శిల్పకళావేదికలో మునావర్ షోకు వచ్చిన అభిమానులు..
సాక్షి, మైదరాబాద్: ఆద్యంతం ఉత్కంఠ, ఉద్రి క్తత, అరెస్టుల నడుమ ప్రముఖ స్టాండప్ కమెడియ న్ మునావర్ ఫారూఖీ శనివారం హైదరాబాద్‌లో నిర్వహించిన కామెడీ లైవ్ షో ‘డోంగ్రీ టు నోవేర్’ ప్రశాంతంగా ముగిసింది. మునావర్ గతంలో హిందూ దేవతలను కించపరిచారని... అందుకే నగరంలో ఆయన షోను జరగనివ్వబోమంటూ బీజేపీ, వీ హెచ్‌పీ హెచ్చరించిన నేపథ్యంలో మాదాపూర్‌లోని శిల్పకళావేదిక, పరిసర ప్రాంతాల్లో 1,500 మంది పోలీసులు బందోబస్తు చేపట్టారు.
సైబరాబాద్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర శిల్పకళా వేదికను సందర్శించి బందోబస్తును పర్యవేక్షించారు. సాయంత్రం 4 గంటల సమయంలో బీజేవైఎం, బీజేపీకి చెందిన 80 మంది శిల్పకళా వేదిక వద్దకు వచ్చే ప్రయత్నం చేయగా పోలీసులు అరెస్ట్ చేశారు. ఐటీ కారిడా ర్‌లోని ఆయా పోలీస్‌స్టేషన్ల పరిధిలో మరో 20 మందిని అదుపులోకి తీసుకున్నారు. దాదాపు మూడు గంటల పాటు ఉద్రిక్తత నెలకొంది.
చదవండి: మునావర్ కామెడీ షో: శిల్పకళా వేదిక వద్ద టెన్షన్.. టెన్షన్
షోను అడ్డుకునేందుకు ఎస్‌ఓటీ పోలీస్ డ్రెస్‌లో వచ్చిన బీజేపీ కార్యకర్తను కొడుతున్న పోలీసులు
అరగంట ముందే ప్రారంభం...
షో తిలకించేందుకు వచ్చిన వారిని సాయంత్రం 4:30 నుంచి లోపలకు అనుమతించారు. సెల్‌ఫోన్ల లో టికెట్ క్యూఆర్ కోడ్‌ను చూపడంతోపాటు వ్యక్తి గత ధ్రువీకరణ పత్రాలు తనిఖీ చేశాకే లోపలికి అనుమతించారు. మంచినీళ్ల సీసాలనూ తీసుకెళ్లనీ యలేదు. శిల్పకళా వేదిక లోపల సైతం పోలీసులు కాపలా ఉన్నారు. ఆందోళనకారులను అడ్డుకొనేందుకు స్టేజీ వద్ద బారికేడ్లను ఏర్పాటు చేశారు.
ఆన్‌లైన్‌లో టికెట్లు విక్రయించిన సంస్థలు సాయంత్రం 6:30కి షో ప్రారంభమవుతుందని ప్రకటించినప్పటికీ 35 నిమిషాల ముందే మొదలైంది. 2,080 టికెట్లు అమ్ముడయ్యాయి. మునావర్ శిల్పకళా వేదికను ఆనుకొని ఉన్న ట్రైడెంట్ హోటల్ లో బస చేసి అక్కడి నుంచి మధ్యాహ్నం 3కే బుల్లెట్ ప్రూఫ్ కారులో శిల్పకళా వేదికకు చేరుకున్నారు.
నవ్వులు పండించిన మునావర్: ‘డోంగ్రీ టు నోవేర్’ ఆద్యంతం నవ్వులు పండించింది. శిల్పకళా వేదిక హాస్యప్రియుల హర్షధ్వానాలతో దద్దరిల్లింది. ఇద్దరు స్నేహితులు ముంబై నుంచి ఢిల్లీకి వెళ్లడం, అక్కడ వారికి ఎదురైన అనుభవాలను హాస్య రూ పంలో మునావర్ వివరించడం సభికులను ఆకట్టు కుంది. ఢిల్లీ నుంచి ముంబై తిరిగి రావడం, వచ్చాక చోటుచేసుకున్న ఘటనలను వ్యంగ్యాస్త్రాలతో వర్ణించడం రెండు, మూడు ఘటనలను గంటన్నర పాటు వివరిస్తూ కడుపుబ్బ నవ్వించారు. ఎక్కడా ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేయలేదు. షో ను ఆస్వాదించినట్లు అభిమానులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment