అయోధ్య: బాబ్రీ మసీదు కూల్చివేత దినం (డిసెంబర్ 6) సమీపిస్తుండటంతో అయోధ్యలో భద్రత పెంచారు. శాంతి, సహనం, సౌభ్రాతృత్వాన్ని ప్రజలు ప్రదర్శిస్తారని భావిస్తున్నట్లు అయోధ్య డిప్యూటీ కలెక్టర్ అనూజ్ ఝా చెప్పారు. బాబ్రీ మసీదు కూల్చివేత దినం రోజున కొందరు ఉత్సవాలు జరుపుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే అయోధ్యను నాలుగు విభాగాలుగా విభజించి భద్రతా బలగాలను మోహరించారు. పలుచోట్ల సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. అయోధ్య జిల్లాలో డిసెంబర్ 28 వరకూ 144 సెక్షన్ అమల్లో ఉండనుంది.
Comments
Please login to add a commentAdd a comment