footage
-
పోలీసులకు మా ఆదేశాలంటే.. గౌరవం లేదు: హైకోర్టు
-
ఐదే నిమిషాల్లో మునక! ఢిల్లీ కోచింగ్ సెంటర్ ఘటన వీడియోలు వైరల్
ఢిల్లీ: దేశరాజధానిలోని ఓ సివిల్స్ కోచింగ్ సెంటర్ బేస్మెంట్లోకి వరదనీరు చేరడంతో పరీక్షకు సిద్ధమవుతున్న ముగ్గురు విద్యార్థులు నీట మునిగి మృతిచెందారు. ఓల్డ్ రాజేంద్ర నగర్‌లోని రావ్ స్టడీ సెంటర్లో ఈ ఉదంతం చోటుచేసుకోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు వైరల్‌గా మారుతున్నాయి. ప్రమాదానికి ముందు.. బేస్మెంట్లోకి నీరు ఎలా వేగంగా చేరుతున్నదో చూడవచ్చు. ఆ సమయంలో లోపలున్న విద్యార్థులు వీలైనంత త్వరగా బయటకు రావాలని కోచింగ్ సెంటర్ సిబ్బంది చెప్పడం కూడా కనిపిస్తుంది. అలాగే లోపల ఎవరైనా ఉన్నారా? అని అడగడాన్ని గమనించవచ్చు. కేవలం ఐదే ఐదు నిమిషాల్లో సెల్లార్ నిండా వరద నీటితో నిండిపోయిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. శనివారం సాయంత్రం ఈ ప్రమాదం చోటు చేసుకోగా.. ఏడు గంటల పాటు శ్రమించి ముగ్గురు విద్యార్థుల మృతదేహాల్ని అధికారులు వెలికి తీశారు. మరోవీడియోలో కోచింగ్ సెంటర్ బయట నడుం లోతు నీరు పేరుకుపోవడం గమనించవచ్చు. మరోవైపు సెంటర్‌కు ఎదురుగా నిల్చొని కొందరు ఆ వరద తాకిడిని వీడియోలు తీసిన దృశ్యాలు వైరల్ అవుతున్నాయి. ఇదీ చదవండి: సివిల్స్ కల జల సమాధిమరోవైపు నిబంధనలను ఉల్లంఘిస్తున్న కోచింగ్ సెంటర్లపై ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎంసీడీ) చర్యలు మొదలుపెట్టింది. ఢిల్లీలో చట్టవిరుద్ధంగా నడుస్తున్న పలు కోచింగ్ సెంటర్లను సీల్ చేసేందుకు మున్సిపల్ కార్పొరేషన్ బృందం పాత రాజేంద్ర నగర్ ప్రాంతంలో తనిఖీలు నిర్వహించింది. అదేవిధంగా ఈ ఘటనపై దర్యాప్తు చేయడానికి త్వరలో ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు ఒక అధికారి తెలిపారు. 'कोई नीचे तो नहीं रहा'दिल्ली कोचिंग सेंटर हादसा | बेसमेंट से निकलते छात्रों का एक और वीडियो आया सामने #OldRajinderNagar | #DelhiRains | #UPSCStudents | #Delhi | #coachingcentre pic.twitter.com/BXIHDiXrqw— NDTV India (@ndtvindia) July 28, 2024This is the situation of our Delhi innocent #UPSC aspirants loose life Mazak bana dia h😡May God give familes strength to bear this loss🙏🏻#rajendranagar #RaoIAS #RajenderNagar #UPSCaspirants pic.twitter.com/aiDWOKugcL— CSE Aspirants (@cse_aspirantss) July 28, 2024Another video has surfaced from outside Rajendra Nagar Institute in which it can be seen how the passing of a vehicle increased the flow of water, due to which the gates broke and water entered the basement.#Delhi #CoachingCenter #Flood #HeavyRain #RaoIASCoaching… pic.twitter.com/cZUBkKbNUm— POWER CORRIDORS (@power_corridors) July 28, 2024 సంబంధిత వార్త: సెల్లార్ ప్రమాదం.. 13 కోచింగ్ సెంటర్లకు సీల్ -
నేను గీతాంజలిలా కాదు.. ఒక్కొక్కరి అంతు తేల్చేస్తా
-
పోలీసు నిర్లక్ష్యంతోనే జాహ్నవి మృతి?.. ఆలస్యంగా ఆధారాలు వెలుగులోకి..
అమెరికాలోని సీటెల్‌లో 2023 జనవరిలో పోలీస్ వాహనం ఢీకొని తెలుగు యువతి కందుల జాహ్నవి దుర్మరణం పాలైన సంగతి తెలిసిందే. ఇది అప్పట్లో కలకలం సృష్టించింది. ఆ యువతి కుటుంబంలో విషాదం నింపింది. తాజాగా ఆ ప్రమాదానికి సంబంధించిన వీడియో కీలకంగా మారింది. నార్త్ ఈస్ట్ యూనివర్సిటీలోని కాలేజ్ ఆఫ్ ఇంజనీరిగ్‌లో మాస్టర్ ఆఫ్ సైన్స్ చదువుతున్న జాహ్నవి గత జనవరి 23న రోడ్డు దాటుతుండగా ఆమెను ఒక పోలీస్ వాహనం ఢీకొంది. ఆ సమయంలో పోలీసుల వాహనంలో సీటెల్ పోలీస్ విభాగానికి చెందిన కెవిన్ డేవ్ ఉన్నారు. కెవిన్ డేవ్ బాడీ కెమెరాలో రికార్డ్ అయిన దృశ్యాలను గమనిస్తే.. నాటి కారు స్పీడో మీటర్ గంటకు 74 మైళ్ల వేగాన్ని చూపుతోంది. అదే స్పీడ్‌లో వాహనం జాహ్నవిని థామస్ స్ట్రీట్ కూడలి వద్ద ఢీకొంది. ప్రమాదంలో గాయాలపాలైన ఆమెను వెంటనే స్థానికులు, పోలీసు అధికారులు హార్బర్ వ్యూ మెడికల్ సెంటర్ కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె ప్రాణాలు కోల్పోయింది. కాగా ఈ ఘటన జరిగిన సమయంలో కెవిన్ ఓ ఎమర్జెన్సీ కాల్ మాట్లాడుతున్నట్లు సమాచారం. అందుకే అతను వాహనం సైరన్‌ను తగ్గించాడని తెలుస్తోంది. అయితే ఈ అత్యవసర పరిస్థితి గురించి ఆమెకు హెచ్చరించడంలో కెవిన్ విఫలమయ్యాడని ప్రాసిక్యూటర్లు ఆరోపిస్తున్నారు. ఈ ఉదంతంపై కెవిన్ మాట్లాడుతూ ఆ సమయంలో తాను సైరన్ మోగించానని, అప్పుడు జాహ్నవి క్రాస్ వాక్‌లో ఉందన్నారు. తమ కారును చూసి కూడా ఆమె క్రాస్ వాక్ గుండా వేగంగా పరిగెత్తిందని కెవిన్ తెలిపారు. కాగా ప్రమాదం జరిగిన ఆరు నెలల తర్వాత బాడీ క్యామ్‌లో రికార్డ్ అయిన నాటి ఘటన దృశ్యాలు వెలుగుచూశాయి. కర్నూలు జిల్లాకు చెందిన జాహ్నవి కందుల 2021లో ఉన్నత విద్య అభ్యసించేందుకు అమెరికాకు వెళ్లి సీటెల్ లోని నార్త్ ఈస్టర్న్ యూనివర్సిటీలో చేరారు. గత జనవరి 23న ఆమె కళాశాలకు వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఇది కూడా చదవండి: ఇన్ని చిరుకప్పలు ఎక్కడి నుంచి Body cam footage shows Kevin Dave hitting and killing Jaahnavi Kandula in a crosswalk at 8 p.m. on Jan. 23. Dave had chirped his siren, but did not have it running consistently, as he plowed into Kandula, a 23 Y/O master’s student at Northeastern University’s Seattle campus pic.twitter.com/IeTVuUA7cK — That Guy Shane (@ProfanityNewz) July 24, 2023 -
దొంగతనం చేస్తూ దొరికిపోయిన సన్నీ
-
ప్రభుత్వం ఎంపిక చేసిన దృశ్యాలపై ఎంపీ బినోయ్ విశ్వమ్ లేఖ
న్యూఢిల్లీ: ఆగస్టు 11న రాజస్యభలో జరిగిన రభకు సంబంధించి ప్రభుత్వం ఎంపిక చేసిన దృశ్యాలను మాత్రమే లీక్ చేసి ప్రతిపక్షాలపై తప్పుడు అభిప్రాయాలను కలిగించవద్దంటూ సీపీఐ ఎంపీ బినోయ్ విశ్వమ్ రాజ్యసభ సెక్రటరీ జనరల్‌కు లేఖ రాశారు. ప్రభుత్వం విడుదల చేసిన సీసీటీవీ ఫుటేజ్ ప్రజలను తప్పుదోవ పట్టించేదిగా ఉందని అన్నారు. సభలోని ప్రతిపక్ష సభ్యులపై గుర్తు తెలియని సైనికులు దాడి చేశారని ఆయన ఆరోపించారు. ఆగస్టు 11కు సంబంధించి పూర్తి సీసీటీవీ ఫుటేజీ బయట పెట్టాలని డిమాండ్ చేశారు. ప్రజా వ్యతిరేకమైన జనరల్ ఇన్సూరెన్స్ బిజినెస్ (నేషనలైజేషన్) అమెండమెంట్ బిల్, 2021ని సెలక్ట్ కమిటీ పంపాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయన్నారు. అయితే అప్పుడే దాదాపు 40 మంది గుర్తు తెలియని సైనికులు సభలో ప్రవేశించారన్నారు. మహిళా ఎంపీలు సహా ప్రతిపక్ష సభ్యులపై భౌతిక దాడులు జరిగాయని పేర్కొన్నారు. అయితే బయటకు వచ్చిన వీడియోలలో మాత్రం సభ్యులు మార్షల్స్‌పై దాడి చేస్తున్నట్లు చూపించారని అన్నారు. తనపై కూడా 4–5 మంది బయటి వ్యక్తులు వచ్చి దాడిచేశారని పేర్కొన్నారు. సభలో జరిగిన అసలు విషయాన్ని దాచి ఎంపిక చేసిన వీడియోను విడుదల చేసిన కేంద్రం ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని ఆరోపించారు. చదవండి : సోషల్ మీడియాకు ఊరట, చట్టంలోని కొన్ని అంశాలపై బాంబే హైకోర్టు స్టే -
దైవ సన్నిధి
గొప్ప ప్రవక్త జార్జివర్‌వర్ ఒక ఆథ్యాత్మిక మహాసభలో ఆత్మవశంలో ప్రసంగిస్తున్నారు. ఇచ్చిన సమయం మించిపోయింది. కాని సందేశం ఆపడం లేదు. ఆయన్ని ఎలా ఆపాలో కూడా తెలియక పెద్దలు సతసతమవుతున్నారు. దాని తర్వాత మరో కార్యక్రమం ఉంది. అందుకే ఈ ఆరాటం అంతా. చివరికి ఒక పెద్ద మనిషి వేదిక మీద నుండి కిందికి దిగివచ్చాడు. వేదికకు ముందు జార్జివర్‌వర్ గారికి ఎదురుగా కూర్చున్నాడు. కూర్చున్నాడే గాని అటు ఇటూ స్థిమితం లేకుండా ఉన్నాడు. అతనిని చూస్తూనే సంపన్నుడు అని ఇట్టే తెలిసిపోతుంది. సమయం మించిపోతుందన్న ఆలోచనతో ఆ సంగతిని గుర్తు చేయడానికి తన చేతికి ఉన్న అత్యంత ఖరీదైన గడియారాన్ని అతడు జార్జి గారికి చూపించాడు. అది చూసి జార్జి ప్రవక్త అవాక్కయ్యాడు. శాంత హృదయంతో ప్రశాంతంగా తన దివ్య సందేశాన్ని ఆపివేశాడు. సభలో కొందరు పరిచారకులు అటు ఇటూ తిరుగుతూ వున్నారు. వారందరూ అక్కడ తమవంతు సహాయ సహకారాలు అందిస్తూ తమ కర్తవ్యాన్ని భక్తిశ్రద్ధతో నిర్వర్తిస్తున్నారు. జార్జివర్‌వర్ చిరునవ్వుతో ఒక పరిచారకుడిని దగ్గరకు రమ్మని పిలిచాడు. ‘‘చూడు బాబూ.. నా ఎదురుగా కూర్చున్న ఆ పెద్దాయన తన అత్యంత ఖరీదైన తన చేతిగడియారాన్ని ఈ మహాసభ సహాయార్థం ఇస్తాననే సంకేతంతో తన వాచ్ చూపిస్తున్నాడు. మీరు వెళ్లి ఆ గడియారాన్ని తెచ్చి హుండీలో వేయండి’’ అని ఆజ్ఞాపించాడు. అనుకోని ఈ ఆకస్మిక సంభవానికి పెద్దాయన తలదించుకొన్నాడు. అంతేకాదు, ఇలా తలదించుకొనే ఇలాంటి పని మరోసారి చేయను అని, చేయకూడదు అని తన హృదయంలో నిశ్చయించుకొన్నాడు. దైవ సన్నిధికి వెళ్లినప్పుడు పారవశ్యంతో కూర్చోవాలిగాని ఎన్ని గంటకు వచ్చాను, ఎన్ని గంటకు వెళ్లాలి అని ఆలోచించకూడదు. – బైరపోగు శామ్యూల్ బాబు -
కోటిస్తేనే కనికరించారు!
హైదరాబాద్: చిక్కడపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆటోమొబైల్ ఫైనాన్షియర్ కిడ్నాప్‌కు గురైన సంఘటన చోటుచేసుకుంది. ఆదివారం రాత్రి 11.30 గంటల సమయంలో ఫైనాన్షియర్‌ను కిడ్నాప్ చేసిన అగంతకులు రూ.కోటి తీసుకుని సోమవారం తెల్లవారుజామున 2.30 గంటల ప్రాంతంలో వదిలిపెట్టారు. 3 గంటలపాటు నాటకీయ ఫక్కీలో ఈ ఘటన జరిగి చివరకు బాధితుడు స్వల్పగాయాలతో బయ టపడ్డారు. చిక్కడపల్లి పోలీస్‌స్టేషన్ ఇన్స్పెక్టర్ వెంకట్‌రెడ్డి వీడియాకు వివరాలు వెల్లడించారు. హిమాయత్‌నగర్ రోడ్ నం.16లో నివ సించే గజేందర్ పారక్ (40) మైనా ఫైనాన్స్ కంపెనీను నిర్వహిస్తున్నాడు. స్నేహితులను కలిసేందుకు తరచూ దోమలగూడ ఏవీ కళాశాల వద్దకు వస్తుంటాడు. ఆదివారం రాత్రి 10.30 గంటల ప్రాంతంలో తన కారు (టీఎస్09ఎఫ్ఏ2131)లో అక్కడికి వచ్చాడు. అతని స్నేహితుడు రసగుల్లా అతడితో మాట్లాడి వెళ్లిపోయాడు. 11.15 గంటల ప్రాంతంలో 30 నుంచి 35 యేళ్ల వయస్సున్న ఇద్దరు ద్విచక్ర వాహనంపై వచ్చి కారు వెనకే ఆపారు. వారు గజేందర్‌ను అడ్డగించేలోపే ముసుగు వేసుకున్న మరో ముగ్గురు కారులో అక్కడికి చేరుకున్నారు. వెంటనే గజేందర్‌ను కారులో కూర్చోబెట్టారు. ఎక్కడికి వెళ్తున్నామో తెలియకుండా గజేందర్‌కు మాస్క్ తగిలించారు. రూ.3 కోట్లు డిమాండ్... గజేందర్‌ను అబిడ్స్‌కు తరలించి రూ.3 కోట్లు డిమాండ్ చేశారు. రూ.15 నుంచి రూ.20 లక్షల కంటే ఎక్కువ ఇవ్వలేనని చెప్పినా కిడ్నాపర్లు ఒప్పుకోకపోగా, గజేందర్‌ను చితకబాదారు. దీంతో రూ.కోటి ఇవ్వడానికి డీల్ కుదిరింది. గజేందర్ అతని స్నేహితుడు రాజేష్ అగర్వాల్‌కు ఫోన్ చేసి రూ.కోటి తీసుకురావాలని కోరారు. జగదీశ్ మార్కెట్ వద్ద ఉన్న బాంబే జ్యూస్ సెంటర్ వద్దకు డబ్బులు తీసుకువచ్చి అతని కారు డిక్కీపైనే ఉంచి దూరంగా వెళ్లాలని కిడ్నాపర్లు సూచించారు. తర్వాత స్కూటీపై ముసుగువేసుకుని వచ్చిన ఇద్దరు ఆ బ్యాగ్ తీసుకుని చిరాగ్ ఆలీ లేన్ వైపు ఉడాయించారు. అనంతరం గజేందర్‌ను చిరాగ్ ఆలీ లేన్‌లో వదిలిపెట్టారు. బాధితుడు ఇంటికి వెళ్లి ఉదయం 5 గంటలకు చిక్కడపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసి, హైదర్‌గూడ అపోలో ఆసుపత్రికి వెళ్లారు. సెంట్రల్ డీసీపీ విశ్వప్రసాద్ ఆధ్వర్యంలో పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు. ఆర్థిక లావాదేవీలే కారణమా?.. గజేందర్ కిడ్నాప్ కేసులో ఆర్థిక లావాదేవీలే ప్రధాన పాత్ర పోషించాయా అనే అనుమానంతో పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు. గతంలో ఫార్చూన్ ఫైనాన్స్‌లో దాదాపు రూ.24 కోట్ల మేర మోసం చేశాడనే కేసులో గజేందర్ అన్నను పోలీసులు అరెస్టు చేశారు. దీనికి దానికి ఏదైనా సంబంధం ఉందా అని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గజేందర్తో పాటు మరికొందరు బినామీలుగా ఏర్పడి ముంబైకి చెందిన కంపెనీని మోసగించిన కేసులు కూడా ఉన్నట్లు సమాచారం. కాగా, కిడ్నాప్ జరిగిన ప్రాంతంతో పాటు అబిడ్స్‌లో చోటుచేసుకున్న నాటకీయ పరిణామాలను కూడా పోలీసులు సీసీ ఫుటేజీల ద్వారా సేకరిస్తున్నారు. -
నా సూచన మేరకే ఏజీ హామీ
సాక్షి, హైదరాబాద్ : కాంగ్రెస్ నేతలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎ.సంపత్‌కుమార్ శాసనసభ్యత్వాల రద్దుకు దారితీసిన వీడియో ఫుటేజీలను కోర్టుకు సమర్పించడంపై నెలకొన్న వివాదంలో అడ్వొకేట్ జనరల్ (ఏజీ) దేశాయ్ ప్రకాశ్‌రెడ్డిని బలిపశువును చేశారా? మంగళవారం హైకోర్టులో జరిగిన పరిణామాలను చూస్తే ఔననే సమాధానం వస్తోంది. ఫుటేజీలు సమర్పిస్తానని ఏజీ తనంతట తానుగా హామీ ఇవ్వలేదని, అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) జె.రామచంద్రరావు సూచన మేరకే ఇచ్చారని నిర్ధారణయింది. ‘ఫుటేజీలు సమర్పిస్తానని నా సూచన మేరకే ఏజీ హామీ ఇచ్చారు’ అని అదనపు ఏజీయే మంగళవారం విచారణ సందర్భంగా కోర్టుకు స్వయంగా నివేదించారు. ఏజీ ఇలా హామీ ఇవ్వడంపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ఆగ్రహించారని, అందుకే ఆయన రాజీనామా చేశారని వార్తలు రావడం తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఎంకు అత్యంత సన్నిహితుడయిన రామచంద్రరావు ఇలా ఒక్కసారిగా తన సూచన మేరకే ఏజీ హామీ ఇచ్చారనడంతో కోర్టు హాల్లోని న్యాయవాదులంతా కంగుతిన్నారు. దీన్ని పరిగణనలోకి తీసుకున్న కోర్టు, ఆయన్ను గట్టిగానే నిలదీసింది. ‘ఏజీ హామీతో మీకు ఏ మాత్రం సంబంధం లేదని గత విచారణ సమయంలో చెప్పారుగా! మరిప్పుడేమో మీ సూచన మేరకే మీరు, ఆయన కలిసి హామీ ఇచ్చామని చెబుతున్నారు!! ఈ వైరుద్ధ్యమేమిటి?’ అంటూ ప్రశ్నించింది. ‘ఏదేమైనా ఏజీ హామీని ఈ కోర్టు రికార్డ్ చేసుకుంది. ఆ మేరకు ఫుటేజీ ఇవ్వకుంటే అందులోని అంశాలు మీకు (అసెంబ్లీ కార్యదర్శికి) వ్యతిరేకంగా ఉన్నాయని పరిగణిస్తాం’ అని పునరుద్ఘాటించింది. కౌంటర్ దాఖలుకు మరింత గడువు కావాలన్న అదనపు ఏజీ అభ్యర్థనను నిర్ద్వంద్వంగా తోసిపుచ్చింది. ఇప్పటికే పలుమార్లు అవకాశమిచ్చామంది. శుక్రవారానికల్లా కౌంటర్లు దాఖలు చేసి తీరాలని ప్రభుత్వాన్ని, కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. ‘‘కౌంటర్ల కాపీని పిటిషనర్ల తరఫు న్యాయవాదులకు అందజేయాలి. కోమటిరెడ్డి, సంపత్ బహిష్కరణ ప్రొసీడింగ్స్‌ను కూడా వారికివ్వాలి’’ అని ఆదేశించింది. సోమవారం పూర్తిస్థాయి విచారణ జరుపుతామంటూ విచారణను వాయిదా వేసింది. న్యాయమూర్తి జస్టిస్ బి.శివశంకరరావు ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. ఎన్నిసార్లు గడువివ్వాలి? అసెంబ్లీ నుంచి తమను బహిష్కరించడాన్ని, తాము ప్రాతినిధ్యం వహిస్తున్న నల్లగొండ, అలంపూర్ అసెంబ్లీ స్థానాలు ఖాళీగా ఉన్నట్టు నోటిఫై చేస్తూ గెజిట్ నోటిఫికేషన్ జారీని సవాలు చేస్తూ కోమటిరెడ్డి, సంపత్ హైకోర్టుకు వెళ్లడం తెలిసిందే. హెడ్‌ఫోన్ విసిరి శాసనమండలి చైర్మన్ స్వామి గౌడ్‌ను తాము గాయపరిచామన్న ఆరోపణల నేపథ్యంలో ఆ రోజు పరిణామాల వీడియో ఫుటేజీని కోర్టు ముందుంచేలా ఆదేశించాలని కూడా కోరారు. ఆ స్థానాలకు ఎన్నికల నిర్వహణపై ఆరు వారాల పాటు న్యాయమూర్తి స్టే ఇవ్వడంతో పాటు నాటి వీడియో ఫుటేజీ సమర్పించాలంటూ ఆదేశాలివ్వబోయారు. ఆ అవసరం లేదని, ఫుటేజీ సమర్పిస్తామని ఏజీ హామీ ఇవ్వడం, కానీ ఆ హామీతో తమకు సంబంధం లేదని గత వారం విచారణలో అదనపు ఏజీ చెప్పడం తెలిసిందే. తాజాగా మంగళవారం విచారణ మొదలవగానే, ఫుటేజీ సమర్పించేందుకు సభ అనుమతి లేదని అదనపు ఏజీ మరోసారి తెలిపారు. ‘‘ఫుటేజీల సమర్పణ పూర్తిగా సభ పరిధిలోని వ్యవహారం. సభ తీర్మానం లేకుండా ఫుటేజీలివ్వడం సాధ్యం కాదు. సభ నిరవధికంగా వాయిదా పడింది. కనుక విచారణ కూడా వాయిదా వేయండి. ఈ వ్యవహారాన్ని సంబంధిత అధికార వర్గాల (అసెంబ్లీ) నిర్ణయానికి వదిలేయండి’’ అని కోరారు. అందుకు న్యాయమూర్తి తిరస్కరించారు. కౌంటర్ల దాఖలు గురించి ప్రశ్నించారు. డ్రాఫ్ట్ సిద్ధమైందని, తుది రూపు ఇచ్చేందుకు మూడు నాలుగు రోజుల గడువు కావాలని కోరగా తోసిపుచ్చారు. మార్చి 16 నుంచి 27 దాకా పలుమార్లు గడువునిచ్చామని గుర్తు చేశారు. సభ లేదని, సభ తీర్మానం లేకుండా ఫుటేజీ ఇవ్వడం సాధ్యం కాదని అదనపు ఏజీ పలుమార్లు చెప్పడంతో, ‘ఫుటేజీ ఇవ్వకుంటే అందులోని అంశాలు మీకు (అసెంబ్లీ కార్యదర్శికి) వ్యతిరేకంగా ఉన్నట్లు పరిగణిస్తా’ అని స్పష్టం చేశారు. ఫుటేజీలిస్తానని ఏజీ హామీ ఇవ్వడాన్ని, దాన్ని రికార్డు చేయడాన్ని గుర్తు చేశారు. అదనపు ఏజీ స్పందిస్తూ, తన సూచన మేరకే ఏజీ ఆ హామీనిచ్చారని చెప్పారు. దాంతో ‘మరి ఏజీ హామీతో సంబంధం లేదని గత విచారణ సమయంలో మీరే కదా చెప్పారు!’ కదా అంటూ న్యాయమూర్తి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అసెంబ్లీ కార్యదర్శి తరఫున ఎవరు హాజరవుతున్నారని ప్రశ్నించారు. ఎవరూ కావడం లేదని, తాను ప్రభుత్వం తరఫునే హాజరవుతున్నానని అదనపు ఏజీ చెప్పారు. ‘‘మీరు అసెంబ్లీ తరఫున హాజరు కానప్పుడు ‘సభ లేదు, తీర్మానం లేదు, ఫుటేజీ ఇవ్వడం కుదరదు’ అంటూ అసెంబ్లీ కార్యదర్శి చెప్పాల్సిన వాదనలు చెబుతున్నారేం?’’ అంటూ న్యాయమూర్తి నిలదీశారు. ‘‘కౌంటర్ల దాఖలుకు మీకు సమయమిస్తా. అయితే ఈ కేసులో ఇప్పటికే ఏజీ వాదనలు ప్రారంభించారు. వాటిని మీరు కొనసాగించండి. ఇంతకు మించి నేను చేయగలిగిందేమీ లేదు. చట్ట ప్రకారం, నేను చేసిన ప్రమాణం ప్రకారమే నడుచుకుంటా’’ అని తేల్చి చెప్పారు. ఈసీ కౌంటర్ సిద్ధమైందని, సంతకాల కోసం పంపామని ఆ సంస్థ తరఫు న్యాయవాది తెలిపారు. -
రూ.25 లక్షల విలువైన మొబైళ్లు చోరి
హైదరాబాద్: తాళం పగులకొట్టలేదు.. షట్టర్ ధ్వంసం చేయలేదు.. ఏడుగురు వచ్చారు, ఇద్దరు లోపలికి వెళ్లారు.. 20 నిమిషాల్లో పని పూర్తి చేసుకుని రూ.25 లక్షలు సొత్తు ఎత్తుకుపోయారు. ఇదీ సోమవారం అర్ధరాత్రి మహంకాళి పోలీసుస్టేషన్ పరిధిలోని ‘అపెక్స్’ యాపిక్ మొబైల్ ఔట్లెట్లో జరిగిన భారీ చోరీ నేపథ్యం. దుకాణం బయట, లోపల ఉన్న సీసీ కెమెరాల్లో నమోదైన దృశ్యాలను నగర పోలీసులు ప్రస్తుతం అధ్యయనం చేస్తున్నారు. షాపు నిర్వాహకుల నిర్లక్ష్యం దుండగులకు కలిసొచ్చిందని భావిస్తున్నారు. నిందితుల కోసం ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. ‘అపెక్స్’ దుకాణం బయట ఉన్న సీసీ కెమెరాల్లో నమోదైన దశ్యాల్లో మొత్తం ఏడుగురు సభ్యులతో కూడిన ముఠా చోరీకి పాల్పడినట్ట తెలుస్తోంది. వీరిలో నలుగురి వీపుకు బ్యాగ్‌లు తగిలించుకుని ఉన్నారు. తెల్లవారుజామున 3.39 గంటల ప్రాంతంలో దుకాణం దగ్గరకు వచ్చిన గ్యాంగ్.. వెంట తెచ్చుకున్న బ్యాగుల్లోంచి రెండు దుప్పట్లు బయటకు తీశారు. షట్టర్‌కు కుడివైపుగా ఇద్దరు వాటిని తెరిచి అడ్డంగా పట్టుకున్నారు. ఎవరైనా వాళ్లను చూసినా.. దుప్పట్లు పర్చుకొని పడుకుంటున్నారని భావించేలా జాగ్రత్తలు తీసుకున్నారు. దుకాణానికి సెంటర్ లాక్ వ్యవస్థ అందుబాటులో ఉన్నా నిర్వాహకులు దాన్ని ఉపయోగించకపోవడం దుండగులకు కలిసొచ్చింది. షట్టర్ ను చిన్న రాడ్ తో ఎత్తిపట్టుకుని ఏర్పడిన సందులో నుంచి ఇద్దరు వ్యక్తులు లోపలికి ప్రవేశించారు. మిగిలిన వారు దుప్పటిని మడతపెట్టుకుని కాస్త దూరంగా వెళ్లారు. షట్టర్ వెనుక దుకాణం లోపలి వైపు అలంకరణ కోసం గ్లాస్ ఫిటింగ్, డోర్ ఉన్నప్పటికీ దానికి కూడా ఎలాంటి లాక్ లేకపోవడంతో దుండగుల పని తేలికైంది. దుకాణంలోకి వెళ్లిన ఇద్దరు దుండగులు 16 నిమిషాల్లో పని పూర్తి కానిచ్చేశారు. ఫోన్లు మాత్రమే.. ‘అపెక్స్’ దుకాణంలో యాపిల్ ఫోన్లతో పాటు ల్యాప్టాప్స్ తదితరాలు ఉన్నాయి. అయితే, దొంగలు కేవలం సెల్ఫోన్లు ఉన్న షెల్ఫ్‌ను చిన్నపాటి రాడ్డుతో పగులకొట్టారు. ఒకడు అందులోని సెల్ఫోన్లను బయటకు తీసి ఇస్తుండగా.. మరొకడు బాక్సులు ఓపెన్ చేసి పక్కన పడేస్తూ కేవలం వాటిలో ఉన్న ఫోన్లు మరో పక్కన పేర్చాడు. ఇలా తమకు కావాల్సిన ఫోన్లు వేరు చేసిన తర్వాత క్యాష్ కౌంటర్‌ను పగులకొట్టి అందులో ఉన్న రూ.51 వేల నగదు తీసుకున్నారు. ఆపై రూ.24.85 లక్షల విలువైన ఫోన్లను వెంట తెచ్చుకున్న బ్యాగ్‌లో సర్దుకుని పారిపోయారు. ఈ మొత్తం చోరీ 20 నిమిషాల్లో పూర్తయినట్టు సీసీ కెమెరాల్లో రికార్డయింది. అంతర్రాష్ట్ర ముఠా ఈ చోరీకి పాల్పడినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. యాపిల్ ఫోన్లకు సంబంధించిన ఇంటర్నేషనల్ మొబైల్ ఎక్యూప్మెంట్ ఐడెంటిటీ (ఐఎంఈఐ) నెంబర్లు క్లోనింగ్ చేయడం సాధ్యం కాదు. అలా కాకుండా వాటిని దేశంలో ఎక్కడ విక్రయించినా పోలీసులు సాంకేతికంగా ట్రాకింగ్ చేసి గుర్తిస్తారు. ఈ నేపథ్యంలోనే ఉత్తరాదికి చెందిన అంతర్రాష్ట్ర ముఠా పక్కా రెక్కీ తర్వాత ఈ చోరీ చేసిందని, సొత్తును వివిధ మార్గాల్లో ఇతర దేశాలకు తరలించే ఆస్కారం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. దుండుగులు వచ్చిపోయిన మార్గాలను గుర్తించడం కోసం సికింద్రాబాద్ ఎస్డీ రోడ్‌లోని మినర్వా కాంప్లెక్స్ సమీపంలో ఉన్న ‘అపెక్స్’ నుంచి అన్ని వైపులకు ఉన్న రహదారుల్లోని సీసీ కెమెరాల దృశ్యాలను అధ్యయనం చేస్తున్నారు. వీరు రైలులో వచ్చి వెళ్లి ఉంటారనే అనుమానంతో రైల్వేస్టేషన్‌లోని సీసీ కెమెరాల ఫీడ్‌ను కూడా పరిశీలించాలని నిర్ణయించారు. -
కూతుర్ని చంపాడంటూ అమాంతం గాల్లోకి ఎగిరి..
అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురును ఓ దుర్మార్గుడు హత్య చేశాడు. ఆ నిందితుడిపై పగపై రగిలిపోయాడు. శిక్ష పడుతుందని రెండేళ్ల నుంచి ఎదురుచూశాడు. చివరికి కోర్టులో అతడ్ని ప్రవేశపెట్టగా ఆ తండ్రి తీవ్ర ఆవేశంతో ఊగిపోయాడు. ఈ రోజు నా చేతిలో నువ్వు చస్తావు అంటూ ఒక్క ఉదుటున నిందితుడి మీదకు దూకాడు. అధికారులు కంట్రోల్ చేయడంతో నిందితుడ్ని వదిలేశాడు. గురువారం నాడు అమెరికాలోని ఓహియో కోర్టులో ఈ సంఘటన జరిగింది. వాన్ టెర్రీ కూతురు షిరెల్డా టెర్రీ రెండేళ్ల కిందట దారుణ హత్యకు గురైంది. 2013లో మాడిసన్ ముగ్గుర్ని హత్య చేసి వారి మృతదేహాలను బ్యాగ్ లో తీసుకెళ్తుంటే పోలీసులు అరెస్ట్ చేశారు. అంగెలా డిస్కిన్స్(38), షెటిషా షీలే(18), షిరెల్డా టెర్రీ(18)లను ఈస్ట్ క్లీవ్ లాండ్ లోని తన నివాసంలో అతి దారుణంగా హతమార్చాడు. ఓహియో కోర్టులో కేసు గురువారం విచారణకు వచ్చింది. నిందితుడు మాడిసన్ కు మరణశిక్ష విధించారు. అయినా వాన్ టెర్రీ కోపం చల్లారలేదు. అమాంతం గాల్లోకి ఎగిరి నిందితుడిపై దూకాడు. ఇంతలో అధికారులు ఒక్కసారిగా అప్పమత్తమై నిందితుడు మాడిసన్ ను పక్కకు జరిపారు. దాదాపు పది మంది వ్యక్తులు ఆయనను పట్టుకుని వెనక్కి లాగుతున్నా కొంత సేపటి వరకు కంట్రోల్ చేయలేకపోయారు. అప్పటికీ దుఖంలో ఉన్న ఆ తండ్రి నన్ను వదలండీ సార్.. వాడు మా కుటుంబాన్ని టచ్ చేశాడు. ఆ నీచుడ్ని నా చేతులతోనే చంపేస్తాను. నా కూతుర్ని పొట్టన పెట్టుకున్న పాపాత్మున్ని శిక్షిస్తాను అంటూ కన్నీటి పర్యంతమయ్యాడు. ఈ దృశ్యం అక్కడి అధికారులతో పాటు కోర్టుకు హాజరైన వారిని కంటతడి పెట్టించింది. -
సింహ గర్జనకు దుమ్మురేపిన దున్నలు
సియోల్: ఒక్కోసారి ఎంతటి ప్రశాంతవాతవరణమైన రణరంగాన్ని తలపించొచ్చు. ఎంత శాంతంగా ఉన్న జీవైన భయంగుప్పిట్లోకి జారుకుందంటే తనకు తెలియకుండానే ప్రమాదబారిన పడటమో ప్రమాదంలో పడేయడమో చేయొచ్చు. దక్షిణాఫ్రికాలోని ఓ పెద్ద పార్క్‌లో ఇలాగే జరిగింది. అప్పటివరకు నిర్మలంగా.. చల్లటి గాలులు.. పచ్చని చెట్ల మధ్య పీస్ఫుల్ గా కనిపించిన ఆ రహదారి ఒక్కసారిగా దుమ్మురేగింది. భయం గుప్పిట్లోకి జారుకున్న అడవి దున్నలు చేసిన హంగామాకు ఆ రోడ్డుపై వెళుతున్న వాహనదారులు ఉలిక్కిపడ్డారు. వందల దున్నల టపాటపా తమ కార్లకు ఢీకొనడమే కాకుండా.. ఆ కార్లపై నుంచి కొన్ని దూకుతూ.. కార్లను తొక్కుతూ వెళ్లడంతో సచ్చాం రా దేవుడా అనుకొని కాసేపు ఊపిరి బిగబట్టుకున్నారు. దక్షిణాఫ్రికాలోని క్రూగ్ పార్క్‌లో విశాలమైన రహదారి ఉంది. ఈ రహదారి గుండా వెళుతూ టూరిస్టులు అటవీ జంతువును సందర్శిస్తుంటారు. అందులో భాగంగానే అప్పటికే కొన్ని వాహనాలు ముందుండగా ఓ రెండు కార్లు నెమ్మదిగా వెళుతున్నాయి. ఆ రోడ్డును అడవి దున్నలు ఎంతో ప్రశాంతంగా ఒక పద్థతిగా రోడ్డు దాటుతుండటంతో కాసేపు వార్లు కార్లు నిలుపుకున్నారు. అవి దాటేసి వెళ్లగానే కార్ల వేగం పెంచారు. ఈ లోగా అడవి రారాజు సింహం అరుపు వినిపించింది. దాంతో అప్పటికే ప్రశాంతంగా రోడ్డు దాటిన దున్నలన్నీ కూడా ఒక్కసారిగా తిరిగి మరోసారి రోడ్డు దాటేందుకు మెరుపు వేగంతో దూసుకొచ్చాయి. ఆ వందల దున్నలమధ్య ఆ రెండు కార్లు చిక్కుపోయాయి. ఏదో పెద్ద బాంబు పేలితే ఎంతటి దుమ్ముధూళి రేగుతుందో ఆ దున్నల పరుగుకు అంతటి దుమ్ము రేగింది. ఎన్నో దున్నల మధ్య తొక్కిసలాట కూడా చోటుచేసుకుంది. ఆ కార్లను చూసిన ఇతరులు ఆ దృశ్యం చూసి గుండెలు పట్టుకున్నారు. అదృష్టవశాత్తు ఏం కాలేదు. -
వామ్మో.. ఇది ఉడుమా.. గాడ్జిల్లా పిల్లనా?
గ్రాఫిక్స్, త్రీడి చిత్రాల్లో గాడ్జిల్లా(రాక్షస బల్లి)ని మనం ఇప్పటి వరకు చూశాం. ఒకప్పుడు అది ఇలా ఉండేదని మిగిలిపోయిన శిలాజాల ద్వారా మనం వాటి పరిమాణాన్ని అంచనా వేశాం తప్ప ఏనాడు ప్రత్యక్షంగా చూడలేదు. అయితే, మనం ఇప్పటి వరకు రాక్షసబల్లి ఎలా ఉంటుందని ఇప్పటి వరకు చూస్తూ వచ్చామో అచ్చం అలాంటి రూపమే ప్రత్యక్షంగా దర్శనమిచ్చింది. అది కూడా గాలపాగో ద్వీపంలోని ఇసబెల్లా కోస్తా తీరంలో. అవునూ.. సముద్ర జలాల్లో ప్రత్యేక కెమెరాల ద్వారా వీడియోలు తీసి అందులోని వృక్షరాశి, జంతురాశి గురించి ఆరా తీసే ప్రత్యేక గజ ఈతగాళ్లకు ఇది కనిపించి అబ్బురపడిపోయేలా చేసింది. కాకపోతే ఇది రాక్షసబల్లి కాదుగానీ, అచ్చం అలాగే ఉన్న ఓ పెద్ద ఉడుము. ఇది నీటి అడుగు భాగంలో ఎంతో నేర్పుగా డైవర్స్ తోపాటు ఈదుతూ రుచికరమైన ఆహారం కోసం నీటి అడుగున పాకుతూ ఆ తర్వాత గాలి తీసుకునేందుకు తిరిగి సముద్ర ఉపరితలంపైకి రావడాన్ని వారు వీడియోలో చూశారు. ఇది అచ్చం జురాసిక్ పార్క్ సినిమాలో జంతువులు ఎలా ఉన్నాయో అలాగే ఉంది. ఇంతకీ దీని పరిమాణం ఎంత ఉందని అనుకుంటున్నారు.. సరిగ్గా ఒక మనిషి అంత పెద్దగా ఉందట. ఇలా ప్రతిసారి నీటిలో వేగంగా మునుగుతూ ఆహారం కోసం వెతుకుతూ తోకతో ఈదుతూ వేగంగా ముందుకు కదలడం ఈ వీడియోలో రికార్డయింది. -
పోలీసును కారుతో ఢీ కొట్టి అలానే..
వేగంగా పోతున్న కారు, ముందు భాగంలో ఓ పోలీసు అధికారి. అచ్చం సినిమాల్లో స్టంట్లా కనిపించే వాస్తవ సంఘటనకు చెందిన దృశ్యాలు ఇప్పుడు నెట్లో హల్ చల్ చేస్తున్నాయి. తప్పించుకునే ప్రయత్నంలో ఓ దుండగుడు కారుతో పోలీసు అధికారిని ఢీ కొట్టాడు. ఉత్తర చైనాలోని టియాజిన్ మున్సిపాలిటీలో ఈ సంఘటన చోటుచేసుకుంది. దీనికి సంబంధించి సీసీకెమెరాల్లో రికార్డయిన వీడియో ఫుటేజిని పోలీసులు విడుదల చేశారు. వివరాలు.. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన దుండగుడిని ఇద్దరు పోలీసులు వెంబడించారు. గ్యాస్ బంకు దగ్గర ఆగడంతో అతన్ని లైసెన్స్ చూపించాల్సిందిగా ఆదేశించారు. అతని దగ్గర ఉన్నవి నకిలీ ధృవ పత్రాలు అని పోలీసులు నిర్ధారణకు వచ్చేలోపే దుండగుడు పోలీసుల నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించాడు. ఈ క్రమంలో కారును ఆపాలని చూసిన ఓ పోలీసు అధికారి, కారు ఢీకొట్టడంతో ముందు భాగం పై పడ్డాడు. అయినా కారును ఆపకుండా అక్కడి నుంచి మెయిన్ రోడ్డు పై అతి వేగంగా పోనిచ్చాడు. ఈ మొత్తం తతంగం అక్కడే ఉన్న ట్రాఫిక్ సీసీ కెమరాల్లో చిక్కాయి. ఈ ఘటనలో ప్రాణాపాయం నుంచి గాయాలతో పోలీసు అధికారి బయటపడ్డాడు. నిందితున్ని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. -
విస్మయపరుస్తున్న గడాఫీ చివరి క్షణాల వీడియో
సుమారు ఐదు సంవత్సరాల తర్వాత అందర్నీ దిగ్భ్రాంతికి గురి చేసే వీడియో వెలుగులోకి వచ్చింది. అతి పెద్ద నియంతగా పేరు తెచ్చుకున్న గడాఫి.. నెత్తురోడుతూ దిక్కులేని పరిస్థితిలో కనిపించాడు. ఆయన చివరిక్షణాలు ఎలా ముగిశాయన్న వివరాలను తాజా ఫుటేజీ చెప్తోంది. దెబ్బలతో రక్తంకారుతున్న శరీరం, తలకు పాయింట్ చేసిన గన్...అతి దీనమైన స్థితిలో ఉన్నగడాఫీ వీడియోను లిబియన్ రెబల్స్ మొబైల్ ఫోన్లో తీసినట్లు తెలుస్తోంది. లిబియా తిరుగుబాటుదారులు ఆ వీడియో కల్నల్ గడాఫీ హత్యకు కొద్ది క్షణాల ముందే చిత్రించారు. రెబల్ ఫైటర్ అయ్ మాన్ అల్మాని అక్టోబర్ 2011 లో తీసుకున్న వీడియో ఫుటేజ్ ను తాజాగా బయట పెట్టాడు. గడాఫీ చనిపోయేందుకు ముందు అతడిచుట్టూ సాయుధ తిరుగుబాటుదారులు నిలబడి ఉన్నట్లు వీడియోలోని దృశ్యాల ద్వారా తెలుస్తోంది. తలకు, ఒంటికి గాయాలై... రక్తస్రావంతో ఉన్న గడాఫీ తనను ప్రాణాలతో వదిలేయమని అభ్యర్థిస్తున్నట్లు కూడ వీడియో ఫుటేజ్ లో వినిపిస్తోంది. కొన్ని క్షణాల తర్వాత తిరుగుబాటుదారుడు గడాఫి తలపై అతడి గోల్డెన్ గన్ పెట్టి కాల్చి చంపినట్లు వీడియో వివరిస్తోంది. అయితే ఆ నియంతకు తగిన శిక్షే పడిందని తాజాగా వీడియో ఫుటేజ్ బయటపెట్టిన అల్మానీ చెప్తున్నాడు. గడాఫీ హత్యకు వాడిన హ్యాండ్ గన్ తనవద్దే ఉందని, ఆ ఆయుధం లిబియన్ విప్లవానికి చిహ్నంగా మారిందని అంటున్నాడు. గడాఫీ హత్య తర్వాత విస్తృతంగా బయటికొచ్చిన చిత్రాలు హత్యకు అల్మానీయే కారణమని చెప్తున్నా... నిజానికి తాను గన్ పేల్చలేదని, తర్వాత నేలపై పడి ఉన్న ఆ బంగారు తుపాకీనీ తన చేతిలోకి తీసుకున్నానని చెప్తున్నాడు. అప్పట్నుంచీ గడాఫీ విధేయులు తనను చంపేస్తామని బెదిరిస్తూనే ఉన్నారని అంటున్నాడు. ఇపుడు తాను బయట పెట్టిన కొత్త ఫుటేజ్... గడాఫీ హత్యలో తనకన్నా ఇతరులదే అధిక పాత్ర ఉన్నట్లు రుజువు చేస్తుందని అల్మానీ భావిస్తున్నాడు. -
'హైడ్ అండ్ సీక్' తో పిల్ల టెర్రరిస్టుల దాష్టీకం!
ఐఎస్ఐఎస్ తీవ్రవాదులు తాజాగా పోస్టు చేసిన ఓ వీడియో భయోత్పాతాన్ని సృష్టిస్తోంది. ఓ పురాతన కోట లోపల బంధించిన ఖైదీలను పిల్ల టెర్రరిస్టులు పట్టుకునే హైడ్ అండ్ సీక్ ఆటలా కనిపిస్తున్నా... నిజంగానే వారిని పట్టి బలవంతంగా చంపే వికృత చర్యలతో వీడియోను చిత్రించారు. సిరియాలోని మారుమూల డేయిర్ ఆజోర్ ప్రావిన్స్ ప్రాంతంలో దాచిన ఖైదీలను వెతుకుతూ చారిత్రక కట్టడాల మధ్య వాళ్లు శోధిస్తున్న దృశ్యాలను వీడియోలో పొందుపరిచారు. చేతులు రెండూ వెనక్కు విరిచి కట్టిన బందీలను..కనిపిస్తే కాల్చి చంపేందుకు సిద్ధంగా... ఆ పిల్ల పిశాచులు ఓ తుపాకీతో వేచి చూస్తుండటం ఆ పురాతన కట్టడాల మధ్య వీడియోలో స్పష్టంగా కనిపిస్తుంది. ఇటువంటి భయంకర దాడుల్లో పాల్గొన్న వారు చాలావరకూ ఉత్తర ఆఫ్రికా, తజకిస్తాన్ నుంచి వచ్చినవారిలా ఉన్నారు. ఒకరి వెంట ఒకరు చారిత్రక అల్ రభా కోట ప్రవేశ ద్వారంనుంచి వారి శిక్షకుడిని కలుసుకుని, వారు చెప్పినట్లు కోట లోపల దాచిన ఖైదీలను అన్వేషించి మట్టుబెట్టేందుకు సిద్ధమయ్యారు. ఇందుకు పిల్ల టెర్రరిస్టులకు కావలసిన తుపాలకులను అప్పగించారు. నిస్సహాయ స్థితిలో ఉన్న బందీలను లోపలి చీకట్లో కనుగొనేందుకు చిన్నదీపం వెలిగించి ఇచ్చారు. ఒకరి తర్వాత ఒకరు వారిని వెతికి...పని పూర్తి చేసి తిరిగి తమ ట్రైనర్ వద్దకు వచ్చి, అనంతరం ఆ తుపాకులను మరో బాల టెర్రరిస్టుకు ఇస్తే అతడు తిరిగి ఆట(వేట) ప్రారంభిస్తాడు. ఇలా ఖైదీలను వేర్వేరు ప్రాంతాల్లో తప్పించుకొనేందుకు వీలు లేనట్లుగా బంధించారు. చివరికి ఓ ఖైదీని నరికి చంపిన దృశ్యం కూడా వీడియోలో కనిపిస్తుంది. సిరియా ఇరాక్ లలో తమ ఉగ్రవాద కార్యకలాపాల కోసం వందలాదిమంది పిల్లలకు ఇస్లామిక్ స్టేట్ శిక్షణ ఇస్తున్న విషయం తెలిసి టర్కీ పోలీసులు అరెస్టు చేసిన వార్తలు గతంలో సంచలనం రేపాయి. తాజాగా బందీలను చంపేందుకు బాల టెర్రరిస్టులతో 'హైడ్ అండ్ సీక్' గేమ్ ఆడిస్తున్న వీడియో భయోత్పాతాన్ని సృష్టిస్తోంది. -
దిల్సుఖ్నగర్ బాంబు పేలుళ్ల కేసులో పురోగతి