సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీలో రెండు పాములు కలకలం సృష్టించాయి. అసెంబ్లీ ప్రాంగణంలోని మీడియా పాయింట్ సమీపంలో శుక్రవారం రెండు పాముల సయ్యాట బెంబేలెత్తిచింది. దాదాపు అరగంటలపాటు పాములు పెనవేసుకున్నాయి. ఈ సమయంలో మీడియా హాలులో ప్రతిపక్ష నేత జానారెడ్డి మాట్లాడుతున్నారు.
పాముల సయ్యాటను చూసిన కొంతమంది స్నేక్ సొసైటీకి సమాచారం అందించారు. స్నేక్ సొసైటీ సభ్యులు వచ్చి పాములను పట్టుకోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. అయితే అసెంబ్లీ అవరణలో తరచూ పాములు తిరుగుతున్నా పట్టించుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి.
(పాములను పట్టుకున్న స్నేక్ సొసైటీ సభ్యులు)
Comments
Please login to add a commentAdd a comment