king kobra
-
మాకు బతకాలని ఉండదా!.. కనపడితే ఖతం చేస్తున్నారు
సాక్షి ,భామిని(పార్వతిపురం మన్యం): సరీసృపాల్లో సర్పజాతిపై అవగాహన లోపంతో అవి అంతరించి పోయే దుస్థితి ఏర్పడింది. హైందవ సంప్రదాయంలో పవిత్ర స్థానం గల సర్పాలకు పూజలు, నోములు చేస్తున్న చోటే అవగాహన లోపంతో వాటిని అంతం చేసే సంస్కృతి సాగుతోంది. దెబ్బ తిన్న పాము పగ పడుతుందనే అభూత కల్పన, పాము కాటు వేస్తే విష ప్రభావంతో మరణిస్తామనే భయంతో వాటిని హతమారుస్తున్నారు. గ్రామస్తుల చేతిలో హతమైన భారీ కొండచిలువ పంట కాపాడే పాములు రైతు పండించే పంటలో నలభై శాతం స్వాహా చేస్తున్న ఎలు కలు, పందికొక్కుల నివారణ లో కీలక పాత్ర ధారి పాముకు మనుగడ కష్టమైపోతోంది. పర్యావరణ పరిరక్షణలో కీలకంగా, భూ సారాన్ని కాపాడే ముఖ్యమైన జీవిగా గుర్తింపు పొందినా వాటికి తగిన రక్షణ కరువవుతోందని పర్యావరణ హితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. క్రిమి సంహారక మందుల ప్రభావం ప్రధానంగా వ్యవసాయ రంగంలో వినియోగించే క్రిమి సంహారక మందుల ప్రభావం, ఆదునిక యంత్రాల వాడకంలో పుట్టలు, తుప్పలు, దిబ్బలు లేకుండా, భూమిలో బొరియలు లేకుండా చేయడంతో పాముల సంచారం కష్టమైంది. విష సర్పాలు తక్కువ.. మన చుట్టూ తిరుగుతున్న పాములలో 80 శాతం విషంలేని సాధారణ సర్పాలే ఉన్నాయి. విçషపూరితమైనవి, ప్రాణాంతకం కలిగించేవి కొద్దిగానే ఉన్నాయి. నాలుగు రకాలైన తాచుపాము(నాగుపాము),రక్తపింజర,కట్లపాము, పొడపాములను విషసర్పా లుగా గుర్తించారు. పాము కాటుకు గురైన వ్యక్తుల్లో అత్యధికంగా భయంతోనే ఎక్కువ మంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. పాములపై అవగాహన అవసరం విద్యార్థి స్థాయి నుంచి పాములపై అవగాహన కల్పించాలి. అన్ని పాములు ప్రమాదరం కావని తెలియజేయాలి. పాము పగ పడుతుందనే మూఢ నమ్మకాలు విడిచి పెట్టేలా చైతన్యం కల్పించాలి. స్నేక్స్ ఫ్రెండ్లీ సొసైటీలు ఏర్పాటు కావాలి. అన్ని పాములను హరించడం తగదు. కొట్టి చంపకుండా, పట్టి దూరంగా విడిచిపెట్టాలి. అవి అంతరించకుండా చూడాలి. పాములన్నీ విషసర్పాలు కావు పాములన్నీ విషసర్పాలు కావు. అన్ని పాములకు విషం ఉండదు. పాము కాటు వేస్తే చనిపోతామనే భయం వీడాలి. ప్రమాదవశాత్తు పాముకాటుకు గురైనా భయపడవద్దు. అందుబాటులోని ప్రభుత్వాస్పత్రికి తీసుకురండి. విషాన్ని నివారించే ఏంటీస్నేక్ వీనమ్(ఏఎస్వీ) మందులు అందుబాటులో ఉన్నాయి. పాముకాటు పడిన తరువాత గాయాన్ని కడగవద్దు. పాము వేసిన గాట్లు గుర్తించి విషప్రభావం లెక్కించి ఏఎస్‌వీలు వేస్తాం. – డాక్టర్ ఎన్.శ్రీనివాసరావు,డిప్యూటీ డీఎంహెచ్ఓ,సీతంపేట పాము కనిపిస్తే సమాచారం ఇవ్వండి పాములు కనిపిస్తే సమాచారం ఇవ్వండి. సర్ప జాతుల సంరక్షణకు స్నేక్ రెస్క్యూ టీం తరలి వస్తుంది. ప్రాణాపాయం లేకుండా పట్టుకుని అడవుల్లో విడిచి పెడతాం.అటవీశాఖాధికారుల సహకారంతో గ్రీన్ మెర్సీ సంస్థ ఉచితంగా సేవలు అందిస్తుంది.సర్పజాతులను చంపవద్దు. ప్రకృతి సమతుల్యం దెబ్బతింటుంది.హెల్ప్‌లైన్ నంబర్ 9848414658కు తెలియ పర్చండి. పాములను చంపడం చట్టరీత్యానేరం.1972 వన్యప్రాణి సంరక్షణ చట్టం మేరకు కఠిన శిక్షలు తప్పవు. – కేవీ రమణమూర్తి, సీఈఓ, గ్రీన్‌మెర్సీ వన్యప్రాణ సంరక్షణ గస్తీ బృందం చదవండి: Gujarat Riots: గుజరాత్ అల్లర్ల వెనుక షాకింగ్ నిజాలు.. మోదీని గద్దె దింపేందుకే కాంగ్రెస్ ప్లాన్! -
కిచెన్‌లోకి వెళ్లిన భార్య ఒక్కసారిగా భయంతో..
శివమొగ్గ(బెంగళూరు): శివమొగ్గ నగరంలోని చాలుక్య నగర్లో మంజునాథ్ అనే వ్యక్తి ఇంటిలో ఓ నాగుపాము వంట గదిలో దూరింది. శుక్రవారం ఉదయం 7 గంటల సమయంలో మంజునాథ్ భార్య వంట చేయడానికి పాత్రలు తీస్తుండగా ఒక్కసారిగా బుసలు కొట్టడంతో ఆమె భయంతో పరుగు తీసింది. కుటుంబ సభ్యుల నుంచి సమాచారం అందుకున్న స్నేక్ కిరణ్ అక్కడికి చేరుకుని పామును పట్టుకోవడంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. మరో ఘటనలో.. బూదిపడగ గ్రామంలో శిలాయుగం నాటి సమాధులు మైసూరు: చామరాజనగర జిల్లా బూదిపడగ గ్రామంలో పురాతన సమాధులు బయటపడ్డాయి. మైసూరు వర్సిటీ ప్రాచీన చరిత్ర, పురావస్తు శాఖ విభాగం సహాయ ప్రాధ్యాపకురాలు వి.శోభ నేతృత్వంలోని అధికారుల బృందం గ్రామ సమీపంలో సుమారు 300 మీటర్ల దూరంలో తవ్వకాలు చేపట్టింది. సుమారు 9 మీటర్ల పొడవు, 4.5 మీటర్ల వెడల్పుతో ఉన్న కట్టడాలు బయట పడ్డాయి. వీటిని పరిశీలించగా సమాధులుగా గుర్తించారు. ఇవి క్రీ.పూ.1,500 లేదా అంతకంటే ముందునాటివి అయి ఉండవచ్చని పరిశోధకులు భావిస్తున్నారు. చదవండి: ఎస్ఐ పరీక్షలో అక్రమాలు.. హోం మంత్రి సంచలన వ్యాఖ్యలు -
బుసలు కొడుతూ పైకి లేచిన 14 అడుగుల కింగ్ కోబ్రా..
బ్యాంకాక్: సాధారణంగా చాలా మంది పాముని చూడగానే భయంతో వెన్నులో వణుకుపుడుతుంది. మరికొందరైతే పాము ఫలాన చోట కనిపించిందంటే.. ఆ దారిదాపుల్లోకి వెళ్లటానికి సాహసించరు. అయితే, ఒక్కొసారి పాములు తమ దారి తప్పి ఆవాసం కోసం, ఆహర అన్వేషణలో జనవాసాల మధ్యన చేరుతుంటాయి. ఇలాంటి సమయాల్లో ఆత్మరక్షణకు ఒక్కొసారి అవి కాటు వేస్తాయి. మరికొన్నిసార్లు అవి కూడా ప్రమాదాల బారిన పడతాయి. కొందరు పాములు కనిపిస్తే.. స్నేక్ సోసైటి వారికి సమాచారం అందించి వాటిని ఏ ఆపద తలపెట్టరు. ఇలాంటి ఎన్నో వీడియోలు ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. తాజాగా, ఇలాంటి ఘటన ఒకటి థాయిలాండ్‌లో జరిగింది. దక్షిణ థాయి ప్రావిన్స్‌లో క్రాబీలోని ఒక తోటలో గిరినాగు ( కోబ్రా) ప్రత్యక్షమయ్యింది. దీంతో అక్కడి వారంతా భయంతో వణికిపోయారు. అది దాదాపు 14 అంగుళాల వరకు పోడవుంది. స్థానికులు వెంటనే పాములను పట్టే వారికి సమాచారం అందించారు. అయితే, నైవాధ్ అనే వ్యక్తి ఆ ప్రదేశంలో పాములను పడుతుంటాడు. అతను అక్కడికి చేరుకున్నాడు. ఆ తర్వాత కోబ్రాను పట్టుకోవడానికి ప్రయత్నించాడు. గిరినాగు మాత్రం బుసలు కొడుతూ.. ఎంత సేపటికి అతనికి లొంగలేదు. అతను పట్టుకుందామనుకోనేసరికి బుసలు కొడుతూ.. కాటు వేయడానికి రాసాగింది. దాదాపు 20 నిముషాలు కష్టపడి చాకచక్యంగా కోబ్రాను లొంగతీసుకున్నాడు. ఆ తర్వాత నైవాధ్.. కోబ్రా.. ప్రపంచంలో అత్యంత విషపూరిత సర్పమని తెలిపాడు. ఇది పెద్ద పాములను సైతం తింటుందని తెలిపాడు. అత్యంత వేగంగా కూడా ప్రయాణిస్తుందని, కాటు వేస్తే తక్కువ సమయంలోనే మనిషి ప్రాణాలు గాల్లో కలుస్తాయని వివరించాడు. ఆ తర్వాత కోబ్రాను సమీపంలోని అడవిలో వదిలేశాడు. ఇవి దక్షిణ, ఆగ్నేయ ఆసియాలో ఎక్కువగా కనిపిస్తాయి. కాగా, అతను కోబ్రాను పట్టేటప్పుడు స్థానికులు వీడియో తీశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. దీన్ని చూసిన నెటిజన్లు.. ‘వామ్మో.. ఎంత భయంకరంగా ఉంది..’, ‘కాటు వేస్తే.. అంతే సంగతులు..’, ‘మీ ధైర్యానికి జోహర్లు..’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. చదవండి: వంతెనను ప్రారంభించిన మహరాష్ట్ర మంత్రి.. గిరిజనులు ఎన్నో ఏళ్లుగా -
King Cobra: 13 అడుగుల గిరినాగు
అడ్డతీగల(తూర్పుగోదావరిజిల్లా): 13 అడుగుల గిరినాగు (కింగ్‌కోబ్రా)ఇళ్లల్లోకి చొరబడటంతో మామిడిపాలెంలో గిరిజనులు భయభ్రాంతులతో కకావికలమయ్యారు. సమాచారం తెలిసి, అడ్డతీగల అటవీ క్షేత్రంలో పని చేస్తున్న డీఆర్వో భానుప్రకాశ్, ఎఫ్‌బీఓలు ప్రశాంత్‌కుమార్, శశికుమార్‌లు కాకినాడకు చెందిన స్నేక్ శివను రప్పించారు. గ్రామానికి చెందిన యువకుడు కట్టా సిద్ధు తెలివిగా ఓ గోనె సంచిలోకి గిరినాగు వెళ్లేలా చేసి బంధించాడు. అనంతరం దానిని మిట్లపాలెం సమీపాన తపస్వికొండ రక్షిత అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు. చదవండి: పాపికొండలు.. బెంగాల్ పులులు.. బంగారు బల్లులు -
హిమాచల్ ప్రదేశ్‌లో తొలిసారి కింగ్ కోబ్రా ప్రత్యక్షం.. వైరల్
సిమ్లా: సాధారణంగా పాములను దూరం నుంచి చూస్తేనే మన వెన్నులో వణుకు పుట్టడం ఖాయం.. అలాంటిది మన పక్కనే ఉంటే ఒక్కోసారి ప్రాణాలు కూడా పోతుంటాయి. కానీ హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన ప్రవీణ్ ఠాకూర్ తన ఇంటికి సమీపంలో ఉన్న పుట్టలో నుంచి బయటకు వస్తున్న పామును వీడియో తీశాడు. తన పెంపుడు కుక్కతో కలిసి మార్నింగ్ వాక్కు వచ్చిన సమయంలో ఇది జరిగింది. మొదట అది చిన్నపాము అని భావించినా.. వీడియో తీస్తున్నంతసేపు పాము పుట్టలోంచి పూర్తిగా బయటకు రావడానికి 40 సెకన్లు పట్టింది. దాదాపు ఆ పాము పొడవు 12 అడుగులకు పైగా ఉంది. ఇంత పెద్ద పామును తాను ఎప్పుడు చూడలేదని.. ఇది ఏంటో తెలపాలంటూ ఐఎఫ్ఎస్ అధికారి పర్వీన్ కష్వాన్కు షేర్ చేశాడు. '' పర్వీన్ కష్వాన్ జీ.. నేను మార్నింగ్ వాకింగ్ వచ్చినప్పుడు పుట్టలోంచి పాము రావడం చూశాను. కానీ నా జీవితంలో అంత పెద్ద పామును మాత్రం చూడలేదు.. దయచేసి ఆ పాము ఏంటో చెప్పండి'' అంటూ కామెంట్ చేశాడు. అలా ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారి చివరికి వైల్డ్‌లైఫ్ అధికారులో దృష్టిలో పడింది. వాళ్లు ఆ వీడియోనూ చూసి కింగ్ కోబ్రాగా తేల్చారు. హిమాచల్ ప్రదేశ్‌లో కింగ్ కోబ్రా కనిపించడం ఇదే తొలిసారని.. భారతదేశంలో కింగ్ కోబ్రా ప్రధానంగా పశ్చిమ కనుమల ప్రాంతంతో పాటు అస్సాం, బెంగాల్, ఒడిశా, టెరాయ్ ప్రాంతాలలో కనిపిస్తుంది. ఇక ప్రపంచంలోనే అతి పొడవైన విషపూరిత కింగ్ కోబ్రాలు ఆగ్నేయాసియాలో ఎక్కువగా సంచరిస్తుంటాయి. చదవండి: వైరల్: నీటి కోసం వెళ్లి మొసలికి బలైన చిరుత! -
వైరల్: ఈ తల్లి బిడ్డకోసం 8 అడుగుల పాము తోక పట్టుకుని..
భువనేశ్వర్: సాధారణంగా చిన్న పామును చూస్తేనే మనం భయపడిపోతుంటాం. అలాంటిది ఓ మహిళ ఏకంగా 8 అడుగుల ఉన్న కింగ్ కోబ్రాను చాకచక్యంగా పట్టుకుని ఫారెస్ట్ అధికారలకు అప్పగించింది. ఈ ఘటన ఒడిశా మయూరభంజ్‌లో జరిగింది. వివరాల్లోకి వెళితే.. ఎలా వచ్చింది గానీ 8 అడుగుల కింగ్‌కోబ్రా ఒకటి ఓ ఇంటిలోకి వచ్చింది. ఆ ఇంట్లో ఆడుకుంటున్న 2 సంవత్సరాల పిల్లాడు పాము వైపు వెళ్తుండడం తల్లిదండ్రులు గమనించారు. వెంటనే పిల్లాడి తండ్రి స్పందించి కొడుకును పట్టుకోగలిగాడు. అదే క్రమంలో పిల్లాడి తల్లి (సస్మిత) పాము తోక పట్టుకుని బయటకు లాక్కొచ్చి విసిరేసింది. అనంతరం వాళ్లు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్‌ను పిలిపించి ఆ పాముని అడవిలో విడిచిపెట్టారు. అదృష్టవశాత్తూ, ఈ ఘటనలో ఎవరికీ ఏ అపాయం జరగలేదు. సస్మిత మాట్లాడుతూ.. తన బిడ్డకు ఏమైనా జరుగుతుందేమోనని భయంతో ఇంతటి ధైర్యం చేసినట్లు తెలిపింది. ఈ పరిస్థితిలో మాకు సహాయం చేసిన అటవీ శాఖ అధికారికి కృతజ్ఞతలు తెలిపింది. కాగా ఆమె ధైర్యాన్ని చూసి అందరూ హడలిపోయారు. ప్రస్తుతం సస్మతి చూపిన ధైర్యానికి చుట్టు పక్కల వాళ్లంతా ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. Odisha: A woman rescued a King Cobra who entered a residential area in Mayurbhanj "It was found in front of a house of a local. I rescued it and released it in its habitat with the help of the forest department and Range Officer," said Sasmita Gochhait (05.06) pic.twitter.com/dCfsaAkrSs — ANI (@ANI) June 5, 2021 చదవండి: వైరల్: రైతు దుశ్చర్య.. పాపం ఎలుకల దండుని.. -
నాగుపామును వెంటాడి.. అరగంట పోరాడి..
బెంగళూరు : మనం ఎంతో ప్రేమతో పెంచుకునే కుక్కలు మనం వాటిని నమ్మితే అవి మన పట్ల ఎంత విశ్వాసంగా ఉంటాయో మనకు తెలుసు. అలాంటి కుక్కలు నాగుపాము తమ యజమాని ఇంటిలోకి వెళ్లడాన్ని అడ్డుకోవడంతో పాటు దానిని వెంటాడి చంపిన సంఘటన విజయపుర సమీపంలో చోటు చేసుకుంది. విజయపురకు అతి సమీపంలో ఉన్న రైతు కృష్ణప్ప తోటలోనే ఇంటిని నిర్మించుకుని ఉన్నాడు. అయితే గురువారం సాయంత్రం ఒక నాగుపాము తోటలో ఉన్న రైతు కృష్ణప్ప ఇంటిలోకి వెళ్లడానికి యత్నిస్తున్న సమయంలో తోటలో ఉన్న మూడు కుక్కలు పామును ఇంటిలోకి వెళ్లకుండా కట్టడి చేశాయి. కుక్కల అరుపులు విన్న యజమాని కృష్ణప్ప అక్కడికి చేరుకుని విషయం గుర్తించాడు. అప్పటికే పామును కుక్కలు చంపేశాయి. ఈ సందర్భంగా కృష్ణప్ప మాట్లాడుతూ... తమ తోట చుట్టు పక్కల చాలా విష సర్పాలు ఉన్నాయని, వాటి భయంతోనే తాము మూడు కుక్కలు పెంచుతున్నామని చెప్పారు. దాదాపు అరగంట పాటు పామును కుక్కలు కదలకుండా అడ్డుకుని, ఆ తరువాత దాడి చేసి చంపాయని తెలిపారు. -
కాలనాగు కళ్లలోకి చూస్తూ...
సాధారణంగా చిన్న పామును చూడగానే మనకు పై ప్రాణం పైనే పోతుంది. అలాంటిది ప్రపంచంలోనే అత్యధిక విషపూరితమైన పాముల్లో ఒకటైన 13 అడుగుల కింగ్ కోబ్రా ముందు కూర్చుని దాని కళ్లలోకి చూస్తూ పట్టుకోవడానికి ప్రయత్నించడమంటే ప్రాణాలతో చెలగాటమాడినట్లే. కానీ పాములు పట్టడంలో సుప్రసిద్ధుడైన స్నేక్ కిరణ్ ఏ మాత్రం భయపడకుండా అరగంట పాటు తీవ్రంగా శ్రమించి దాన్ని పట్టుకున్నాడు. కర్ణాటకలో శివమొగ్గ జిల్లాలోని తీర్థహళ్ళి తాలూకాలో ఉన్న మేలిన హదూరు గ్రామానికి చెందిన ప్రకాశ్‌గౌడ అనే వ్యక్తికి చెందిన వక్కతోటలో శుక్రవారం రాత్రి భారీ కింగ్ కోబ్రా పాము ప్రత్యక్షమైంది. వెంటనే స్థానికులు ఈ విషయాన్ని అటవీ శాఖ అధికారులకు తెలుపగా, వారు కిరణ్‌కు సమాచారమిచ్చారు. పాములు పట్టడంలో నిపుణుడైన కిరణ్ సుమారు అరగంట పాటు శ్రమించి ఈ రాచనాగును పట్టుకున్నాడు. దీని పొడవు 13 అడుగులు, బరువు 8 కేజీలని కిరణ్ తెలిపాడు. అనంతరం పామును ఊరికి దూరంగా ఆగుంబె అడవిలో వదిలిపెట్టాడు. భారతదేశంలో అత్యధికంగా కింగ్ కోబ్రాలు మనుగడ సాగిస్తున్నది ఆగుంబె అడవుల్లోనే. – శివమొగ్గ -
20 అడుగుల రాచనాగుతో చెడుగుడు!
అతనంటే పాములకు హడల్ అడవి అయినా.. కొండలైనా.. పాము కనపడితే చాలు పట్టేస్తాడు అతని చేతిలో పాములు నాట్యమాడతాయి అతను పాములను కూర్చోబెట్టి క్లాస్ తీసుకుంటాడు 3వేల సార్లు పాము కాటు.. ఆరుసార్లు ఐసీయూ (‘సాక్షి’ స్పెషల్ స్టోరీ) పాములంటే అందరికీ భయమే. తెలిసి తెలిసి ఎవరూ పాముల జోలికి వెళ్లరు. కానీ కేరళలో ఈ యువకుడికి మాత్రం పాములంటే ఎంతో ఇష్టం. పాము కనపడితే వదిలిపెట్టడు. జనం చేతిలో పాములు చావుకుండా కాపాడుతుంటాడు.. క్షేమంగా వాటిని అడవిలో వదిలేస్తుంటాడు. ఎంత ఇష్టమంటే.. పాములు పట్టేటప్పుడు ఆయుధాలు వాడితే అవి ఎక్కడ గాయపడతాయేమోనని ఆలోచిస్తాడు. అందుకే 3వేల సార్లు పాము కాటుకు గురయ్యాడు. దాదాపు మృత్యుఒడిదాకా వెళ్లి వచ్చాడు. అతనే వావా సురేష్.. ఊరు కేరళలోని తిరువనంతపురం. పాములు పట్టడం, వన్య ప్రాణులను సంరక్షించటం అతని హాబీ. రాచనాగు.. కింగ్ కోబ్రా.. పాములన్నింటిలోకెల్లా అత్యంత ప్రమాదకరమైంది. అత్యంత విషపూరితమైంది. ఓ మామూలు నాగుపాము కనిపిస్తేనే మన గుండెలు దడదడా కొట్టుకుంటాయి. దాదాపు 20 అడుగుల నల్లటి కింగ్ కోబ్రా కనిపిస్తే ఎలా వుంటుంది. కానీ సురేష్‌కు మాత్రం చాలా ఈజీ.. మనం చేపలు పట్టినంత ఈజీగా అతను కింగ్ కోబ్రాతో చెడుగుడు ఆడేస్తాడు. మొదట పాము బుసలు కొట్టినా సురేష్ చేతిలో పడ్డాక తోకముడవాల్సిందే. అదే ఇటీవల జరిగింది. అయ్యప్ప భక్తులు శబరిమల వెళ్లేందుకు కీకారణ్యం లోపలి నుంచి వెళ్లాల్సి వుంటుంది. ఈదారిలో వన్యప్రాణాల నుంచి భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఫారెస్ట్ సిబ్బంది పర్యవేక్షిస్తుంటారు. ఆ మార్గంలో భక్తులకు ఇటీవల ఓ భయంకరమైన కింగ్ కోబ్రా కనిపించింది. అత్యంత విషపూరితమైన కింగ్ కోబ్రాను పట్టుకునేందుకు అటవీ శాఖ సిబ్బంది కూడా సాహసించలేదు.. అందుకే వావా సురేష్‌ను పిలిపించారు. అప్పటికే కొండరాళ్లమధ్య దూరిన రాచనాగు చేతులతో పట్టుకోవడమే కాదు.. ఒక ఆట ఆడుకున్నాడు. 30వేల పాములు.. 3వేల సార్లు పాము కాట్లు! 42 ఏళ్ల ఈ సాహసి ఇప్పటివరకు 30వేలకు పైగానే పాములను కాపాడి అడవిలో వదిలాడు. పాములను పట్టేసమయంలో అతను ఎలాంటి పరికరాలు వాడడు. ఎందుకంటే వాటి వల్ల పాములకు గాయాలవుతాయంటాడు. పాములను పట్టేక్రమంలో 3వేల సార్లు పాము కాటుకు గురయ్యాడు. మూడు సార్లు వెంటిలేటర్‌పైన వున్నాడు.. ఆరు సార్లు ఐసీయూలో చేరాడు. అయినా ఇప్పటికీ పాము కనిపిస్తే చాలు దానిని సురక్షితంగా అడవిలో వదిలేయడానికి వెనుకాడడు. పాముల సైకాలజీ తెలుసు..! పాముల కదలికలను సురేష్ బాగా స్టడీ చేశాడు. పాముల సైకాలజీ ఎలా వుంటుందో.. ఏ పాము ఎలా కాటేస్తుందా కూడా అతనికి తెలుసు. పడగ విప్పిన నాగుపాము కనిపిస్తే మనం అంతదూరం పారిపోతాం. కానీ సురేష్ పాముల పడగల మధ్య దర్జాగా కూర్చుంటాడు. పాములన్నీంటినీ వరుసలో కూర్చోబెట్టి క్లాస్ తీసుకుంటాడు. వాటితో ఆటాడిస్తాడు. చిన్నప్పటినుంచీ ఇంతే.. నిరుపేద కుటుంబంలో పుట్టిన సురేష్‌కు చిన్నప్పటి నుంచి పాములంటే ఇష్టం. 12ఏళ్ల వయసులోనే ఓ బేబీ కోబ్రాను పట్టుకొచ్చి ఇంట్లో దాచుకున్నాడు. పాము ప్రవర్తను అర్ధం చేసుకునేదాకా ఆ బేబీ కోబ్రాను తనతోనే వుంచుకున్నాడు. 2012లో కేరళ సర్కారు సురేష్‌కు అటవీ శాఖలో ఉద్యోగం ఆఫర్ చేసింది. అయితే అతను దాన్ని నిరాకరించాడు. 2013లో ఒక విషనాగు కాటేయటంతో దాదాపు మృత్యు ఒడిదాకా వెళ్లి వచ్చాడు. అయినా పాములను పట్టడం మానలేదు. పాములు పట్టడంలో అతని సాహసం గురించి తెలిసిన ఎవరైనా హ్యాట్సాప్ అంటారు. -
విమానంలో రెస్టు తీసుకున్న కింగ్ కోబ్రా!
భారీ వర్షాల కారణంగా చెన్నైలో మనుషులకే కాదు.. జంతువులకు కూడా రక్షణ లేకుండా పోయింది. ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతుండటంతో తలదాచుకోడానికి సురక్షిత ప్రాంతం వెతుక్కుంటూ వెళ్లిన ఓ కింగ్ కోబ్రా.. చివరకు ఎంచక్కా ఓ విమానం ఎక్కేసి అందులో నిద్దురపోయింది. నగరంలోని విమానాశ్రయం కూడా భారీ వర్షాలతో మూతపడిన విషయం తెలిసిందే. అక్కడ పార్క్ చేసిన ఓ విమానం చక్రం కంపార్టుమెంటు లోపల ఈ కింగ్ కోబ్రా విశ్రమించింది. చెన్నై విమానాశ్రయంలో సోమవారం నుంచి కార్యకలాపాలు తిరిగి ప్రారంభం అవ్వడంతో సిబ్బంది విమాన చక్రాలను శుభ్రం చేస్తుండగా ఈ కింగ్ కోబ్రా కనిపించింది. దాన్ని సురక్షితంగా బయటకు తీసి, విమానాశ్రయానికి దూరంగా ఉన్న ప్రాంతంలో వదిలిపెట్టారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. వర్షాల కారణంగా చెన్నై విమానాశ్రయం ఐదు రోజుల పాటు మూతపడింది. ప్రధాన రన్‌వేతో పాటు ఇతర ప్రాంతాల్లో కూడా నీళ్లు నిలిచిపోవడంతో అక్కడి నుంచి విమానాలను నడిపించలేకపోయారు. ఇప్పుడు కూడా కేవలం స్వదేశీ ప్రయాణాలకు సంబంధించిన విమానాలను మాత్రమే నడుపుతున్నారు తప్ప అంతర్జాతీయ విమానాలను టేకాఫ్ గానీ, ల్యాండింగ్ గానీ చేయడం లేదు. -
ఆ పాము గర్భిణి.. మాకొద్దు!
తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం ప్రాంతంలో దొరికిన తాచుపామును తాము సాకలేమని విశాఖ జూ అధికారులు చేతులెత్తేశారు. 15 అడుగుల తాచుపాము ఒకదాన్ని రంపచోడవరం ప్రాంతంలో ఈనెల 13వ తేదీన పట్టుకున్నారు. నాలుగు గంటల పాటు శ్రమించి పట్టుకున్న ఆ పామును అటవీ శాఖాధికారులు కష్టమ్మీద విశాఖపట్నం జూకు తరలించారు. అయితే, అక్కడ దాన్ని పరిశీలించిన వైద్యులు.. ఆ పాము గర్భిణి అని గుర్తించారు. ఇది చాలా ఎక్కువ సంఖ్యలో పిల్లలను పెట్టే అవకాశం ఉందని, అవి జూలో ఉన్న ఇతర జంతువులకు ప్రమాదకరం కావచ్చని, దాంతోపాటు ఈ పాము, పిల్లలను సాకడం కూడా చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం అవుతుందని వైద్యులు చెప్పారు. దీంతో అత్యంత విషపూరితమైన ఈ పామును విశాఖ, తూర్పుగోదావరి ఏజెన్సీల మధ్యలో ఉన్న దట్టమైన అడవుల్లో లోపలికంటే తీసుకెళ్లి వదిలేశారు. రంపచోడవరం ప్రాంతంలో ఉన్న ఓ ఇంటి ఆవరణలో్కి ఈ తాచుపాము దూరగా, అత్యంత కష్టమ్మీద దీన్ని పట్టుకోగలిగారు. సాధారణంగా ఇంత పెద్ద తాచులు ఆస్ట్రేలియాలో కనపడతాయని, బహుశా చెట్లు నరికేయడం వల్ల ఇది నివాస ప్రాంతాల్లోకి వచ్చి ఉంటుందని అధికారులు చెప్పారు. ప్రపంచంలో అత్యంత పొడవైన, అత్యంత విషపూరితమైనది తాచుపామే. -
రంపచోడవరం అడవుల్లో 15 అడుగుల కోబ్రా
రాజమండ్రి: ఐదడగుల నాగ పాముల్ని చూస్తేనే అదొక వింతలా భావిస్తుంటాం. అటువంటిది ఏకంగా 15 అడుగుల అరుదైన కింగ్ కోబ్రా కనపడితే..అమ్మో ఇంకేముంది. నోళ్లు యెళ్లబెట్టి ఆశ్చర్చం వ్యక్తం చేస్తాం. అటువంటి ఘటనే తూర్పు గోదావరి జిల్లాలోని రంపచోడవరం అడవుల్లో చోటు చేసుకుంది. ఏజెన్సీ ప్రాంతమైన రంపచోడవరంలో నివసిస్తున్నఓ వ్యక్తి ఇంటి దగ్గర్లో భారీ కింగ్ కోబ్రా విపరీతమైన శబ్దాలు చేయడంతో గమనించిన అతను అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించాడు. దీంతో అక్కడి చేరుకున్న అటవీశాఖ అధికారులు నాలుగు గంటలకు పైగా శ్రమించి ఆ త్రాచుని చాకచక్యంగా వలల సాయంతో పట్టుకున్నారు. అక్కడి నుంచి ఆ కింగ్ కోబ్రాను విశాఖ జూలాజికల్ పార్క్ కు తరలించారు. కింగ్ కోబ్రా అనేది ప్రపంచలోని అత్యంత విషపూరితమైన జంతువని అటవీ అధికారులు తెలిపారు. ఈ తరహా పాములు భారతదేశంలోని అడవుల్లోనే ఎక్కువగా ఉంటాయన్నారు.