
వెబ్ డెస్క్ : ఓ గోల్ఫ్ కోర్సులో పాము, ఇగువానాల మధ్య జరిగిన భీకర పోరులో పాము విజయం సాధించింది. ఐదు నిమిషాల పాటు సాగిన ఈ పోరులో పాము ఇగువానాను మింగేసింది. ఈ సంఘటన థాయ్‌లాండ్‌లోని బ్యాంకాక్‌లో చోటు చేసుకుంది. మైదానం వెళ్తున్న ఇగువానాను చూసిన గోల్డెన్ ట్రీ స్నేక్ దాన్ని చుట్టి మింగేయబోయింది.
ఇగువానా ప్రతిఘటించడంతో రెండిటి మధ్య భీకర పోరు జరిగింది. ఆ సమయంలో గోల్ఫ్ కోర్సులో ఉన్న ఓ వ్యక్తి ఈ దృశ్యాన్ని చిత్రీకరించారు. కొద్దిసేపటి తర్వాత రెండు అడుగుల పొడవున్న ఇగువానాను పాము మింగేసిందని ఆయన పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Comments
Please login to add a commentAdd a comment