బ్యాంకాక్: సాధారణంగా చాలా మంది పాముని చూడగానే భయంతో వెన్నులో వణుకుపుడుతుంది. మరికొందరైతే పాము ఫలాన చోట కనిపించిందంటే.. ఆ దారిదాపుల్లోకి వెళ్లటానికి సాహసించరు. అయితే, ఒక్కొసారి పాములు తమ దారి తప్పి ఆవాసం కోసం, ఆహర అన్వేషణలో జనవాసాల మధ్యన చేరుతుంటాయి. ఇలాంటి సమయాల్లో ఆత్మరక్షణకు ఒక్కొసారి అవి కాటు వేస్తాయి.
మరికొన్నిసార్లు అవి కూడా ప్రమాదాల బారిన పడతాయి. కొందరు పాములు కనిపిస్తే.. స్నేక్ సోసైటి వారికి సమాచారం అందించి వాటిని ఏ ఆపద తలపెట్టరు. ఇలాంటి ఎన్నో వీడియోలు ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. తాజాగా, ఇలాంటి ఘటన ఒకటి థాయిలాండ్‌లో జరిగింది. దక్షిణ థాయి ప్రావిన్స్‌లో క్రాబీలోని ఒక తోటలో గిరినాగు ( కోబ్రా) ప్రత్యక్షమయ్యింది. దీంతో అక్కడి వారంతా భయంతో వణికిపోయారు.
అది దాదాపు 14 అంగుళాల వరకు పోడవుంది. స్థానికులు వెంటనే పాములను పట్టే వారికి సమాచారం అందించారు. అయితే, నైవాధ్ అనే వ్యక్తి ఆ ప్రదేశంలో పాములను పడుతుంటాడు. అతను అక్కడికి చేరుకున్నాడు. ఆ తర్వాత కోబ్రాను పట్టుకోవడానికి ప్రయత్నించాడు. గిరినాగు మాత్రం బుసలు కొడుతూ.. ఎంత సేపటికి అతనికి లొంగలేదు. అతను పట్టుకుందామనుకోనేసరికి బుసలు కొడుతూ.. కాటు వేయడానికి రాసాగింది.
దాదాపు 20 నిముషాలు కష్టపడి చాకచక్యంగా కోబ్రాను లొంగతీసుకున్నాడు. ఆ తర్వాత నైవాధ్.. కోబ్రా.. ప్రపంచంలో అత్యంత విషపూరిత సర్పమని తెలిపాడు. ఇది పెద్ద పాములను సైతం తింటుందని తెలిపాడు. అత్యంత వేగంగా కూడా ప్రయాణిస్తుందని, కాటు వేస్తే తక్కువ సమయంలోనే మనిషి ప్రాణాలు గాల్లో కలుస్తాయని వివరించాడు. ఆ తర్వాత కోబ్రాను సమీపంలోని అడవిలో వదిలేశాడు.
ఇవి దక్షిణ, ఆగ్నేయ ఆసియాలో ఎక్కువగా కనిపిస్తాయి. కాగా, అతను కోబ్రాను పట్టేటప్పుడు స్థానికులు వీడియో తీశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. దీన్ని చూసిన నెటిజన్లు.. ‘వామ్మో.. ఎంత భయంకరంగా ఉంది..’, ‘కాటు వేస్తే.. అంతే సంగతులు..’, ‘మీ ధైర్యానికి జోహర్లు..’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
చదవండి: వంతెనను ప్రారంభించిన మహరాష్ట్ర మంత్రి.. గిరిజనులు ఎన్నో ఏళ్లుగా
Comments
Please login to add a commentAdd a comment