వైరల్‌: ఈ తల్లి బిడ్డకోసం 8 అడుగుల పాము తోక పట్టుకుని.. | Odisha: 8 Ft King Cobra Rescued Woman Protect Child Mayurbhanj Viral | Sakshi
Sakshi News home page

వైరల్‌: ఈ తల్లి బిడ్డకోసం 8 అడుగుల పాము తోక పట్టుకుని..

Published Sun, Jun 6 2021 8:47 PM | Last Updated on Sun, Jun 6 2021 9:10 PM

Odisha: 8 Ft King Cobra Rescued Woman Protect Child Mayurbhanj Viral - Sakshi

భువనేశ్వర్‌: సాధారణంగా చిన్న పామును చూస్తేనే మనం భయపడిపోతుంటాం. అలాంటిది ఓ మహిళ ఏకంగా 8 అడుగుల ఉన్న కింగ్‌ కోబ్రాను చాకచక్యంగా పట్టుకుని  ఫారెస్ట్‌ అధికారలకు అప్పగించింది. ఈ ఘటన ఒడిశా మయూరభంజ్‌లో జరిగింది. వివరాల్లోకి వెళితే.. ఎలా వచ్చింది గానీ 8 అడుగుల కింగ్‌కోబ్రా ఒకటి ఓ ఇంటిలోకి వచ్చింది. ఆ ఇంట్లో ఆడుకుంటున్న 2 సంవత్సరాల పిల్లాడు పాము వైపు వెళ్తుండడం తల్లిదండ్రులు గమనించారు.

వెంటనే పిల్లాడి తండ్రి స్పందించి కొడుకును పట్టుకోగలిగాడు. అదే క్రమంలో పిల్లాడి తల్లి (సస్మిత) పాము తోక పట్టుకుని బయటకు లాక్కొచ్చి విసిరేసింది. అనంతరం వాళ్లు ఫారెస్ట్‌ రేంజ్ ఆఫీసర్‌ను పిలిపించి ఆ పాముని అడవిలో విడిచిపెట్టారు. అదృష్టవశాత్తూ, ఈ ఘటనలో ఎవరికీ ఏ అపాయం జరగలేదు. సస్మిత మాట్లాడుతూ.. తన బిడ్డకు ఏమైనా జరుగుతుందేమోనని భయంతో ఇంతటి ధైర్యం చేసినట్లు తెలిపింది. ఈ పరిస్థితిలో మాకు సహాయం చేసిన అటవీ శాఖ అధికారికి కృతజ్ఞతలు తెలిపింది. కాగా ఆమె ధైర్యాన్ని చూసి అందరూ హడలిపోయారు. ప్రస్తుతం సస్మతి చూపిన ధైర్యానికి చుట్టు పక్కల వాళ్లంతా ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.

చదవండి: వైరల్‌: రైతు దుశ్చర్య.. పాపం ఎలుకల దండుని..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement