iguana
-
వైరల్: అమ్మో.. మరో జురాసిక్ వరల్డ్ పార్క్..?
"Jurassic Park" గురించి చాలా మందికి తెలిసిందే. 1993 సంవత్సరం మొదట్లో వెండితెరపై ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా అప్పట్లో పెద్ద సెన్సేషన్ హిట్ సాధించింది. ఈ సినిమాలోని పెద్ద పెద్ద డైనోసార్లు అటు ఇటుగా తిరుగుతూ, మనుషుల్ని చీమల్లాగా నలిపేసే సన్నివేశాలు చిన్నా, పెద్దా ప్రతి ఒక్కరిలో ఒకింత ఆశ్చర్యం, మరింత భయాన్ని కలిగించాయి. తాజాగా ఓ పార్క్‌లో ఉడుములు(ఇగువానాస్) మందలుగా పరిగెడుతున్న వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఈ వీడియోను ‘స్ట్రాంగ్ జురాసిక్ పార్క్ వైబ్స్’ అనే క్యాప్షన్‌తో మైక్రోబ్లాగింగ్ వెబ్సైట్లో యూజర్ రాబ్ ఎన్ రోల్ పోస్ట్ చేయగా.. మాజీ బాస్కెట్‌బాల్ క్రీడాకారుడు రెక్స్ చాప్మన్ షేర్ చేశారు. ఈ వీడియోను ఇప్పటి వరకు 1.30 లక్షల మంది వీక్షించారు. దీనిలో ఓ ఉడుముల(ఇగువానాస్) గుంపు ఎవరో తరుముతున్నట్టు పరుగెడుతుంది. ‘‘ఈ దృశ్యం1993 జురాసిక్ పార్క్ చిత్రంలో డైనోసార్లు మందలుగా పరుగెత్తడంలా.. ఉంది.’’ అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశారు. ఇది ఎక్కడ జరిగిందో తెలియ రాలేదు.. కానీ ప్రసుత్తం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక ఈ చిత్రంలో కథానాయకుడు అలాన్ గ్రాంట్, పిల్లలు డైనోసార్ల మందలో నుంచి బయట పడతానికి పరిగెత్తుతారు. this is giving off strong Jurassic Park vibes pic.twitter.com/qDJGfxCbsM — Rob N Roll (@thegallowboob) July 7, 2021 -
ఉడుముల విక్రేత అరెస్ట్
తూర్పుగోదావరి ,తాళ్లరేవు (ముమ్మిడివరం): మడ అడవుల్లో సంచరించే ఉడుములను పట్టుకుని కాట్రేనికోన సంత పరిసరాల్లో విక్రయిస్తున్న ఆవుల ఏసు అనే వ్యక్తిని ఆదివారం అటవీశాఖ అధికారులు పట్టుకున్నారు. ఈ మేరకు రాజమహేంద్రవరం వన్యప్రాణి విభాగం అధికారి అనంతశంకర్ ఒక ప్రకటన విడుదల చేశారు. తమకు అందిన సమాచారం మేరకు శనివారం ఉదయం నుంచి ఆకస్మిక తనిఖీలు నిర్వహించగా కాట్రేనికోన సంత ప్రాంతంలో ఉడుములను విక్రయిస్తున్న ఏసును పట్టుకున్నట్టు తెలిపారు. అతడి వద్ద నుంచి ఐదు ఉడుములు స్వాధీనం చేసుకోగా వాటిలో ఒకటి మృతి చెందిందని తెలిపారు. ఈ మేరకు వన్యప్రాణి చట్టం 1972 సెక్షన్ 9, 48ఎ ప్రకారం సదరు వ్యక్తిపై కేసు నమోదు చేసి జ్యుడీషియల్ మేజిస్ట్రేటు వద్ద హాజరుపరచనున్నట్టు ఆయన తెలిపారు. ఉడుమును చంపితే పులిని చంపిన శిక్షే వన్యప్రాణి చట్టం ప్రకారం పులిని చంపిన వారికి విధించే శిక్షే ఉడుమును చంపిన వారికి కూడా వర్తిస్తుందని అనంతశంకర్ తెలిపారు. చట్టంలో ఉడుములు షెడ్యూల్–1లో ఉన్నాయన్నారు. పులిని చంపితే మూడు నుంచి ఏడేళ్ల సంవత్సరాల జైలు శిక్ష, రూ.పది వేలు జరిమానా విధించడం జరుగుతుందని, అదేమాదిరిగా ఉడుములతో వ్యాపారం చేసినా, వాటిని చంపినా అదేశిక్ష విధించడం జరుగుతుందన్నారు. -
భీకరపోరులో ఓడిందెవరు?
వెబ్ డెస్క్ : ఓ గోల్ఫ్ కోర్సులో పాము, ఇగువానాల మధ్య జరిగిన భీకర పోరులో పాము విజయం సాధించింది. ఐదు నిమిషాల పాటు సాగిన ఈ పోరులో పాము ఇగువానాను మింగేసింది. ఈ సంఘటన థాయ్‌లాండ్‌లోని బ్యాంకాక్‌లో చోటు చేసుకుంది. మైదానం వెళ్తున్న ఇగువానాను చూసిన గోల్డెన్ ట్రీ స్నేక్ దాన్ని చుట్టి మింగేయబోయింది. ఇగువానా ప్రతిఘటించడంతో రెండిటి మధ్య భీకర పోరు జరిగింది. ఆ సమయంలో గోల్ఫ్ కోర్సులో ఉన్న ఓ వ్యక్తి ఈ దృశ్యాన్ని చిత్రీకరించారు. కొద్దిసేపటి తర్వాత రెండు అడుగుల పొడవున్న ఇగువానాను పాము మింగేసిందని ఆయన పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. -
హాలీవుడ్ ఛేజింగ్‌ను మైమరపించేలా!
హీరో వెంట విలన్లు పడుతుంటారు. హీరో వాళ్లను అక్కడినుంచి దూరంగా తీసుకెళ్లడానికి పరుగు పెడుతుంటాడు. గల్లీల్లో దూరి, బండ్ల మీదకు ఎగురుతూ ఎలాగోలా వాళ్ల బారి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తాడు. హాలీవుడ్ సినిమాల్లో ఈ తరహా ఛేజింగ్ మనం చూస్తుంటాం. కొండలు, గుట్టలు దాటుకుని మరీ విలన్లను ఒక ఆట ఆడించడం అక్కడి హీరోలకు వెన్నతో పెట్టిన విద్య. సరిగ్గా అదే తరహాలో.. పదుల సంఖ్యలో పాములు వెంబడిస్తున్నా, వాటి బారి నుంచి ఉడుము ఎలా తప్పించుకుందన్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. జంతువులకు సంబంధించిన డాక్యుమెంటరీలలో రెండు నిమిషాల కేటగిరీలో అత్యంత ఉత్కంఠభరితంగా, ఆసక్తికరంగా ఉన్న వీడియో ఇదేనని ప్రస్తుతం అంటున్నారు. సాధారణంగా ఉడుము అనగానే దాని పట్టు గుర్తుకొస్తుంది. పట్టుకుంటే ఒక పట్టాన విడిచిపెట్టని తత్వం దానిది. కానీ, అదే సమయంలో కావాలనుకుంటే ఎలాగైనా జారిపోయి, తప్పించుకోగల సామర్థ్యం కూడా దానికి ఉందని ఈ వీడియోలో తెలుస్తోంది. నల్లటి కొండరాళ్లలో దాదాపు ఏడు అడుగుల పొడవున్న పాములు దాగి ఉంటాయి. ఆ పర్వతపాద ప్రాంతంలో ఒక ఉడుము వెళ్తూ ఉంటుంది. ఒక పాము ఏమీ తెలియనట్లుగా దానికి దూరంగా వెళ్లి, దాని పక్కనుంచే వెళ్లిపోతుంది. అక్కడే ఆగిపోయిన ఉడుము.. అది ఏం చేస్తుందా అని చూస్తూ ఉంటుంది. కానీ ఈలోపు వెనక నుంచి వచ్చిన మరో పాము ఉడుము తోకను పట్టుకోడానికి ప్రయత్నిస్తుంది. అక్కడి నుంచి అసలైన ఛేజింగ్ మొదలవుతుంది. దాన్నుంచి తప్పించుకున్న ఉడుము వేగంగా పరుగులు పెడుతుంటే, కొండ గుట్టల్లోంచి కొన్ని పదుల సంఖ్యలో ఒక్కసారిగా పాములు జరజరా ముందుకొచ్చి, ఆ ఉడుము మీద మూకుమ్మడిగా దాడి చేయడానికి ప్రయత్నిస్తాయి. వాటన్నింటి నుంచి కూడా అత్యంత చాకచక్యంగా తప్పించుకునే ఆ ఉడుము, కొండ ఎక్కేయాలని ఒక బండ రాయి వద్దకు చేరుకుంటుంది. ఈలోపు అక్కడే బండరాళ్లలో దాగున్న మరికొన్ని పాములు ఒకేసారి దాన్ని చుట్టుముట్టి, శరీరాన్ని చుట్టేస్తాయి. ఇక ఉడుము పని అయిపోయింది.. దొరికేసిందే అనుకుంటున్న తరుణంలో మళ్లీ అక్కడి నుంచి జారిపోయి తప్పించుకుని కొండపైకి ఎక్కేస్తుంది. మధ్యలో కూడా పాములు చిట్టచివరిక్షణం వరకు ప్రయత్నించినా ఎలాంటి ఉపయోగం ఉండదు. చివరకు ఉడుము కొండ శిఖరం మీదకు వెళ్లి, అక్కడ ఉన్న తన మరో స్నేహితుడిని కలిసి విజయగర్వంతో ఒక్కసారి పైకి చూస్తుంది! -
హాలీవుడ్ ఛేజింగ్‌ను మైమరపించేలా..!
-
వామ్మో.. ఇది ఉడుమా.. గాడ్జిల్లా పిల్లనా?
గ్రాఫిక్స్, త్రీడి చిత్రాల్లో గాడ్జిల్లా(రాక్షస బల్లి)ని మనం ఇప్పటి వరకు చూశాం. ఒకప్పుడు అది ఇలా ఉండేదని మిగిలిపోయిన శిలాజాల ద్వారా మనం వాటి పరిమాణాన్ని అంచనా వేశాం తప్ప ఏనాడు ప్రత్యక్షంగా చూడలేదు. అయితే, మనం ఇప్పటి వరకు రాక్షసబల్లి ఎలా ఉంటుందని ఇప్పటి వరకు చూస్తూ వచ్చామో అచ్చం అలాంటి రూపమే ప్రత్యక్షంగా దర్శనమిచ్చింది. అది కూడా గాలపాగో ద్వీపంలోని ఇసబెల్లా కోస్తా తీరంలో. అవునూ.. సముద్ర జలాల్లో ప్రత్యేక కెమెరాల ద్వారా వీడియోలు తీసి అందులోని వృక్షరాశి, జంతురాశి గురించి ఆరా తీసే ప్రత్యేక గజ ఈతగాళ్లకు ఇది కనిపించి అబ్బురపడిపోయేలా చేసింది. కాకపోతే ఇది రాక్షసబల్లి కాదుగానీ, అచ్చం అలాగే ఉన్న ఓ పెద్ద ఉడుము. ఇది నీటి అడుగు భాగంలో ఎంతో నేర్పుగా డైవర్స్ తోపాటు ఈదుతూ రుచికరమైన ఆహారం కోసం నీటి అడుగున పాకుతూ ఆ తర్వాత గాలి తీసుకునేందుకు తిరిగి సముద్ర ఉపరితలంపైకి రావడాన్ని వారు వీడియోలో చూశారు. ఇది అచ్చం జురాసిక్ పార్క్ సినిమాలో జంతువులు ఎలా ఉన్నాయో అలాగే ఉంది. ఇంతకీ దీని పరిమాణం ఎంత ఉందని అనుకుంటున్నారు.. సరిగ్గా ఒక మనిషి అంత పెద్దగా ఉందట. ఇలా ప్రతిసారి నీటిలో వేగంగా మునుగుతూ ఆహారం కోసం వెతుకుతూ తోకతో ఈదుతూ వేగంగా ముందుకు కదలడం ఈ వీడియోలో రికార్డయింది. -
ఉడుం'పట్టు'కు యత్నించి ఇరుక్కుపోయాడు!
-
ఉడుం'పట్టు'కు యత్నించి ఇరుక్కుపోయాడు!
పట్టు పట్టడంలో ఉడుముతో పోటీపడి.. ప్రమాదం నుంచి బయటపడ్డాడు ఓ యువకుడు. తనదారిన తాను వెళుతోన్న ఉడుమును పట్టుకునే ప్రయత్నం చేసి కొండగుహలో.. బండరాళ్ల మధ్యలో ఇరుక్కుపోయిన అతగాడిని కాపాడటానికి ఏకంగా భారీ యంత్రాలను రంగంలోకి దింపాల్సి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. నిజామాబాద్ జిల్లా మద్నూరు మండలం పెద్ద శెక్కర్గకు హన్మాండ్లు(22) గొర్రెలకాపరి. ఆదివారం తన స్నేహితులతో కలిసి గొర్రెలు కాయడానికి వెళ్లిన హన్మాండ్లుకు ఓ ఉడుము కనపడింది. దాన్ని పట్టుకుందామనుకున్నాడు.. మొదటి ప్రయత్నంలోనే అది సర్రున జారిపోయి బండరాళ్ల మధ్యన దూరింది. హన్మాండ్లు కూడా వీరుడిలా బండరాళ్ల మధ్యకు ప్రవేశించాడు. ఉడుము మాత్రం నేల బొరియల్లోకి దూరిపోగా హన్మాండ్లు మాత్రం దిక్కుతోచని స్థితిలో అలా రాళ్ల మధ్యే ఇరుక్కుయాడు. అతడ్ని బయటికి తీయడానికి స్నేహితులు చేసిన ప్రయత్నాలన్నీ విఫలం కావడంతో విషయాన్ని గ్రామస్తులకు చెప్పేందుకు వెళ్లారు. ఈలోపు అరకొర సిగ్నల్స్ అరకొరగా కొట్టుమిట్టాడుతున్న మొబైల్ ఫోన్ నుంచి తండ్రికి ఫోన్ చేసి తన దుస్థితిని వివరించాడు హన్మాండ్లు. ఆ తర్వాత ఊరంతా ఒక్కటైంది. పలుగు, పారల సాయంతో హనుమాండ్లును బయటికి తీసే ప్రయత్నం చేశారు. కానీ విఫలమయ్యారు. ఇక చేసేదేమీలేక చివరికి ఓ జేసీబీ యంత్రాన్ని తెప్పించి ఆ ప్రాంతమంతా తొవ్వించారు. బండరాళ్లన్నింటినీ తొలిగించిన తర్వాతగానీ సురక్షితంగా బయటికి రాలేదు హన్మాండ్లు. ఆ తర్వాత భయంతో వణికిపోతూ అతడు.. నవ్వుతూ ఊరివాళ్లు ఇళ్లకేసి బయలుదేరారు.. హన్మండ్లు పాక్కుంటూ లోపలికెళ్లిన ప్రాంతం హన్మండ్లు చద్ది.. దీన్ని చూసే గుర్తుపట్టారు.. హన్మండ్లుతో మాట్లాడుతున్న గ్రామస్తులు జేసీబీతో రాళ్లను తీస్తున్న దృశ్యం బయటకు వచ్చిన హన్మండ్లు