వామ్మో.. ఇది ఉడుమా.. గాడ్జిల్లా పిల్లనా?
గ్రాఫిక్స్, త్రీడి చిత్రాల్లో గాడ్జిల్లా(రాక్షస బల్లి)ని మనం ఇప్పటి వరకు చూశాం. ఒకప్పుడు అది ఇలా ఉండేదని మిగిలిపోయిన శిలాజాల ద్వారా మనం వాటి పరిమాణాన్ని అంచనా వేశాం తప్ప ఏనాడు ప్రత్యక్షంగా చూడలేదు. అయితే, మనం ఇప్పటి వరకు రాక్షసబల్లి ఎలా ఉంటుందని ఇప్పటి వరకు చూస్తూ వచ్చామో అచ్చం అలాంటి రూపమే ప్రత్యక్షంగా దర్శనమిచ్చింది. అది కూడా గాలపాగో ద్వీపంలోని ఇసబెల్లా కోస్తా తీరంలో.
అవునూ.. సముద్ర జలాల్లో ప్రత్యేక కెమెరాల ద్వారా వీడియోలు తీసి అందులోని వృక్షరాశి, జంతురాశి గురించి ఆరా తీసే ప్రత్యేక గజ ఈతగాళ్లకు ఇది కనిపించి అబ్బురపడిపోయేలా చేసింది. కాకపోతే ఇది రాక్షసబల్లి కాదుగానీ, అచ్చం అలాగే ఉన్న ఓ పెద్ద ఉడుము. ఇది నీటి అడుగు భాగంలో ఎంతో నేర్పుగా డైవర్స్ తోపాటు ఈదుతూ రుచికరమైన ఆహారం కోసం నీటి అడుగున పాకుతూ ఆ తర్వాత గాలి తీసుకునేందుకు తిరిగి సముద్ర ఉపరితలంపైకి రావడాన్ని వారు వీడియోలో చూశారు.
ఇది అచ్చం జురాసిక్ పార్క్ సినిమాలో జంతువులు ఎలా ఉన్నాయో అలాగే ఉంది. ఇంతకీ దీని పరిమాణం ఎంత ఉందని అనుకుంటున్నారు.. సరిగ్గా ఒక మనిషి అంత పెద్దగా ఉందట. ఇలా ప్రతిసారి నీటిలో వేగంగా మునుగుతూ ఆహారం కోసం వెతుకుతూ తోకతో ఈదుతూ వేగంగా ముందుకు కదలడం ఈ వీడియోలో రికార్డయింది.