సాధారణంగా చిన్న పామును చూడగానే మనకు పై ప్రాణం పైనే పోతుంది. అలాంటిది ప్రపంచంలోనే అత్యధిక విషపూరితమైన పాముల్లో ఒకటైన 13 అడుగుల కింగ్ కోబ్రా ముందు కూర్చుని దాని కళ్లలోకి చూస్తూ పట్టుకోవడానికి ప్రయత్నించడమంటే ప్రాణాలతో చెలగాటమాడినట్లే. కానీ పాములు పట్టడంలో సుప్రసిద్ధుడైన స్నేక్ కిరణ్ ఏ మాత్రం భయపడకుండా అరగంట పాటు తీవ్రంగా శ్రమించి దాన్ని పట్టుకున్నాడు.
కర్ణాటకలో శివమొగ్గ జిల్లాలోని తీర్థహళ్ళి తాలూకాలో ఉన్న మేలిన హదూరు గ్రామానికి చెందిన ప్రకాశ్‌గౌడ అనే వ్యక్తికి చెందిన వక్కతోటలో శుక్రవారం రాత్రి భారీ కింగ్ కోబ్రా పాము ప్రత్యక్షమైంది. వెంటనే స్థానికులు ఈ విషయాన్ని అటవీ శాఖ అధికారులకు తెలుపగా, వారు కిరణ్‌కు సమాచారమిచ్చారు. పాములు పట్టడంలో నిపుణుడైన కిరణ్ సుమారు అరగంట పాటు శ్రమించి ఈ రాచనాగును పట్టుకున్నాడు. దీని పొడవు 13 అడుగులు, బరువు 8 కేజీలని కిరణ్ తెలిపాడు. అనంతరం పామును ఊరికి దూరంగా ఆగుంబె అడవిలో వదిలిపెట్టాడు. భారతదేశంలో అత్యధికంగా కింగ్ కోబ్రాలు మనుగడ సాగిస్తున్నది ఆగుంబె అడవుల్లోనే.
– శివమొగ్గ
Comments
Please login to add a commentAdd a comment