![MLA Raja Singh Arrest After Warning To Munavar Farooqui Show In HYD - Sakshi](/styles/webp/s3/article_images/2022/08/19/Raja-singh.jpg.webp?itok=s_4weZT5)
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మునావర్ ఫారూఖీ స్టాండప్ కామెడీ షో హైటెన్షన్ రాజేస్తోంది. ఇప్పటికే మునావర్ షోను అడ్డుకుంటామని బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ హెచ్చరించిన విషయం తెలిసిందే. రాజాసింగ్ హెచ్చరికతో పోలీసులు అప్రమత్తమయ్యారు. హైదరాబాద్‌లో ఎమ్మెల్యే నివాసం వద్ద భారీగా మోహరించిన పోలీసులు.. ముందస్తుగా ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. ఎమ్మెల్యేను బయటకు రావొద్దని చెప్పినా వినలేదని దీంతో ఆయన్ను హౌజ్ అరెస్ట్ చేసినట్లు గోషామహల్ పోలీసులు వెల్లడించారు.
కాగా మునావర్ కామెడీ షోకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. రేపు(శనివారం) హైటెక్ సిటీలోని శిల్పకళా వేదిక మునావర్ షోకు నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. కానీ పోలీసులు ఇంత వరకు మునావర్ షోకు అనుమతినివ్వలేదు. అనుమతిపై పోలీసులు నేడు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
అయితే ఒక వర్గంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్న మునావర్ ఫారూఖీ షోను అడ్డుకుంటామని గోషామహాల్ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ ప్రకటించారు. రేపు శిల్పకలా వేదికలో ఏమైనా జరగవచ్చని ఎమ్మెల్యే హెచ్చరించారు. మునావర్‌ను వెంటపడి కొడతామమని బెదిరించారు. ఏం జరిగినా ప్రభుత్వానిదే బాధ్యతని తెలిపారు. ఈ క్రమంలో మాదాపూర్ డీసీపీ కార్యాలయం వద్ద పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు.
చదవండి: మునావర్ ఫరూకీ కామెడీ షోకి గ్రీన్‌సిగ్నల్.. రాజాసింగ్ వార్నింగ్ ఇదే..
Comments
Please login to add a commentAdd a comment