వై.రామవరం వద్ద శనివారం పోలీసులు జరిపిన తనిఖీల్లో భారీ స్థాయిలో గంజాయి పట్టుబడింది.
అడ్డతీగల (తూర్పు గోదావరి జిల్లా) : వై.రామవరం వద్ద శనివారం పోలీసులు జరిపిన తనిఖీల్లో భారీ స్థాయిలో గంజాయి పట్టుబడింది. వాహనంలో మహారాష్ట్రకు రవాణా అవుతున్న రూ.23.52 లక్షల విలువైన 588 కిలోల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. ఈ మేరకు రంపచోడవరం ఏఎస్పీ అద్నామ్ నయీం అస్మి విలేకరుల సమావేశంలో వివరాలు తెలిపారు.
విశాఖ జిల్లా కొంగపాకలు వద్ద గంజాయిని కిలో రూ.1000కి కొనుగోలు చేసుకుని ప్యాకింగ్ చేసి బొలెరోలో ప్రత్యేకంగా తయారుచేసిన ర్యాక్‌లో అమర్చుకుని తరలిస్తుండగా తమకు సమాచారం అందడంతో.. దాడులు నిర్వహించి వాహనంతో పాటు గంజాయి రవాణా చేస్తున్న మహారాష్ట్రకు చెందిన గొట్టిరమ్ గురుధయాల్ సబాల్, రాహుల్ గొట్టిరమ్‌సబాల్, మనోజ్‌రాజ్ మల్‌సబాల్, వినాయక్ మురళీధర్క్రుంది తదితరులను అరెస్ట్ చేసినట్లు ఆయన తెలిపారు.