ఫుల్‌స్పీడ్‌లో ఉన్నప్పుడు పాము లిఫ్ట్‌ అడిగితే.. | Snake Lunges At Man Riding A Motorcycle | Sakshi
Sakshi News home page

ఫుల్‌స్పీడ్‌లో ఉన్నప్పుడు పాము లిఫ్ట్‌ అడిగితే..

Published Wed, Apr 19 2017 7:41 PM | Last Updated on Wed, Aug 29 2018 8:36 PM

ఫుల్‌స్పీడ్‌లో ఉన్నప్పుడు పాము లిఫ్ట్‌ అడిగితే.. - Sakshi

ఫుల్‌స్పీడ్‌లో ఉన్నప్పుడు పాము లిఫ్ట్‌ అడిగితే..

థాయిలాండ్‌: యూట్యూబ్‌లో ఓ వీడియో ఇప్పుడు తెగ ట్రెండింగ్‌ అవుతోంది. వేగంగా బైక్‌పై వెళుతున్న ఓ వ్యక్తిని పలుకరించిన అనుకోని అతిథికి సంబంధించినదే ఆ వీడియో. అయితే, ఆ అతిథి పలకరించింది ప్రేమతో కాదు.. భయంతో.. ఆ అతిథి వ్యక్తి కూడా కాదు.. ఓ పెద్ద పాము. అదేమిటని అనుకుంటున్నారా.. మరేం లేదు. ఈ నెల (ఏప్రిల్‌) 16న థాయిలాండ్‌లోని లాంపాంగ్‌ రోడ్డులో పట్టపగలు ఓ వ్యక్తి బైక్‌ వేసుకొని వేగంగా వెళుతున్నాడు. అతడి వెనుకాలే ఓ కారులో కొంతమంది వస్తున్నారు.

వారు సరదాగా రోడ్డు వెంట వీడియోలు తీస్తూ డ్రైవ్‌ చేస్తున్నారు. అంతలో తమ కారును దాటేసి ముందుకెళ్లిన బైక్‌పై వారి దృష్టిపడి ఆ బైకిస్టును వీడియో తీయడం మొదలుపెట్టారు. ఈలోగా అక్కడ ఏదో అనూహ్య సంఘటన జరగబోతున్నట్లు వారికి అనిపించింది. ఎందుకంటే రోడ్డుపక్కనే ఉన్న చెట్లల్లో నుంచి ఓ పెద్ద పాము రోడ్డు దాటడం ప్రారంభించింది. సరిగ్గా అది వచ్చే సమయానికి బైకిస్టు కూడా వెళ్లాడు. దీంతో భయంతో ఆ పాము కాస్త ఎక్కడ బైక్‌ కింద పడతానో అని ఎగిరి దూకింది.

ఆ సన్నివేశం ఎలా కనిపించిందంటే ‘నాకు నీ బైక్‌పై లిఫ్ట్‌ ఇవ్వు అని అడిగి అందుకున్నట్లుగా.. అదృష్టవశాత్తు అతడు బైక్‌ వేగం పెంచడంతో పాముకు అందకుండా పోయాడు. వాస్తవానికి అది భయంకరమైన విష సర్పం. అది భయంతో దూకినప్పటికీ అతడు దొరికినట్లయితే ఆ వేగంలోనే కాటు వేసేది. ఈ వీడియోను ఈ నెల (ఏప్రిల్‌) 17న యూట్యూబ్‌లో పోస్ట్‌ చేయగా దాదాపు 20లక్షలమంది చూశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement