addateegala
-
కాలు జారితే అంతే.. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని..
అడ్డతీగల(అల్లూరి సీతారామరాజు జిల్లా): ప్రత్యామ్నాయం లేకపోవడంతో గత్యంతరం లేక అడ్డతీగల మండలంలోని పింజరికొండ గ్రామస్తులు అంత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో ఏలేరు వాగులో గల గోడపై నుంచి రాకపోకలు సాగిస్తున్నారు. 400 మంది జనాభా ఉన్న ఈ గ్రామం వాగుకు అవతలి వైపు ఉంది. 2010 వరకూ వాగులో ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకునే వారు. వాగుకు సమీపంలో చిన్నతరహా జలవిద్యుత్ కేంద్రం నిర్మించారు. అక్కడ విద్యుత్ ఉత్పత్తి చేయడం కోసం నీటిని మళ్లించడానికి వాగుకు అడ్డంగా వియర్(అడ్డుగోడ) నిర్మించారు. ఇప్పుడా గోడమీద నుంచి పింజరికొండ గ్రామస్తులు రాకపోకలు సాగిస్తున్నారు. నిత్యం నీటి ప్రవాహం ఉండడంతో గోడ నాచుపట్టి ఉంటుంది. ప్రవాహ ఉధృతి అధికంగా ఉన్నప్పుడు కూడా తప్పనిసరి పరిస్థితుల్లో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని గోడపై నుంచి రాకపోకలు సాగించవలసి వస్తోంది. ఈ క్రమంలో ప్రమాదాలు చోటుచేసుకోవడం పరిపాటిగా మారింది. పలువురు మృత్యువాత పడ్డారు. వాగు దాటితే గాని బాహ్యప్రపంచానికి రాలేని పరిస్థితి వారిది. వాగు నుంచి 5 కిలోమీటర్ల దూరంలో గల పాపంపేట చేరుకుంటేగాని వారికి వాహన సదుపాయం అందుబాటులోకి రాదు. ఏలేరు వాగుపై రోప్ బ్రిడ్జి అయినా నిర్మించాలని పింజిరికొండ వాసులు సంవత్సరాల తరబడి కోరుతూనే ఉన్నారు. (క్లిక్ చేయండి: పాపికొండలు.. షికారుకు సిద్ధం) -
ఎర్ర మిరపకాయల గుత్తి.. బ్రిటిషర్ల హడల్..
రంపచోడవరం: ఆంగ్లేయుల అకృత్యాలపై విల్లంబులు ఎక్కుపెట్టిన విప్లవవీరుడు అల్లూరి సీతారామరాజు సాగించిన మహోజ్వల సాయుధ పోరాటం ఎప్పటికీ స్ఫూర్తిదాయకమే. ఈ పోరాటంలో భాగంగా ఆయన సారథ్యంలో గిరిజన వీరులు బ్రిటిష్ పోలీస్స్టేషన్లపై వరస దాడులు చేశారు. దాడులు చేయడంలో అల్లూరి తెగింపే వేరు. ముందుగానే దాడులు చేస్తున్నట్లు బ్రిటిష్ సైన్యానికి హెచ్చరిక సందేశం పంపేవారు. కాగితంపై రాసిన ఆ సందేశాన్ని బాణానికి గుచ్చి, దానిపై ఎర్ర మిరపకాయల గుత్తి తగిలించేవారు. ఎర్ర మిరపకాయల గుత్తితో పోలీస్‌స్టేషన్ వద్ద బాణం నాటుకొంటే చాలు.. బ్రిటిష్ సైనికులు హడలెత్తిపోయేవారు. పైడిపుట్ట వద్ద నివాసం బ్రిటిష్ అధికారుల నిరంకుశ చర్యలకు వ్యతిరేకంగా విప్లవాగ్నిని రగిలించిన సీతారామరాజు.. అడ్డతీగల మండలం పైడిపుట్ట వద్ద కొంతకాలం నివాసం ఉన్నారు. 1922లో ప్రస్తుత అల్లూరి సీతారామరాజు జిల్లాలోని కృష్ణదేవీపేట పోలీస్‌స్టేషన్‌పై దాడి చేశారు. అక్కడి ఆయుధాలను కొల్లగొట్టి దాడి చేసినట్లు సమయం తెలుపుతూ ఉత్తరం ఉంచారు. కొద్ది రోజుల్లోనే రాజవొమ్మంగి పోలీస్ స్టేషన్‌పై దాడి చేశారు. ఈ దాడికి తర్వాత కొంత సమయం తీసుకోవడంతో తమకు సీతారామరాజు భయపడ్డాడని బ్రిటిష్ అధికారులు ప్రచారం చేశారు. ఈ నేపథ్యంలో అడ్డతీగల మండలం పైడిపుట్ట వద్ద ఆయన గిరిజనులతో సమావేశమయ్యారు. అడ్డతీగల పోలీస్‌స్టేషన్‌పై దాడి చేస్తున్నట్లు 1922 అక్టోబర్ 10న బాణానికి మిరపకాయ గుత్తి ఉంచి సందేశం పంపించారు. అడ్డతీగల స్టేషన్‌పై దాడి చేసేందుకు గుర్రం మీద తేనెలమంగిలోని తెల్లమద్ది చెట్టు వద్దకు రాత్రి చేరుకుని వ్యుహం రచించారు. 1922 అక్టోబర్ 15న దాడి చేసి ఆయుధాలు కొల్లగొట్టారు. స్టేషన్‌పై దాడి చేసినట్లు లేఖ ఉంచారు. ఆ తర్వాత నాలుగు రోజుల వ్యవధిలోనే అక్టోబర్ 19న రంపచోడవరం పోలీస్‌స్టేషన్‌పై కూడా అల్లూరి దాడి చేశారు. అల్లూరి సీతారామరాజు బ్రిటిష్ వారిపై తిరుగుబాటు చేసేందుకు రంగం సిద్ధం చేసుకునే సమయంలో అనేక గ్రామాల్లో గిరిజనులతో సమావేశమయ్యారు. ఈ నేపథ్యంలో రంపచోడవరానికి సమీపంలోని రంప గ్రామాన్ని ఆయన సందర్శించారు. అక్కడ గిరిజనులతో సమావేశమయ్యారు. 1880లో జరిగిన రంప పితూరి గురించి మాట్లాడారు. గిరిజనులతో సమావేశం అనంతరం రంప జలపాతంలో స్నానం చేసి.. రంపలోని కొండపై, కొండ దిగువన శివాలయాల్లో పూజలు చేసి వెళ్లిపోయారు. (క్లిక్: అచంచల దేశభక్తునికి జాతి నీరాజనాలు) -
తెల్లవారిని హడలెత్తించిన ఎర్ర మిరపకాయ్
రంపచోడవరం(తూర్పుగోదావరి): పచ్చని మన్య సీమలో అమాయక గిరిజనంపై ఆంగ్లేయులు సాగించిన అకృత్యాలపై.. విల్లంబులు ఎక్కుపెట్టిన విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు సాగించిన మహోజ్వల సాయుధ పోరాటం ఇప్పటికీ.. ఎప్పటికీ స్ఫూర్తిదాయకమే. ఈ పోరాటంలో భాగంగా ఆయన సారథ్యంలోని గిరిజన వీరులు బ్రిటిష్ పోలీస్ స్టేషన్లపై వరుస దాడులు చేశారు. ఆ క్రమంలో తాము దాడులు చేస్తున్నట్టు బ్రిటిష్ సైన్యానికి ముందుగానే హెచ్చరిక సందేశం పంపేవారు. కాగితంపై రాసిన ఆ సందేశాన్ని బాణానికి గుచ్చి, దానిపై ఎర్ర మిరపకాయల గుత్తి తగిలించేవారు. ఆవిధంగా ఎర్ర మిరప కాయల గుత్తితో పోలీస్ స్టేషన్ వద్ద బాణం నాటుకొంటే చాలు.. బ్రిటిష్ పోలీసులు హడలెత్తిపోయేవారు. అడ్డతీగల మండలం పైడిపుట్ట వద్ద సీతారామరాజు కొంత కాలం నివాసం ఉన్నారు. బ్రిటిష్ వారిపై తిరుగుబాటు జెండా ఎగుర వేసిన తరువాత అడవుల్లోకి వెళ్లి బ్రిటిష్ సేనలను ఎదిరించేందుకు రంగం సిద్ధం చేశారు. దీనిలో భాగంగా 1922లో విశాఖ జిల్లా కృష్ణదేవీపేట (కేడీ పేట) పోలీస్ స్టేషన్‌పై దాడి చేశారు. అక్కడి ఆయుధాలను స్వా«దీనం చేసుకుని, దాడి చేసినట్టు సమయం తెలుపుతూ ఉత్తరం ఉంచారు. కొద్ది రోజుల్లోనే రాజవొమ్మంగి పోలీస్ స్టేషన్‌పై దాడి చేశారు. ఈ దాడికి కొంత సమయం తీసుకోవడంతో బ్రిటిష్ అధికారులకు సీతారామరాజు భయపడ్డాడని ప్రచారం చేశారు. ఈ నేపథ్యంలో అడ్డతీగల మండలం పైడిపుట్ట వద్ద ఆయన గిరిజనులతో సమావేశమయ్యారు. అడ్డతీగల పోలీస్ స్టేషన్‌పై దాడి చేస్తున్నట్లు 1922 అక్టోబర్ 10న బాణానికి మిరపకాయ గుత్తి ఉంచి సందేశం పంపించారు. ఆ స్టేషన్‌పై దాడి చేసేందుకు గుర్రం మీద తేనెలమంగి గ్రామంలోని తెల్ల మద్ది చెట్టు వద్దకు రాత్రి చేరుకుని వ్యూహం రచించారు. 1922 అక్టోబర్ 15న దాడి చేసి ఆయుధాలు కొల్లగొట్టారు. స్టేషన్‌పై దాడి చేసినట్టు లేఖ ఉంచారు. ఆ తరువాత నాలుగు రోజుల వ్యవధిలోనే అక్టోబర్ 19న రంపచోడవరం పోలీస్ స్టేషన్‌పై కూడా అల్లూరి దాడి చేశారు. తెల్లవారి వెన్నులో వణుకు పుట్టించేలా అల్లూరి మహోధృతంగా సాగించిన సాయుధ పోరాటంలో మిరపకాయ టపాకు ఈవిధంగా ప్రత్యేక స్థానం ఉంది. ఈ ఉద్యమానికి వందేళ్లు అయిన సందర్భంగా నాటి సంఘటనకు గుర్తుగా ఆ మహావీరుని చిత్రంతో తపాలా శాఖ ప్రత్యేక కవర్ విడుదల చేస్తోంది. రంపచోడవరంలో బుధవారం జరిగే ఈ కార్యక్రమంలో కలెక్టర్ సి.హరికిరణ్, రంపచోడవరం ఐటీడీఏ పీఓ ప్రవీణ్ ఆదిత్య, సబ్ కలెక్టర్ కట్టా సింహాచలం, అడిషనల్ ఎస్పీ కృష్ణకాంత పటేల్, రీజియన్ పోస్ట్‌మాస్టర్ జనరల్ డాక్టర్ ముత్యాల వెంకటేశ్వర్లు, రంపచోడవరం సర్పంచ్ మంగా బొజ్జయ్య పాల్గొంటారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా అడ్డతీగలలో కూడా అల్లూరి పోరాటంపై ప్రత్యేక తపాలా చంద్రికను ఆవిష్కరించనున్నారు. తపాలా శాఖ, హైదరాబాద్‌కు చెందిన మిత్రా గ్రూప్ కంపెనీల అధినేత ఆర్‌ఆర్‌కే రాజుల సంయుక్త ఆధ్వర్యాన స్థానిక శ్రీ సాయి సన్నిధి ఫంక్షన్ హాలులో బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు ఈ కార్యక్రమం జరుగుతుంది. -
King Cobra: 13 అడుగుల గిరినాగు
అడ్డతీగల(తూర్పుగోదావరిజిల్లా): 13 అడుగుల గిరినాగు (కింగ్‌కోబ్రా)ఇళ్లల్లోకి చొరబడటంతో మామిడిపాలెంలో గిరిజనులు భయభ్రాంతులతో కకావికలమయ్యారు. సమాచారం తెలిసి, అడ్డతీగల అటవీ క్షేత్రంలో పని చేస్తున్న డీఆర్వో భానుప్రకాశ్, ఎఫ్‌బీఓలు ప్రశాంత్‌కుమార్, శశికుమార్‌లు కాకినాడకు చెందిన స్నేక్ శివను రప్పించారు. గ్రామానికి చెందిన యువకుడు కట్టా సిద్ధు తెలివిగా ఓ గోనె సంచిలోకి గిరినాగు వెళ్లేలా చేసి బంధించాడు. అనంతరం దానిని మిట్లపాలెం సమీపాన తపస్వికొండ రక్షిత అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు. చదవండి: పాపికొండలు.. బెంగాల్ పులులు.. బంగారు బల్లులు -
బయట పడ్డ ‘పేలుడు’ పాతర
బాంబ్ డిజ్పోజబుల్ స్క్వాడ్ వెలికితీత వందేసి చొప్పున డిటోనేటర్లు, పవర్ జెల్స్ స్వాధీనం అడ్డతీగల : గ్రామ శివారులోని ప్రధాన రహదారి చెంత పోలీసులు గురువారం పేలుడు పదార్ధాలను వెలికితీశారు. ఒక గోతిలో దొరికిన ఒక ప్లాస్టిక్ టబ్బు.. అందులో ఉన్న సంచిలో 25 కిలోల బరువైన వంద డిటోనేటర్లు, మరో వంద పవర్ జెల్స్ స్వాధీనం చేసుకున్నారు. ఇంటెలిజెన్స్ బ్యూరో నుంచి వచ్చిన అత్యంత రహస్య సమాచారం మేరకు రంపచోడవరం ఏఎస్పీ అద్మామ్ నయూం అస్మి ఆధ్వర్యంలో బాంబ్ డిస్పోజబుల్ స్క్వాడ్, ఇతర పోలీసులు అడ్డతీగల శివారున అడవుల్లో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో దొరికిన ఈ టబ్బుకి ఏమైనా ఎలక్ట్రిక్ వైర్లు అమర్చారా? అంటూ నిశితంగా పరిశీలించి తరువాతే దానిని బయటకు తీశారు. ఎక్కడో విధ్వంసం సృష్టించేందుకే వీటిని ఇక్కడ భద్రపర్చినట్టుగా పోలీసులు భావిస్తున్నారు. ఏడేళ్ళ క్రితం కోనలోవ వద్ద ఓ కల్వర్టు కింద అమర్చిన 35 కిలోల పేలుడు పదార్ధాలను పోలీసులు కనుగొన్నారు. ఆ తరువాత పేలుడు పదార్ధాలు దొరకడం ఇదే ప్రథమం. దర్యాప్తు చేస్తాం : ఏఎస్పీ అస్మి అడ్డతీగల శివారున పేలుడు పదార్ధాలు బయటపడిన విషయంపై కేసు దర్యాప్తు చేస్తామని రంపచోడవరం ఏఎస్పీ అద్నామ్ నయూం అస్మి తెలిపారు. తనిఖీల్లో బయటపడిన పేలుడు పదార్ధాలను పరిశీలించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఇంటెలిజెన్స్ బ్యూరో సమాచారంతో ఈ ప్రాంతాన్ని జల్లెడ పట్టి వీటిని కనుగొన్నట్టు చెప్పారు. పేలుడు పదార్ధాలు క్వారీ నిర్వాహుకులకు చెందినవా? లేక మావోయిస్టులు ఇక్కడ ఉంచారా అనేది దర్యాప్తులో తేలుతుందన్నారు. ఈ ప్రాంతాన్ని ఆధీనంలోకి తీసుకుని క్షుణ్ణంగా అన్వేషిస్తున్నట్టు చెప్పారు. ప్రస్తుతం ఏజెన్సీలో పరిస్థితి ప్రశాంతంగానే ఉందన్నారు. -
500 దేవాలయాల నిర్మాణానికి శ్రీకారం
అడ్డతీగల : రాష్ట్ర వ్యాప్తంగా టీటీడీ నిధులతో 500 దేవాలయాల నిర్మాణానికి శ్రీకారం చుట్టినట్లు సమరసత సేవా ఫౌండేష¯ŒS రాష్ట్ర కోఆర్డినేటర్ ఎం.సాయిరామ్ తెలిపారు. భవిష్యత్‌లో నిర్మించబోయే నూతన దేవాలయాల అంశంపై అడ్డతీగలలోని పవనగిరిక్షేత్రంలో గురువారం సమావేశం నిర్వహించారు. హిందూధర్మపరిరక్షణట్రస్ట్ జిల్లా కన్వీనర్ తణుకువెంకటరామయ్య ఆద్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న సాయిరామ్ మాట్లాడుతూ రాష్ట్రంలోని 13 జిల్లాల్లో ఎస్సీ, ఎస్టీ, మత్స్యకార గ్రామాల్లో ఈ దేవాలయాలు నిర్మించాలని నిర్ణయించారన్నారు. ఎక్కడ ఏ దేవుడి ఆలయం కావాలంటే అది నిర్మించేలా చర్యలు తీసుకోవడానికి 13 జిల్లాల్లో హిందూధర్మ పరిరక్షణ ప్రచార కన్వీనర్లను నియమించామన్నారు.తూర్పుగోదావరిజిల్లాకు తణుకు వెంకటరామయ్య కన్వీనర్‌గా వ్యవహరిస్తారన్నారు. ఆలయం కావాలనుకునేవారు కమిటీగా ఏర్పడి సంయుక్త బ్యాంక్‌ఖాతా ప్రారంభించి టీటీడీ అందించే దరఖాస్తు పూర్తిచేసి ఇస్తే తాము వాటిని పరిశీలించి టీటీడీకి సమర్పిస్తామన్నారు. ఇప్పటికే తూర్పుగోదావరి ఏజెన్సీ నుంచి 50 దరఖాస్తులు అందాయన్నారు. అడ్డతీగల మండలం రేగులపాడు, సోమన్నపాలెం గ్రామాల్లో ఒక్కొక్కటి రూ.5 లక్షల అంచనా వ్యయంతో దేవాలయాలు నిర్మాణానికి ఆమోదం వచ్చిందన్నారు.సంయుక్త ఖాతాకి ఆరు విడతలుగా నిధులు విడుదల చేస్తారని సమరసత సేవా ఫౌండేష¯ŒS జిల్లా కోఆర్డినేటర్ శ్రీనివాస్ అన్నారు. మండలాల వారీగా హిందూధర్మపరిరక్షణ ప్రచార కన్వినర్లను నియమించారు. గిరిజన అర్చకులు, పలువురు ధార్మికసంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. -
త్యాగధనుడు అల్లూరిని స్మరించుకోవాలి
ఎమ్మెల్యే వంతలరాజేశ్వరి అడ్డతీగలలో అల్లూరి విగ్రహావిష్కరణ అడ్డతీగల : దేశ స్వాతంత్య్రం కోసం తన జీవితాన్ని అర్పించిన విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజును ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని ఎమ్మెల్యే వంతలSరాజేశ్వరి అన్నారు. అల్లూరి దాడి చేసిన వాస్తవ పోలీస్‌స్టేçÙ¯ŒS ఎదుట మంగళవారం అల్లూరి సీతారామరాజు యువజనసంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అల్లూరి విగ్రహావిష్కరణలో ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. తొలుత అల్లూరి విగ్రహాన్ని రంపచోడవరం ఏఎస్పీ అద్నామ్ నయూం అస్మీ, ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి ఆవిష్కరించారు. అల్లూరి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ నేటి తరంతో పాటు భావితరాలకు కూడా గిరిజనుల హక్కులు, బాధ్యతలను గుర్తుచేస్తూ అల్లూరి నెరపిన పోరాటస్ఫూర్తిని కొనసాగించేలా కృషిచేయాలన్నారు. అల్లూరి స్మారక స్థలాలను పరిరక్షించడానికి యువజన సంఘం చేస్తున్న కృషి అభినందనీయమని ఏఎస్పీ అన్నారు. అల్లూరి పోరాట స్ఫూర్తి, చైతన్యాన్ని నింపుకొని యువత ఉన్నత శిఖరాలు అధిరోహించాలన్నారు. అల్లూరి దాడి చేసిన పోలీస్‌స్టేçÙన్ల వద్దనే కాకుండా పాఠశాలలు, ఇతరత్రా గ్రామాల్లోనూ అల్లూరి విగ్రహాలను నెలకొల్పనున్నట్టు యువజనసంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు పడాల వీరభద్రరావు తెలిపారు. అల్లూరి జీవిత చరిత్రపై నిర్వహించిన బుర్రకథ పలువురిని ఆకట్టుకుంది. ఎంపీపీ అన్నం సత్తిబాబు, అడ్డతీగల సర్పంచ్ పప్పుల చిట్టమ్మ అడ్డతీగల, రాజవొమ్మంగి సీఐలు ముక్తేశ్వర్రావు, మోహ¯ŒSరెడ్డి, అడ్డతీగల ఎస్ఐ వై.గణేష్‌కుమార్, అల్లూరిసీతారామరాజు యువజన సంఘం బాధ్యులు దంగేటి సత్తిబాబు, రామన శ్రీను తదితరులతో పాటు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. -
25 నుంచి సామూహిక సత్యదేవ దీక్షలు
హిందూ ధర్మపరిరక్షణ ట్రస్టు జిల్లా కన్వీనర్ పవనగిరి స్వామి రాజమహేంద్రవరం కల్చరల్ : రాష్ట్ర దేవాదాయశాఖ ఆధ్వర్యంలోని స్టేట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెంపుల్ అడ్మినిస్ట్రేష¯ŒS (ఎస్ఐటీఏ) ఆదేశాల మేరకు జిల్లాలోని గిరిజన గ్రామాల్లో హిందూ ఆధ్యాత్మిక చైతన్యాన్ని మరింత బలపరిచేందుకు చర్యలు చేపడుతున్నామని హిందూ ధర్మపరిరక్షణ ట్రస్టు జిల్లా కన్వీనర్ పవనగిరి స్వామి తెలిపారు. శుక్రవారం రాత్రి గుంటూరు జిల్లా సీతానగరంలో మూడు రోజులు జరిగిన గిరిజన, హరిజన, కోయదొర, కొండరెడ్ల, వాల్మీకి శాఖలకు చెందిన అర్చక శిక్షణ శిబిరానికి హాజరై తిరిగి వెడుతున్న ఆయన శనివారం రాజమహేంద్రవరం వచ్చారు. ఈ సందర్భంగా సాక్షితో మాట్లాడారు. హిందూ ధర్మపరిరక్షణ ట్రస్టు ప్రిన్సిపల్ సెక్రటరీ జేఎస్వీ ప్రసాద్ సూచనల మేరకు ఈఓ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఈనెల 25 నుంచి అడ్డతీగల గ్రామంలోని పవనగిరిపై తొలివిడత సామూహిక సత్యదేవుని దీక్షలు ప్రారంభమవుతాయన్నారు. దీక్షావస్రా్తలు, ఇతర సామగ్రిని అన్నవరం దేవస్థానం అందజేస్తుందన్నారు. గిరిజన గ్రామాలు, దళిత వాడల్లో 500 ఆలయాలను నిర్మించడానికి దేవాదాయశాఖ ప్రణాళికలను సిద్ధం చేస్తోందన్నారు. ఆలయాల నిర్మాణం కోసం టీటీడీ ఇప్పటికి రూ. 5 కోట్లు మంజూరు చేసిందన్నారు. సమన్వయ సరస్వతి సామవేదం షణ్ముఖ శర్మ ఆధ్వర్యంలో అడ్డతీగలలోని పవనగిరిపై నిర్మించిన ఋషిపీఠం కల్యాణమండపంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు. -
రూ.23 లక్షల విలువైన గంజాయి పట్టివేత
అడ్డతీగల (తూర్పు గోదావరి జిల్లా) : వై.రామవరం వద్ద శనివారం పోలీసులు జరిపిన తనిఖీల్లో భారీ స్థాయిలో గంజాయి పట్టుబడింది. వాహనంలో మహారాష్ట్రకు రవాణా అవుతున్న రూ.23.52 లక్షల విలువైన 588 కిలోల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. ఈ మేరకు రంపచోడవరం ఏఎస్పీ అద్నామ్ నయీం అస్మి విలేకరుల సమావేశంలో వివరాలు తెలిపారు. విశాఖ జిల్లా కొంగపాకలు వద్ద గంజాయిని కిలో రూ.1000కి కొనుగోలు చేసుకుని ప్యాకింగ్ చేసి బొలెరోలో ప్రత్యేకంగా తయారుచేసిన ర్యాక్‌లో అమర్చుకుని తరలిస్తుండగా తమకు సమాచారం అందడంతో.. దాడులు నిర్వహించి వాహనంతో పాటు గంజాయి రవాణా చేస్తున్న మహారాష్ట్రకు చెందిన గొట్టిరమ్ గురుధయాల్ సబాల్, రాహుల్ గొట్టిరమ్సబాల్, మనోజ్‌రాజ్ మల్సబాల్, వినాయక్ మురళీధర్క్రుంది తదితరులను అరెస్ట్ చేసినట్లు ఆయన తెలిపారు. -
అడ్డతీగల బ్యాంకులో భారీ స్కామ్
-
ఒక్కటైన 40 జంటలు
అడ్డతీగల : పవనగిరి క్షేత్రంలో బుధవారం జరిగిన సామూహిక ఉచిత వివాహ కార్యక్రమంలో ఏజెన్సీలోని ఏడు మండలాలకు చెందిన 40 జంటలు ఒక్కటయ్యాయి. ఈ కార్యక్రమంలో పవనగిరి వ్యవస్థాపకులు తణుకు వెంకట్రామయ్య, ఆర్ట్‌ఆఫ్ లివింగ్ ఉభయ గోదావరి జిల్లాల కో ఆర్డినేటర్ ఎన్. సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. యువతీయువకులకు వివాహం ప్రాధాన్యతను వివరిస్తూ ఆధ్యాత్మిక సంస్థలు ఉచితవివాహాలను నిర్వహించడం అభినందనీయమని సత్యనారాయణ అన్నారు. గ్రామాల్లో మౌలిక అవసరాలు తీర్చడానికి, గిరిజనుల్లో అంతర్లీనంగా ఉన్న శక్తిని వెలికితీసి దాని ప్రాధాన్యతను వారికి తెలియజేయడానికి ఆర్ట్‌ఆఫ్ లివింగ్ తరఫున హ్యాపీనెస్, యూత్‌లీడర్‌షిప్ ట్రైనింగ్ ప్రోగ్రాంలను రూపొందించామన్నారు. గురువారం నుంచి హ్యాపీనెస్ శిక్షణ ప్రారంభమవుతుందన్నారు. ఈ శిక్షణ పొందినవారితోనే గ్రామాల సమగ్ర అభివృద్ధికి మార్గాలను చూపుతామన్నారు. తమ సంస్థ ద్వారా 30 గ్రామాలకు గంగాలమ్మతల్లి రాతివిగ్రహాలను ఉచితంగా అందజేస్తామన్నారు. ఏజెన్సీలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని హిందూత్వం విస్తరించడానికి, హిందూ వివాహవ్యవస్థ అభివృద్ధి చెందేం దుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్టు పవనగిరి వ్యవస్థాపకులు తణుకు వెంకటరామయ్య తెలిపారు. 40 జంటలకు పెళ్లిసామగ్రిని అందజేసి ఋషిపీఠం కళ్యాణమండపంలో పురోహితుల వేదమంత్రోచ్చారణల మధ్య సామూహిక ఉచిత వివాహాలను జరిపించారు.అనంతరం నూతన దంపతులతోపాటు వారి కుటుంబసభ్యులకు అన్నసంతర్పణ చేశారు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ ప్రతినిధులు పి.జ్యోతి, పద్మజ, రాజమండ్రి శివనాడీ జ్యోతిషాలయం నిర్వాహకులు ఎం.జనార్దన్ తదితరులు పాల్గొన్నారు. -
గట్టి పోలీసు బందోబస్తు
అడ్డతీగల (తూర్పుగోదావరి), న్యూస్‌లైన్ : రానున్న ఎన్నికల నేపథ్యంలో ఏజెన్సీ ప్రాంతంలో గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తామని ఏలూరు రేంజి డీఐజీ విక్రమ్‌సింగ్ మాన్ తెలిపారు. ఎన్నికలు సజావుగా, ప్రశాంతంగా జరగడానికి అవసరమైన అన్ని చర్యలూ తీసుకుంటామని చెప్పారు. ఇందులో భాగంగా మావోయిస్టుల నిరోధక కార్యక్రమాలను ఎప్పటిలాగే అనుభవజ్ఞులైన అధికారులతో కొనసాగిస్తున్నామని వివరించారు. బుధవారం ఆయన తూర్పు గోదావరి జిల్లా అడ్డతీగల సర్కిల్ పరిధిలోని అడ్డతీగల, గంగవరం పోలీసు స్టేషన్లను సందర్శించారు. పోలీసు సిబ్బంది నివసిస్తున్న క్వార్టర్లు, పోలీసు స్టేషన్ భవనాల స్థితిగతులను పరిశీలించారు. అనంతరం ఏజెన్సీలో భద్రతా చర్యలపై పోలీసు అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా డీఐజీ మాట్లాడుతూ శాంతిభద్రతల పరిరక్షణ కోసం ఏజెన్సీలో విధులు నిర్వహిస్తున్న పోలీసులకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడానికి చర్యలు తీసుకుంటామన్నారు. శిథిలమైన క్వార్టర్ల స్థానే నూతన భవనాల నిర్మాణానికి నిధులు, ఆదేశాలు ఇవ్వమని డీజీపీ కార్యాలయానికి నివేదించామన్నారు. కమ్యూనిటీ పోలీసింగ్‌లో భాగంగా జనమైత్రి సమావేశాలు నిర్వహించడంతో పాటు ఆయా చోట్ల గుర్తించిన సమస్యల పరిష్కారానికి కృషి చేయాల్సిన అవసరాన్ని అధికారులు గుర్తిం చాలన్నారు. సాధారణ పర్యటన గానే తాను ఏజెన్సీ ప్రాంతానికి వచ్చానన్నారు. ఆయన వెంట అడిషనల్ ఎస్పీ (ఆపరేషన్స్) ప్రకాష్ జాదవ్, డీఎస్పీ చైతన్యకుమార్, అడ్డతీగల సీఐ హనుమంతరావు ఉన్నారు.