
రంజాన్ మాసం చివరి శుక్రవారం సందర్భంగా పాతబస్తీలో ముస్లిం సోదరుల ప్రార్థనలు ప్రశాంతంగా ముగిశాయి.
సాక్షి, హైదరాబాద్: రంజాన్ మాసం చివరి శుక్రవారం సందర్భంగా పాతబస్తీలో ముస్లిం సోదరుల ప్రార్థనలు ప్రశాంతంగా ముగిశాయి. పాతబస్తీలో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. భద్రతా ఏర్పాట్లను సీపీ అంజనీకుమార్ పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నగరంలో శనివారం రంజాన్ ప్రార్థనలకు 5 వేల మందితో పటిష్ట భద్రత ఏర్పాటు చేశామన్నారు.
సిటీలోని 600 మసీదుల వద్ద సెక్యూరిటీ పెంచినట్టు తెలిపారు. 50 సమస్యాత్మక మందిరాల వద్ద సీసీ కెమెరాలు, మఫ్టీ పోలీసులతో నిఘా పెట్టామన్నారు. అదేవిధంగా సిటీలో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని వెల్లడించారు.