ఈద్ ముబారక్
భక్తిభావం వెల్లివిరిసింది. రంజాన్ (ఈద్-ఉల్-ఫితర్) పండుగను ముస్లింలు ఘనంగా జరుపుకొన్నారు. గురువారం ఉదయాన్నే పిల్లలు, పెద్దలు స్నానాలు ఆచరించి.. కొత్త బట్టలు ధరించారు. స్నేహితులు, బంధువుల ఇళ్లకు వెళ్లి పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈద్గాలు, మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అల్లాహ్ నామస్మరణతో తరించారు. అనంతరం కులమతాలకతీతంగా ఆలింగనం చేసుకుంటూ ‘ఈద్ ముబారక్’ చెప్పుకున్నారు. ఇళ్లకు చేరుకుని షీర్ కుర్మా రుచులను ఆస్వాదించారు. ఇతర మతాలకు చెందిన స్నేహితులకు పంచిపెట్టి ఆనందంగా గడిపారు.