Girl Catches Cobra Snake, Video Viral On Social Media - Sakshi
Sakshi News home page

అదేమో కింగ్‌ కోబ్రా.. ఆ యువతి ఎలా పట్టేసుకుందో!

Published Tue, Jun 15 2021 12:12 PM | Last Updated on Tue, Jun 15 2021 6:22 PM

Viral Video: Fearless Girl Catches King Cobra With Just One Hand People Are Stunned  - Sakshi

మనలోఎవరికైనా.. పాము కనిపిస్తే ఏంచేస్తారని ఒకవేళ అడిగితే.. ‘ ఇంకేంచేస్తాం.. గట్టిగా అరుస్తూ.. అక్కడి నుంచి పారిపోతామని’  చెప్తాం. అయితే, మరికొందరు భయస్తులు, పామును చూడటం అటుంచి, ఒకవేళ దాని పేరు తలుచుకున్న కూడా భయంతో వణికి పోతారనే విషయం మనకు తెలిసిందే. అయితే ఒక యువతి మాత్రం కింగ్‌ కోబ్రాను చూసినా భయం లేకుండా ఒంటి చేత్తో పట్టేసుకుంది. అయితే, ఆ పామును పట్టేక్రమంలో ఆమె మొహంలో భయం కించెత్తైనా లేదు.  ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

వివరాలు.. నాగేశ్వరీ అనే యువతికి పాములను పట్టుకోవడం అంటే ఇష్టం. ఈ క్రమంలో ఎక్కడ పాములు కనిపించినా కూడా. వెంటనే సదరు స్థానికులు నాగేశ్వరీకి సమాచారం ఇస్తారు. దీంతో ఆమె అక్కడికి చేరుకొని ఆపాముని పట్టుకుంటుంది. అ‍యితే, ఈ వీడియోలో కూడా నాగేశ్వరీ ఒక పామును పట్టుకోవడం కనిస్తోంది. దీనిలో ఒక పెద్ద నాగుపాము రాళ్ల వెనుక ఉండటాన్ని నాగేశ్వరీ గమనించింది. ఆమె వెంటనే, రాళ్లను పక్కకు జరిపి ఒంటి చేత్తోనే ఆ పాముని పట్టేసుకుంది. అయితే, ఆ యువతి మొహంలో ఏమాత్రం భయం కనిపించడంలేదు. ‘పాపం.. ఆ పాము మాత్రం, నాగేశ్వరీ చేతిలో నుంచి విడిపించుకోవటానికి విశ్వ ప్రయత్నాలన్ని చేస్తోంది’. ఆ యువతి అదేదో.. ఉడుము పట్టులా.. గట్టిగా పట్టుకొని, ఒక చేతిలో జారీపోతే.. మరో చేతిలో మార్చి మరీ పట్టుకుంటోంది.

అంతటితో ఆగకుండా, పామును పట్టుకున్న సంతోషంలో ఆ యువతి నవ్వుతూ.. స్థానికులు తీస్తున్న ఫోటోలకు ఫోజిచ్చింది. ఆమె పాములను పట్టుకుని ‘నాగేశ్వరీ స్నేక్‌ లవర్..అనే ’తన ఇన్‌స్టాలో పోస్ట్‌ చేస్తూ ఉంటుంది. ఈ సంఘటన ఎక్కడ జరిగిందో మాత్రం తెలియరాలేదు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీన్ని చూసిన నెటిజన్లు.. ‘వామ్మో.. ఇంత ధైర్యమా తల్లి నీది..’ పాము ఎంత పెద్దదిగా ఉందో..  పాపం.. పాము వదిలించుకోవడానికి తెగ ప్రయత్నాలు చేస్తోంది..‘ ఇంతకీ పాముని ఏంచేశారో చెప్పలేదు..‘దాని ప్రాణాలు కాపాడిన మీకు హ్యాట్సాఫ్‌’ అంటూ కామెంట్‌లు పెడుతున్నారు. 

చదవండి: కరోనా భయంతో స్వీట్‌ వద్దన్నాడు! కోపంతో నేలకేసికొట్టిన వధువు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement