సాక్షి, సిటీబ్యూరో: నగర ప్రజలకు సరికొత్త అనుభూతులు అందించడానికి నెక్సస్ మాల్లో ‘డైనోసర్ ఎక్స్‌పీరియన్స్’ ఏర్పాటు చేశారు. ఈ నెల 17 నుంచి సెప్టెంబర్ 15 వరకు కొనసాగుతుంది. డైనోసార్ ప్రదర్శనలో డినో ఫాసిల్ మ్యూజియం, ఎత్తయిన డినో లింబ్, డైనోసార్ ఫుట్‌స్టెప్స్ ట్రయల్, ఆకట్టుకునే స్కెలిటన్ డిస్‌ప్లే ఉన్నాయి. మధ్యాహ్నం 12 నుంచి రాత్రి 9 గంటల వరకు సందర్శకులకు అనుమతిస్తారు.
బాలీవుడ్ నైట్.. 23న..
సాక్షి సిటీబ్యూరో: ముంబైకి చెందిన ప్రముఖ లేడీ డీజే కర్మ.. లైవ్ దర్బూక పేరిట ప్రదర్శన ఇస్తున్నారు.
నగరంలోని శ్రీనగర్‌కాలనీ రోడ్‌లో ఉన్న కమలాపురి కాలనీలోని విన్‌ఫ్లోరా రెసిడెన్సీ హోటల్‌లో శుక్రవారం రాత్రి 8.30 గంటల నుంచీ ఈ బాలీవుడ్ నైట్ ఈవెంట్ జరగనుంది. ఈ షోలో తనదైన శైలిలో విభిన్న రకాల ట్రాక్స్‌ను ఆమె కదం తొక్కించనున్నారు.
డార్క్ కామెడీ షో.. 25న..
సాక్షి, సిటీబ్యూరో: నగరవాసుల్ని ఇటీవల అమితంగా ఆకట్టుకుంటున్న వాటిలో కామెడీ షోలదే అగ్రస్థానం. ఈ నేపథ్యంలో మరో హాస్యభరిత కార్యక్రమం ఓన్లీ కామిక్స్ లెఫ్ట్ ఎలైవ్ పేరిట ఏ డేంజరస్ స్టాండప్ కామెడీ షో అనే ట్యాగ్ లైన్‌తో సిటీలో ఓ ఈవెంట్ నిర్వహిస్తున్నారు.
జూబ్లీహిల్స్, ఫిల్మ్‌నగర్‌లోని ఎన్‌హ్యాన్స్ కేఫ్ అండ్ కన్ఫెక్షనరీలో ఈ నెల 25వ తేదీన రాత్రి 7గంటలకు ఈ కార్యక్రమం ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment