
వాషింగ్టన్: సాధారణంగా మనం ఒక్క పామును చూస్తే భయంతో పరుగులు తీస్తాము. అలాంటిది ఏకంగా 18 పాములను ఒకేసారి చుస్తే..అది కూడా మనం నిద్ర పోయే బెడ్ కింద ఉంటే అది ఊహించడానికే కష్టంగా ఉంటుంది. అచ్చం ఇటువంటి సంఘటనే ఒకటి జార్జియాలో జరిగింది.వివరాలు.. ట్రిస్ విల్చర్ అనే మహిళ రాత్రి సమయంలో తన బెడ్ రూమ్ లో నిద్ర పోవడానికి బెడ్ ను సర్దుతున్న సమయంలో నేలపై ఏదో శబ్ధం వినిపించడంతో దగ్గరగా వెళ్లి చూసింది. ఆ మహిళకు పాము కనిపించడంతో ఒక్కసారిగా భయంతో కేకలు వేయడంతో వెంటనే ఆమె భర్త రూమ్ లోపలకి వచ్చి పాము పిల్లను చూసాడు.
ఇంకా ఏమైనా ఉన్నాయేమోనని చూడగా ఏకంగా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 18 పాములు కనిపించాయి. ఈ మొత్తం పాములును సంచిలో వేసి సమీపంలో ఉన్న అడవిలో వదిలేసారు. ఆ తర్వాత ఈ సమాచారాన్ని అందుకున్న స్నేక్ రెస్క్యూ టీమ్ ఆ ఇల్లంతా గాలించారు. ఇల్లంతా వెతికాక ఇంకా ఎక్కడ పాములు లేవని చెప్పడంతో ఆ దంపతులు ఊపిరి పీల్చుకున్నారు అన్ని పాములు తమ రూమ్ లోకి ఎలా వచ్చాయో ఆ దంపతులకు అర్ధం కాలేదు. దీనికి సంభందించిన ఫోటోలను ఆమె పేస్ బుక్ లో పోస్ట్ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment