినట్లే, ఎవరైనా ఈశాన్య వాసులకు ఇబ్బంది ఎదురైతే వెంటనే 1093కి ఫోన్ చేస్తే పోలీసులు తగిన చర్యలు తీసుకుంటారని బస్సీ చెప్పారు. ఈశాన్య విద్యార్థి నిడో తానియా హత్య తర్వాత ఈ చర్యలు తీసుకోవడానికి తాము యోచించినట్లు కమిషనర్ తెలిపారు. అలాగే హైకోర్టు సైతం ఈశాన్యవాసుల రక్షణార్థం నగరంలో తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించినందున దీనికోసం ప్రత్యేక సెల్‌ను ఏర్పాటుచేశామన్నారు. ఈ కొత్త విభాగం ఈశాన్య రాష్ట్రాల నుంచి వచ్చిన 4వ బెటాలియన్ డీసీపీ కిమ్ కామింగ్ నేతృత్వంలో నానక్పురా నుంచి పనిచేస్తుందని చెప్పారు. అతడు జాయింట్ కమిషనర్, చీఫ్ కోఆర్డినేటర్ రాబిన్ హిబూతో కలిసి ఈ విభాగం పనితీరును పర్యవేక్షిస్తారని వివరించారు. ఈ విభాగం జాతీయ రాజధానిలో నివాసముండే ఈశాన్యవాసుల భద్రతకు బాధ్యత వహిస్తుందని చెప్పారు. ఇంతకుముందు ఢిల్లీ పోలీసులు ఈశాన్య ప్రజల సమస్యలను పట్టించుకునేందుకు ఏడుగురు నోడల్ అధికారులను నియమించిన సంగతి తెలిసిందే. కాగా, ప్రస్తుతం అన్ని జిల్లాలకు చెందిన డీసీపీలను నోడల్ అధికారులగా గుర్తించేందుకు నిర్ణయించామన్నారు. వీరందరూ స్థానికంగా ఉన్న ఈశాన్యవాసుల సంస్థలతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉంటారని, ఎవరికైనా వ్యక్తిగతంగా సమస్య ఎదురైతే వెంటనే స్పం దిస్తారని కమిషనర్ తెలిపారు. ద్వారకాలోని ముని ర్కా వంటి ఈశాన్యవాసులు ఎక్కువగా నివసించేప్రాంతాలపై ఇకనుంచి ప్రత్యేక దృష్టి పెడతామని బస్సీ వివరించారు. ఇదిలా ఉండగా, ఈశాన్యవాసుల భద్రత నేపథ్యంలో ప్రత్యేక విభాగం ఏర్పాటుచేసినట్లుగానే విదేశీయుల కోసం కూడా ఒక ప్రత్యేక విభాగాన్ని, హెల్ప్‌లైన్ నంబర్ ను ఏర్పాటుచేశామని కమిషనర్ తెలిపారు. ఈ విభాగానికి జాయింట్ కమిషనర్ ముఖేష్ మీనా సంధానకర్తగా వ్యవహరిస్తారన్నారు. సెల్ నంబర్- 08750871111, హెల్ప్‌లైన్-1098 లకు ఆపదలో ఉన్న విదేశీయులెవరైనా ఫోన్ చేస్తే తాము వెంటనే స్పందిస్తామని బస్సీ వివరించారు. నగరంలో ఇటీవల కాలంలో నేరాల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో పోలీస్ శాఖ నగరంలో ఉండే ప్రతిఒక్కరికీ రక్షణ కల్పించేందుకు కృషిచేస్తున్నట్లు కమిషనర్ బి.ఎస్.బస్సీ తెలిపారు. -
బిల్లుకు రక్షణగా వ్యూహాలు, భారీగా మార్షల్స్
-
బిల్లుకు రక్షణగా వ్యూహాలు, భారీగా మార్షల్స్
న్యూఢిల్లీ : లోక్‌సభలో తెలంగాణ బిల్లు పెట్టేందుకు స్పీకర్ కార్యాలయం సన్నద్ధం అవుతోంది. సీమాంధ్ర ప్రాంత ఎంపీలు తెలంగాణ బిల్లును వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో ఏమైనా అవాంఛనీయ సంఘటనలు జరగవచ్చేమో అనే అనుమానంతో ముందు జాగ్రత్త చర్యగా పార్లమెంట్ వెలుపల, లోపల కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ప్రతి ఎంపీని భద్రతా సిబ్బంది నిశితంగా పరిశీలిస్తోంది. లోక్‌సభలో భారీ స్థాయిలో మార్షల్స్ మోహరించారు. తెలంగాణ బిల్లు సభలో పెడితే ఆత్మాహుతి చేసుకుంటానన్న ఎంపీ సబ్బం హరి వ్యాఖ్యలతో స్పీకర్ మీరాకుమార్ అప్రమత్తం అయ్యారు. ఎలాంటి సంఘటనలు చోటుచేసుకుంటాయో ఊహించలేమని, ఏ సంఘటన ఎదురైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని లోక్ సభ సిబ్బందిని స్పీకర్ నిన్ననే అప్రమత్తం చేశారు. దాంతో భారీ సంఖ్యలో భద్రతా సిబ్బంది టీ. బిల్లు రక్షణగా నిలుస్తున్నారు. -
నేడు చెన్నైకి మోడీ రాక
-
పటిష్ట భద్రత మధ్య ఢిల్లీ చేరిన తెలంగాణ బిల్లు
-
గణతంత్రానికి సిద్ధం
సాక్షి, ముంబై: గణతంత్ర దినోత్సవాల కోసం ముంబైతోపాటు రాష్ట్రం ముస్తాబైంది. ఈ సందర్భంగా వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా ఉదయం జాతీయ పతాకావిష్కరణ అనంతరం కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి. పలుప్రాంతాల్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు కార్యక్రమాలు నిర్వహించనున్నారు. అదే విధంగా కొన్ని ప్రాంతాల్లో వైద్య శిబిరాలు, రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేశారు. తెలుగు సంఘాల ఆధ్వర్యంలో... ముంబైతోపాటు రాష్ట్రంలోని తెలుగు సంఘాలు ప్రతిసారిలాగే ఈసారి కూడా గణతంత్ర దినోత్సవాలకు సిద్ధమయ్యాయి. ఆంధ్రమహాసభ, తెలుగు కళాసమితితోపాటు పద్మశాలి, మున్నూర్‌కాపు, తెలంగాణ , దళిత సంఘాలు ఇలా అనేక సంఘాల ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం జాతీయ పతాకావిష్కరణ జరగనుంది. అనంతరం వివిధ కార్యక్రమాలు జరగనున్నాయి. ముఖ్యంగా ముంబైతోపాటు ఠాణే, నవీముంబై, భివండీ, పుణే, షోలాపూర్ తదితర ప్రాంతాల్లో తెలుగు ప్రజలు కొన్నేళ్లుగా ఈ గణతంత్ర దినోత్సవాలను నిర్వహిస్తున్నారు. ఈసారి కూడా అదే ఉత్సాహంతో జాతీయ పతాకావిష్కరణ కార్యక్రమాలతోపాటు వివిధ సాంసృ్కతిక కార్యక్రమాలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. భారీ భద్రత... గణతంత్ర దినోత్సవాలను పురస్కరించుకుని ముంబైతోపాటు రాష్ట్రవ్యాప్తంగా గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు ముందు జాగ్రత్తగా అన్ని ప్రాంతాలపై నిఘా వేయడంతోపాటు నాకాబందీ నిర్వహించి వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్నారు. -
నిఘా నీడలో నగరం
సాక్షి, న్యూఢిల్లీ: గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశరాజధానివ్యాప్తంగా ముమ్మర ఏర్పాట్లు చేశారు. ఉగ్రమూకల దాడులకు ఏమాత్రం అవకాశం లేకుండా సాయుధ బలగాలు డేగకళ్లతో పహారా కాస్తున్నారు ఢిల్లీ లోని అన్ని ప్రాంతాల్లో మొత్తం పదిహేను వేల మంది సిబ్బంది బందోబస్తులో పాల్గొంటున్నారు. పోలీసు ఉన్నతాధికారులు చెబుతున్న ప్రకారం.. రాజధానిలోకి ప్రవేశించే వారిపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. రైలేృ స్టేషన్లు, మెట్రోస్టేషన్లు, బస్ అడ్డాలు, ప్రముఖ మార్కెట్లలో ఢిల్లీ పోలీసులతోపాటు సీఐఎస్ఎఫ్, సీఆర్పీఎఫ్తోపాటు ఇతర పారామిలిటరీ దళాల బలగాలను మోహరించారు. చెక్‌పోస్టుల వద్ద తనిఖీలతోపాటు ఢిల్లీలోనికి ప్రవేశించే, బయటికి వెళ్లే వాహనాల వివరాలు ఇతర రాష్ట్రాల పోలీసులకు ఎప్పటికప్పుడు తెలియజేస్తున్నారు. న్యూఢిల్లీ ఏసీపీ ముకేశ్‌మీనా తెలిపిన ప్రకారం పరేడ్ కోసం ఇప్పటికే అన్ని ఏర్పాట్లూ పూర్తి చే శారు. అన్ని మార్గాలను అదుపులోకి తీసుకోవడంతోపాటు బారికేడ్లు ఏర్పాటు చేసి రెండు రోజులుగా తనిఖీలు చేస్తున్నారు. శనివారం రాత్రి నుంచి నిషేధాజ్ఞలు అమలులోకి వస్తాయన్నారు. పరేడ్కి వెళ్లేందుకు పాస్‌లు ఉన్నవారిని మాత్రమే ఆయా మార్గాల్లో అనుమతిస్తామని మీనా అన్నారు. పరేడ్‌కు చేరుకునేందుకు ఆయా ఎన్ క్లోజర్స్ వారీగా ఇప్పటికే రూట్‌బోర్డులను ఢిల్లీ పోలీసులు ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ మళ్లింపులకు సంబంధించి ఇప్పటికే వార్తాపత్రికలు, ఎఫ్ఎం రే డియోల్లో సమాచారం అందించామన్నారు. శనివారం అర్థరాత్రి నుంచే ముందస్తుగా తెలిపిన అన్ని ప్రాంతాల్లో వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిపివేశారని మీనా వివరించారు. -
మీ సేవ కేంద్రాల వద్ద గందరగోళం
వేంపల్లె, న్యూస్‌లైన్ : పంటల బీమా ప్రీమియంను రైతులు చెల్లించేందుకు మీసేవ కేంద్రాల వద్దకు భారీగా రావడంతో తీవ్ర గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. వేంపల్లెలో ఉన్న నాలుగు మీసేవ కేంద్రాల వద్దకు రైతులు భారీగా వచ్చారు. మంగళవారం పంటల బీమా ప్రీమియం గడువు చివరి రోజు కావడంతో రైతుల తొందరపాటుకు అంతులేకుండా పోవడంతో తోపులాట జరిగింది. దీంతో ఉదయం నుంచి ఆయా కేంద్రాల వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. జిల్లా వ్యాప్తంగా జమ్మలమడుగు మినహా దాదాపు 40వేల మంది రైతులు ప్రీమియం చెల్లించాల్సి ఉండగా.. ఇందులో 10వేల మంది రైతులు ప్రీమియం చెల్లించినట్లు లెక్కలు చెబుతున్నాయి.. దాదాపు 30వేల మంది రైతులు ప్రీమియం చెల్లించాల్సి ఉండగానే గడువు ముగియడంతో తీవ్ర నిరాశకు లోనయ్యారు. బుధవారం నూతన సంవత్సర వేడుకలు కావడంతో ఒకవైపు ప్రీమియం చెల్లించకపోవడంతో నిరాశగానే ఉన్నారు. మంగళవారం 11గంటల దాకా సమయం ఉండటంతో మీసేవ కేంద్రాల వద్ద అలాగే వేచి ఉన్నారు. అధికారులకు సమయం వెచ్చించాలని డిమాండు చేసినా ఫలితంలేదు. తహశీల్దార్ ఏమంటున్నారంటే.. : ఈ విషయమై తహశీల్దార్ మధుసూదన్‌రెడ్డి, ఏడీఏ జమ్మన్నలను వివరణ కోరగా.. గడువు పెంచేందుకు వీలు లేదన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒకే పద్ధతి కాబట్టి తమ చేతుల్లో ఏమీ లేదని చెప్పారు. ఇప్పటికే కలెక్టర్, కమిషనర్ల దృష్టికి తీసుకెళ్లామని.. గడువు పెంచే పరిస్థితి లేదన్నారు. తహశీల్దార్ మధుసూదన్‌రెడ్డి మాత్రం ప్రీమియం చెల్లించని రైతులు ఒక జాబితా తయారు చేసి తమకు అందించాలని.. కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి తెలియజేస్తామన్నారు. -
లేక్‌వ్యూ గెస్ట్‌హౌస్ వద్ద భారీ బందోబస్తు
హైదరాబాద్ : లేక్ వ్యూ అతిధి గృహం వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు. రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దిగ్విజయ్ సింగ్ రెండురోజుల పాటు లేక్వ్యూలో బస చేయటంతో సమైక్యవాదుల నిరసనల నేపథ్యంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. హైదరాబాద్ చేరుకున్న దిగ్విజయ్‌కు సమైక్యవాదుల నుంచి నిరసనలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. సీఐఎస్ఎఫ్ ఆర్ఏఎఫ్, టాస్క్‌ఫోర్స్ బలగాలు మోహరించాయి. అనుమతి ఉన్నవారినే పోలీసులు లోనికి అనుమతిస్తున్నారు. కాగా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కొద్దిసేపటి క్రితం దిగ్విజయ్ సింగ్‌తో భేటీ అయ్యారు. ఈరోజు సాయంత్రం నాలుగు గంటల నుంచి ఆరు గంటల వరకూ మంత్రులు, ఎమ్మెల్యేలతో దిగ్విజయ్ భేటీ అవుతారు. సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల వరకూ పీసీసీ కార్యవర్గంతో సమావేశం కానున్నారు. సీమాంద్ర, తెలంగాణ ప్రాంత నేతలు ఇరువురితో ఆయన భేటీ అవుతారు. -
చంచల్‌గూడ ప్రధాన ద్వారం వద్ద భారీ బందోబస్తు
-
చంచల్‌గూడ ప్రధాన ద్వారం వద్ద భారీ బందోబస్తు
ఆంధ్రప్రదేశ్ విభజనపై కాంగ్రెస్ పార్టీ వైఖరికి నిరసనగా వైఎస్ జగన్ చంచల్‌గూడ జైలులో ఆమరణ నిరాహర దీక్ష చేపట్టారు. ఈ నేపథ్యంలో జైలు ప్రధాన ద్వారం వద్ద భారీ బందోబస్తును పోలీసులు ఏర్పాటు చేశారు. అందులోభాగంగా ఎక్కడికక్కడ ముళ్ల కంచెలను ఏర్పాటు చేశారు. వైఎస్ జగన్ దీక్ష బుధవారం నాటికి నాలుగోరోజుకు చేరుకుంది. ఆయన ఆరోగ్య పరిస్థితిపై జైలు అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. నిత్యం అందుబాటులో ఉండేలా వైద్యులను జైలు అధికారులు ఏర్పాటు చేశారు. అయితే నిర్బంధంలో ఉన్న జనం కోసం దీక్ష చేపట్టిన జగన్‌కు అన్ని వర్గాల నుంచి అనూహ్య మద్దతు లభిస్తోంది. వైఎస్ జగన్‌కు మద్దతు తెలిపేందుకు ఆయన అభిమానులు నిత్యం వేలాది మంది చంచల్‌గూడ జైలుకు తరలివస్తున్నారు. అయితే వారిని పోలీసులు జైలు సమీపంలోకి రానివ్వకపోవడంతో వారు నిరాశతో వెనతిరుగుతున్నారు. -
చంచల్‌గూడ పరిసరాల్లో భద్రత కట్టుదిట్టం
హైదరాబాద్ : రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ పార్టీ తీసుకున్న ఏకపక్ష నిర్ణయాన్ని నిరసిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న నిరవధిక నిరాహార దీక్షకు పెద్ద ఎత్తున మద్దతు లభిస్తోంది. మరోవైపు జగన్‌కు మద్దతుగా..అభిమానులు, పార్టీ కార్యకర్తలు పెద్దసంఖ్యలో తరలివస్తారని అంచనా వేస్తున్న జైలు అధికారులు.. చంచల్‌గూడ పరిసర ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. భారీగా పోలీసు బలగాలను మోహరించారు. ముళ్లకంచెలు ఏర్పాటు చేశారు. ఇటు జగన్ నిరవధిక నిరాహార దీక్షకు సీమాంధ్రజిల్లాలో పెద్దఎత్తున ప్రజల నుంచి మద్దతు లభిస్తోంది. పార్టీ కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు ఎక్కడిక్కడ రోడ్లెక్కుతున్నారు. రాష్ట్రాన్ని ముక్కలుచేసిన కాంగ్రెస్ తీరును ఎండగడుతున్నారు. -
చంచల్‌గూడ జైలు వద్ద భారీ బందోబస్తు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన అంశంపై కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ చేపట్టనున్న ఆమరణ నిరాహార దీక్ష మరికొద్ది సేపట్లో చంచల్‌గూడ జైల్లో ప్రారంభంకానుంది. ఈ నేపథ్యంలో జైలు వద్ద పోలీసులు ఆదివారం చంచల్‌గూడ జైలు వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రత్యేక బలగాలను మోహరించారు. ఉన్నతస్థాయి అధికారులు జైలులో పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించనున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనపై చేస్తే ఇరు ప్రాంతాలకు సమన్యాయం చేయాలి, అలా కుదరకుంటే రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలనే లక్ష్యంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ గుంటూరు నగరంలో సమరభేరీ దీక్షను చేపట్టారు. ఆరోగ్య పరిస్థితల దృష్ట్యా దీక్ష విరమించాలని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు వైఎస్ విజయమ్మకు సూచించారు. అందుకు ఆమె ఒప్పుకో లేదు. దాంతో శుక్రవారం ఆర్థరాత్రి వైఎస్ విజయమ్మ దీక్షను పోలీసులు భగ్నం చేశారు. ఆమె ఆరోగ్యంపై ఆందోళన చెందిన ఆమె కుమారుడు వైఎస్ జగన్ చంచల్‌గూడ జైలు అధికారులు కల్పించిన ఫోన్ సహాయంతో నేరుగా వైఎస్ విజయమ్మతో మాట్లాడారు. అనారోగ్యం దృష్ట్యా దీక్ష విరమించాలని తన తల్లిని జగన్ కోరారు. ఆదివారం నుంచి తాను చంచల్‌గూడ జైల్లో ఆమరణ నిరాహారదీక్ష చేసేందుకు సుముఖంగా ఉన్నట్లు వైఎస్ విజయమ్మకు జగన్ తెలిపారు. దాంతో వైఎస్ విజయమ్మ దీక్ష విరమించిన సంగతి తెలిసిందే. -
చంచల్‌గూడ జైలు వద్ద భారీ బందోబస్తు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన అంశంపై కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ చేపట్టనున్న ఆమరణ నిరాహార దీక్ష మరికొద్ది సేపట్లో చంచల్‌గూడ జైల్లో ప్రారంభంకానుంది. ఈ నేపథ్యంలో జైలు వద్ద పోలీసులు ఆదివారం చంచల్‌గూడ జైలు వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రత్యేక బలగాలను మోహరించారు. ఉన్నతస్థాయి అధికారులు జైలులో పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించనున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనపై చేస్తే ఇరు ప్రాంతాలకు సమన్యాయం చేయాలి, అలా కుదరకుంటే రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలనే లక్ష్యంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ గుంటూరు నగరంలో సమరభేరీ దీక్షను చేపట్టారు. ఆరోగ్య పరిస్థితల దృష్ట్యా దీక్ష విరమించాలని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు వైఎస్ విజయమ్మకు సూచించారు. అందుకు ఆమె ఒప్పుకో లేదు. దాంతో శుక్రవారం ఆర్థరాత్రి వైఎస్ విజయమ్మ దీక్షను పోలీసులు భగ్నం చేశారు. ఆమె ఆరోగ్యంపై ఆందోళన చెందిన ఆమె కుమారుడు వైఎస్ జగన్ చంచల్‌గూడ జైలు అధికారులు కల్పించిన ఫోన్ సహాయంతో నేరుగా వైఎస్ విజయమ్మతో మాట్లాడారు. అనారోగ్యం దృష్ట్యా దీక్ష విరమించాలని తన తల్లిని జగన్ కోరారు. ఆదివారం నుంచి తాను చంచల్‌గూడ జైల్లో ఆమరణ నిరాహారదీక్ష చేసేందుకు సుముఖంగా ఉన్నట్లు వైఎస్ విజయమ్మకు జగన్ తెలిపారు. దాంతో వైఎస్ విజయమ్మ దీక్ష విరమించిన సంగతి తెలిసిందే. -
సచివాలయానికి భద్రత పెంచిన పోలీసులు
హైదరాబాద్ : సచివాలయానికి పోలీసులు భద్రత పెంచారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో సచివాలయలో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా భద్రతను కట్టుదిట్టం చేశారు. సచివాలయంలో ర్యాలీలు, నిరసన ప్రదర్శనలపై పోలీసులు దృష్టి సారించారు. విధులకు ఆటంకం కలిగించేలా ఉన్న నిరసన కార్యక్రమాలను అడ్డుకోవాలని పోలీసులు నిర్ణయించారు. ఈ మేరకే పోలీసులు సీమాంధ్ర, తెలంగాణ ప్రాంత ఉద్యోగులకు సూచనలు చేశారు. రాష్ట్ర విభజన ప్రకటన అనంతరం సచివాలయంలో ఇరుప్రాంతల ఉద్యోగులు నిరసనలు, ర్యాలీలు, ఆందోళనలు చేపడుతున్న విషయం తెలిసిందే. మరోవైపు సచివాలయంలోకి ప్రభుత్వ వాహనాలు తప్ప ప్రయివేటు వాహనాలను అనుమతించలేదు. సచివాలయ ఉద్యోగులను సైతం క్షుణ్ణంగా తనిఖీ చేసిన తరువాతనే అనుమతిస్తున్నారు. ఉద్యోగులను తప్పా ఇతరులను అనుమతించటం లేదు.