
అడ్డతీగల(తూర్పుగోదావరిజిల్లా): 13 అడుగుల గిరినాగు (కింగ్‌కోబ్రా)ఇళ్లల్లోకి చొరబడటంతో మామిడిపాలెంలో గిరిజనులు భయభ్రాంతులతో కకావికలమయ్యారు. సమాచారం తెలిసి, అడ్డతీగల అటవీ క్షేత్రంలో పని చేస్తున్న డీఆర్వో భానుప్రకాశ్, ఎఫ్‌బీఓలు ప్రశాంత్‌కుమార్, శశికుమార్‌లు కాకినాడకు చెందిన స్నేక్ శివను రప్పించారు.
గ్రామానికి చెందిన యువకుడు కట్టా సిద్ధు తెలివిగా ఓ గోనె సంచిలోకి గిరినాగు వెళ్లేలా చేసి బంధించాడు. అనంతరం దానిని మిట్లపాలెం సమీపాన తపస్వికొండ రక్షిత అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు.