dinosaurs
-
డైనోసర్ ఎక్స్పీరియన్స్ అవ్వాలంటే.. ఇక్కడికి వెళ్లండి చాలు!
సాక్షి, సిటీబ్యూరో: నగర ప్రజలకు సరికొత్త అనుభూతులు అందించడానికి నెక్సస్ మాల్లో ‘డైనోసర్ ఎక్స్పీరియన్స్’ ఏర్పాటు చేశారు. ఈ నెల 17 నుంచి సెప్టెంబర్ 15 వరకు కొనసాగుతుంది. డైనోసార్ ప్రదర్శనలో డినో ఫాసిల్ మ్యూజియం, ఎత్తయిన డినో లింబ్, డైనోసార్ ఫుట్‌స్టెప్స్ ట్రయల్, ఆకట్టుకునే స్కెలిటన్ డిస్ప్లే ఉన్నాయి. మధ్యాహ్నం 12 నుంచి రాత్రి 9 గంటల వరకు సందర్శకులకు అనుమతిస్తారు.బాలీవుడ్ నైట్.. 23న..సాక్షి సిటీబ్యూరో: ముంబైకి చెందిన ప్రముఖ లేడీ డీజే కర్మ.. లైవ్ దర్బూక పేరిట ప్రదర్శన ఇస్తున్నారు.నగరంలోని శ్రీనగర్‌కాలనీ రోడ్లో ఉన్న కమలాపురి కాలనీలోని విన్‌ఫ్లోరా రెసిడెన్సీ హోటల్లో శుక్రవారం రాత్రి 8.30 గంటల నుంచీ ఈ బాలీవుడ్ నైట్ ఈవెంట్ జరగనుంది. ఈ షోలో తనదైన శైలిలో విభిన్న రకాల ట్రాక్స్‌ను ఆమె కదం తొక్కించనున్నారు.డార్క్ కామెడీ షో.. 25న..సాక్షి, సిటీబ్యూరో: నగరవాసుల్ని ఇటీవల అమితంగా ఆకట్టుకుంటున్న వాటిలో కామెడీ షోలదే అగ్రస్థానం. ఈ నేపథ్యంలో మరో హాస్యభరిత కార్యక్రమం ఓన్లీ కామిక్స్ లెఫ్ట్ ఎలైవ్ పేరిట ఏ డేంజరస్ స్టాండప్ కామెడీ షో అనే ట్యాగ్ లైన్‌తో సిటీలో ఓ ఈవెంట్ నిర్వహిస్తున్నారు.జూబ్లీహిల్స్, ఫిల్మ్‌నగర్‌లోని ఎన్‌హ్యాన్స్ కేఫ్ అండ్ కన్ఫెక్షనరీలో ఈ నెల 25వ తేదీన రాత్రి 7గంటలకు ఈ కార్యక్రమం ఉంటుంది. -
'డైనోసార్ ప్రిన్సెస్': ఎవరీ ఆలియా సుల్తాన్ బాబీ?
డైనోసార్ల వంటి రాక్షస జాతి బల్లుల గురించి జురాసిక్ పార్క్ వంటి హాలీవుడ్ సినిమాల ద్వారే విన్నాం. పురావస్తు శాస్త్రవేత్తల కారణంగా కథకథలుగా తెలుసుకున్నాం. కానీ మన దేశంలోనే జురాసిక్ పార్క్‌ని తలపించేలా డైనోసార్ల శిలాజ స్థలం ఉందన్న విషయం గురించి విన్నారా?. దాని కోసం రాజవంశానికి చెందని యువరాణి కృషి చేసి ప్రపంచ పటంపై ఆ గ్రామాన్ని నిలపడమే గాక అందరికీ తెలిసేలా చేసింది. ఎవరామె? ఎక్కడ ఉంది ఆ ప్రాంతం అంటే..? గుజరాత్‌లోని బాలాసినోర్కు చెందిన ఆలియా సుల్తానా బాబీ అనే మహిళ భారత గడ్డపై ఉన్న జురాసిక్ పార్క్ గురించి ప్రపంచానికి తెలిసేలా చేసింది. దాన్ని ఒక ఉద్యానవన పార్క్‌గా చేసి టూరిస్టులకు ఆమెనే గైడ్‌గా ఉండి వాటన్నింటి గురించి వివరిస్తుంది. అయితే ఈ ప్రాంతాన్ని ఆమె ఎలా గుర్తించందంటే..1980లో బాలోసోర్కి సమీపంలో ఉన్న రహియోలీ అనే గ్రామంలో భూగర్భ శాస్త్రవేత్తలు, పురావస్తు శాస్త్రవేత్తలు గుడ్లు, కుళ్లిన డైనోసార్ ఎముకలను గుర్తించారు. అక్కడ తవ్విన కొద్ది పెద్ద సైజులో ఉండే ఫిరంగి బంతుల్లా రాయి మాదిరిగా ఉన్న డైనోసార్ గుడ్లను చూశారు. ప్రఖ్యాత జియాలజిస్ట్ అశోక్ సాహ్ని వాటిని గుర్తించి అహ్మదాబాద్‌కు తరలించారు. ఆ తర్వాత ఆ ప్రదేశాన్ని డైనోసార్ శిలాజ ప్రదేశంగా ప్రకటించడం జరిగింది. అయితే ఆ గ్రామానికి సరైన రోడ్డుమార్గం లేకపోవడంతో శాస్త్రవేత్తలు, పరిశోధకులు ఇక్కడకు వచ్చి వీటిని సంరక్షించడం అనేది కష్టమైపోయింది. అలాగే దీన్ని అభివృద్ధిపరచడం కూడా సమస్యాత్మకంగా ఉండేది. సరిగ్గా అప్పుడే ఆలియా కాలేజీ చదువు పూర్తై బయటకు వచ్చింది. ఈ ప్రాంతంలో పరిశోధన చేసే శాస్త్రవేత్తలకు, జియాలజిస్ట్ శాస్త్రవేత్తలకు ఆమె తండ్రి, నవాబ్ మొహమ్మద్ సలాబత్ఖాన్ బాబీకి చెందిన పెద్ద ప్యాలెస్ బస చేసే హెరిటేజ్ హోటల్‌గా మారింది. శాస్త్రవేత్తలంతా ఆ గ్రామం వద్ద, సమీపంలో నర్మదా నది ప్రాంతంలో వందల కొద్ది ఎముకలను సేకరించడం వంటివి చేశారు. అలా ఆమెకు డైనోసార్ల శిలాజాలపై ఆసక్తి ఏర్పడింది. ఆ తర్వాత క్రమంగా రాళ్లలో నిక్షిప్తమై ఉన్న శిలాజ భాగాలను గుర్తించడం నేర్చుకుంది. అలా ఈ అరుదైన చారిత్రక ప్రదేశం పట్ల ఆసక్తి ఏర్పడి ఆ ప్రాంతాన్ని డైనోసార్ల పార్క్‌గా తీర్చిదిద్దేందుకు దారితీసింది. ఇలా చేసే సమయంలో గ్రామస్తుల నుంచి పలు సవాళ్లు ఎదురయ్యాయి సుల్తానా బాబీకి. ఆమె చేసిన ప్రయత్నాల కారణంగానే గుజరాత్ ప్రభుత్వం ఈ స్థలాన్ని కాపాడేందుకు ముందుకు వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం ఆ స్థలం చుట్టూ కొత్త డబుల్ ఫెన్సింగ్‌ను ఏర్పాటు చేసింది. అలాగే ఆ ప్రదేశంలో పశువులు మేయకుండా ఉండేలా గార్డులను ఏర్పాటు చేసింది. ఈ ప్రాంతాన్ని రక్షించేందుకు పురావస్తు శాస్త్రవేత్తలు, భూవిజ్ఞాన శాస్త్రవేత్తలతో మాట్లాడి వాటి గురించి సమగ్ర సమాచారాన్ని తెలుసుకుని దాన్నో టూరిస్ట్ ప్రదేశంగా మార్చేలా కృషి చేసింది. ఆమె కృషి ఫలితంగా భారతదేశంలో ఉన్న డైనోసార్ల జాతి గురించి ప్రపంచమే తెలుసుకునేలా చేసింది. అంతేగాదు ఆమె ఆ ప్రాంతాన్ని సందర్శించడానికి వచ్చే టూరిస్టులందరికీ తమ రాజప్యాలెస్లోనే బస చేసే ఏర్పాట్లు అందించింది. అలాగే వారికి ఆ డైనోసర్ల గురించి సవివరంగా తెలిపేలా స్వయంగా ఆమె ఓ గైడ్‌గా మారి వివరించేది. అ ఆమె డైనోసార్ల గురించి సవివరంగా పలు ఆసక్తికర విషయాలు తెలియజేయడంతో డైనోసార్ యవరాణి(డైనోసార్ ప్రిన్సెస్ అని ముద్దుగా పిలవడం ప్రారంభించారు స్థానికులు. ఈ విషయంలో తన తల్లిదండ్రులు పూర్తి మద్దతు ఇవ్వడంతోనే ఇదంత సాధ్యమయ్యిందని చెబుతోందామె. అయితే ఈ శిలాజ పార్కుని రాష్ట్ర ప్రభుత్వానికి అందించడానికి ఎలాంటి అభ్యంతరం లేదు కానీ వారు తమ శక్తిమేర రక్షిస్తామని హామీ ఇస్తేనని అప్పగిస్తానని అంటోంది ఆలియా. అంతేగాదు ఇక్కడే ఒక మ్యూజియాన్ని ఏర్పాటు చేసి పాలియోంటాలజీ విద్యార్థుల పరిశోధనల్లో సహాయ సహకారాలు అందించాలని యోచిస్తోంది. ఇక ఈ గ్రామం తన తాతగారికి చెందిందని చెప్పుకొచ్చింది. ఇది భారతదేశంలో మూడవ అతిపెద్ద చారిత్రక శిలాజ ప్రదేశం. ఈ శిలాజాలను భావితరాలకు తెలియజేసేలా జాగ్రత్తగా భద్రపరచడానికి కృషి చేస్తానని ఆలియా అన్నారు. ఇకి ఆమె అత్త ప్రముఖ బాలీవుడ్ నటి పర్వీన్ బాబీ. ఆలియా నిర్వహిస్తున్న ఈ పార్క్‌లో డైనోసార్ అవశేషాలు తాకొచ్చు, పట్టుకోవచ్చు అదే డైనోసార్ శిలాజ పార్క్ ప్రత్యేకత. View this post on Instagram A post shared by Dinosaur Musuem (@dinosaur__balasinor) (చదవండి: 24 క్యారెట్ల బంగారంతో దాల్ రెసిపీ! షాక్‌లో నెటిజన్లు) -
రాక్షస బల్లులతో మానవులకు స్వల్పకాలిక పరిచయం
లండన్: భూమిపై మనుషులతో సహా పలు రకాల క్షీరదాలు ఒకప్పుడు రాక్షస బల్లులతో(డైనోసార్లు) కలిసి జీవించినట్లు ఇంగ్లాండ్‌లోని యూనివర్సిటీ ఆఫ్ బ్రిస్టల్ సైంటిస్టుల అధ్యయనంలో వెల్లడయ్యింది. క్షీరదాల శిలాజాల పరీక్ష ఆధారంగా ఈ నిర్ధారణకు వచ్చారు. దాదాపు 6.60 కోట్ల ఏళ్ల క్రితం బలమైన గ్రహ శకలం భూమిని ఢీకొట్టడంతో రాక్షస బల్లులు అంతమైనట్లు పరిశోధకులు ఇప్పటికే నిర్ధారించారు. అంతకంటే కొంత కాలం ముందే మనుషులతోపాటు కుందేళ్లు, శునకాలు, పిల్లులు, గబ్బిలాల వంటి క్షీరదాలు పరిణామ క్రమంలో భూమిపై ఆవిర్భవించాయి. అవి రాక్షస బల్లులతోపాటే మనుగడ సాగించాయని బ్రిస్టల్ సైంటిస్టులు తేల్చారు. ఈ అధ్యయనం వివరాలను కరెంట్ బయాలజీ జర్నల్‌లో ప్రచురించారు. డైనోసార్లతో ప్రాచీన మానవుల పరిచయం ఎక్కువ కాలం కొనసాగలేదని వెల్లడయ్యింది. మానవులు ఆవిర్భవించిన కొంతకాలానికే డైనోసార్లు అంతం కావడమే ఇందుకు కారణం. భూమిపై జీవనం సాగించే విషయంలో డైనోసార్ల నుంచి ఎలాంటి పోటీ లేకపోవడంతో క్షీరదాలు విస్తృతంగా ఆవిర్భవించాయని, కాలానుగుణంగా వాటిలో వైవిధ్యం సైతం చోటుచేసుకుందని పరిశోధకులు అంచనా వేస్తున్నారు. -
ప్రపంచంలో టాప్10 విచిత్రమైన డైనోసార్స్
-
నేటి పక్షి.. నాటి రాకాసి బల్లి
గుంటూరు: కోతి నుంచి మనిషి అవతరించాడని చెబుతారు. అలాగే ఇప్పటి పక్షుల పూర్వీకులు ఆనాటి రాకాసి బల్లులేనట! సరీసృపాల స్వర్ణయుగంగా పేరొందిన క్రిటేయస్ (దాదాపు వంద మిలియన్ ఏళ్లకు పూర్వం)నాటి టైటనోసారిక్ డైనోసర్ల శిలాజీకరణం చెందిన లోపభూయిష్టమైన గుడ్లను వాటి గూళ్లను కనిపెట్టి అధ్యయనం చేసిన ముగ్గురు శాస్త్రవేత్తల బృందం తేలి్చన సారాంశమిది. డైనోసార్ల పునరుత్పత్తి జీవశాస్త్రంపై వీరి పరిశోధనపత్రం గత వారం నేచర్ గ్రూప్ జర్నల్ సైంటిఫిక్ రిపోర్ట్స్‌లో ప్రచురితమైంది. వీరిలో ఒకరు తెనాలికి చెందిన పాలీయాంథాలజీ శాస్త్రవేత్త డాక్టర్ గుంటుపల్లి వీఆర్ ప్రసాద్ కావటం విశేషం. వీఆర్ ప్రసాద్ ఢిల్లీలోని యూనివర్శిటీ ఆఫ్ ఢిల్లీ భౌగోళిక విభాగం అధిపతి. పూర్వ చారిత్రాత్మక కాలం (మెసాజోయిక్ ఎరా)లో భారతదేశంలోని సకశేరుక జంతుజాలం పరిణామక్రమం, జీవవైవిధ్యం, ప్రకృతి, వాతావరణంలో మార్పులను ఆయన 40 ఏళ్లుగా అధ్యయనం చేస్తున్నారు. ఈ అన్వేషణలో కనుగొన్న అంశాలు శాస్త్రపరిశోధన రంగాన్ని అబ్బుర పరిచాయి. 2016లో డైనోసర్లను పోలిన 150 మిలియన్ ఏళ్లకు చెందిన సముద్ర సరీసృపంను గుజరాత్‌లోని కచ్ తీరంలో వీఆర్ ప్రసాద్ గుర్తించారు. 1988లో క్రిటిíÙయస్ యుగంలో నివసించిన క్షీరదాల ఉనికిని దక్కన్ పీఠ భూమిలో గుర్తించి, వాటి పుట్టుక భారత్‌లోనే నని శాస్త్రలోకానికి చాటారు. తన విజయాలకు గాను 2019లో భారత ప్రభుత్వంచే ‘జాతీయ ఉత్తమ శాస్త్రవేత్త’ అవార్డును స్వీకరించారు. టైటనోసారిక్ డైనోసార్ల గూడు, గుడ్లు శిలాజాల మైక్రోస్కోపిక్ ఫీల్డ్ ఫొటోలు ఫలించిన ముగ్గురు శాస్త్రవేత్తల అన్వేషణ భారతదేశంలోని మధ్య, పశి్చమ ప్రాంతాల్లో టైటనోసారిక్ డైనోసర్ల గూళ్లలో శిలాజీకరణం చెందిన లోపభూయిష్టమైన గుడ్లను హర్ష ధిమాన్, విశాల్ వర్మతో కలిసి గుంటుపల్లి వీఆర్ ప్రసాద్ గుర్తించారు. గుడ్డు లోపల ఇంకో గుడ్డు ఉండటం లేదా గుడ్డును ఆవరించి ఉండే పెంకు ఎక్కువ పొరల్లో ఉండటాన్ని లోపభూయిష్టమైనవిగా చెబుతారు. వీటిని మధ్యప్రదేశ్‌లోని ధార్ జిల్లాకు చెందిన పడ్లియా గ్రామంలో కనుగొన్నారు. మరికొన్నిటిని గుజరాత్ రాష్ట్రంలో గుర్తించారు. పరిశోధనల అనంతరం ఈ శిలాజ అవశేషాలను పడ్లియా సమీపంలోని మధ్యప్రదేశ్ ప్రభుత్వ డైనోసర్ శిలాజ జాతీయ పార్కులో భద్రపరిచారు. ఆధార సహితంగా నిర్ధారణ పక్షుల పూరీ్వకులు రాకాసి బల్లులేనని వీఆర్ ప్రసాద్ బృందం ఆధార సహితంగా నిర్ధారించింది. జీవుల్లో లోపభూయిష్ట గుడ్లు ఏర్పడడానికి అనేక కారణాలుంటాయి. దేహరుగ్మతలు, అధిక జనసాంద్రత, ఆహార కొరత, వరదలు, కరువుకాటకాలు, వాతావరణ మార్పులు వంటివి ప్రధానమైనవి. గుడ్డులో గుడ్డు ఉండడాన్ని పక్షుల విషయంలో అప్పుడప్పుడు వింటుంటాం. అలాగే అనేక పొరల పెంకుతో గుడ్లు ఏర్పడటం కూడా సరీసృపాలు, పక్షుల్లో కనిపిస్తోంది. ఈ రెండు అంశాల ఆధారంగా డైనోసర్లు పక్షుల పూర్వీకులనే విషయాన్ని వీఆర్ ప్రసాద్ బృందం స్పష్టం చేసింది. డైనోసర్ల పరిణామక్రమంపై పరిశోధన ప్రథమంగా మన దేశంలో జరగటం, ఇందులో తెలుగు శాస్త్రవేత్త పాలుపంచుకోవటం విశేషం. -
డైనోసార్ ‘గుడ్డు’రట్టు.. నేటి పక్షుల పూర్వీకులు నాటి రాకాసి బల్లులేనట..!
సాక్షి, గుంటూరు: మాంసాహార రాకాసి బల్లుల (డైనోసార్లు) గ్రూపు నుంచి పక్షులు పరిణామం చెందాయనే భావన ఇప్పటి వరకు శాస్త్ర లోకంలో ఉంది. అయితే వాటి పునరుత్పత్తి గురించి ఎవరికీ పెద్దగా అవగాహన లేదు. ఈ నేపథ్యంలో తాజాగా సౌరోపాడ్ (వెజిటేరియన్) డైనోసార్లు, పక్షులకు పునరుత్పత్తి ప్రక్రియ దగ్గరగా ఉందని తేల్చారు. ఈ మేరకు సరీసృపాల స్వర్ణయుగంగా పేర్కొనే క్రిటేషియస్ యుగం (దాదాపు వంద మిలియన్ ఏళ్లకు పూర్వం) నాటి టైటనోసారిక్ డైనోసార్ల శిలాజీకరణం చెందిన గుడ్లను తెనాలికి చెందిన పాలీయాంథాలజీ శాస్త్రవేత్త డాక్టర్ గుంటుపల్లి వీఆర్ ప్రసాద్ కనిపెట్టారు. ఆయన పరిశోధన పత్రం జూన్ 7న నేచర్ గ్రూప్ జర్నల్ సైంటిఫిక్ రిపోర్ట్స్‌లో ప్రచురితమైంది. టైటనోసారిక్ డైనోసార్ల గూడు భారతదేశంలో విస్తృతంగా.. అతిపెద్ద జంతువుల్లో సౌరోపాడ్ కుటుంబానికి చెందిన డైనోసార్ ఒకటి. తీసుకునే ఆహారాన్ని బట్టి వీటిని వెజిటేరియన్స్‌గా భావిస్తారు. క్రిటేషియస్ యుగంలో ఇవి భారతదేశంలో విస్తృతంగా ఉండేవి. సరీసృపాల్లో పునరుత్పత్తి కోశంలో ఒకేచోట గుడ్లు వస్తాయి. గర్భాశయంలో గుడ్డు లోపల పొర, పైన పెంకు తయారవుతాయి. ఒకేసారి అన్ని గుడ్లు విడుదలవుతాయి. పక్షుల్లో ఇందుకు భిన్నం. పునరుత్పత్తి నాలుగు భాగాలుగా విభజితమై ఉంటుంది. గుడ్ల నుంచి పైన పెంకు తయారీ వరకు నాలుగు దశలుగా జరిగి గుడ్డు ఒకేసారి విడుదలవుతుంది. పక్షుల్లో కొన్ని ప్రతికూల పరిస్థితులు, ఒత్తిడి ఫలితంగా ఒక్కోసారి గుడ్డు లోపల గుడ్లు తయారవుతుంటాయి. గుడ్డు లోపల గుడ్డు గుడ్డు లోపల గుడ్లు.. సరీసృపాలు అన్నింటిలానే ఆ జాతిలోని డైనోసార్లలోనూ పునరుత్పత్తి ఒకేలా ఉంటుందనే భావన సరికాదని ప్రొఫెసర్ గుంటుపల్లి వీఆర్ ప్రసాద్ తన పరిశోధనలో తేల్చారు. పక్షుల్లో ఉన్నట్టుగానే డైనోసార్లలోనూ పునరుత్పత్తి ఉందని చెబుతున్నారు. మధ్యప్రదేశ్‌లోని ధార్ జిల్లా పడ్లియాలో సౌరోపాడ్ డైనోసార్ల గూళ్లను, వాటిలో శిలాజీకరణం చెందిన లోపభూయిష్టమైన గుడ్లను ప్రొఫెసర్ ప్రసాద్ గుర్తించారు. పక్షుల గుడ్ల తరహాలో వీటిలో గుడ్డు లోపల గుడ్డును కనుగొన్నారు. సరీసృపాలు, పక్షుల గుడ్లలో ఎక్కువ పొరలు ఉండటం సహజమే అయి నా, గుడ్డు లోపల గుడ్లు ఉంటాయనేది శాస్త్ర ప్రపంచానికి ఇంత వరకు తెలియదని ఆయన ‘సాక్షి’కి వివరించారు. పరిశోధనల అనంతరం ఈ శిలాజ అవశేషాలను పడ్లియా సమీపంలోని మధ్యప్రదేశ్ ప్రభుత్వ డైనోసార్ శిలాజ జాతీయ పార్కులో భద్రపరచినట్టు తెలిపారు. ఈ రకమైన పరిశోధన మనదేశంలో జరగడం ఇదే ప్రథమం. అందు లోనూ పరిశోధకుడు తెలుగు శాస్త్రవేత్త కావడం విశేషం. ఈ పరిశోధనలో ప్రొఫెసర్ ప్రసాద్‌తోపాటు యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీకి చెందిన పాలీయాంథాలజీ పరిశోధక విద్యార్థిని హర్ష ధిమాన్, మధ్యప్రదేశ్‌కు చెందిన విశాల్‌వర్మ పాలుపంచుకున్నారు. -
భారత్‌లో బయటపడ్డ అరుదైన డైనోసార్ల గుడ్లు!
భోపాల్: డైనోసార్లు(రాక్షస బల్లులు).. వీటి రూపం ఎలా ఉంటుందో సినిమాల ద్వారా అందరికీ పరిచయమే. భౌతికంగా ఈ జాతులు మిలియన్ల సంవత్సరాల కిందటే అంతరించినా.. ఈ భూమ్మీద వీటి అవశేషాలు శిలాజాల రూపంలో బయల్పడుతూనే ఉన్నాయి. తాజాగా భారత్‌లో అరుదైన రాక్షస బల్లుల గుడ్లను వెలికితీశారు పరిశోధకులు. ఢిల్లీ విశ్వవిద్యాలయానికి చెందిన కొందరు పరిశోధకులు మధ్యప్రదేశ్ లోని ధార్ జిల్లాలోని డైనోసార్ ఫోసిల్ నేషనల్ పార్క్ లో తవ్వకాలు చేపట్టారు. ఈ సందర్భంగా పది డైనోసార్ గుడ్ల అవశేషాలను వెలికితీశారు. ఇప్పటివరకు లభ్యమైన గుడ్లతో పోల్చితే ఇవి ఎంతో భిన్నంగా ఉండడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అవన్నీ అసాధారణరీతిలో ఉన్నట్టు గమనించారు. సారోపోడ్ వర్గానికి చెందిన టిటానోసారస్ డైనోసార్లకు చెందినవిగా నిర్ధారించారు. ఓవమ్ ఇన్ ఓవో.. ఒక గుడ్డులోనే మరొక గుడ్డు ఏర్పడి ఉండడంతో రీసెర్చర్లు ఆశ్చర్యపోయారు. శాస్త్ర పరిభాషలో ఈ స్థితిని ‘ఓవమ్ ఇన్ ఓవో’ అంటారు. సాధారణంగా.. గుడ్డులోనే గుడ్డు ఉండడం అనే స్థితి పక్షుల్లో అధికంగా కనిపిస్తుందని. సో.. టిటానోసారస్ డైనోసార్లకు పక్షులకు మధ్య దగ్గరి సంబంధం ఉండొచ్చని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు.ధార్ జిల్లాలోని నేషనల్ పార్క్ ప్రాంతంలో ఇప్పటికే 52 టిటానోసారస్ సారోపోడ్స్ డైనోసార్ గూడులను(పక్షుల మాదిరి) వెలికితీశారు. లక్షల సంవత్సరాల క్రితం భూమిపై సంచరించి, ప్రతికూల వాతావరణం కారణంతోనే డైనోసార్లు అంతరించి పోయాయన్నది అందరికీ తెలిసిందే. -
కాసుల వర్షం కురిపించిన డైనోసర్ అస్థిపంజరం.. ఏకంగా రూ. 96 కోట్లు..
11 కోట్ల ఏళ్ల నాటి ఓ డైనోసార్ అస్థిపంజరం ఇటీవల ఓ వేలంలో దాదాపు రూ. 96 కోట్లు పలికిందంటే నమ్ముతారా! వేలం వేసిన వాళ్లే ఎక్కువలో ఎక్కువగా రూ. 50 కోట్ల వరకు వస్తాయనుకుంటే.. వాళ్ల అంచనాలను తలకిందులు చేసిందీ ఈ అస్థిపంజరం. కాసుల వర్షం కురిపించింది. ఇంతకీ అంత ప్రత్యేకత ఏముంది ఇందులో అనుకుంటున్నారా? ఇప్పటివరకు దొరికిన డైనోసార్ అస్థిపంజరాల్లో అతి పెద్దది, పూర్తి ఆకారంలో లభించింది ఇదే మరి. అంతేకాదు.. టీరెక్స్ తరహాలో ఇది బాగా ఫేమస్.. పేరు డైనానుకస్ యాంటిరోపస్. జురాసిక్ పార్క్ చిత్రంలో కిచెన్‌లో పిల్లలను వెంటాడే రాక్షస బల్లి ఇదే. చదవండి: బట్టతల ఉన్నవారికి ఊరటనిచ్చే వార్త.. ఇక ఎగతాళి చేశారో అంతే! 2012 నుంచి 2014 మధ్య అమెరికాలోని మోంటానాలో ఉన్న వూల్ఫ్ లోయలో పురావస్తు శాస్త్రవేత్తలు రాక్, రాబర్ట్ ఓవన్ జరిపిన తవ్వకాల్లో ఇది బయటపడింది. దీని ఎత్తు 4 అడుగులు, పొడవు 10 అడుగులు. ఆ సమయంలో అస్థిపంజరంలో 126 ఎముకలున్నాయి. ఆ తర్వాత పురాతత్వ శాస్త్రవేత్తలు దీనికి తుది రూపును తీసుకొచ్చారు. ఇందులో పుర్రె భాగంలో చాలా వరకు, ఎముకల్లో కొన్నింటిని మళ్లీ కొత్తగా రూపొందించారు. ప్రపంచంలో ప్రైవేట్ వ్యక్తుల వద్ద ఉన్న ఒకే ఒక డైనోసార్ అస్థిపంజరం ఇదే. అయితే ఇంత ధర పెట్టి ఈ అస్థిపంజరాన్ని ఎవరు కొన్నారో మాత్రం చెప్పలేదు. – సాక్షి, సెంట్రల్ డెస్క్ -
డైనోసార్లకు చుట్టాలు చీమలు..వాటర్ ప్రూఫ్ కూడా!
‘చీమంత బలం నీది .. నువ్వేం చేస్తావ్ రా నన్ను’ అంటూ చీమను తక్కువ చేసి మాట్లాడుతుంటారు కానీ చీమకున్నంత బలం, చీమకున్నంత ఓర్పు, నేర్పు, కలుపుగోలుతనం.. అబ్బో చాలా వాటిల్లో మనుషులను మించి ముందున్నాయి. వీటికి సంబంధించి అవాక్కయ్యే నిజాలు కూడా చాలానే ఉన్నాయి. ఆ ‘చాలా’ ఏంటో తెలుసుకుందామా! డైనోసార్లకు చుట్టాలు చీమలు నిజం. హార్వర్డ్, ఫ్లోరిడా స్టేట్ వర్సిటీల పరిశోధనలో ఇది తేలింది. 130 మిలియన్ సంవత్సరాల కిందటి నుంచే చీమలు ఉన్నాయంట. డైనోసార్లు అంతరించినా ఇవి మాత్రం గడ్డు పరిస్థితులను తట్టుకొని నిలబడ్డాయంట. చీమలు.. రైతులు ఏంటి.. నిజమా! అని అనుకొనే ఉంటారు. మనుషులు కాకుండా ఇంకే జీవులైనా ఇతర జీవులను పెంచి పోషిస్తున్నాయంటే అవి చీమలే. ఆహారం, ఇతర ఉత్పత్తుల కోసం ఆవులు, గేదెలు, మేకలు, గొర్రెలు, కోళ్లను మనుషులు పెంచుతున్నట్టే.. చీమలు కూడా కొన్ని రకాల నల్లులను పెంచి పోషిస్తాయి. ఇతర జీవుల నుంచి రక్షణ కల్పిస్తాయి. వానాకాలంలో ఇబ్బంది పడకుండా వాటి ఇళ్లల్లో చోటిస్తాయి. బదులుగా ఆ నల్లుల నుంచి తేనెను తీసుకుంటాయి. అలాగే ఆహారానికి, నివాసానికి కావాల్సిన మంచి ప్రాంతమెక్కడుందో తెలుసుకోవడానికి తమ తోటి చీమలందరి నుంచి సలహాలను తీసుకొని మరీ చీమలు ముందుకెళ్తాయి. పాఠాలు నేర్పించగలవు మనుషులు, జంతువుల్లా చీమలు కూడా తమ తోటి చీమలకు పాఠాలు చెప్పగలవు. నేర్పించగలవు. చాలా జంతువులు తమ తోటి జంతువులను అనుసరించి కావాల్సినవి నేర్చుకుంటుంటాయి. కానీ చీమలు కాస్త వేరు. కొన్ని రకాల రసాయనాలను బయటకు విడుదల చేసి పక్క చీమలకు కొన్ని రకాల విషయాలు నేర్పిస్తుంటాయి. ఉదాహరణకు కొత్త ప్రాంతానికి, ఇంటికి గనుక చీమలు వెళ్తే పక్క చీమలు ఆ ప్రాంతాన్ని గుర్తుంచుకోవడానికి వీలుగా రసాయనాలు వదులుతుంటాయి. ప్రతి కొంత దూరానికి ఇలా చేస్తుంటాయి. మిగతా చీమలు ఆ వాసన పసిగట్టి ముందుకెళ్తుంటాయి. చీమలు ఒకే వరుసలో వెళ్లడానికి ప్రధాన కారణమిదే. చీమలు పనికెక్కాయంటే పక్కా మరి. ఇవి వాటర్ ప్రూఫ్ చీమలు నీటిలో ఈదగలవు. అలాగని బటర్‌ఫ్లై స్టైల్లో ఈతకొడతాయని కాదు. వాటిస్థాయిలో నీటిపై తేలుతూ వెళ్తుంటాయి. ఒకవేళ నీటి అడుగుకు వెళ్లినా కూడా బతకగలవు. ఎలాగా..? అంటే వాటికి ఊపిరితిత్తులుండవు మరి. వాటి శరీరంపై ఉండే రంధ్రాలతో ఆక్సిజన్ పీల్చుకోవడం, కార్బన్‌డై ఆౖMð్సడ్‌ను వదలడం చేస్తుంటాయి. రంధ్రాలు చిన్న చిన్న గొట్టాలకు కలిపి ఉంటాయి. వీటి నుంచి శరీరంలోని ఇతర ప్రాంతాలకు ఆక్సిజన్ సరఫరా అవుతుంది. కాబట్టి చీమలు నీటి అడుగుకు వెళ్లినా 24 గంటల్లోపు నీళ్లు ఆవిరైతే అవి మళ్లీ బతికేయగలవు. కొన్ని శరీర భాగాలు పోయినా కొన్ని చీమలు జీవిస్తాయి. కొన్ని తిండి, నీళ్లు లేకున్నా వారాల తరబడి బతికేస్తాయి. చీమలకు చెవులు కూడా ఉండవు. అలాగని వినలేవని కాదు. వైబ్రేషన్స్ ద్వారా ఇవి వినగలుగుతాయి. రెండు పొట్టల జీవులు చీమలకు రెండు పొట్టలుంటాయి. అలాగని ఇవేం అత్యాశపరులేం కాదు. ఒక పొట్టలో తమకు కావాల్సిన ఆహారం పెట్టుకుంటాయి. మరో పొట్టలో వేరే చీమలకు కావాల్సిన ఆహారం నిల్వ చేసుకుంటాయి. కొన్ని చీమలు తమ గూడు వదిలి ఆహారం కోసం వెళ్లినప్పుడు తమ ప్రాంతానికి కాపలాగా ఉంటాయి. ఇలా బయటకు వెళ్లిన చీమలు కాపలాగా ఉండే చీమలకు ఆ రెండో పొట్టలో తిండి దాచుకొని తీసుకొస్తాయి. చాలా.. అంటే చాలానే.. ప్రపంచంలో చీమల జనాభా ఎంతనుకుంటున్నారు. చాలానే ఉంటుంది. చాలా అనే పదం వాడినా తక్కువేనేమో. ఎందుకంటే ప్రపంచంలోని ప్రతి మనిషికి సరాసరి 10 లక్షల చీమలున్నాయి. చీమల్లో దాదాపు 10 వేల రకాలు ఉన్నాయి. బలంలో బాహుబలులు చీమలు బలంలో బాహుబలులు. వీటి శరీర బరువుకు దాదాపు 10 నుంచి 50 రెట్ల వరకు బరువును మోసుకెళ్లగలవు. చీమల పరిమాణంతో, బలంతో పోల్చితే ప్రపంచంలో అత్యంత బలమైన జీవులివే. ఆసియా జాతికి చెందిన చీమలైతే తమ బరువుకు దాదాపు 100 రెట్లు బరువును తీసుకెళ్లగలవు. అరిజోనా స్టేట్ యూనివర్సిటీ రిపోర్టు ప్రకారం.. చీమలు చిన్నగా ఉంటాయి కాబట్టి వాటి కండరాల్లో విభజన ఎక్కువుంటుంది. దాని వల్ల మిగతా జీవులతో పోల్చితే ఎక్కువ బలాన్ని ప్రయోగించగలవు. -
వేమనపల్లి ప్రాణహిత తీరంలో ఏళ్లనాటి డైనోసార్ శిలాజాలు
కోట్ల సంవత్సరాల క్రితం భూమిపై సంచరించిన ఎన్నో జీవజాతులు పరిణామ క్రమంలో కాలగర్భంలో కలిసిపోయాయి. అలాంటి వాటిలో ప్రముఖంగా చెప్పుకునే రాకాసి బల్లులు ఒకప్పుడు మంచిర్యాల, కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాల పరిధిలోని ప్రాణహిత తీరం వెంబడి రారాజులుగా వెలుగొందాయి. వేమనపల్లిలో గుర్తించిన డైనోసార్ శిలాజాన్నే ప్రస్తుతం హైదరాబాద్‌లోని మ్యూజియంలో భద్రపర్చారు. దీంతోపాటు నత్తగుళ్లలు, చేప, వృక్ష, తాబేలు శిలాజాలను శాస్త్రవేత్తలు ఇక్కడ కనుగొన్నారు. వీటి ప్రాముఖ్యతను గుర్తించిన కొందరు చరిత్రకారులు తీరం వెంబడి తవ్వకాలు జరిపారు. ఆ తర్వాత వీటి ఉనికిని పట్టించుకోకపోవడంతో అధికవర్షాలు, కబ్జాల కారణంగా మట్టిలో కలిసిపోతున్నాయి. సాక్షి, వేమనపల్లి(బెల్లంపల్లి)ఆదిలాబాద్: వేమనపల్లి మండలంలోని రాజారం, మంగెనపల్లి, దస్నాపూర్, సుంపుటం, ప్రాణ హిత ప్రాంతాల్లో 16 కోట్ల ఏళ్ల క్రితం నాటి ఎన్నో రకాల శిలాజాలు ఇప్పటికీ విసిరేసిన ట్లు పడి ఉన్నాయి. 1925లో మలాన్ అనే జర్మ న్ శాస్త్రవేత్త కోటసారస్గా పిలిచే డైనోసార్ (రాకాసి బల్లి), ఫైసా అనే నత్తగుళ్ల, చేప, వృక్ష, తాబేలు ఆకృతుల్లో ఉన్న శిలాజాలను గు ర్తించారు. ఆ ఆనవాళ్ల ఆధారంగా 1970–85 మధ్య జియోలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జీఎస్ఐ) ఆధ్వర్యంలో యాదగిరి అనే శాస్త్రవే త్త స్థానిక కూలీల సాయంతో తవ్వకాలు జరి పారు. అప్పట్లో గుర్తించిన డైనోసార్ శిలాజా న్ని హైదరాబాద్‌లోని బిర్లా మ్యూజియానికి తరలించారు. వీటితోపాటు మండలాన్ని ఆనుకుని ఉన్న మత్తడి ఒర్రె, ప్రాణహిత తీరం వెంట విభిన్న ఆకృతుల శిలాజాలు ఉన్నాయి. అటవీశాఖ ఆధ్వర్యంలో సేకరించిన వృక్ష శిలాజాలు అటవీశాఖ సంరక్షణ వేమనపల్లి, రాజారాం పరిసరాల్లో దొరికిన శి లాజాల రక్షణకు అట వీ శాఖ ప్రత్యేక చర్యలు తీ సుకుంది. మూడు సంవత్సరాల క్రితం డీఎఫ్ఓ గా పనిచేసిన ప్రభాకర్‌రావు వృక్ష, తాబేలు శి లాజాలను బొక్కలగుట్ట గాంధారి వనం, హైదరాబాద్ మ్యూజియానికి తరలించారు. సతీశ్బక్షి అనే జియాలజిస్ట్ ఈ ప్రాంతంలో దొరికే శిలాజాలపై పరిశోధనలు చేశారు. నత్తగుల్ల, వృక్ష, దారు, చేప శిలాజ అవశేషాలను పరిశోధనల నిమిత్తం తీసుకెళ్లారు. ఇటీవల ఔత్సాహిక పరిశోధకుడు సముద్రాల సునీల్ బృందం కూడా శిలాజ ఆనవాళ్లు, ఇతర అంశాలపై వేమనపల్లిలో పరిశోధనలు నిర్వహించారు. ప్రాణహిత తీరంలో నత్తగుళ్లు, తాబేళ్ల శిలాజాలు ఫాసిల్ పార్క్‌లతో రక్షణ.. మన దేశంలో హిమాచల్ ప్రదేశల్లోని శివాలిక్ ఫాసిల్ పార్కు, ఉత్తర్‌ప్రదేశ్‌లోని సల్కాన్ ఫాసిల్ పార్కు, గుజరాత్‌లోని ఇంద్రోడా ఫాసిల్ పార్కు, మధ్యప్రదేశ్‌లోని మాండ్లే ప్లాంట్ ఫాసిల్స్ నేషనల్ పార్కు, తమిళనాడులోని సతనూర్ నేషనల్ ఫాసిల్ పార్కులు ఉన్నాయి. మన రాష్ట్రంలో కరీంనగర్, వరంగల్ ప్రాంతాల్లో మాత్రమే జియాలజికల్ పార్కులు ఉన్నాయి. పక్కనే ఉన్న మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా సిరొంచా తాలూకాలో సైతం శిలాజ ఆనవాళ్లు గుర్తించి, వర్తమాన్ ఫాసిల్ పార్కు ఏర్పాటుచేశారు. తెలంగాణ–మహారాష్ట్ర సరిహద్దులోని గడ్చిరోలి జిల్లాకు సుమారు 15 కిలోమీటర్ల దూరంలో ప్రాణాహిత, గోదావరి బేసిన్లో ఉన్న వడోధామ్లో సారోపోడ్స్ సరీసృపాలు, వృక్షజాతుల శిలాజ జాడలు వెలుగుచూశాయి. దీంతో అక్కడి ప్రభుత్వం ఆ ప్రాంతాన్ని వడ్ధామ్ ఫాసిల్ పార్కుగా మార్చింది. ఇది కొండపల్లి గ్రామానికి సరిహద్దుగా ఉండడంతో స్థానిక వృక్షశిలాజాలు కూడా వాటి కాలానికి చెందినవిగా భావిస్తున్నారు. అరుదుగా ఉండే ఫాసిల్ వుడ్స్ కొండపల్లి ప్రాంతాన్ని, రాకాసి బల్లులు, ఇతర పురాతన జంతుజాలం తిరిగిన వేమనపల్లిని ఫాసిల్ పార్కుగా తీర్చిదిద్దాలని పరిశోధకులు, స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. కొండపల్లి అటవీప్రాంతంలో వృక్షశిలాజం, వృక్షశిలాజాలను పరిశీలిస్తున్న కలెక్టర్ చంపాలాల్(ఫైల్) కోట్ల ఏళ్ల నాటి జీవజాతులు పెంచికల్పేట్ మండలం కొండపల్లి అటవీప్రాంతంలో 15 ఎకరాల్లో విస్తరించి ఉన్న కోనిఫర్ జాతికి చెందిన వృక్ష శిలాజాలను 2014లో అటవీశాఖ అధికారులు కనుగొన్నారు. గ్రామానికి మూడు కిలోమీటర్ల దూరంలోని అటవీప్రాంతంలో ఆరున్నర కోట్ల ఏళ్ల నాటి శిలాజాలను గుర్తించారు. వర్షాలకు చిన్నవాగు ఉధృతంగా ప్రవహించడంతో సుమారు పది అడుగుల లోతులో ఉన్న వీటి ఉనికి బయటపడింది. ఇందులో కొన్ని 10 నుంచి 25 అడుగుల పొడవు ఉంటే మరికొన్ని 50 అడుగుల వరకు పొడవు ఉన్నాయి. సంరక్షణ అందరి బాధ్యత శిలాజ సంపద సంరక్షణ విషయంలో అందరూ భాగస్వాములు కావాలి. అటవీశాఖ ఆధ్వర్యంలో గతంలో వృక్ష, ఇతర శిలాజాలను వెలికితీయించాం. వాటిని మంచిర్యాల గాంధారి వనంలో సందర్శనార్థం ప్రదర్శనకు ఉంచాం. వీటి సంరక్షణకు ప్రభుత్వానికి నివేదిక పంపించాం. ఉన్నతాధికారుల ఆదేశాలు వస్తే పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది. – బాబుపటేకర్, డీఆర్ఓ, వేమనపల్లి సంరక్షణ అందరి బాధ్యత 40 ఏళ్ల కింద మంగెనపల్లి జంగట్ల రాక్షసి బల్లి బొక్కలు ఉన్నాయంటే త వ్వకాల కోసం కూలీ పనులకు వెళ్లాం. పెద్దసార్లు వచ్చి రాజారాం, మంగెనపల్లికి చెందిన కూలీలను తీసుకెల్లారు. తవ్వకాల్లో దొరికిన వాటిని హైదరాబాద్‌కు తీసుకెళ్లిండ్లు. అప్పట్లో జీపుల్లో వచ్చి తవ్వకాలు జరిపించేవాళ్లు. సర్కారు పట్టింపు చేసి వాటిని బయటకు తీయాలే. – పాలే శంకర్, వేమనపల్లి -
ఓర్నీ..! డైనోసార్ పళ్లతో ఫోన్ డిజైన్, కొనేందుకు ఎగబడుతున్న బిలియనీర్లు..!
ప్రస్తుతం మార్కెట్లో దొరుకుతున్న హై అండ్ మోడల్ స్మార్ట్ ఫోన్ ధర ఎంతుంటుంది..? మహా అయితే రూ.లక్ష,లేదంటే లక్షన్నర ఉంటుంది. కానీ ఈ ఫోన్ ధర అక్షరాల రూ. 6.83 లక్షలు. ఎందుకంత కాస్ట్ ఉంటుందని అనుకుంటున్నారా? మీరు ఊహించినట్లు ఫోన్‌ని వజ్రాలు, వైడుర్యాలతో డిజైన్ చేయలేదు. అది కేవలం ఫోన్ మాత్రమే. కానీ దానికో స్పెషాలిటీ ఉంది. అందుకే అంత కాస్ట్ ఉంది. ఐఫోన్ 13 సిరీస్ ఇటీవల టెక్ దిగ్గజం యాపిల్ సంస్థ ఐఫోన్ 13 సిరీస్‌ను విడుదల చేసింది. ప్రస్తుతం భారత్‌లో ఐఫోన్ 13ప్రో ఫోన్ ధర రూ.119,900, ఐఫోన్ 13 ప్రో మ్యాక్స్ ధర రూ.129,900 ఉండగా..ఇప్పుడు మనం చెప్పుకునే ఈ ఐఫోన్ 13సిరీస్ ఫోన్ల ధరలు రూ. 6.4లక్షలు, రూ.6.8లక్షలుగా ఉంది. అందుకు కారణం ఆ ఐఫోన్ ప్యానలే. వరల్డ్ వైడ్‌గా ఐఫోన్లు, స్మార్ట్ ఫోన్లకు కేవియర్ అనే సంస్థ లగ్జరీ కేసెస్‌ను తయారు చేసి మార్కెట్లో విడుదల చేస్తుంది. తాజాగా అదే కేవియర్ సంస్థ నిజమైన డైనోసార్ పళ్లతో ఐఫోన్ కెసెస్ను తయారు చేసింది. ప్రస్తుతం ఆ ఫోన్ నెట్టింట్లో సందడి చేస్తుండగా.. ఆ ఫోన్‌ను సొంతం చేసుకునేందుకు బిలియనీర్లు ఎగబడుతున్నారు. 80 మిలియన్ సంవత్సరాల క్రితం కేవియర్ సంస్థ 80 మిలియన్ సంవత్సరాల క్రితానికి చెందిన డైనోసార్ల పళ్లతో ప్రత్యేకంగా ఐఫోన్ 13 ప్రో, ఐఫోన్ 13ప్రో మ్యాక్స్ ఫోన్ కేసెస్‌లను డిజైన్ చేసింది. 'Tyrannosaurus rex(T. rex)' అనే పేరుతో ఆఫోన్ కేసెస్‌లను మార్కెట్లో విడుదల చేసింది. 1 టెరా బైట్ స్టోరేజ్ ఉన్న ఐఫోన్ 13ప్రో ధర రూ. 6.8 లక్షలుగా ఉండగా ఈ ఫోన్ల గురించి కేవియర్ ప్రతినిధుల పలు ఆసక్తికర విషయాల్ని వెల్లడించారు. ఈ ఐఫోన్ కేసెస్‌ను డిజైన్ చేసిన డైనోసార్ పళ్లు 80 మిలియన్ సంవత్సరాలని తెలిపారు. డైనోసార్లలో అత్యంత బలమైన జాతి టైరన్నోసారస్. టైరన్నోసారస్ జాతికి చెందిన డైనోసార్లు మనుషుల కంటే 125 రెట్ల శక్తివంతమైందని తెలిపారు. 4 మీటర్ల ఎత్తు,12.3 మీటర్ల పొడవు వరకు ఉండే ఈ డైనోసార్లలో అత్యంత ప్రసిద్ధ జాతులలో ఒకటిగా అభివర్ణించారు. కాబట్టే వినియోగదారుల్ని ఆకర్షించేందుకు డైనోసార్ పళ్లతో ఫోన్ కేసెస్‌ను తయారు చేసినట్లు చెప్పారు. ఫోన్ లో డైనోసార్ పళ్లు టీ రెక్స్ (T. rex) అని పిలిచే ఫోన్ వెనుక ప్యానల్లో కేవియర్ సంస్థ నిజమైన డైనోసార్ పళ్లను ఇమిడ్చింది. ఆ ఫోన్ ప్యానల్‌ను నలుపు, పీవీడీ(Physical vapor deposition) పూతతో, టైటానియంతో తయారు చేశారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఫోన్ ప్యానల్లో ఉండే డైనోసార్ పళ్లను ఎక్కడ సేకరించారనే విషయాన్ని కేవియర్ సంస్థ వెల్లడించలేదు. చదవండి : యాపిల్ లోగోలో ఇంత విషయం ఉందా..! టచ్ చేసి చూడండి..అదిరిపోద్దంతే..! -
పిరికి డైనోసార్లు.. ఎలా బతికేవో తెలుసా?
Patagonian fossils show Jurassic dinosaur had herd mentality: డైనోసార్ల ఉనికి.. మనుగడ కాలంపై నిర్ధారణ కోసం పరిశోధనలు ఎన్నో ఏళ్లుగా కొనసాగుతూనే ఉన్నాయి. అర్జెంటీనా దక్షిణ భాగంలోని పటగోనియా రీజియన్‌లో దొరికిన వివిధ జాతుల డైనోసార్ల శిలాజాల్ని.. ఈ భూమ్మీద అత్యంత ప్రాచీన సాక్ష్యాలుగా పరిగణిస్తుంటారు. అయితే వీటి ఆధారంగా డైనోసార్లు బతికిన విధానంపై సైంటిస్టులు ఇప్పుడొక అంచనాకి వచ్చారు. గురువారం ఈ మేరకు సైంటిస్టుల పరిశోధనకు సంబంధించిన కథనం.. సైంటిఫిక్ రిపోర్ట్స్ అనే జర్నల్‌లో పబ్లిష్ అయ్యింది. వందకి పైగా గుడ్లు, 20కిపైగా భారీ డైనోసార్లు, 80 పిల్ల డైనోసార్ల అవశేషాల ఆధారంగా.. డైనోసార్లు గుంపులుగా కలిసి బతికేవని అంచనాకి వచ్చారు. సుమారు 193 మిలియన్ సంవత్సరాల కిందట వీటి మనుగడ కొనసాగి ఉంటుందని భావిస్తున్నారు. ముస్సావురస్(సావ్రోపోడోమార్ఫ్ జాతి) డైనోసార్లు 20 అడుగుల ఎత్తు, టన్నున్నర బరువు పెరుగుతాయి. ఈ డైనోసార్ జాతి ఇక్కడి సముహంలో బతికినట్లు భావిస్తున్నారు. వీటికి పొడవైన మెడ.. తోక, స్తంభాల్లాంటి కాళ్లు ఉంటాయి వీటికి. ఇవి పూర్తి శాఖాహారులు. గుత్తగంపగా ఇవి అన్నీ కలిసి గుడ్లు పెట్టడం విశేషం. కందకాల్లో పొరలు పొరలుగా ఆడ డైనోసార్లు పెట్టిన గుడ్ల(పిండం అభివృద్ధి చెందిన దశలో)ను పరిశోధకులు సేకరించారు. ఇక భారీ డైనోసార్ల శిలాజాలు విడి విడిగా లభించగా.. పిల్ల డైనోసార్ల శిలాజాలు మాత్రం గుంపుగా ఒకే దగ్గర దొరికాయి. మట్టి దిబ్బల నుంచి ఈ డైనోసార్ల అవశేషాలను సేకరించారు. కరువు వల్లే ఇవన్నీ సామూహికంగా అంతం అయ్యి ఉంటాయని, ఆపై ఇసుక తుపాన్లు వీటి కళేబరాలను ముంచెత్తి ఉంటాయని భావిస్తున్నారు. అయితే ముస్సావురస్ చాలా పిరికివని, దాడి చేసే సత్తా కూడా ఉండేవి కావేమోనని, శత్రువుల(రాకాసి డైనోసార్ల) నుంచి తమను తాము కాపాడుకునేందుకే గుంపులుగా తిరిగేవని, పిల్ల డైనోసార్లనూ మధ్యలో ఉంచుకుని గుంపులుగా రక్షించుకునేవని నిర్ధారణకు వచ్చారు. హై రెజల్యూషన్ ఎక్స్‌రే.. (కంప్యూటెడ్ టోమోగ్రఫీ) ఆధారంగా వీటిని స్కాన్ చేసి ముస్సావురస్ డైనోసార్ల జీవన విధానంపై ఒక నిర్ధారణకు వచ్చారు. అయితే పటాగోనియాలోనే Argentinosaurus ఆర్జెంటినోసారస్ను భూమ్మీద అత్యంత భారీ డైనోసార్‌గా(ఈ భూమ్మీద అత్యంత పెద్ద ప్రాణిగా) భావిస్తుంటారు. 118 ఫీట్ల ఎత్తు, 70 టన్నుల బరువు ఉండేదని వాటి శిలాజాల ఆధారంగా నిర్దారించుకున్నారు. ఇవి మాత్రం పక్కా మాంసాహారులని సదరు జర్నల్‌లో కథనం ఉంది. చదవండి: మనుషుల్ని గోళ్లతో చీల్చి చంపేసే భయంకరమైన పక్షి గురించి తెలుసా? -
మనుషుల్ని గోళ్లతో చీల్చి చంపేసే భయంకరమైన పక్షి గురించి తెలుసా?
కోట్ల ఏళ్ల కిందటి శిలాజం ఒకటి.. కోట్ల ఏళ్లనాటి జీవికి ప్రతిరూపం ఇంకోటి. రెండూ డేంజరే. ఒకదాని ఆనవాళ్లను ఇప్పుడే కొత్తగా కనుగొనగా.. మరోటి ఎప్పట్నుంచో మన మధ్యే ఉన్నా దానికి సంబంధించిన కొత్త సంగతులు ఇప్పుడే బయటపడ్డాయి. ఇందులో ఒకటి ‘సెరాటోసుచోప్స్ ఇన్ఫెరోడియోస్’ అనే రాక్షసబల్లికాగా.. మరోటి ఆ రాక్షస బల్లుల వారసత్వంగా మిగిలిన ‘కాస్సోవరీ’ అనే పక్షి. మరి ఈ విశేషాలు ఏమిటో తెలుసుకుందామా? రెండు కొత్త డైనోసార్లు ఖడ్గమృగం లాంటి కొమ్ము.. మొసలిలాంటి తల..పది మీటర్ల పొడవు.. శత్రువులను చీల్చేసే బలమైన కోరలు.. ఓ భయంకరమైన కొత్త డైనోసార్ రూపమిది. ఇటీవలే యూనివర్సిటీ ఆఫ్ సౌతాంప్టన్ శాస్త్రవేత్తలు ఇంగ్లండ్ పరిధిలోని ‘ఐసిల్ ఆఫ్ వెయిట్’ ద్వీపంలో దీని శిలాజాలను గుర్తించారు. దానికి ‘సెరాటోసుచోప్స్ ఇన్ఫెరోడియోస్’ అని పేరుపెట్టారు. దీనికితోడుగా కనిపెట్టిన మరో కొత్త డైనోసార్‌కు ‘రిపరోవెనటార్ మిల్నెరీ’ అని పేరుపెట్టారు. 12.5 కోట్ల ఏళ్ల కింద ఇవి తిరుగాయని.. వీటిలో సెరాటోసుచోప్స్ భయంకరమైనదని పరిశోధనకు నేతృత్వం వహించిన శాస్త్రవేత్త క్రిస్ బార్కర్ తెలిపారు. వీటి పొడవు 29 అడుగుల వరకు ఉంటుందని, అందులో తల పొడవే 3 అడుగుల (మీటర్) వరకు ఉంటుందని వివరించారు. హెరోన్గా పిలిచే ఓ కొంగ వంటి పక్షి తరహాలో ఈ రెండు డైనోసార్లు కూడా చేపలను, ఇతర జంతువులను వేటాడి ఉంటాయని తెలిపారు. ఈ ‘ఐసిల్’లో ఎన్నో వింతలు ఇంగ్లండ్ పరిధిలోని ఐసిల్ ఆఫ్ వెయిట్ ద్వీపం ఎన్నో పురాతన శిలాజాలకు, వింతలకు నిలయం. ఇక్కడ కోట్ల ఏళ్లనాటి శిలాజాలను ఎన్నింటినో గుర్తించారు. మనం చెరువుల్లో, నదుల్లో నత్తలను చూస్తుం టాం. వాటి పరిమాణం మహా అయితే నాలుగైదు అంగుళాల వరకు ఉంటుంది. కానీ ఐసిల్ ద్వీపంలో కోట్ల ఏళ్లనాటి భారీ అమ్మోనైట్ (నత్త గుల్ల వంటి జీవి) శిలాజాన్ని 2020లో గుర్తించారు. 20 అంగుళాలు ఉన్న ఈ శిలాజం 95 కిలోలకుపైగా బరువు ఉండటం గమనార్హం. ఈ ద్వీపంలో నీయోవెనటర్, టెరోసార్ వంటి డైనోసార్లు, సూపర్టెరోసార్గా పిలిచే భారీ డైనోసార్ పక్షి, కాకి అంత పరిమాణంలో ఉండే మరో చిన్న డైనోసార్ పక్షి, కోట్ల ఏళ్ల నాటి మొసళ్లు, ఇతర జీవుల శిలాజాలను ఇప్పటికే గుర్తించారు. వాటన్నింటితో ఓ మ్యూజియం ఏర్పాటు చేస్తున్నారు. డైనోసార్లను మరిపించేలా.. డైనోసార్లకు ఉండేలా తలపై పెద్ద ముట్టె.. పొడవైన ముక్కు.. రెండు కాళ్లకు కత్తుల్లాంటి పొడవాటి పదునైన గోళ్లు.. చూడగానే కాస్త డైనోసార్ల పోలికలు.. ‘కాస్సోవరీ’గా పిలిచే ఈ పక్షిని అత్యంత ప్రమాదకరమైన పక్షిగా పరిగణిస్తారు. ఆస్ట్రేలియాలో ఎక్కువగా కనిపిస్తుంది. మనుషులు మొదట్లో పెంచుకున్నది కోళ్లు, బాతులను కాదు.. ఈ ‘కాస్సోవరీ’ పక్షులనేనట. తాజాగా పెన్సిల్వేనియా స్టేట్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఈ విషయాన్ని గుర్తించారు. ఆది మానవుల నివాస ప్రాంతాలపై అధ్యయనం చేస్తున్న ఈ శాస్త్రవేత్తలకు కొన్ని రకాల గుడ్ల పెంకులు, పక్షుల ఎముకలు లభించాయి. వాటిపై లేజర్ మైక్రోస్కొపీ, ఇతర పద్ధతుల్లో అధ్యయనం చేసి.. కాస్సోవరీ పక్షులకు చెందినవిగా గుర్తించారు. కొన్ని గుడ్లను కాల్చుకుని తిన్నట్టుగా, మరికొన్ని పొదిగి పిల్లలు బయటికి వచి్చనట్టుగా తేల్చారు. సుమారు 18 వేల ఏళ్ల కింద ఆది మానవులు వీటిని మాంసం, ఈకలు, గుడ్ల కోసం పెంచుకుని ఉంటారని పరిశోధనకు నేతృత్వం వహించిన ప్రొఫెసర్ క్రిస్టినా డగ్లస్ తెలిపారు. గోళ్లతో చీల్చేస్తుంది..! ఏకంగా ఆరు అడుగుల ఎత్తు, 59 కిలోల బరువు వరకు పెరిగే ఈ కాస్సోవరీ పక్షులు ప్రస్తుతం భూమ్మీద ఆస్ట్రిచ్‌ల తర్వాత అతిపెద్ద పక్షిజాతిగా చెప్పవచ్చని డగ్లస్ పేర్కొన్నారు. ఇది ప్రమాదకరమైన పక్షి అని.. ఇతర పక్షులు, జంతువులతోపాటు మనుషులను కూడా గోళ్లతో చీల్చేసే సామర్థ్యం వీటికి ఉంటుందని తెలిపారు. ఆ్రస్టేలియాలోని న్యూగినియాలో స్థానికులు ఇప్పటికీ ఈ కాస్సోవరీ పక్షుల మాంసం తినడం గమనార్హం. యజమానిని చంపేసింది 2019లో అమెరికాలోని ఫ్లారిడాలో ఒక కాస్సోవరీ పక్షి.. తనను పెంచుకుంటున్న మార్విన్ హజోస్ అనే వ్యక్తిని గోళ్లతో చీల్చి చంపేసింది. విషయం ఏమిటంటే ఆయన ఓ పర్యావరణ ప్రేమికుడు. ఈ పక్షి ఒక్కదాన్నే కాదు.. ఇలాంటి చిత్రమైన మరో వంద రకాల పక్షులు, జంతువులను తన ఎస్టేట్‌లో పెంచేవాడు. ఆయన చనిపోయాక వాటన్నింటినీ వేలం వేశారు. – సాక్షి సెంట్రల్ డెస్క్ -
మహారాష్ట్ర సమీపంలో డైనోసర్ ల ఆనవాళ్ళు
-
వైరల్: అమ్మో.. మరో జురాసిక్ వరల్డ్ పార్క్..?
"Jurassic Park" గురించి చాలా మందికి తెలిసిందే. 1993 సంవత్సరం మొదట్లో వెండితెరపై ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా అప్పట్లో పెద్ద సెన్సేషన్ హిట్ సాధించింది. ఈ సినిమాలోని పెద్ద పెద్ద డైనోసార్లు అటు ఇటుగా తిరుగుతూ, మనుషుల్ని చీమల్లాగా నలిపేసే సన్నివేశాలు చిన్నా, పెద్దా ప్రతి ఒక్కరిలో ఒకింత ఆశ్చర్యం, మరింత భయాన్ని కలిగించాయి. తాజాగా ఓ పార్క్‌లో ఉడుములు(ఇగువానాస్) మందలుగా పరిగెడుతున్న వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఈ వీడియోను ‘స్ట్రాంగ్ జురాసిక్ పార్క్ వైబ్స్’ అనే క్యాప్షన్‌తో మైక్రోబ్లాగింగ్ వెబ్సైట్లో యూజర్ రాబ్ ఎన్ రోల్ పోస్ట్ చేయగా.. మాజీ బాస్కెట్‌బాల్ క్రీడాకారుడు రెక్స్ చాప్మన్ షేర్ చేశారు. ఈ వీడియోను ఇప్పటి వరకు 1.30 లక్షల మంది వీక్షించారు. దీనిలో ఓ ఉడుముల(ఇగువానాస్) గుంపు ఎవరో తరుముతున్నట్టు పరుగెడుతుంది. ‘‘ఈ దృశ్యం1993 జురాసిక్ పార్క్ చిత్రంలో డైనోసార్లు మందలుగా పరుగెత్తడంలా.. ఉంది.’’ అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశారు. ఇది ఎక్కడ జరిగిందో తెలియ రాలేదు.. కానీ ప్రసుత్తం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక ఈ చిత్రంలో కథానాయకుడు అలాన్ గ్రాంట్, పిల్లలు డైనోసార్ల మందలో నుంచి బయట పడతానికి పరిగెత్తుతారు. this is giving off strong Jurassic Park vibes pic.twitter.com/qDJGfxCbsM — Rob N Roll (@thegallowboob) July 7, 2021 -
అత్యంత భారీ డైనోసార్లు ఏవి?
కోట్ల సంవత్సరాల క్రితం భూమండలంపై తిరగాడిన భారీ జీవజాతి ఏదైనా ఉందంటే అది రాకాసిబల్లులదే. పరిశోధకుల అన్వేషణలో ప్రపంచవ్యాప్తంగా వేర్వేరు దేశాల్లో వేర్వేరు ప్రాంతాల్లో కొన్ని డైనోసార్ జాతుల అవశేషాలు బయల్పడ్డాయి. వాటిని విశ్లేషించి ఆ జాతుల్లో అత్యంత భారీ డైనోసార్లు రకాలు కొన్నింటిని శాస్త్రవేత్తలు వర్గీకరించారు. ► బ్రాకియోసారస్ పొడవు: 25 మీటర్లు బరువు: 80 టన్నులు జీవించిన కాలం: దాదాపు 15 కోట్ల ఏళ్ల క్రితం ►అర్జెంటీనోసారస్ పొడవు: 37–40 మీటర్లు బరువు: 100–110 టన్నులు జీవించిన కాలం: దాదాపు 9.8 కోట్ల ఏళ్ల క్రితం ► సూపర్సారస్ పొడవు: 33–35 మీటర్లు బరువు: 45 టన్నులు జీవించిన కాలం: 14.2 నుంచి 15.4 కోట్ల ఏళ్ల క్రితం ► పటగోటైటాన్ మయోరం పొడవు: 37–40 మీటర్లు బరువు: 77 టన్నులు జీవించిన కాలం: దాదాపు 9.5 నుంచి 10 కోట్ల ఏళ్ల క్రితం ► డిప్లోడోకస్ పొడవు: 27 మీటర్లు బరువు: 30–80 టన్నులు జీవించిన కాలం: దాదాపు 15 కోట్ల ఏళ్ల క్రితం పటగోటైటాన్ మయోరం రకం డైనోసార్ పరిమాణంలో మానవుడు, ఏనుగు, జిరాఫీల కంటే ఎంత పెద్దదంటే..? -
అంత కష్టపడి చివరకు ఏం చేశాడంటే..
సిడ్నీ : సాధారణంగా ఎవరైనా దొంగతనానికి వస్తే ఏం చేస్తారు.. ఏవైనా విలువైన వస్తువులు, డబ్బులు, నగలు ఎత్తుకెళ్లడం చూస్తాం. కానీ ఆస్ట్రేలియాలో సిడ్నీకి చెందిన ఒక వ్యక్తి మాత్రం అర్థరాత్రి మ్యూజియంలోకి చొరబడి డైనోసార్‌తో సెల్ఫీ దిగాడు. ఆ తర్వాత కౌబాయ్ టోపీతో పాటు మ్యూజియంలోని కొన్ని ఫోటోలు ఎత్తుకెళ్లాడు. ఈ వింత ఘటన ఆస్ట్రేలియాలో చోటుచేసుకుంది. దీనిపై ఆస్ట్రేలియా పోలీసులు స్పందించారు. (అది మనుషులకు ప్రమాదం: డబ్ల్యూహెచ్‌వో) 'గత ఆదివారం రాత్రి ఒంటి గంటకు ది ఆస్ట్రేలియన్ మ్యూజియంలోకి ఓ వ్యక్తి అక్రమంగా చొరబడ్డాడు. సుమారు 40 నిమిషాల పాటు అతను మ్యూజియంలో స్వేచ్ఛగా సంచరించాడు . కొద్దిసేపటికి అక్కడ ఉన్న ఓ డైనోసర్ శిలజం దగ్గరికి వెళ్లాడు. దాని నోట్లో తన ముఖం పెట్టి సెల్ఫీలు దిగాడు. ఇదంతా అక్కడి సీసీటీవీ ఫుటేజీలో రికార్డయింది. డైనోసార్‌తో సెల్ఫీ తర్వాత అక్కడే ఉన్న ఒక కౌబాయ్ టోపీని, ఓ ఫోటోను ఎత్తుకెళ్లాడు. అదృష్టమేంటంటే ఆ వ్యక్తి మ్యూజియంలో ఉన్న కొన్ని విలువైన పురాతన వస్తువుల జోలికి మాత్రం వెళ్లలేదు. అయితే ఈ విషయాన్ని మాత్రం తాము సీరియస్‌గా తీసుకుంటాం.ఎట్టి పరిస్థితుల్లో ఆ వ్యక్తిని పట్టుకొని తీరుతాం' అంటూ పేర్కొన్నారు. మ్యూజియంలోకి చొరబడ్డ వ్యక్తిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. వాస్తవానికి పునర్ నిర్మాణంలో భాగంగా సిడ్నీ మ్యూజియాన్ని గత ఏడాది నుంచి మూసివేశారు. అయితే పనులన్ని పూర్తైనా ఇంతలో కరోనా మహమ్మారి రావడంతో మరోసారి మ్యూజియాన్ని మూసివేశారు. ('కళ్ల ముందే ప్రాణం పోతుంటే ఏం చేయలేకపోయా') -
నీటిలోనూ రాక్షసబల్లులు
రాక్షసబల్లులు.. ఒకప్పుడు భూమిపై వీటిదే రాజ్యం.. భూమిపై ఓకే.. మరి నీటిలోనో.. అక్కడ కూడా వీటిదే రాజ్యమని తాజాగా తేలింది.. చిత్రంలో చూస్తున్నారుగా.. నీట్లో ఉండే జీవులను ఎలా కరకరలాడిస్తోందో.. దీని పేరు స్పైనొసొరస్ ఈజిప్టాయకస్. చిన్నప్పుడు ఎంతుంటాయో తెలియదు గానీ.. పెద్దయ్యాక మాత్రం 50 అడుగుల పొడవుండి.. 20 వేల కిలోల బరువుంటాయట. పళ్ల సైజు ఆరంగుళాలు. ఈ మధ్యే దీని తోకకు సంబంధించిన శిలాజం మొరాకోలోని ఎడారి ప్రాంతంలో దొరికాయి.. శాస్త్రవేత్తలు దీని తోకను పట్టుకుని.. చరిత్రను తవ్వితే.. మొత్తం విషయం బయటపడింది. నదుల్లో ఎక్కువగా ఉండేవని.. తమ జీవితకాలంలో అత్యధిక భాగం నీటిలోనే గడిపేవని చెబుతున్నారు. నీటిలోనూ రాక్షస బల్లులు ఉండేవనడానికి స్పష్టమైన ఆధారం దొరకడం ఇదే తొలిసారట. -
భూమ్మీద అదే అతి ప్రమాదకరమైన ప్రదేశం!
దాదాపు మిలియన్ సంవత్సరాల నుంచి మానవులు భూమిపై నివసిస్తున్నారు. కానీ ఇప్పటికీ ఎన్నో ప్రశ్నలకు సమాధానాలే లేవు. భూమిపై లోతైనా సముద్రాలు, పోడవైన నదులు, ఎతైనా పర్వతాలు వాటి పుర్వొత్తారాల గురించి అందరికి తెలుసు. కానీ మనం నివసించే ఈ భూమిపై ప్రమాదకరమైన ప్రదేశం కూడా ఉందన్న విషయం మీకు తెలుసా? ఆ ప్రదేశం ఎక్కడుంది.. ఎందుకు అది అంత భయంకరమైన ప్రదేశమైందో ఇంగ్లాండ్ పాలియోంటాలజిస్టు(శిలాజాల అధ్యయనం, భూమిపై జీవ పరిమాణం) శాస్త్రవేత్తలు ఇటివల ఆధ్యయనం చేసి అధికారికంగా ప్రకటించారు. పోర్ట్స్మౌత్ యూనివర్శిటీకి చెందిన శాస్త్రవేత్తలు ఆఫ్రికాకు చెందిన ఏజ్ ఆఫ్ డైనోసార్ల శిలాజాలపై ఇటీవల పరిశోధనలు జరిపారు. ఈ క్రమంలో 100 మిలియన్ సంవత్సరాల క్రితం నాటి శిలాజాలను వారు సమీక్షించగా ఆశ్చర్యపరిచే విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆగ్నేయ మొరాకోలోని క్రెటేషియస్ శిలల ప్రదేశాలలో పరిశోధనలు జరిపిన వారికి అక్కడ ఎగిరే సరీసృపాలు, మొసళ్లతో పాటు భయంకరమైన మాంసాహార నీటి జంతువుల శిలాజాలను కనుగొన్నారు. ఈ ప్రదేశాన్ని కెమ్ కెమ్ గ్రూప్ అని కూడా పిలుస్తారని, ఇది భూమిపై అత్యంత ప్రమాదకరమైన ప్రదేశంగా శాస్త్రవేత్తలు అధికారికంగా ప్రకటించారు. కాగా ప్రస్తుతం ఎండిన భూమిగా ఉన్న ఈ ప్రదేశం ఒకప్పుడు విస్తృతమైన నదీ వ్యవస్థను కలిగి ఉండేదని కూడా వెల్లడించారు. అంతేగాక ఈ నది వ్యవస్థ చుట్టూ వివిధ రకాల జల, భూసంబంధమైన జంతువులు నివసించేవని శాస్త్రవేత్తలు తెలిపారు. ఇక దీనిపై డెట్రాయిట్ మెర్సీ విశ్వవిద్యాలయం పరిశోధకుడు, బయాలజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ నిజార్ ఇబ్రహీం పుస్తకం కూడా రచించించారు. దీని ప్రకారం ఈ ప్రదేశం కెమ్ కెమ్ గ్రూప్‌కు చెందినదని, ఇక్కడ అతిపెద్ద డైనోసార్లు నివసించేవని తెలిపారు. వాటితో పాటు సాబెర్-టూత్ కార్చరోడోంటోసారస్, టెరోసార్స్ వంటి భయంకరమైన మొసళ్లు, ఎగిరే సరిసృపాలు నీటి వేట జంతువులు నివసించేవని వెల్లడించారు. అంతేగాక ఇది ఒక గ్రహమని, భూమిపై ఇది అత్యంత ప్రమాదకరమైన ప్రదేశంగా పుస్తకంలో పేర్కొన్నాడు. ఇక ఇక్కడ మానవులు జీవించినప్పటికీ.. భయంకరమైన సరిసృపాల వేట వల్ల ఎక్కువ కాలం ఇక్కడ మనుగడ సాగించలేక పోయారని కూడా చెప్పారు. -
యుద్ధభూమిలో ఆంబర్ వేట!
జురాసిక్ పార్క్ సినిమా గుర్తుందా...? ఎన్నడో అంతరించిపోయిన రాక్షస బల్లులు మళ్లీ పుట్టుకొస్తాయి దీంట్లో! చెట్ల జిగురులో ఇరుక్కుపోయిన అవశేషాల నుంచి డీఎన్ఏను వేరు చేయడం.. దాన్నుంచి పూర్తిస్థాయి జంతువును సృష్టించడం చిత్రం ఇతివృత్తం! సినిమా.. అందులోని కాల్పనిక టెక్నాలజీ విషయాలన్నీ కాసేపు పక్కనపెడితే... ఆ జిగురు కథ మాత్రం ఎంతో ఆసక్తికరం.. ఇప్పుడదో లాభసాటి వ్యాపారం.. అంతేనా... కానేకాదు.. మన పొరుగుదేశం మయన్మార్‌లో బోలెడంత ఘర్షణకూ ఇదే కారణమవుతోంది! చిన్నప్పుడు మీ పుస్తకాలకు అట్టలేసుకునేందుకు జిగురు వాడారా? ఇప్పుడైతే ఫెవికాల్ లాంటివి వచ్చేశాయి గానీ.. ఓ మూడు దశాబ్దాల క్రితమైతే.. చెట్ల వెంబడి పడి.. సొంతంగా జిగురు సేకరించుకోవాల్సిందే. వేపచెట్టు జిగురు కంటే తుమ్మ బంక చాలా గట్టిదన్న నమ్మకం.. తుమ్మచెట్టు ఎక్కడుందో వెతుక్కోవడం.. కాండం, కొమ్మలపై గాట్లు పెట్టి జిగురు వచ్చేందుకు వేచి ఉండటం.. ఆపై దాన్ని మురిపెంగా సేకరించుకొచ్చి.. దాచుకుని కొంచెం కొంచెం వాడుకోవడం.. ఇదీ పాతకాలపు అనుభవాలు. పొరుగుదేశం మయన్మార్‌లో కొంతమంది ఇప్పటికీ ఇలాగే జిగురు సేకరిస్తున్నారు. కాకపోతే అది ఇప్పుడున్న చెట్లకు కాసింది కాదు. ఎప్పుడో కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం నాటిది. అన్ని పరిస్థితులనూ తట్టుకుని గడ్డకట్టిపోయినవి. ఇంగ్లిష్ పేరు ఆంబర్. ముదురు పసుపు రంగులో లేదంటే కొంచెం ఎరుపు రంగులో గాజు మాదిరిగా పారదర్శకంగా ఉండే ఈ ఆంబర్‌ను సేకరించడం లాభసాటి వ్యాపారమే. జిగురు మాత్రమే ఉంటే నగల్లో వాడతారు. అందులో ఏవైనా ఇతర పదార్థాలు కలసి ఉన్నా.. క్రిమి, కీటక, జంతు అవశేషాలున్నా.. ధర ఎక్కువవుతుంది. రాక్షస బల్లుల అవశేషాల్లాంటివి ఉంటే ఒక్కో ఆంబర్ ముక్క లక్ష డాలర్లు అంటే సుమారు 70 లక్షల రూపాయలు ఖరీదు చేసినా ఆశ్చర్యం లేదు. కొత్త కేంద్రం మయన్మార్... ఆంబర్ చరిత్ర ఘనమైందే. ఒకప్పుడు చైనా పాలకులు దీన్ని నగల్లో విరివిగా వాడేవారు. గ్రీస్‌తోపాటు కొన్ని ఇతర యూరోపియన్ దేశాల్లోని కొన్ని చర్చిల్లోనూ విస్తృతస్థాయిలో దీన్ని వినియోగించారనడానికి ఆధారాలు ఉన్నాయి. అయితే తాజాగా మయన్మార్ ప్రాంతంలో బయటపడుతున్న ఆంబర్ మాత్రం రికార్డులు సృష్టిస్తోంది. అంతర్యుద్ధంతో అతలాకుతలమవుతున్న కచిన్ ప్రాంతంలో పెద్ద ఎత్తున బయటపడుతూండటం ఒక విశేషమైతే.. ఇటీవలే అక్కడ రాక్షస బల్లి రెక్క అవశేషం పూర్తిస్థాయిలో ఉన్న ఓ ముక్క వెలుగుచూడటం ఇంకో విశేషం. సుమారు పదికోట్ల ఏళ్ల క్రితం నాటి ఆంబర్లు కచిన్కు కొంచెం దూరంలో ఉన్న మయిట్కైనా ప్రాంతంలో బయటపడుతున్నాయని.. కొన్నింటిలో క్రిమికీటకాలు పూర్తిస్థాయిలో నిక్షిప్తమై ఉండటం పురాతత్వ శాస్త్రవేత్తలను విపరీతంగా ఆకర్షిస్తోందని అంటున్నారు చైనా యూనివర్సిటీ శాస్త్రవేత్త లిడా జింగ్. మూడేళ్ల క్రితం రాక్షస బల్లి తోకతో కూడిన ఆంబర్‌ను మయన్మార్ నుంచి చైనాకు తీసుకొచ్చింది ఈయనే. అంతర్యుద్ధంతో శాస్త్రవేత్తల అధ్యయనానికి ఇబ్బందులు కోట్ల ఏళ్లక్రితం నాటి జీవజాతుల గురించి అధ్యయనం చేసే పాలియో ఎంటాలజిస్ట్లకు ఆంబర్లోని అవశేషాలు ఎంతో ఉపయోగపడతాయి. అయితే ప్రపంచం మొత్తమ్మీద వాణిజ్యస్థాయిలో ఆంబర్‌ను వెలికితీస్తున్న ఏకైక ప్రాంతం కచిన్ కావడం.. స్థానికులు కచిన్ స్వాతంత్య్రం కోసం సైన్యంతో పోరాడుతూండటం వీరికి సమస్యలు సృష్టిస్తోంది. ఆంబర్‌ను అమ్ముకుని తమ ఉద్యమానికి ఆర్థిక దన్ను సమకూర్చుకోవాలన్నది తిరుగుబాటుదారుల ఉద్దేశం. ఇది సైన్యానికి సుతరామూ ఇష్టం లేదు. ఈ అంతర్యుద్ధం కారణంగా ఇప్పటికే లక్ష మందికి పైగా సామాన్యులు ఆ ప్రాంతాన్ని వదిలి వెళ్లిపోగా.. ఆంబర్ గనుల పరిసరాల్లోని వారు కూడా అక్కడి నుంచి వెళ్లిపోవడం మంచిదని సైన్యం ఒత్తిడి చేస్తోంది. ఫలితంగా ఈ ప్రాంతాలకు వెళ్లడం, ఆంబర్ గనుల్లో భూగర్భ ప్రాంతాలను పరిశీలించడం సాధ్యం కావడం లేదని పరిశోధకులు అంటున్నారు. ఈ సమస్యలన్నింటినీ ఎదుర్కొని రాక్షస బల్లుల అవశేషాల కోసం అక్బర్‌ఖాన్ లాంటివారు కొందరు ప్రయత్నాలు సాగిస్తూనే ఉన్నారు. ఇలాంటి అరుదైన ఆంబర్ వేటకు మించిన థ్రిల్ ఇంకోటి లేదని అక్బర్‌ఖాన్ అంటారు. -
డేంజరస్ డైనోసర్...
‘‘ఈ భూమ్మీద జీవించిన అతి భయంకరమైన జంతువు ఇది’. ఆ జంతువును బంధించి పెట్టారు. ఒక పెద్ద గదంత పెద్దగా ఉంది ఆ జంతువు. హీరో అందులో ఉన్నాడు. అతని భార్యా పక్కనే ఉంది. ఆ జంతువు వాళ్లను చూసింది. గట్టిగా అరిచింది. పట్టుకునేందుకు గాండ్రిస్తూ తిరిగింది. అంతే తిరుగులేని యాక్షన్ అడ్వెంచర్‌కు మూలం దొరికేసింది. ఆ తర్వాత ఏం జరిగింది? అంతకుముందు ఏం జరిగింది? ‘జురాసిక్ వరల్డ్ : ఫాలెన్ కింగ్డమ్’ సినిమా చూసి తెలుసుకోవాల్సిందే! ఆ జంతువు పేరు డైనోసర్. దశాబ్దాలుగా అడ్వెంచర్ సినిమాలను ఇష్టపడుతూ వస్తున్న వారికి డైనోసర్ గురించి, జురాసిక్ పార్క్ గురించీ ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. జురాసిక్ పార్క్‌కు రీబూట్లాగా జురాసిక్ వరల్డ్ సిరీస్ ప్రస్తుతం నడుస్తోంది. ఇందులో కొత్త సినిమా ‘జురాసిక్ వరల్డ్ : ఫాలెన్ కింగ్డమ్’. జూన్ 7న ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఇప్పటికే రెండు, మూడు ట్రైలర్లతో ఆసక్తి పెంచిన ఈ సినిమా, తాజాగా ఫైనల్ ట్రైలర్‌తో అంచనాలను తారాస్థాయికి చేర్చింది. సినిమా ఎలా ఎలా ఉండబోతోందో ఈ ట్రైలర్ స్పష్టంగా తెలియజేస్తోంది. దర్శకుడు జె.ఎ.బయోనా, జురాసిక్ పార్క్ అభిమానులను దృష్టిలో పెట్టుకొని, వాళ్లను ఆకర్షించే సన్నివేశాలతో సినిమాను తెరకెక్కించినట్లు ట్రైలర్ స్పష్టం చేస్తోంది. భారీ విజువల్ ఎఫెక్ట్స్ కోరుకునే వారికి ఈ సినిమా పండగే అని తెలుస్తోంది. పిల్లలు, అడ్వెంచర్స్ ఇష్టపడే పెద్దలూ జురాసిక్ వరల్డ్ కోసం, ఈ ట్రైలర్ విడుదలయ్యాక ఇంకా పిచ్చిగా ఎదురుచూస్తున్నారు. మరి ఈ డేంజరస్ డైనోసర్ మనల్ని ఎలా భయపెడుతుందో, ఆకట్టుకుంటుందో చూడాలి!! -
వేలానికి డైనోసార్ ..!
డైనోసార్ల అస్థిపంజరాలు... పారిస్‌లో వేలానికి సిద్ధమవుతున్నాయి. ఇంత పెద్ద సైజులో ఉన్న ఈ అస్థిపంజరాలు ఎవరైనా కొంటారా? అనుకుంటున్నారా... వీటికున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ప్రసిద్ధ హాలీవుడ్ నటులు లియోనార్డో డికాప్రియా, నికోలాస్ కేజ్ వంటి వారు ఇలాంటివి కొనుగోలు చేస్తున్నారు. తాజాగా బుధవారం జరిగే వేలంలో జూరాసిక్,క్రెటాషియస్ కాలానికి చెందిన ‘అలోసౌరుస్’ డైనోసార్, ఆ తర్వాతి కాలానికి చెందిన అతి పొడవైన మెడ, తోకలతో పాటు మొత్తం 12 మీటర్ల మేర శరీరం కలిగిన ‘డిప్లోడోకస్’ డైనోసార్ అస్థిపంజరాలు ఉంచుతారు. ఇలాంటి శిలాజాల మార్కెట్ కేవలం సైంటిస్టులకే పరిమితం కావడం లేదని, పెయింటింగ్స్ మాదిరిగా వస్తువుల అలంకరణకు డైనోసార్ల అస్థిపంజరాలుంచడం ఇప్పుడు ట్రెండీగా మారిందని ఈ వేలాన్ని నిర్వహిస్తున్న సంస్థ ప్రతినిధి ఐయాకొపొ బ్రియానో వెల్లడించారు. గత రెండు,మూడేళ్లుగా డైనోసార్ల నమూనాల కోసం చైనీయులు ఎక్కువ అసక్తి చూపుతున్నారని, తమ మ్యూజియంలతో పాటు వ్యక్తిగత కలెక్షన్ల కోసం వీటిని కొనుగోలు చేస్తున్నారని పేర్కొన్నారు. వీటి కోసం కొత్తగా ముందుకు వస్తున్న కొనుగోలుదారులు బహుళజాతిసంస్థలతో, ఐరోపా, అమెరికాలకు చెందిన అత్యంత సంపన్నులతోనూ పోటిపడుతున్నారని తెలిపారు. బుధవారం జరగనున్న వేలంలో ఒకింత చిన్న సైజుదిగా భావిస్తున్న (12.5 అడుగులు) అలోసౌరోస్కు దాదాపు రూ. 5.22 కోట్లు (ఆర్నునర లక్షల యూరోలు), పెద్ద ముక్కు నుంచి తోక వరకు 12 మీటర్ల సైజు కలిగిన డిప్లోడొకస్కు దాదాపు రూ.4 కోట్ల వరకు (నాలుగున్నర నుంచి అయిదులక్షల యూరోలు ) రావొచ్చునని భావిస్తున్నారు. చికాగో మ్యూజియంలో డైనోసార్‌కు 8.6 మిలియన్ డాలర్లు... 1997లో మెక్‌డొనాల్డ్, వాల్ట్‌డిస్నీ సంస్థలతో సహా ఇతరుల విరాళాలు కలిపి దాదాపు రూ.55.86 కోట్ల (8.36 మిలియన్ డాలర్ల ) తో పూర్తిస్థాయిలోని ‘టెరన్నోసారస్’ అస్థిపంజరాన్ని కొనుగోలు చేసి చికాగోలోని నేషనల్ హిస్టరీ మ్యూజియంలో ఉంచారు. దీనిని చూసేందుకు లక్షలాది మంది వస్తుండడంతో ఈ కంపెనీలకు మంచి పబ్లిసిటీ వస్తోందని ఓ కొనుగోలు కేంద్ర నిపుణుడు ఎరిక్ మికీలర్ చెప్పారు. వీటిని తమ కలెక్షన్లలో పెట్టుకోవాలని అనుకుంటున్న వారిలో వాటి పళ్లను ఎక్కువగా ఇష్టపడుతున్నారన్నారు.జురాసిక్ కాలాని కంటే పూర్వపు ౖ‘టెరన్నోసారస్’ డైనోసార్ అరుదైన పుర్రెను 2007లో నికోలాస్ కేజ్ కొనుగోలు చేసినా మంగోలియా నుంచి దానిని దొంగిలించి తీసుకొచ్చారని తెలియడంతో తిరిగి అప్పగించేశాడు. ప్రతీ ఏడాది ప్రపంచవ్యాప్తంగా అయిదు డైనోసార్ల అస్థిపంజరాలను వేలానికి పెడుతున్నారు.ట్రియాసిక్ నుంచి క్రెటాషీయస్ కాలం వరకు జీవించిన ‘దెరోపొడా’ డైనాసారో అస్థిపంజరం వచ్చేజూన్‌లో దాదాపు రూ.12.04 కోట్లకు (1.5 మిలియన్ యూరోలకు) వేలం నిర్వహించనున్నారు. –సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
మొదట్లో డైనోసార్లు రెండు కాళ్లమీదే నడిచేవట!
టొరంటో: జురాసిక్ పార్క్.. సినిమా విడుదలైన తర్వాతే డైనోసార్ల గురించి చాలా మందికి తెలిసింది. అయితే సినిమాలో చూపించినట్లుగా డైనోసార్లు నాలుగు కాళ్లపై నడిచేవి కావట. ముందుగా వాటి పరిమాణం కూడా అంత పెద్దగా లేదట. మన కంగారూల సైజులో ఉండి.. అచ్చంగా వాటిలాగే తోకమీద నిలబడేవట. ఈ విషయాలన్నీ శాస్త్రవేత్తల తాజా పరిశోధనలో రుజువయ్యాయి. బైపెడలిజమ్.. అంటే రెండు కాళ్లమీద నడవడమనేది మొదటితరం డైనోసార్లకు చెందిన ప్రధాన లక్షణమని, పరిణామ క్రమంలో మరో రెండుకాళ్లు బలపడడంతో నాలుగు కాళ్లమీద సంచరించడం, శరీర పరిమాణం పెరగడం జరిగాయని కెనడాకు చెందిన ఆల్బెర్టా యూనివర్సిటీ శాస్త్రవేత్త స్కాట్ పర్సన్స్ తెలిపారు. మొదట్లో రెండు కాళ్లపై కూడా నిలబడే కండర సామర్థ్యం డైనోసార్లకు ఉండేదని, దీంతో ముందు రెండు కాళ్లను ఆహార సేకరణకు ఉపయోగించేదని, ప్రస్తుతమున్న బల్లి జాతి జీవుల్లో కూడా ఈ లక్షణాలు కనిపిస్తాయని పర్సన్స్ తెలిపారు. అంతేకాకుండా వీటి శరీర పరిమాణం కూడా చిన్నదిగా ఉండడంతో చాలా దూరం అలసట లేకుండా పరిగెత్తేవని చెప్పారు. -
అగ్నిపర్వతాల వల్ల కాదు
వాషింగ్టన్: డైనోసార్లు దాదాపు 6.5 కోట్ల సంవత్సరాల కింద అంతరించిపోవడానికి భారత్‌లో సంభవించిన అగ్ని పర్వతాల విస్ఫోటం కారణం కాదని ఓ తాజా అధ్యయనంలో తేలింది. క్రిటేషియస్, పేలియోజీన్ కాలాల మధ్య దాదాపు మూడొంతుల వృక్ష, జంతు జాతులు నశించాయని, అందులో డైనోసార్లు కూడా అంతరించి పోయాయనే చర్చ జరుగుతోంది. అయితే భారత్‌లో విస్ఫోటం చెందిన అగ్నిపర్వతాల నుంచి కార్బన్‌డై ఆక్సైడ్ విడుదల కారణంగానే అలా జరిగిందని మరికొందరు చెబుతున్నారు. అయితే కార్బన్‌డై ఆక్సైడ్‌ను శోషించుకున్న సముద్రాల్లో ఎసిడిటీ పెరిగి అది తిరిగి వాతావరణంలోకి కార్బన్‌డై ఆక్సైడ్ పంపటం వల్ల గ్లోబల్ వార్మింగ్ జరగడం వల్ల డైనోసార్లు అంతరించిపోయి ఉంటాయని పేర్కొన్నారు. -
డైనోసార్లు ఇలా అంతరించాయి
మియామి: ‘బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు’ ఇది కొన్ని కోట్ల మంది మెదడ్లో నానుతున్న ప్రశ్న. ఈ ప్రశ్నకు ఇప్పటికిప్పుడు కాకున్న వచ్చే ఏడాదికైన సమాధానం దొరుకుతుంది. కాని కొన్ని వందల ఏళ్లుగా రాక్షసబల్లులు ఎలా అంతరించపోయాయి అనే దానికి మాత్రం ఎవరి దగ్గర సరైన జవాబు లేదు. ఈ విషయంపై ఇప్పటికీ శాస్త్రవేత్తలు పరిశోధనలు సాగిస్తూనే ఉన్నారు. ఒక గ్రహశకలం భూమిని ఢీ కొట్టడం వల్ల డైనోసార్లు అంతరించాయని చాలా మంది శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. కానీ అంతకంటే ముందే కొన్ని మిలియన్ సంవత్సరాలకు పూర్వమే అవి అంతరించి పోయే దశకు చేరుకుని జీవించడానికి పోటీపడ్డాయని కొందరు పరిశోధకులు ఇటీవల అధ్యయనంలో తేల్చారు. ఖండచలనాలు, అగ్ని ప్రమాదాలను అధిగమించి జీవించడానికి రాక్షసబల్లులు చాలా కష్టపడ్డాయని కనుగొన్నారు. 66 మిలియన్ సంవత్సరాల క్రితం ఆస్టరాయిడ్ భూమిని ఢీకొట్టడం వల్ల దుమ్ము, ధూళి కణాలు ఆవరించి సూర్య కిరణాలు భూవాతావరణంలోకి రాకుండా అడ్డుకున్నాయని, చెట్లు, జీవరాశులు నశించిపోయాయని గుర్తించారు. దీంతో డైనోసార్లకు ఆహారం లేకుండా పోవడంతో అంతరించి పోయాయని కనుగొన్నారు.