నాగుపామును వెంటాడి.. అరగంట పోరాడి.. | Dogs Saves Owner From Snake | Sakshi
Sakshi News home page

యజమాని ప్రాణాలు కాపాడిన శునకాలు 

Published Fri, May 31 2019 8:28 AM | Last Updated on Fri, May 31 2019 8:28 AM

Dogs Saves Owner From Snake - Sakshi

నాగుపామును ముట్టడించిన కుక్కలు

బెంగళూరు : మనం ఎంతో ప్రేమతో పెంచుకునే కుక్కలు మనం వాటిని నమ్మితే అవి మన పట్ల ఎంత విశ్వాసంగా ఉంటాయో మనకు తెలుసు. అలాంటి కుక్కలు నాగుపాము తమ యజమాని ఇంటిలోకి వెళ్లడాన్ని అడ్డుకోవడంతో పాటు దానిని వెంటాడి చంపిన సంఘటన విజయపుర సమీపంలో చోటు చేసుకుంది. విజయపురకు అతి సమీపంలో ఉన్న రైతు కృష్ణప్ప తోటలోనే ఇంటిని నిర్మించుకుని ఉన్నాడు. అయితే గురువారం సాయంత్రం ఒక నాగుపాము తోటలో ఉన్న రైతు కృష్ణప్ప ఇంటిలోకి వెళ్లడానికి యత్నిస్తున్న సమయంలో తోటలో ఉన్న మూడు కుక్కలు పామును ఇంటిలోకి వెళ్లకుండా కట్టడి చేశాయి.

కుక్కల అరుపులు విన్న యజమాని కృష్ణప్ప అక్కడికి చేరుకుని విషయం గుర్తించాడు. అప్పటికే పామును కుక్కలు చంపేశాయి. ఈ సందర్భంగా కృష్ణప్ప మాట్లాడుతూ... తమ తోట చుట్టు పక్కల చాలా విష సర్పాలు ఉన్నాయని, వాటి భయంతోనే తాము మూడు కుక్కలు పెంచుతున్నామని చెప్పారు. దాదాపు అరగంట పాటు పామును కుక్కలు కదలకుండా అడ్డుకుని, ఆ తరువాత దాడి చేసి చంపాయని తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement