ఆస్ట్రేలియాలో ఎండలు మండిపోతున్నాయి.రోజురోజుకు ఉష్ణోగ్రతలు తీవ్ర స్థాయికి చేరుతున్నాయి. మంగళవారమక్కడ సగటు ఉష్ణోగ్రత 40.9 డిగ్రీలుగా నమోదైంది. ఇది 2013లో ఏర్పడిన 40.03 డిగ్రీల రికార్డును బ్రేక్ చేసిందని ఆస్ట్రేలియ వాతావరణ శాఖ వెల్లడించింది. అటు ఎండ తీవ్రత సమస్యను ఎదుర్కొంటున్న స్థానిక ప్రజలకు మరో విచిత్రకరమైన సమస్య ఎదురవుతుంది. బయటఎండ తీవ్రతను తట్టుకోలేని పాములు జనావాసాల్లోకి చొరబడి.. ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. ఇంట్లోకి ప్రవేశించిన పాములు మూలల్లోకి వెళ్లి తల దాచుకుంటున్నాయి. అక్కడా...ఇక్కడా అనే తేడా లేకుండా పాములు చల్లటి ప్రదేశాన్ని వెతుక్కుంటున్నాయి.