
ప్రతీకాత్మక చిత్రం
శివమొగ్గ(బెంగళూరు): శివమొగ్గ నగరంలోని చాలుక్య నగర్‌లో మంజునాథ్ అనే వ్యక్తి ఇంటిలో ఓ నాగుపాము వంట గదిలో దూరింది. శుక్రవారం ఉదయం 7 గంటల సమయంలో మంజునాథ్ భార్య వంట చేయడానికి పాత్రలు తీస్తుండగా ఒక్కసారిగా బుసలు కొట్టడంతో ఆమె భయంతో పరుగు తీసింది. కుటుంబ సభ్యుల నుంచి సమాచారం అందుకున్న స్నేక్ కిరణ్ అక్కడికి చేరుకుని పామును పట్టుకోవడంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు.
మరో ఘటనలో..
బూదిపడగ గ్రామంలో శిలాయుగం నాటి సమాధులు
మైసూరు: చామరాజనగర జిల్లా బూదిపడగ గ్రామంలో పురాతన సమాధులు బయటపడ్డాయి. మైసూరు వర్సిటీ ప్రాచీన చరిత్ర, పురావస్తు శాఖ విభాగం సహాయ ప్రాధ్యాపకురాలు వి.శోభ నేతృత్వంలోని అధికారుల బృందం గ్రామ సమీపంలో సుమారు 300 మీటర్ల దూరంలో తవ్వకాలు చేపట్టింది. సుమారు 9 మీటర్ల పొడవు, 4.5 మీటర్ల వెడల్పుతో ఉన్న కట్టడాలు బయట పడ్డాయి. వీటిని పరిశీలించగా సమాధులుగా గుర్తించారు. ఇవి క్రీ.పూ.1,500 లేదా అంతకంటే ముందునాటివి అయి ఉండవచ్చని పరిశోధకులు భావిస్తున్నారు.
చదవండి: ఎస్‌ఐ పరీక్షలో అక్రమాలు.. హోం మంత్రి సంచలన వ్యాఖ్యలు
Comments
Please login to add a commentAdd a comment