వైరల్‌: అమ్మో.. మరో జురాసిక్‌ వరల్డ్‌ పార్క్‌..? | A Group Of Iguanas Running Video Went Viral On Social Media | Sakshi
Sakshi News home page

వైరల్‌: అమ్మో.. మరో జురాసిక్‌ వరల్డ్‌ పార్క్‌..?

Published Wed, Jul 7 2021 7:47 PM | Last Updated on Wed, Jul 7 2021 7:51 PM

A Group Of Iguanas Running Video Went Viral On Social Media - Sakshi

"Jurassic Park" గురించి  చాలా మందికి తెలిసిందే. 1993 సంవత్సరం మొదట్లో వెండితెరపై ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా అప్పట్లో పెద్ద సెన్సేషన్ హిట్ సాధించింది.  ఈ సినిమాలోని పెద్ద పెద్ద డైనోసార్లు అటు ఇటుగా తిరుగుతూ, మనుషుల్ని చీమల్లాగా నలిపేసే సన్నివేశాలు చిన్నా, పెద్దా ప్రతి ఒక్కరిలో ఒకింత ఆశ్చర్యం, మరింత భయాన్ని కలిగించాయి.

తాజాగా ఓ పార్క్‌లో ఉడుములు(ఇగువానాస్) మందలుగా పరిగెడుతున్న వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరలవుతోంది. ఈ వీడియోను ‘స్ట్రాంగ్ జురాసిక్ పార్క్ వైబ్స్’ అనే క్యాప్షన్‌తో మైక్రోబ్లాగింగ్ వెబ్‌సైట్‌లో యూజర్ రాబ్ ఎన్ రోల్ పోస్ట్‌ చేయగా.. మాజీ బాస్కెట్‌బాల్ క్రీడాకారుడు రెక్స్ చాప్మన్ షేర్‌ చేశారు. ఈ వీడియోను ఇప్పటి వరకు 1.30 లక్షల మంది వీక్షించారు. దీనిలో ఓ ఉడుముల(ఇగువానాస్) గుంపు ఎవరో తరుముతున్నట్టు పరుగెడుతుంది. ‘‘ఈ దృశ్యం1993 జురాసిక్ పార్క్ చిత్రంలో డైనోసార్లు మందలుగా పరుగెత్తడంలా.. ఉంది.’’ అంటూ ఓ నెటిజన్‌ కామెంట్‌ చేశారు. ఇది ఎక్కడ జరిగిందో తెలియ రాలేదు.. కానీ ప్రసుత్తం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక ఈ చిత్రంలో కథానాయకుడు అలాన్ గ్రాంట్, పిల్లలు డైనోసార్ల మందలో నుంచి బయట పడతానికి  పరిగెత్తుతారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement