Snake Society
-
పెయింట్ డబ్బాలో చిక్కుకున్న పాము
తమిళనాడు: మైలాడుదురై బి జిల్లా కొల్లిడం సమీపంలో ఒక పాము పెయింట్ డబ్బాలో తల చిక్కుకుని తీవ్ర ఇబ్బంది పడింది. ఈ వీడియో వైరల్ అయింది. అలక్కుడి తోనితురకు చెందిన ఇందుమతి (30) ఇంటికి ఎదురుగా ఉన్న ముళ్ల కంచె పక్కన పాము తిరుగుతోంది. అది దానంతట అదే వెళ్లిపోతుందని అందరూ భావించారు. ఈ క్రమంలో పాము మూడు రోజుల క్రితం పెయింట్ డబ్బాలోకి దూరేందుకు ప్రయత్నించింది. డబ్బా మూతలో తల ఇరుక్కుపోవడంతో అది లోపలికి వెళ్లలేక, బయటకు రాలేక అలాగే విలవిలలాడుతూ ఉండిపోయింది. పాము వెళ్లిపోతుందని భావించిన ఇందుమతి కుటుంబ సభ్యులు ఆ ప్రాంతానికి వెళ్లి పరిశీలించింది. ఆ సమయంలో దినేష్ అనే వ్యక్తి చిన్న పెయింట్ డబ్బాను పాము తలపై పెట్టడంతో అది అక్కడి నుంచి వెళ్లిపోయింది. పాము ప్రాణాలతో పోరాడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. -
పట్టు విడుపుల సర్పపర్వం
జనాభా.. జనాల అవసరాలూ పెరుగుతున్నాయి! అందుకోసం వనాలను.. పొలాలను.. ఖాళీ స్థలాలను అనువుగా మలచుకోవడమే కరెక్ట్ కాదు! ఆ ఎరుక ఉన్నా అమలు చేసే పరిస్థితి లేదు. దాంతో అక్కడ బతుకుతున్న ప్రాణులు దిక్కు తోచక ఇళ్లల్లోకి వస్తాయి.. వస్తున్నాయి కూడా! విస్తరిస్తున్న నగరాల్లో ఈ సమస్య మరీ ఎక్కువ.. అటు వన్య ప్రాణులకు.. ఇటు మనుషులకు! పైగా వానాకాలం.. పాముల వంటి సరిసృపాలు కలుగులు, బొరియల్లోంచి బయటకు వచ్చే సమయం.. అవి ఒళ్లు విరుచుకుని కళ్లు తెరిస్తే.. చుట్టూ అంతా కాంక్రీట్ జంగిలే! ఏం చేస్తాయి పాపం.. దిక్కు తోచక ఇళ్లల్లోకి జొరబడ్తాయి.. ఇంటి పరిసరాల్లో తచ్చాడ్తాయి! మనం భయంతో గెంతులేస్తాం.. సాయం కోసం వెంటనే ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్స్ సొసైటీకి ఫోన్ చేస్తాం! ఆ సొసైటీ వాలంటీర్స్ దాన్ని పట్టుకుని ఎక్కడో దూరంగా వదిలేస్తారు. ఇలా పామును పట్టుకోవడం... విడిచిపెట్టడం మధ్య పెద్ద ప్రహసనమే ఉంటుంది. గాయాలైతే ఆ పాముకు వైద్యం చేయడం, విడిచిపెట్టే లోపు అది గుడ్లు పెడితే.. పిల్లలు బయటకు వచ్చేదాకా కంటికి రెప్పలా కాపాడడం, ఆపై అటవీ శాఖ అధికారుల సూచనల మేరకు అనువైన ప్రాంతంలో పాముల్ని వదలడం.. ఇలా కనిపించని ఘట్టాలు అనేకం ఉంటాయి. వీటన్నింటినీ ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్స్ సొసైటీ వాలంటీర్లే నిర్వర్తిస్తుంటారు. ఈ సొసైటీ గురించి తెలుసుకుందాం.. ఏటా పది వేలకు పైనే... ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్స్ సొసైటీకి ప్రతి రోజూ హైదరాబాద్‌తో పాటు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి 100 నుంచి 150 ఫోన్లు వస్తుంటాయి. సరాసరిన ఏడాదికి 10 వేలకు పైగా పాముల్ని రెస్క్యూ చేస్తోందీ సొసైటీ. వీటిలో 50 శాతం నాగు పాములు, 35 శాతం జెర్రిపోతులే. రియల్ ఎస్టేట్ వ్యాపారం, నిర్మాణాల వల్ల కొండలు, గుట్టలు, దట్టమైన చెట్లుండే ప్రాంతాలు అంతరించిపోతుండడంతో.. అడాప్టెడ్ రెపై్టల్స్గా పిలిచే ఈ పాములు జనావాసాల్లోకి వచ్చేస్తున్నాయి. చెత్త, మొక్కలు, రంధ్రాలు, నిర్మాణ సామాగ్రి పడి ఉండే ప్రాంతాలను తమ ఆవాసాలుగా మార్చుకుంటున్నాయి. మనుషులు తమ ఇళ్ల సమీపంలో పడేసే చెత్త, ఆహార వ్యర్థాల కోసం ఎలుకలు, కప్పలు వంటివి చేరతాయి. వాటిని ఆహారంగా తీసుకోవడానికే ఈ పాములు వచ్చి .. కొన్ని సందర్భాల్లో ఇళ్లల్లోకీ చేరుతున్నాయి. ఇక్కడ ఓ విషయం ప్రస్తావించాలి. సాధారణంగా నాగు పాము, జెర్రిపోతు కలసి ఉంటాయనుకుంటారు. కాని అది కేవలం అపోహే. ఈ రెండూ ఒకే రకమైన ఆహారం తీసుకుంటాయి కాబట్టి ఆ తిండి దొరికే ప్రాంతాల్లో ఇవి తిరుగాడుతుంటాయి. రాజ్‌కుమార్ కానూరి .. హైదరాబాద్ వాసి. ఒకసారి ఇలాగే నివాస పరిసరాల్లో తిరుగుతున్న సర్పాన్ని కొందరు చంపడం చూసి చలించిపోయాడు. అన్యాయంగా ఓ జీవి మృత్యువాత పడ్డంతో తట్టుకోలేకపోయాడు. మనుషుల నుంచి పాములను... పాముల నుంచి మనుషులను కాపాడ్డానికి ఏదైనా చేయాలనుకున్నాడు. అదే ‘ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్స్ సొసైటీ’. దీన్ని 1995, జూన్ 30న స్థాపించాడు. జువాలజీ బ్యాక్‌గ్రౌండ్ ఏమీలేని.. బీకామ్ గ్రాడ్యుయేట్ అయిన రాజ్‌కుమార్ కేవలం పాముల మీదున్న ప్రేమ.. బయోడైవర్సిటీని సంరక్షించాలనే కాంక్షతోనే ఈ సొసైటీని స్థాపించారు. రాజ్‌కుమార్ 2010 అక్టోబర్ 25న కన్నుమూశారు. తొలినాళ్లల్లో ఆరుగురుగా మాత్రమే ఉన్న వాలంటీర్ల సంఖ్య ప్రస్తుతం 150కి చేరింది. పాముల్ని రెస్క్యూ చేయడం, అవగాహన కార్యక్రమాలు తదితర విధులను నిర్వర్తిస్తుంటారు వీళ్లు. అటవీ శాఖ సహకారంతో ఈ సొసైటీ 2020, జూన్ 5న..మేడ్చెల్ జిల్లా భౌరమ్పేటలో స్నేక్ రెస్క్యూ సెంటర్‌నూ ఏర్పాటు చేసింది. పట్టుకున్న పాముల్ని సంరక్షించి. పరిరక్షించడమే దీని లక్ష్యం. అనుకోకుండా ఇళ్లు, ఇంటి పరిసరాల్లోకి వచ్చిన పాముల్ని చూసిన కొందరు భయంతో వాటిని చంపడానికి ప్రయత్నిస్తుంటారు. అలాంటి సందర్భాల్లో కొన్ని పాములు చనిపోతుండగా, మరికొన్ని గాయపడి రంధ్రాల్లో దాక్కుంటాయి. అప్పుడైనా స్నేక్స్ సొసైటీకి సమాచారం ఇస్తే వాటిని సొసైటీ పట్టుకుంటుంది. గాయపడిన వాటిని జూపార్క్‌కు తరలిస్తుంది. అక్కడి పశువైద్యులతో చికిత్స చేయించి రెస్క్యూ సెంటర్‌కు తీసుకువస్తారు సొసైటీ సభ్యులు. ఆ పాములకు ఎక్స్‌రేలు తీయిస్తారు. వాటి ఒంటిమీద గాయాలుంటే కుట్లు వేసి.. కట్లు కట్టి.. మందులిస్తారు. రెస్క్యూ... చికిత్స... మూడేళ్ల క్రితం.. నార్సింగి ప్రాంతంలో ఓ కొండచిలువ మీద నుంచి వాహనం వెళ్లి అది తీవ్రంగా గాయపడింది. దాన్ని.. వాలంటీర్లు రెస్క్యూ సెంటర్‌కు తీసుకువచ్చే సమయానికి అది కేవలం కళ్లు మాత్రమే కదపగలిగే స్థితిలో ఉంది. ఎనిమిది అడుగుల పొడవున్న ఈ కొండచిలువకు దాదాపు ఏడాది పాటు వివిధ రకాలైన చికిత్సలు అందించారు. అప్పటికి గాని అది పూర్తిగా కోలుకుని ఆహారాన్ని వేటాడుకునే స్థితికి చేరుకోలేదు. ఆ తర్వాతే సొసైటీ వాలంటీర్లు దాన్ని అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు. స్నేక్ రెస్క్యూ సెంటర్లో ‘ప్రసవాలు’ కూడా జరుగుతుంటాయి. రెస్క్యూ చేసి తరలిస్తున్న సమయంలో కొన్ని పాములు గుడ్లు పెడతాయి. పెట్టిన గుడ్లను సంరక్షించే గుణం లేదు పాములకు. అందుకే రెస్క్యూ చేసి తరలిస్తున్నప్పుడు పాము గుడ్లు పెడితే.. ఆ పామును, గుడ్లను కలిపి ఉంచరు. నిర్ణీత సమయం తర్వాత పామును వదిలిపెట్టి.. గుడ్లను మాత్రం ఇంక్యుబేటర్‌లో పెడతారు. వాటికి కావాలసిన తేమ, వేడి కలగలసిన వాతావరణాన్ని ఆ ఇంక్యుబేటర్‌లో ఏర్పాటు చేస్తారు. ఈ గుడ్లు పిల్లలుగా మారడానికి గరిష్ఠంగా రెండు నెలలు పడుతుంది. ఇలా పుట్టిన పాము పిల్లలకు వారం రోజులు బతకడానికి కావల్సిన శక్తి ఉంటుంది. ఇంక్యుబేటర్ ద్వారా పిల్లలుగా... గుడ్డులో ఉంటే యోక్ (పచ్చసొన) ద్వారా ఇది వాటికి వస్తుంది. అప్పటి వరకు ఎలాంటి ఆహారం తీసుకోవు. ఆ తర్వాతే ఆ పిల్లలు కుబుసం విడిచి.. ఆహారాన్ని వేటాడటం మొదలెడతాయి. అలా ఇంక్యుబేటర్‌లో పుట్టిన పాము పిల్లలను వారం రోజుల్లో అడవిలో విడిచిపెడతారు. ఏ రకం పాములను ఏ అటవీ ప్రాంతంలో వదలాలన్న దానికీ ఓ లెక్కుంటుంది. రాష్ట్రంలోని ఆయా అటవీ ప్రాంతాల్లో కొన్ని రకాల జాతులకు చెందిన సర్పాలే ఉంటాయి. అలాంటి చోట కొత్త వాటిని వదిలితే మనుగడ సాగించలేవు. ఆ జాబితా ఆధారంగా అటవీ శాఖ అధికారులు ఏ అడవిలో ఏ జాతి సర్పాలను వదలాలన్నది సొసైటీ వాలంటీర్లకు సూచిస్తారు. ఆ ప్రకారమే ఆ పాములను తీసుకువెళ్లి వదులుతారు. అదీ సూర్యోదయం తర్వాత 11 గంటల్లోపు, సాయంత్రం 3–4 గంటల మధ్య మాత్రమే వదులుతారు. ఒక అడవిలో ఒక బ్యాచ్ సర్పాన్ని వదిలిన తర్వాత కనిష్ఠంగా ఏడాది తర్వాతే ఆ ప్రాంతంలో మరో బ్యాచ్ సర్పాన్ని వదిలిపెడతారు. సమతుల్యం కోసమే ఈ జాగ్రత్త తీసుకుంటున్నారు. కనిపించేవన్నీ విషసర్పాలు కాదు... పాముల్లో విషం కలిగినవి, విషం లేనివి ఉంటాయి. హైదరాబాద్‌లో మొత్తం 38 రకాల సర్పాలు ఉండగా... వీటిలో నాగు పాము, రక్త పింజర, కట్లపాము, చిన్న పింజర మాత్రమే విష సర్పాలు. దేశ వ్యాప్తంగా ఇవి విస్తరించి ఉండడంతో వీటికి బిగ్ ఫోర్ వీనమస్ స్నేక్స్ ఆఫ్ ఇండియా అని పేరు వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో 43 రకాల సర్పాలు ఉండగా... తొమ్మిది మాత్రమే విషసర్పాలు. నాగు పాము, రక్త పింజర, కట్లపాము, చిన్న పింజరలతో పాటు అరుదైన రకాలుగా పిలిచే ఏటూరునాగారం ప్రాంతంలో ఉండే బంగారు గాజుల కట్లపాము, ఆమ్రాబాద్, కవ్వాల్ అభయారణ్యాల్లో నివసించే బాంబూ పిట్ వైపర్, కొత్తగూడెం ప్రాంతంలో కనిపించే స్లెండర్ కోరల్ స్నేక్, ఆంధ్రప్రదేశ్.. కోస్తా ప్రాంతంలో ఉండే సముద్ర పాములు, సాలూరు–మారేడుమిల్లి మధ్య కనిపించే కింగ్ కోబ్రా మాత్రమే విషంతో ఉంటాయి. హైదరాబాద్‌కు సంబంధించి గచ్చిబౌలి–మియాపూర్ మధ్య కొండ చిలువలు ఎక్కువ. ఇక్కడ ఏటా 50 వరకు కొండ చిలువలు రెస్క్యూ అవుతున్నాయి. వాటి కలయికకూ ఓ సమయం... సాధారణంగా ఏడాదికి ఒకసారి మాత్రమే మేటింగ్ చేస్తాయి. ఆ సమయంలో ఆడ పాములు ఫెరమోన్స్గా పిలిచే ద్రవాలను స్రవిస్తాయి. ఓ రకమైన వాసన కలిగి ఉండే వీటి ద్వారానే ఆడ పాముల ఉనికిని మగ పాములు గుర్తిస్తాయి. కలయిక జరిగిన రెండు నెలల తర్వాత ఆడ పాము గుడ్లు పెడుతుంది. ఈ సమయాన్ని జెస్టేషన్ పీరియడ్‌గా పిలుస్తారు. ఈ గుడ్లు 60 రోజుల తర్వాత పిల్లలుగా మారతాయి. అన్ని పాములూ గుడ్లు పెట్టినా పింజరలు మాత్రం నేరుగా పిల్లల్నే కంటాయి. ఒక్కో పాము గరిçష్ఠంగా 30 గుడ్లు/పిల్లల్ని పెడుతుంది. పాములు చాలా మితాహారులు... రెస్క్యూ సెంటర్లో ఉన్న పాములకు వివిధ మార్గాల్లో సేకరించిన ఎలుకలు, కప్పలు, బల్లుల్ని ఆహారంగా వేస్తుంటారు. పాములు చాలా మితాహారులు. ఒక్కసారి తింటే వారం–పదిహేను రోజుల వరకు మళ్లీ తిండి వంక చూడవు. కొండ చిలువ ఒక్కసారి ఆహారం తీసుకుంటే మూడు నెలల నుంచి ఏడాది వరకు ఉండగలదు. నీళ్లను మాత్రం వారానికి ఒకసారి తాగుతాయి. పాములు కోల్డ్ బ్లడెడ్ జీవుల కేటగిరీలోకి వస్తాయి. ఈ కారణంగానే చలికాలంలో మందకొడిగా, మిగిలిన కాలాల్లో చురుకుగా ఉంటాయి. వరుసగా ఎండల తర్వాత వాన వచ్చినా, వానల తర్వాత ఎండ వచ్చినా బయట పాములు ఎక్కువగా కనిపిస్తుంటాయి. కారణం వాటి శరీరతత్వమే. అలా వాతావరణంలో మార్పుకు అనుగుణంగా అవి తమ ఆవాసాల నుంచి బయటకు వచ్చి శరీర ఉష్ణోగ్రతను మార్చుకుంటాయి. లేకపోతే వాటి శరీరం సహకరించక తిండి కోసం వేట, తిన్నది జీర్ణం చేసుకోవడం రెండూ సాధ్యం కావు. రెస్క్యూ సెంటర్లోనూ వాటికి శరీర ఉష్ణోగ్రతలను సరిచేసుకునే అవకాశం ఇస్తుంటారు. నాగులపంచమి వాటికి నరకమే... నాగుల పంచమి నాగు పాములకు నరకమే. పాములు పాలు తాగవు. మనలో లాక్టేజ్ అనే ఎంజైమ్ ఉత్పత్తి అవుతుంది. ఇదే మనం తీసుకునే పాలలోని లాక్టోజ్‌ను జీర్ణం చేస్తుంది. అయితే పాముల్లో ఈ ఎంజైమ్ ఉండదు. కాబట్టి వాటికి పాలను జీర్ణం చేసుకునే శక్తీ ఉండదు. ఈ కారణంగానే అవి నీళ్లు తాగుతాయి తప్ప పాలు తాగవు. ఈ సత్యం ఎరుగక ఆ పండగనాడు వాటికి పాలు పోస్తుంటాం. అయితే ఆ రోజు కోసం నాగు పాముల్ని సిద్ధం చేసే వ్యక్తులు వాటిని పట్టుకున్నాక కోరలు పీకేసి, నోరు కుట్టేస్తారు. దాదాపు 10 రోజుల పాటు నీళ్లు, ఆహారం ఇవ్వకుండా పస్తు పెడతారు. ఈ కారణంగానే తీవ్ర ఆకలితో ఉండే ఆ పాములు భక్తులు పోసే పాలను తాగుతాయి. అలా పాలు తాగిన పాముల్లో అనేకం వాంతులు, విరోచనాల సమస్యతో చనిపోతుంటాయి. ఇలాంటి వాటిని రెస్క్యూ చేసే స్నేక్స్ సొసైటీ .. అవి కోలుకోవడానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుంది. వాటికి వైద్యం అందిస్తూ అవి సాధారణ స్థితికి చేరుకునే వరకు చికెన్ పేస్ట్‌ను ఆహారంగా ఇస్తుంది. విషాన్ని వృథా చేసుకోవు... ఒంటరి జీవులైన పాములకు గుర్తించే శక్తి, పగ, ప్రేమలాంటి ఫీలింగ్స్ ఉండవు. కేవలం ఆకలి, ఆగ్రహం మాత్రమే ఉంటాయి. ప్రతి పాముకు ఫోర్క్టంగ్గా పిలిచే చీలికతో కూడిన నాలుక ఉంటుంది. దీన్ని గాలిలో తిప్పుతూ వాతావరణంలో ఉన్న రసాయనాలను సంగ్రహించి.. పై దవడలో రెండు రంధ్రాల మాదిరిగా ఉండే జేకబ్ సెన్స్ ఆర్గాన్లో పెడుతుంది. ఆ ఆర్గాన్ రసాయనాలను విశ్లేషించి సమీపంలో ఏ పదార్థం ఉందో చెబుతూ దాని మెదడుకు సంకేతం పంపుతుంది. అలా పాము ఆహారాన్ని గుర్తించి వేటాడుతుంది. చెవుల్లేని పాముకు కాడ్రేట్బోన్గా పిలిచే ఇంటర్నల్ ఇయర్స్ ఉంటాయి. అయితే ఇవి కేవలం లో ఫ్రీకెన్సీ ధ్వనులను మాత్రమే గుర్తించగలుగుతాయి. మనుషుల మాటలు, నాగస్వరం సహా ఇతర శబ్దాలేవీ వాటికి వినిపించవు. సర్పాలు షై క్రీచర్స్. ఇవి మనుషులను చూసిన వెంటనే దాక్కోవడానికే ప్రయత్నిస్తాయి. అది సాధ్యం కానప్పుడే పడగ విప్పి, బుసకొడతాయి ఆత్మరక్షణలో భాగంగా. దాన్ని తీవ్రంగా భయపెడితే, గాయపరిస్తే మాత్రమే కాటు వేస్తాయి. నాగు పాము పడగ విప్పకుండానూ కాటు వేస్తుంది. సాధారణంగా ఆహారం వేటాడటానికి వినియోగించే విషాన్ని మనుషులపై ప్రయోగించడానికి ఇష్టపడవు అవి. తప్పనిసరి పరిస్థితుల్లో కాటేసినా చాలావరకు విషం విడుదల చేయకుండా డ్రై బైట్ చేస్తాయి. అందుకే పాము కాటుతో ఆస్పత్రికి వెళ్లిన వ్యక్తిని పూర్తిగా పరిశీలించిన తర్వాతే వైద్యులు యాంటీ వీనం ఇంజెక్షన్ ఇస్తుంటారు. డ్రై బైట్‌తో వచ్చిన వ్యక్తికి ఈ ఇంజెక్షన్ ఇచ్చినా ఎలాంటి ప్రమాదం ఉండదు. ఒక్కో విషం... ఒక్కో ప్రభావం... నాగు పాము, కట్ల పాముల్లో న్యూరో టాక్సిక్ విషాలు ఉంటాయి. ఇవి మనుషుల శరీరంలోకి ప్రవేశించినప్పుడు నరాల మధ్య ఉండే సెల్స్‌ను దెబ్బతీస్తాయి. ఫలితంగా మెదడు జారీచేసే ఆదేశాలు ఇతర భాగాలకు చేరవు. ఈ కారణంగానే అత్యధికులు ఊపిరి అందని సమస్యతో చనిపోతుంటారు. ఈ పాములు కాటు వేసిన చోట వాపు, రంగు మారడం జరుగుతుంది. రక్త పింజర, చిన్న పింజరల్లో హీమో టాక్సిక్ విషాలు ఉంటాయి. ఇవి రక్తకణాలను దెబ్బతీస్తాయి. దీని ప్రభావంతో కిడ్నీ, ఇతర అవయవాలు ఫెయిలయ్యి ప్రాణాలు కోల్పోతుంటారు. ఈ పాములు కరిస్తే తీవ్రమైన నొప్పి, భరించలేని బాధ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో కాటు వేసిన చెయ్యి, కాలు తీసేయాల్సిన పరిస్థితీ ఏర్పడుతుంది. వాలంటీర్లకు ఆరు నెలల శిక్షణ... ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్స్ సొసైటీలో వాలంటీర్లుగా చేరేవారికి ఆరు నెలల శిక్షణ తర్వాతే రెస్క్యూకు అనుమతిస్తారు. మొదటి రెండు వారాలు విష, విషం లేని సర్పాల గుర్తింపునకు కేటాయిస్తారు. ఆపై రెండు నెలలు విషం లేని, కరవని (మట్టి పాములు వంటివి) పాములను హ్యాండిల్ చేయడం నేర్పిస్తారు. ఆ తర్వాత విషం లేకపోయినా కరిచే స్వభావం ఉన్న నీటి పాములతో శిక్షణ ఇస్తారు. ఇలా రెండుమూడు నెలల తర్వాత వారి సామర్థ్యాన్ని పరీక్షిస్తారు. అప్పుడే పాములను రెస్క్యూ చేయడానికి అనుమతిస్తారు. ఈ వాలంటీర్లకు అనేక సార్లు డ్రై బైట్ సహా పాము కాట్లు తప్పవు. విరాళాలతోపాటు కార్యాలయాలు, స్కూళ్లల్లో ఇచ్చే అవగాహన కార్యక్రమాల ద్వారా వచ్చే నిధులే ఈ సొసైటీకి ఆధారం. ఎముక విరిగితేనే దీర్ఘకాలం చికిత్స: ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్స్ సొసైటీ వాళ్లు రెస్క్యూ చేసిన పాముల్లో గాయపడిన వాటికి జూలోని ఆస్పత్రిలో చికిత్స చేస్తాం. నాగులపంచమి సందర్భంలో ఇక్కడకు వచ్చే సర్పాలు నోటి గాయాలతో ఉంటాయి. కోరలు పీకేయడం, నోరు కుట్టేయడంతో గాయపడతాయి. మిగిలిన సందర్భాల్లో వచ్చేవి నోటిలో ఫంగల్ ఇన్ఫెక్షన్, ఒంటిపై కట్స్, వూండ్స్తో ఉంటాయి. పాములకు గాయాలు త్వరగా మానిపోయే గుణం ఉంటుంది. కాబట్టి వారం రోజుల్లో కోలుకుంటాయి. నోటిని శుభ్రం చేసి, మత్తు ఇంజెక్షన్ ఇచ్చి కుట్లు వేస్తాం. అయితే కొన్ని సందర్భాల్లో అంటే వాటి మీద నుంచి వెహికిల్స్ వెళ్లడం, వాటి మీద ఏవైనా వస్తువులు పడటం, మనుషులు కర్రలతో కొట్టడం వల్ల వాటి ఎముకలు విరుగుతాయి. ఎక్స్‌రే తీసి ఫ్రాక్చర్ ఎక్కడో గుర్తిస్తాం. కట్టు కట్టి.. వైద్యం చేస్తాం. ఎముకలు అతుక్కోవడానికి ఒక్కోసారి 45 రోజులు పడుతుంది. – డాక్టర్ ఎంఏ హకీం, డిప్యూటీ డైరెక్టర్, జూపార్క్ 30 నిమిషాల్లో వస్తాం పాముల్ని చూసి భయపడకండి. చంపకండి. అవి మీ ఇంటి పరిసరాల్లోకి వస్తే మాకు ఫోన్ చేయండి. 30 నిమిషాల్లో వచ్చి రెస్క్యూ చేస్తాం. పాములు అంతరించిపోతే ఎలుకలు, కప్పల సంతతి పెరిగిపోతుంది. దాని వల్లే మనకే నష్టం. మనుషులతో పాటు ఏ జంతువైనా కంటికి కనిపించే ఎలుకలనే చంపుతారు.. చంపుతాయి. పాములు మాత్రమే కలుగుల్లోకి వెళ్లి మరీ ఎలుకల్ని వేటాడుతాయి. – అవినాష్ విశ్వనాథ్, జనరల్ సెక్రటరీ, ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్స్ సొసైటీ --- శ్రీరంగం కామేష్, హైదరాబాద్ సిటీబ్యూరో -
బుసలు కొడుతూ పైకి లేచిన 14 అడుగుల కింగ్ కోబ్రా..
బ్యాంకాక్: సాధారణంగా చాలా మంది పాముని చూడగానే భయంతో వెన్నులో వణుకుపుడుతుంది. మరికొందరైతే పాము ఫలాన చోట కనిపించిందంటే.. ఆ దారిదాపుల్లోకి వెళ్లటానికి సాహసించరు. అయితే, ఒక్కొసారి పాములు తమ దారి తప్పి ఆవాసం కోసం, ఆహర అన్వేషణలో జనవాసాల మధ్యన చేరుతుంటాయి. ఇలాంటి సమయాల్లో ఆత్మరక్షణకు ఒక్కొసారి అవి కాటు వేస్తాయి. మరికొన్నిసార్లు అవి కూడా ప్రమాదాల బారిన పడతాయి. కొందరు పాములు కనిపిస్తే.. స్నేక్ సోసైటి వారికి సమాచారం అందించి వాటిని ఏ ఆపద తలపెట్టరు. ఇలాంటి ఎన్నో వీడియోలు ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. తాజాగా, ఇలాంటి ఘటన ఒకటి థాయిలాండ్‌లో జరిగింది. దక్షిణ థాయి ప్రావిన్స్‌లో క్రాబీలోని ఒక తోటలో గిరినాగు ( కోబ్రా) ప్రత్యక్షమయ్యింది. దీంతో అక్కడి వారంతా భయంతో వణికిపోయారు. అది దాదాపు 14 అంగుళాల వరకు పోడవుంది. స్థానికులు వెంటనే పాములను పట్టే వారికి సమాచారం అందించారు. అయితే, నైవాధ్ అనే వ్యక్తి ఆ ప్రదేశంలో పాములను పడుతుంటాడు. అతను అక్కడికి చేరుకున్నాడు. ఆ తర్వాత కోబ్రాను పట్టుకోవడానికి ప్రయత్నించాడు. గిరినాగు మాత్రం బుసలు కొడుతూ.. ఎంత సేపటికి అతనికి లొంగలేదు. అతను పట్టుకుందామనుకోనేసరికి బుసలు కొడుతూ.. కాటు వేయడానికి రాసాగింది. దాదాపు 20 నిముషాలు కష్టపడి చాకచక్యంగా కోబ్రాను లొంగతీసుకున్నాడు. ఆ తర్వాత నైవాధ్.. కోబ్రా.. ప్రపంచంలో అత్యంత విషపూరిత సర్పమని తెలిపాడు. ఇది పెద్ద పాములను సైతం తింటుందని తెలిపాడు. అత్యంత వేగంగా కూడా ప్రయాణిస్తుందని, కాటు వేస్తే తక్కువ సమయంలోనే మనిషి ప్రాణాలు గాల్లో కలుస్తాయని వివరించాడు. ఆ తర్వాత కోబ్రాను సమీపంలోని అడవిలో వదిలేశాడు. ఇవి దక్షిణ, ఆగ్నేయ ఆసియాలో ఎక్కువగా కనిపిస్తాయి. కాగా, అతను కోబ్రాను పట్టేటప్పుడు స్థానికులు వీడియో తీశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. దీన్ని చూసిన నెటిజన్లు.. ‘వామ్మో.. ఎంత భయంకరంగా ఉంది..’, ‘కాటు వేస్తే.. అంతే సంగతులు..’, ‘మీ ధైర్యానికి జోహర్లు..’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. చదవండి: వంతెనను ప్రారంభించిన మహరాష్ట్ర మంత్రి.. గిరిజనులు ఎన్నో ఏళ్లుగా -
బెడ్ కింద 18 పాములు.. అది చూసిన మహిళ చివరకి
వాషింగ్టన్: సాధారణంగా మనం ఒక్క పామును చూస్తే భయంతో పరుగులు తీస్తాము. అలాంటిది ఏకంగా 18 పాములను ఒకేసారి చుస్తే..అది కూడా మనం నిద్ర పోయే బెడ్ కింద ఉంటే అది ఊహించడానికే కష్టంగా ఉంటుంది. అచ్చం ఇటువంటి సంఘటనే ఒకటి జార్జియాలో జరిగింది.వివరాలు.. ట్రిస్ విల్చర్ అనే మహిళ రాత్రి సమయంలో తన బెడ్ రూమ్ లో నిద్ర పోవడానికి బెడ్ ను సర్దుతున్న సమయంలో నేలపై ఏదో శబ్ధం వినిపించడంతో దగ్గరగా వెళ్లి చూసింది. ఆ మహిళకు పాము కనిపించడంతో ఒక్కసారిగా భయంతో కేకలు వేయడంతో వెంటనే ఆమె భర్త రూమ్ లోపలకి వచ్చి పాము పిల్లను చూసాడు. ఇంకా ఏమైనా ఉన్నాయేమోనని చూడగా ఏకంగా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 18 పాములు కనిపించాయి. ఈ మొత్తం పాములును సంచిలో వేసి సమీపంలో ఉన్న అడవిలో వదిలేసారు. ఆ తర్వాత ఈ సమాచారాన్ని అందుకున్న స్నేక్ రెస్క్యూ టీమ్ ఆ ఇల్లంతా గాలించారు. ఇల్లంతా వెతికాక ఇంకా ఎక్కడ పాములు లేవని చెప్పడంతో ఆ దంపతులు ఊపిరి పీల్చుకున్నారు అన్ని పాములు తమ రూమ్ లోకి ఎలా వచ్చాయో ఆ దంపతులకు అర్ధం కాలేదు. దీనికి సంభందించిన ఫోటోలను ఆమె పేస్ బుక్ లో పోస్ట్ చేసింది. -
సిగ్గెక్కువ.. కానీ, కాటేస్తే వందమంది ఖతం!
ఈ భూమ్మీద సమస్త జీవరాశుల్లో సర్పాలు ఉన్నాయి. కానీ, మనుషుల భయాలు, అపోహలతో వాటి జనాభా తగ్గిపోతూ వస్తోంది. ఇది ఎంతవరకు సరైందన్నది పక్కనపెడితే.. చాలామందిలో చెడును చెప్పడానికి ‘పాములాంటోడు’ అని వర్ణిస్తుంటారు. కానీ, అవి అంత ప్రమాదకరమైనవి మాత్రం కావు. ఈ భూమ్మీద దాదాపు 4 వేల జాతుల దాకా పాములు ఉన్నాయి. ఎప్పటికప్పుడు కొత్తగా కనుగొంటూ పోతున్నారు. ఈ మొత్తంలో 650కి(25 శాతం) పైగా జాతులు మాత్రమే విషపూరితమైనవని సైంటిస్టులు ఇప్పటిదాకా(జులై 7 రిపోర్ట్ ప్రకారం) గుర్తించారు. అందులోనూ 200 జాతుల(10 శాతం) పాముల నుంచి మాత్రమే మనిషికి ముప్పు ఉంటోందని తేల్చారు. కానీ, అవేం పట్టించుకోకుండా కనిపిస్తే చంపేస్తూ.. వాటి జనాభాను తగ్గించేస్తున్నారు. అందుకే వాటి పరిరక్షణ కోసం, పాములన్నీ ప్రమాదకరమైనవి కాదని జనాల్లో అవగాహన కల్పించాలని.. అందుకోసం ఓ రోజు ఉండాలని జులై 16న వరల్డ్ స్నేక్ డే ను నిర్వహిస్తున్నారు కొందరు(స్నేక్ సొసైటీలు). ప్రతీ ఏడాది ఇదే థీమ్‌తో ముందుకు సాగుతున్నారు. వాసన కోసం నాలిక పాములకు చూపు సామర్థ్యం చాలా తక్కువ. చెవుల్లేకున్నా వినికిడి శక్తి కూడా పరిమితంగానే ఉంటుంది. పాము కింది దడవలో ఉన్న ఎముకలు శబ్దతరంగాలను పసిగడతాయి. కానీ, వాసన విషయంలో మాత్రం గొప్ప సామర్థ్యం కలిగి ఉంటాయి. అవి నాలుకతోనే వాసనను పసిగడతాయి. అందుకే ఎప్పుడూ అవి నాలికను అలా బయటకు ఆడిస్తుంటాయి. అత్యంత విషపూరితమైనవి విషానికి ప్రాథమిక కొలమానం ఎల్డీ 50. లెథాల్ డోస్ 50 పర్సంట్ టెస్ట్ అని పిలుస్తారు దీన్ని. ఈ పద్దతిలో పాముల విషాన్ని పరిశీలించే.. అత్యంత విషపూరితమైన ప్రమాదకరమైన పాముల జాబితాను సిద్ధం చేస్తుంది ఇంటర్నేషనల్ స్నేక్ సొసైటీ. ఈస్ట్రన్ బ్రౌన్ స్నేక్.. ఆస్ట్రేలియాలో కనిపించే అత్యంత ప్రమాదకరమైన పాము జాతి. దీని విషం నిమిషాల్లో మనిషిలో అంతర్గతంగా రక్త స్రావం అయ్యేలా చేస్తుంది. కిడ్నీలను పాడు చేస్తుంది. ఒక్కోసారి మెదడుకు చేరి పక్షవాతాన్ని కలగజేస్తుంది. చివరికి రక్తం గడ్డకట్టేలా చేసి మనిషి ప్రాణం తీస్తుంది. టైగర్ స్నేక్ ఎలాపిడ్ జాతికి చెందిన టైగర్ స్నేక్ పాములు కూడా ఆస్ట్రేలియా గడ్డపైనే కనిపిస్తాయి. ఒంటిపై ఉండే మచ్చల కారణంగా వాటికి టైగర్ స్నేక్ అనే పేరొచ్చింది. నివాస ప్రాంతాల్లో ఎక్కువగా సంచరిస్తూ.. అరగంటలో మనిషి మరణానికి కారణం అవుతుంటాయి. టైగర్స్నేక్స్ విషం నాడీ వ్యవస్థ మీద ప్రభావం చూపెడుతుంది. కండరాల్లో రక్తం గడ్డ కట్టేలా చేస్తుంది. కోబ్రా తరహాలో పడగ విప్పి.. భయపెడుతుంది. ఇన్‌ల్యాండ్ టైపాన్ ఈ భూమ్మీద అత్యంత విషపూరితమైన పాము ఇది(అనధికారికంగా). వంద గ్రాముల విషంతో వంద మందిని చంపగలిగే సామర్థ్యం ఉన్న పాము ఇది. వంద గ్రాముల విషాన్ని ఒకే కాటుతో దింపగలదు ఇది. కానీ, ఎల్డీ50 ప్రకారం(త్వరగా ప్రాణం తీసే లెక్కప్రకారం).. లిస్ట్ వల్ల మూడో ప్లేస్ ఇవ్వాల్సి వచ్చింది. ఈ విషం ప్రభావంతో గంటలో ప్రాణం పోవడం ఖాయం. ఇవి జనారణ్యానికి దూరంగా ఏకాంతంగా బతుకుతాయి. ఈ పాముకి ‘సిగ్గు’ ఎక్కువ అని అంటుంటారు. మనుషులను చూస్తే.. ఇవి వేగంగా పాక్కుంటూ వెళ్లి ఓ మూల దాక్కుంటాయి. అలా ఈ డేంజర్ స్నేక్కు ‘సిగ్గున్న పాము’గా ముద్దు పేరు వచ్చింది. రస్సెల్స్ వైపర్ ఆసియాలో అత్యంత ప్రమాదకరమైన పాము జాతిగా పేరుంది రస్సెల్స్ వైపర్‌కి. అంతేకాదు ఎక్కువ మరణాలకు కారణమైన జాతి కూడా ఇదే. దీనిని గుర్తించడం కూడా చాలా తేలిక. భయంతో ఉన్నప్పుడు అది గట్టిగా శబ్దం చేస్తుంటుంది. కాటు వేసిన మరుక్షణం నుంచే విషం శరీరంలోకి ఎక్కేస్తుంటుంది. ఒక్క రస్సెల్స్ వైపర్ గక్కే విషంతో లక్షా యాభై వేల ఎలుకలను చంపొచ్చనేది సైంటిస్టుల మాట. బ్లూ క్రాయిట్ ఆసియాలో ప్రమాదకరమైన పాముల్లో దీని పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తుంటుంది. దీని విషయం నాడీ వ్యవస్థపై ప్రభావం చూపెడుతుంది. చికిత్స అందినా సగం మంది చనిపోతుంటారు. అంత ప్రమాదకరమైంది ఈ పాము విషం. ఇవి విషపూరితమైన పాముల్నే ఆహారంగా తీసుకుంటాయి. జనసంచారానికి దూరంగా పగటి పూట పచ్చిక బయళ్లలో, అడవుల్లో స్వేచ్ఛగా సంచరిస్తుంటాయి ఇవి. బూమ్స్లాంగ్ క్లౌబ్రిడ్ కుటుంబంలో అత్యంత విషపూరితమైన పాము జాతి ఇది. రంగు రంగుల్లో ఉంటాయి ఇవి. విషం అంత విషపూరితమైనది కాకపోయినా.. రక్తస్రావం కారణంగా ప్రాణం పోతుంటుంది. అందుకే ప్రమాదకరమైన పాముల లిస్ట్‌లో చేర్చారు. అయితే ఇవి మనుషులు కనిపిస్తే.. దూరంగా వెళ్లిపోతుంటాయి. ఇవి దాడులు చేసే సందర్భాలు చాలా తక్కువ. చెట్ల మీద ఉంటూ పక్షుల్ని, పురుగులని తింటాయి. మోజావే రాటెల్స్నేక్ అమెరికా నుంచి పాము జాతుల్లో అత్యంత విషపూరితమైన లిస్ట్‌లో ఫస్ట్ కనిపించేది ఇదే. రక్తం, నాడీ వ్యవస్థపై ప్రభావం చూపెడుతుంది దీని విషం. నైరుతి అమెరికా పప్రాంతంలో ఎక్కువ మరణాలు సంభవించేది ఈ పాముల వల్లే. స్టిలెట్టో స్నేక్ పరిణామంలో చిన్నగా ఉండి, కలుగుల్లో దాక్కునే పాము ఇది. కానీ, విషపూరితమైంది. అయితే అదృషవశాత్తూ ఇది ఎక్కువ విషాన్ని కక్కదు. కానీ, దీని విషం ఎంత ప్రమాదకరమంటే.. కణజాలాన్ని దెబ్బ తీయడంతో పాటు గుండె పనితీరును స్తంభింపజేస్తుంది. అంతేకాదు వీటిని పట్టడం కూడా అంత ఈజీ కాదు. కోరలు కూడా విచిత్రంగా వంగి ఉంటాయి. కాబట్టి, నేరుగా కాకుండా వంగి మరీ కాటు వేస్తుంది స్టిలెట్టో. సా స్కేల్డ్ వైపర్ ఇది అంత విషపూరితమైన పాము కాదు. కానీ, ప్రమాదకరమైన జాతిలో ఒకటి. భారత్ తో సహా చాలా దేశాల్లో ఇవి కనిపిస్తుంటాయి. చిన్నసైజులో ఉన్నప్పటికీ అగ్రెసివ్‌గా ఇవి దాడులు చేస్తాయి. వైపర్ జాతి పాముల్లాగే రక్తం గడ్డకట్టించి చంపుతాయి. అయితే విరుగుడు వెంటనే ఇవ్వకపోతే బతకడం కష్టం. ఇసుకలో దాక్కుని వేటాడుతుంటాయి. ఒకవేళ దగ్గరగా వెళ్లాలని ప్రయత్నిస్తే.. గట్టిగా శబ్ధం చేస్తూ భయపెడుతుంటాయి. కింగ్ కోబ్రా విషానికి బ్రాండ్ అంబాసిడర్ ఈ జాతి. అత్యంత పొడవైన విషపూరితమైన పాము కింగ్ కోబ్రా. పైన చెప్పుకున్నంత రేంజ్లో వీటిలో విషం లేకపోయినా.. ఎక్కువ పరిమాణంలో విషం చిమ్మడం, కాటు వేయడంతో పాటు రూపంతోనే భయపెట్టేస్తుంటాయివి. ఇక ఆడ పాము గూడుకట్టి గుడ్లు పెట్టాక.. మగపాముతో కలిసి కాపలా కాస్తుంటుంది. వీటితో పాటు కోస్టల్ టైపాన్, బాండెడ్ క్రాయిట్, కామన్ డెత్ ఆడర్, సముద్రంలో ఉండే బీక్డ్ సీ స్నేక్, ఆఫ్రికన్ డేంజరస్ స్నేక్ జాతి ‘బ్లాక్ మాంబా’, చైనీస్ కోపర్హెడ్, సౌత్ అమెరికన బుష్‌మాస్టర్, ఫర్ డె డాన్స్, బెల్చర్స్ సీ స్నేక్, బ్లూ మలయన్ కోరల్ స్నేక్.. ఆ తర్వాతి స్థానాలో ఉన్నాయి. ఇక వీటితో పాటు విషం లేని బుక్స్నేక్(నార్త్ అమెరికా, అమెరికా), కొండ చిలువ జాతికి చెందిన పాములు, జెనస్ యూనెక్టస్కు చెందిన వాటర్ బోస్(అనకొండ) కూడా ఈ భూమ్మీద ఉన్నాయి. అదృష్టం అంటే దీనిదే.. చాలాకాలం కిందట వైరల్ అయిన వీడియో ఇది How could we dedicate #WorldSnakeDay to anything else? 🐍#PlanetEarth2 pic.twitter.com/B4YxSxqmvm — BBC Earth (@BBCEarth) July 16, 2018 "I'm asking you to respect these creatures, because they have a right to be on Earth, the same way we do." We know many of you may be scared of snakes but it's #WorldSnakeDay, so we asked the 'Snake Man of Lagos' - Dr Mark Ofua - why it's so important we protect them. 🐍 pic.twitter.com/DgWc12NvoS — BBC News Africa (@BBCAfrica) July 16, 2019 -
పాములు ఎక్కడ దాక్కున్నాయో చూడండి..
-
ఆ పాములు ఎక్కడ దాక్కున్నాయో చూడండి..
సిడ్నీ : ఆస్ట్రేలియాలో ఎండలు మండిపోతున్నాయి.రోజురోజుకు ఉష్ణోగ్రతలు తీవ్ర స్థాయికి చేరుతున్నాయి. మంగళవారమక్కడ సగటు ఉష్ణోగ్రత 40.9 డిగ్రీలుగా నమోదైంది. ఇది 2013లో ఏర్పడిన 40.03 డిగ్రీల రికార్డును బ్రేక్ చేసిందని ఆస్ట్రేలియ వాతావరణ శాఖ వెల్లడించింది. అటు ఎండ తీవ్రత సమస్యను ఎదుర్కొంటున్న స్థానిక ప్రజలకు మరో విచిత్రకరమైన సమస్య ఎదురవుతుంది. బయటఎండ తీవ్రతను తట్టుకోలేని పాములు జనావాసాల్లోకి చొరబడి.. ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. ఇంట్లోకి ప్రవేశించిన పాములు మూలల్లోకి వెళ్లి తల దాచుకుంటున్నాయి. అక్కడా...ఇక్కడా అనే తేడా లేకుండా పాములు చల్లటి ప్రదేశాన్ని వెతుక్కుంటున్నాయి. తాజాగా ఓ ఇంట్లోకి చొరబడిన పాము, ఆ తర్వాత అది మాయమవడంతో ఆందోళన చెందిన ఆ ఇంటి యజమాని... జంతు సంరక్షులకు సమాచారం ఇవ్వగా చివరికి బూట్ల మధ్యలో ఆ పాము ఉండటం గమనించారు. సంరక్షులు దానిని రక్షించి అడవుల్లోకి వదిలిపెట్టారు. మరోక సంఘటనలో వూమ్భీలోని ఓ మహిళ తన వాష్ రూంలో పామును గర్తించింది. మొదటి దానిని చెట్టు కొమ్మ అనుకొని ఉండగా అనంతరం అది అక్కడ లేకపోవడంతో పాము అని నిర్ధారణకు వచ్చిన ఆమె... పాము సంరక్షులకు సమాచారం ఇచ్చింది. చివరికి వారు దానిని స్వాధీనం చేసుకున్నారు. కాగా ఆ పాము ఈస్టర్న్ బ్రౌన్ స్నేక్ అని, ఇది ప్రపంచంలో రెండవ అత్యంత విషపూరితమైనదని వారు పేర్కొన్నారు. అలాగే మరూచైడోర్ ప్రాంతంలో విచిత్రంగా కారు టైరులో పామును గుర్తించారు. దీనిని రెడ్ బెల్లీడ్ బ్లాక్ స్నేక్‌గా గుర్తించిన సంరక్షులు పామును రక్షించి అడవిలో విడిచిపెట్టారు. ఇలాంటి ఘటనలు నిత్యం ప్రజలను భయాందోళనకు గురిచేస్తుండగా..వీటిలో కొన్ని అతి ప్రమాదకరమైనవి, విషపూరితమైనవి ఉండటంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. -
కోక్ టిన్‌లో చిక్కి నాగుపాము విలవిల
రాయదుర్గం: పరిశోధనలకు, పచ్చదనానికే కాదు పాములకు సంరక్షణ కేంద్రంగా కూడా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ మారుతోంది. గచ్చిబౌలిలోని హెచ్‌సీయూ క్యాంపస్ రెండువేలకు పైగా ఎకరాల సువిశాల స్థలంలో కొనసాగుతోంది. ఇందులో సగం భూభాగం వరకు అటవీ ప్రాంతంగా ఉంది. ఇందులో çసహజసిద్ధమైన భారీ బండరాళ్లు, చెట్లు, పచ్చదనం, సహజ సిద్ధంగా ఏర్పడిన చెరువులు, కుంటలున్నాయి. దీంతో దేశంలో కొన్ని అరుదైన పాములు తప్ప మిగతా అన్ని రకాల పాములు ఇక్కడ ఉన్నట్లు పలువురు పేర్కొంటారు. ఇందులో కొన్ని ఇప్పటి వరకు కనిపించిన వాటిలో విషసర్పాలు కూడా ఉండడం విశేషం. అయితే ఇప్పటి వరకు పాము కాటు వేయకపోవడం మరో విశేషం. అప్పుడప్పుడు ఈ పాములు విద్యార్థులుండే వసతిగృహాలు, ప్రధాన, అంతర్గత రోడ్లు, వివిధ కార్యాలయాలవైపు వస్తుంటాయి. అయితే సెక్యూరిటీ విభాగం, వైల్డ్‌లెన్స్ గ్రూపు ఈ పాముల సంరక్షణలో ముఖ్యభూమిక పోషిస్తున్నారు. కాగా గత ఆరు నెలల క్రితం జరిగిన అగ్నిప్రమాదంలో ఒక కొండచిలువ తీవ్రంగా కాలి గాయాలపాలుకాగా మరో రెండు పాములు మృత్యవాత పడిన ఘటన అందరినీ కలిచివేసింది. ఇక్కడ పాముల్ని చంపరు.. విద్యార్థులకు పలు చోట్ల పాములు అగుపించడం క్యాంపస్‌లో సర్వసాధారణం. పాము కనిపిస్తే సెక్యూరిటీ సిబ్బంది, వైల్డ్లెన్స్గ్రూపువారికి సమాచారం ఇస్తారు. వారు వెంటనే పాములను పట్టే ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్ సొసైటీవారిని పిలిపించి వాటిని పట్టుకొని తిరిగి అటవీ ప్రాంతంగా ఉండే చోట పాములను వదిలి వేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. కానీ పాములను చంపిన దాఖలాలు ఇప్పటి వరకు లేవంటేనే వీటి సంరక్షణ ఎలా ఉందో అర్థమవుతుంది. ఏది ఏమైనా పాము అనగానే సహజంగా అందరూ భయపడిపోతుంటారు. అందులో రకరకాల విష సర్పాలు కూడా ఉండడంతో మరింతగా వీటిని చూడగానే భయపడిపోయే వారూ లేకపోలేదు. ఈ నేపథ్యంలో పాములను పట్టేవారిని అందుబాటులో ఉండేలా చూడాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా అధికారులు చర్యలు తీసుకోవాల్పిన అవసరం ఉంది. జీవ వైవిధ్యానికి హెచ్‌సీయూ కేంద్రం హెచ్‌సీయూ క్యాంపస్ జీవ వైవిధ్యానికి కేంద్రం. అందులో రకరకాల పక్షులు, జంతువులు, పాములు, పచ్చనిచెట్లు ఉన్నాయి. వీటి పరిరక్షణలో హెచ్‌సీయూ యంత్రాంగం, సెక్యూరిటీ విభాగం చూపించే చొరవ, మా వైల్డ్‌లెన్స్ తోడ్పాటు నిరంతరంసాగే ప్రక్రియ. రకరకాల పాములు క్యాంపస్‌లో ఉన్నాయి. ఒక్కదాన్ని కూడా ఇప్పటి వరకు చంపలేదు. పట్టుకొని తిరిగి అటవీ ప్రాంతంలో వదిలేయడం జరుగుతుంది. – డాక్టర్ రవి జిల్లపల్లి,వైల్డ్‌లెన్స్ గ్రూపు వ్యవస్థాపకులు హెచ్‌సీయూ కోక్ టిన్‌లో తల చిక్కి నాగుపాము విలవిల రాయదుర్గం: ఖాళీ కూల్‌డ్రింక్ టిన్ బాక్సులో ఓ నాగుపాము దూరింది. దీంతో తల ఇరుక్కుపోయి ఇబ్బంది పడగా..హెచ్‌సీయూ విద్యార్థిని ఒకరు గమనించి ఆ పాముకు విముక్తి కలిగించారు. హెచ్‌సీయూ క్యాంపస్‌లో ఉర్దూ డిపార్ట్మెంట్లో పీహెచ్డీ చేస్తున్న విద్యార్థిని జునేరా అబ్రార్ గురువారం సాయంత్రం క్యాంపస్‌లోని వైట్రాక్స్ వైపు నుంచి వెళ్తుండగా పాము తల టిన్‌లో ఇరుక్కోవడం గమనించారు. వెంటనే వైల్డ్ లెన్స్ గ్రూపు వ్యవస్థాపకులు డాక్టర్ రవి జిల్లపల్లికి సమాచారం ఇచ్చేందుకు ప్రయత్నించినా ఫోన్ కలవలేదు. దీంతో మరికొందరు విద్యార్థులతో కలిసి ఆమె పామును రక్షించారు. దాన్ని చెట్ల పొదల్లోకి వదిలేశారు. ఈ సందర్భంగా జునేర్ అబ్రార్ మాట్లాడుతూ క్యాంపస్‌లో ఎవరూ ఖాళీ బాటిళ్లు, కోక్ టిన్లను బహిరంగంగా పారవేయవద్దని విజ్ఞప్తి చేశారు. -
వృత్తి ఆటోడ్రైవర్.. విదేశీయులకు సైతం మెలకువలు
పాము కనబడితేనే ఆమడ దూరం పారిపోతాం.ఈ వ్యక్తి మాత్రం పాము ఎప్పుడుకనబడుతుందా అని ఎదురుచూస్తాడు.పాము బొమ్మను పట్టుకుంటేగజగజలాడిపోతాం. ఈయన మాత్రం పామునుఓ ఆటబొమ్మల్లే ఆడుకుంటాడు.పేరు పెచ్చేటి వెంకటేష్. మండలంలోనిజంపెన గ్రామానికి చెందిన వ్యక్తి. పాములు పట్ట్టడంలో నేర్పరి. విదేశీయులకు సైతంమెలకువలు నేర్పేటంత పనితనం ఈయన సొంతం. అందుకే పరిసర గ్రామాల్లో పాముకనబడితే చాలు వెంకటేష్ ఫోన్ రింగ్మంటుంది.– మాడుగుల ‘పాములు ప్రకృతిలో భాగం. ప్రకృతిని పరిరక్షిస్తేనే మనిషికి మనుగడ. అందుకే పాము కనబడితే కొట్టి చంపొద్దు. దయచేసి నాకు సమాచారం ఇవ్వండి..’ అంటూ అభ్యర్థిస్తాడు వెంకటేష్. చిన్నతనం నుంచి పాములంటే తనకు చాలా ఇష్టమని చెప్పే ఈ ‘స్నేక్’హితుడు చదువుకుంది కేవలం పదోతరగతి మాత్రమే. జీవనాధారం కోసం ఆటో నడుపుతున్నాడు. ప్రస్తుతం మాడుగులలో నివాసం ఉంటున్న వెంకటేష్‌కు చిన్ననాటి నుంచి పాములపట్టడంపై ఆసక్తిని పెంచుకున్నాడు. ఎటువంటి పరికరాలు, రక్షణ చర్యలు లేకుండానే విషనాగును సైతం ఇట్టే పట్టేస్తాడు. పుట్టలో ఉన్న పామును సైతం తోక పట్టుకుని బయటకిలాగే నేర్పరితనం ఆయన సొంతం. ఇంటిపేరు మారింది... పెచ్చేటి వెంకటేష్ అంటే చాలామందికి తెలియదు. ‘పాముల’ వెంకటేష్‌గానే సుపరిచితుడు. పట్టుకున్న ప్రతి పామును ఫొటోతీసి అది ఏ ప్రాంతంలో దొరికింది.. ఏ జాతికి చెందినది.. ప్రమాదకరమైనదా.. కాదా అనే విషయాల్ని రికార్డు రూపంలో భద్రపరచడం అలవాటుగా చేసుకున్నాడు వెంకటేష్. ఇప్పటి వరకూ వందల సంఖ్యలో పాముల్ని పట్టుకుని అటవీ ప్రాంతంలో విడిచిపెడుతున్న వెంకటేష్ సేవల్ని అటవీశాఖ గుర్తించింది. ప్రశంసా పత్రాల్ని అందించింది. గ్రామాల్లో వెంకటేష్ పేరుతో నేమ్‌బోర్డులను కూడా ఏర్పాటు చేసింది. ఫోన్ చేస్తే చాలు... ఫలానా ప్రాంతంలో పాము ఉందని ఫోన్ చేస్తే చాలు ప్రత్యక్షమవుతాడు. అటవీశాఖ సిబ్బందికంటే వేగంగా స్పందిస్తున్నాడు. ఇళ్లలోకి వచ్చిన పాముల్ని సైతం పట్టుకుని అడవిలో విడిచిపెడతాడు. ప్రభుత్వం పరంగా వెంకటేష్‌కు సాయమందిస్తే బాగుంటుంది. –జవ్వాది వరహాలు, మాడుగుల వెంకటేష్ ఇంటికి కెనడా నుంచి వచ్చిన నిపుణులు నిరుపేద కుటుంబంలో పుట్టినా.. వెంకటేష్‌ది నిరుపేద కుటుంబం. తల్లిదండ్రులు అతికష్టంమీద పదోతరగతి వరకు చదివించారు. విధిలేక పొట్టకూటి కోసం ఆటోడ్రైవర్‌గా మారాడు. కొంత కాలం జీపు డ్రైవర్‌గా కూడా పనిచేశాడు. వృత్తి ఆటో నడపడం అయితే ప్రవృత్తిగా పాముల్ని పడుతూ ప్రకృతి మిత్రగా పేరు సంపాదిస్తున్నాడు. ఎటువంటి పరిహారం ఆశించకుండానే పాములు పట్టడంతో మండలవాసులు వెంకటేష్‌ను ప్రత్యేకంగా గౌరవిస్తారు. ‘ఆ నాలుగు’ ప్రమాదం.. మాడుగుల మండలం చుట్టూ దట్టమైన అటవీ ప్రాంతం ఉంది. పాముల సంఖ్య అధికమే. వందలాది సర్పాలున్నప్పటికీ నాలుగురకాలు మాత్రమే విషపూరితమైనవి అని చెబుతాడు వెంకటేష్. రక్తపింజెర, కట్లపాము, కింగ్‌కోబ్రా, నాగపాములు ప్రమాదకరమైనవని వివరిస్తాడు. మండలంలో పాము కనబడితే 95503 10149 నెంబర్‌కు సమాచారమివ్వాలని కోరుతున్నాడు ఈ పాముల సంరక్షకుడు. వెంకటేష్ వద్దకు విదేశీయలు... సోషల్ మీడియాలో వెంకటేష్ వీడియోల్ని, పాములు పట్టే ఫొటోల్ని చూసిన విదేశీయులు గత ఏడాది మాడుగులకు వచ్చి ఆయన్ని కలిశారు. పనితీరును పరిశీలించారు. ఎటువంటి శిక్షణ లేకుండా ఒడుపుగా పామును పట్టడం చూసి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. పాములు పట్టడంలో సుశిక్షితులైన వారు కూడా వెంకటేష్ వద్ద చాలా మెలకువల్ని నేర్చుకున్నారు. పాములు పట్టేందుకు కొన్ని సురక్షితమైన వస్తువుల్ని వెంకటేష్‌కు బహుమతిగా అందించారు. పామును పట్టేందుకు ప్రత్యేకమైన కర్ర, పామును భద్రపరిచేందుకు వినియోగించే సంచి, పట్టుకునే క్రమంలో ధరించాల్సిన బూట్లను ఇచ్చి అభినందించారు. విశ్వవిద్యాలయాల్లో పాముల పట్టడంలో శిక్షణ తీసుకున్నవారు సైతం వెంకటేష్‌లా పాములుపట్టలేరని కితాబిచ్చారు. ప్రమాదకరమని తెలిసినా... చిన్ననాటి నుంచి పాములంటే ప్రత్యేకమైన ప్రేమ. వాటిని పట్టకోవడం.. వాటితో ఆడుకోవడం.. ఇష్టంగా అనిపించేవి. అమ్మా, నాన్నా చాలాసార్లు మందలించారు. కానీ నాలో మార్పు రాలేదు. విషరహిత పామలు ఎన్నో సార్లు కాటేశాయి. కానీ వాటిపై కోపం రాలేదు. అమెరికా, నెదర్లాండ్స్, కెనడా దేశాల నుంచి చాలామంది ప్రతినిధులు వచ్చి నా దగ్గర మెలకువలు నేర్చుకోవడం నాకు గర్వంగా అనిపించింది. ప్రభుత్వం స్పందించి ఇదే వృత్తిలో బతుకుతెరువు చూపించాలి. పాముల్ని దయచేసి ఎవరూ చంపొద్దు. – పెచ్చేటి వెంకటేష్ -
అసెంబ్లీలో పాముల సయ్యాట
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీలో రెండు పాములు కలకలం సృష్టించాయి. అసెంబ్లీ ప్రాంగణంలోని మీడియా పాయింట్ సమీపంలో శుక్రవారం రెండు పాముల సయ్యాట బెంబేలెత్తిచింది. దాదాపు అరగంటలపాటు పాములు పెనవేసుకున్నాయి. ఈ సమయంలో మీడియా హాలులో ప్రతిపక్ష నేత జానారెడ్డి మాట్లాడుతున్నారు. పాముల సయ్యాటను చూసిన కొంతమంది స్నేక్ సొసైటీకి సమాచారం అందించారు. స్నేక్ సొసైటీ సభ్యులు వచ్చి పాములను పట్టుకోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. అయితే అసెంబ్లీ అవరణలో తరచూ పాములు తిరుగుతున్నా పట్టించుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి. (పాములను పట్టుకున్న స్నేక్ సొసైటీ సభ్యులు) -
రాంచరణ్ నివాసంలోకి దూరిన విష సర్పం!
టాలీవుడ్ నటుడు రాంచరణ్ నివాసంలో అనుకోని అతిధి ప్రత్యక్ష మయ్యాడు. రాంచరణ్ నివాసానికి వచ్చింది మిత్రుడో.. పరిచయమున్న వ్యక్తో అయితే అంత ఇబ్బందేమి ఉండేది కాదు. కాని ఆయన ఇంట్లోకి వచ్చింది ఓ విష సర్పం. ఇంట్లోకి పాము దూరిన సంఘటన రాంచరణ్ సిబ్బందికి కొద్దిసేపు ఆందోళన కలిగించింది. అయితే ఆ పామును చంపకుండా వదిలివేయడంపై పలువురు జంతు ప్రేమికులకు ఆనందం కలిగించింది. తన నివాసంలోకి పాము దూరిందని రాంచరణ్ ఫేస్ బుక్ లో ఓ ఫోటోను పోస్ట్ చేశారు. గత రాత్రి ఇంట్లోకి పాము దూరిందని గ్రహించిన రాంచరణ్ సిబ్బంది... పారిపోకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఆతర్వాత జాగ్రత్తగా ఒడిసిపట్టుకుని.. జంతు సంరక్షణ సొసైటీకి కబురు పెట్టి.. వాళ్లకు అప్పగించారు. సోసైటీకి చెందిన సిబ్బంది పామును అడవిలో వదిలివేసినట్టు తెలిసింది. Follow @sakshinews Post by Ram Charan.