హాలీవుడ్ ఛేజింగ్‌ను మైమరపించేలా..! | great escape of iguana from deadly snakes, video goes viral | Sakshi
Sakshi News home page

Published Tue, Nov 8 2016 12:17 PM | Last Updated on Fri, Mar 22 2024 11:21 AM

హీరో వెంట విలన్లు పడుతుంటారు. హీరో వాళ్లను అక్కడినుంచి దూరంగా తీసుకెళ్లడానికి పరుగు పెడుతుంటాడు. గల్లీల్లో దూరి, బండ్ల మీదకు ఎగురుతూ ఎలాగోలా వాళ్ల బారి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తాడు. హాలీవుడ్ సినిమాల్లో ఈ తరహా ఛేజింగ్ మనం చూస్తుంటాం. కొండలు, గుట్టలు దాటుకుని మరీ విలన్లను ఒక ఆట ఆడించడం అక్కడి హీరోలకు వెన్నతో పెట్టిన విద్య. సరిగ్గా అదే తరహాలో.. పదుల సంఖ్యలో పాములు వెంబడిస్తున్నా, వాటి బారి నుంచి ఉడుము ఎలా తప్పించుకుందన్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. జంతువులకు సంబంధించిన డాక్యుమెంటరీలలో రెండు నిమిషాల కేటగిరీలో అత్యంత ఉత్కంఠభరితంగా, ఆసక్తికరంగా ఉన్న వీడియో ఇదేనని ప్రస్తుతం అంటున్నారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement