Godzilla
-
ఓటీటీలోకి వచ్చేసిన 'గాడ్జిల్లా మైనస్ వన్'
ఈ వీకెండ్లో మూవీ లవర్స్ కోసం సడెన్ సర్ప్రైజ్ ఇచ్చింది నెట్‌ఫ్లిక్స్. హాలీవుడ్ హిట్ సినిమా 'గాడ్జిల్లా మైనస్ వన్' ఓటీటీలో విడుదలట్లు ప్రకటించేసింది. 2023 ఆక్టోబర్‌లో మొదట జపాన్‌లో విడుదలైన ఈ సినిమా అక్కడ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.గాడ్జిల్లా ఫ్రాంఛైజీలో 37వ చిత్రంగా 'గాడ్జిల్లా మైనస్ వన్' తెరకెక్కింది. బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్ విభాగంలో ఆస్కార్‌ను దక్కించుకున్న ఈ చిత్రం ఎలాంటి ప్రకటన లేకుండా నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది. ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా ఇండియాలో మాత్రం థియేటర్లలో విడుదల కాలేదు. కానీ, ఓటీటీ వేదికగా చూసే అవకాశం ప్రేక్షకులకు దక్కింది. అయితే ఈ సినిమా జపనీస్,ఇంగ్లీష్,తమిళ్,హిందీలో మాత్రమే స్ట్రీమింగ్ అవుతుంది. గాడ్జిల్లా మైనస్ వన్ చిత్రాన్ని తకాషి యమజాకి తెరకెక్కించారు. -
థియేటర్లలో ఉండగానే ఓటీటీలోకి వచ్చేసిన హిట్ సినిమా
మరో హిట్ సినిమా సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసింది. ఓ పక్క థియేటర్లలో ఇంకా ఆడుతూనే ఉంది. ఇప్పుడు డిజిటల్‌గా అందుబాటులోకి వచ్చేసింది. తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతున్నప్పటికీ.. ఓ విషయం మాత్రం నెటిజన్లకు షాకిస్తోంది. అది చూసి కళ్లు తేలేస్తున్నారు. ఇంతకీ ఏంటా సినిమా? ఎందులో స్ట్రీమింగ్ అవుతోంది?'టిల్లు స్క్వేర్' సినిమాతో పాటు మార్చి 29న థియేటర్లలో రిలీజైన హాలీవుడ్ మూవీ 'గాడ్జిల్లా x కాంగ్: ద న్యూ ఎంపైర్'. గాడ్జిల్లా-కాంగ్ ఫ్రాంచైజీలో వచ్చిన ఈ సినిమాకు మంచి స్పందనే వచ్చింది. వచ్చి చాలా రోజులవుతున్నప్పటికీ ఇప్పటికీ చాలా థియేటర్లలో ఆడుతోంది. అలాంటిది ఇప్పుడు ఓటీటీలో రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్)బుక్ మై షో ఓటీటీలోకి తీసుకొచ్చారు గానీ ఉచితంగా మాత్రం స్ట్రీమింగ్ అందుబాటులో లేదు. ఈ సినిమా రెంట్ విధానంలో 4k క్వాలిటీతో చూడాలంటే రూ.549 చెల్లించాలి. పూర్తిగా కొని చూడాలంటే మాత్రం రూ.799 చెల్లించాలని క్లారిటీ ఇచ్చారు. ఇంగ్లీష్‌తో పాటు తెలుగులోనూ ఈ చిత్రం అందుబాటులో ఉంది.ఇక బుక్ మై షో ఓటీటీలో సోమవారం అందుబాటులోకి రాగా.. అమెజాన్ ప్రైమ్, యూట్యూబ్‌లో మంగళవారం నుంచి రెంట్ విధానంలో స్ట్రీమింగ్ కానుంది. ఇదిలా ఉండగా రూ.15 కోట్ల డాలర్ల బడ్జెట్ పెట్టగా.. రూ.52.4 కోట్ల డాలర్ల వసూళ్లు ఇప్పటివరకు ఈ సినిమాకు వచ్చాయి. దాదాపు మూడురెట్లు అనమాట.(ఇదీ చదవండి: స్టేజీపై నటిస్తూ కన్నుమూసిన ప్రముఖ నటుడు) -
'గాడ్జెల్లా వర్సెస్ కాంగ్' ప్రాంఛైంజీ నుంచి ఐదో చిత్రం విడుదల ఎప్పుడంటే
హాలీవుడ్ చిత్రాల్లో గాడ్జెల్లా వర్సెస్ కాంగ్ చిత్రాలకు ప్రత్యేక ఆదరణ ఉంటుంది. ఈ తరహా చిత్రాలు పిల్లలను, పెద్దలను విపరీతంగా అలరిస్తాయి. అలా ఇంతకు ముందు వచ్చిన గాడ్జెల్లా వర్సెస్ కాంగ్ చిత్రాలు విశేష ఆదరణ పొంది వసూళ్ల వర్షం కురిపించాయి. వాటికి ప్రాంఛైంజీగా వస్తున్న ఐదో చిత్రం 'గాడ్జెల్లా వర్సెస్ కాంగ్. ది ఎంపైర్'. ఆడమ్ వింగార్డ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని లెజెండరీ పిక్చర్స్ సంస్థ నిర్మించింది. రెబాకా హాల్, వ్రియాన్ టైరీహెన్ని, డన్ స్ట్రీవెన్స్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని వార్నర్ బ్రదర్స్ సంస్థ ఈ నెల 29వ తేదీన తెలుగు, తమిళం, హిందీ, ఇంగ్లిషు భాషల్లో విడుదల చేయనుంది. కాగా ఈ చిత్రంలో ప్రధాన పాత్రను పోషించిన రెబాకా హాల్ చిత్ర దర్శకురాలి గురించి తన అభిప్రాయాన్ని తెలుపుతూ ఆడమ్ వింగార్డ్ దర్శకత్వంలో నటించడం తనకు ఎప్పుడూ సంతోషం అన్నారు. తను సెట్లో చాలా జాలీగా ఉంటారని, అదే సమయంలో దర్శకత్వంలో అత్యంత ప్రతిభ కలిగిన వారని చెప్పారు. తాను తెరకెక్కించే సన్నివేశాల విషయంలో చాలా క్లియర్‌గా ఉంటారన్నారు. అదే తనను చాలా ప్రశాంతంగా ఉండేలా చేసిందన్నారు. ఈ చిత్రాన్ని చాలా అద్భుతంగా తెరకెక్కించారని చెప్పారు. చిత్రంలో గ్రాఫిక్స్ సన్నివేశాలను ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారని అన్నారు. కచ్చితంగా ఈ చిత్రం సమ్మర్‌కు చాలా స్పెషల్‌గా ఉంటుందనే అభిప్రాయాన్ని ఆమె వ్యక్తం చేశారు. -
యుద్ధానికి పిలుపు
అమెరికన్ ఫిల్మ్స్ ‘గాడ్జిల్లా’ ఫ్రాంచైజీలో వస్తున్న తాజా చిత్రం ‘గాడ్జిల్లా వర్సెస్ కాంగ్: ది న్యూ ఎంపైర్’ (2024). రెబెక్కా హాల్, బ్రియాన్ టైరీ హెన్రీ, డన్ స్టీవెన్స్, కైలీ హోట్లీ, అలెక్స్ ఫెర్న్స్, ఫలా చెన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి ఆడమ్ విన్గార్డ్ దర్శకుడు. భారీ బడ్జెట్‌తో లెజండరీ పిక్చర్స్ నిర్మించిన ఈ సినిమాను వార్నర్ బ్రదర్స్ రిలీజ్ చేస్తున్నారు. ‘గాడ్జిల్లా వర్సెస్ కాంగ్: ది న్యూ ఎంపైర్’ చిత్రం అంతర్జాతీయంగా మార్చి 27న, యునైటెడ్ స్టేట్స్లో మార్చి 29న, జపాన్‌లో ఏప్రిల్ 26న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ‘గాడ్జిల్లా వర్సెస్ కాంగ్: ది న్యూ ఎంపైర్’ నుంచి లేటెస్ట్ ట్రైలర్‌ను విడుదల చేశారు. ‘మేము ఓ సిగ్నల్‌ని కనుగొన్నాం’, ‘ఏదో ఊహించనది జరగబోతోంది’, ‘అది కేవలం సిగ్నల్ మాత్రమే కాదు.. యుద్ధానికి పిలుపు’ వంటి డైలాగ్స్ ట్రైలర్లో ఉన్నాయి. ఇక 2021లో వచ్చిన ‘గాడ్జిల్లా వర్సెస్ కాంగ్’కి సీక్వెల్‌గా ‘గాడ్జిల్లా వర్సెస్ కాంగ్: ది న్యూ ఎంపైర్’ చిత్రం తెరకెక్కింది. -
అయ్యో ఈ కోతికి ఎంత కష్టమొచ్చింది!
థాయ్‌లాండ్: జంక్ ఫుడ్ తింటే మనుషులే కాదు జంతువుల సైతం అనారోగ్య బారిన పడతాయి. దీనికి ఈ తాజా సంఘటనే ఉదాహరణ. హాయిగా చెట్ల కొమ్మలపై అటూ ఇటూ దూకుతూ యాక్టివ్‌గా ఉండాల్సిన ఈ కోతి జంక్ ఫుడ్ తిని తిని ఉభకాయంతో బాధపడుతోంది. వివరాలు.. బ్యాంకాక్ చెందిన మనోప్ అనే ఓ షాప్ యాజమానురాలు గాడ్జిల్లా అనే కోతిని పెంచుకుంటోంది. ప్రస్తుతం దాని వయసు 3 సంవత్సరాలు. ఆమె రోజు తనతో పాటే ఈ కోతిని మార్కెట్‌కు తీసుకువచ్చి తన షాపు ఎదురుగా కట్టి ఉంచుతుంది. దీంతో ఆ దారిన వచ్చిపోయే వారంతా దానికి జంక్ ఫుడ్‌ను ఆహారంగా ఇవ్వడం మొదలు పెట్టారు. అలా రోజు బర్గర్, పిజ్జా, బన్లు వంటి పదార్థాలు తినడం వల్ల ఈ 3 ఏళ్ల కోతి 20 కేజీల బరువెక్కింది. అంటే దాని వయసుకు ఉండాల్సిన సాధారణ బరువు కంటే రెట్టింపు బరువుతో ఉందని కోతి యజమానురాలు మనోప్ పేర్కొంది. ఇందుకు సంబంధించిన వీడియో, ఫొటోలు నెట్టింటా వైరల్ కావడంతో అందరి దృష్టి ఈ కోతిపై పడింది. అయ్యే ఈ కోతికి ఎంత కష్టం వచ్చిందో అంటూ నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. అయితే గాడ్జిల్లా మొదటి యజమాని దానిని విడిచిపెట్టడంతో ఆమె ఈ కోతినిను పెంచుకుంటున్నట్లు చెప్పింది. అయితే దీనికి మంచి ఆహారం ఇవ్వాలన్నది తన కోరిక అట. కానీ గాడ్జిల్లా అధిక బరువుతో బాధపడుతుండటంతో తిరిగి దాని బరువును అదుపులోకి తీసుకువచ్చేందుకు ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు ఆమె తెలిపింది. గాడ్జిల్లా అతి చిన్న వయసులో ఉన్నప్పుడు రెస్క్యూ టీం బ్యాంకాక్ రోడ్లపై కనుగోని దీని పాత యజమానికి అప్పగించారట. ఇది చిన్నప్పటి నుంచి పట్టణంలో పెరగడం వల్ల ఆడవిలో స్వయంగా ఆహారం వెతుక్కొవడం దానికి తెలియదని ఆమె వివరించింది. అయితే ఈ కోతి రోజు ఉదయం పూట వ్యాయమం చేస్తున్నప్పటికి పలు అరోగ్య సమస్యల వల్ల ఉభకాయంతో బాధపడుతున్నట్లు ఆమె వెల్లడించింది. గాడ్జీల్లా ఒంటరిగా ఉండటం వల్ల ఒత్తిడికి లోనవుతుందని అందుకే రోజు గాడ్జీల్లాను మార్కెట్‌కు తీసుకువస్తానని ఆమె చెప్పుకొచ్చింది. అయితే గాడ్జీల్లా కేవలం తనకు ఇష్టమైన వారు ఆహారం పెడితేనే తింటుందట. -
భీకర యుద్ధం మొదలవ్వబోతోంది
రెండు అతి భారీ ప్రాణుల మధ్య భీకర యుద్ధం మొదలవ్వబోతోంది. నిజంగా కాదు! ‘గాడ్జిల్లా వర్సెస్ కాంగ్’ సినిమాలో. ఆదామ్ విన్గార్డ్ డైరెక్షన్లో వార్నర్ బ్రదర్స్ నిర్మాణంలో తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్ ఆదివారం విడుదలైంది. ‘‘మనకు ఇదొక్కటే మార్గం’’ అన్న డైలాగ్‌తో మొదలై.. ‘‘ కాంగో ఎవరి ముందు తలవంచడు’’ అన్న డైలాగ్ వరకు ట్రైలర్ అద్భుతంగా ఉంది. రెండిటి మధ్య పోరాట సన్ని వేశాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నగరాన్ని నాశనం చేయటానికి పూనుకున్న గాడ్జిల్లాను అంతమొందించటానికి మనుషులు కాంగ్‌ను రంగంలోకి దించుతున్నట్లు ట్రైలర్‌ను బట్టి తెలుస్తోంది. ( బాండ్ మళ్లీ వాయిదా ) గాడ్జిల్లా, కాంగ్‌లు ప్రధాన పాత్రలుగా ఇంతవరకు చాలా సినిమాలు వచ్చాయి. గాడ్జిల్లా: కింగ్ ఆఫ్ ది మాన్స్టర్స్, షిన్ గాడ్జిల్లా, గాడ్జిల్లా: ప్లానెట్ ఆఫ్ ది మాన్స్టర్స్, గాడ్జిల్లా: సిటీ ఆఫ్ ది ఎడ్జ్ ఆఫ్ బ్యాటిల్ ఇలా మొత్తం 40 పైగా సినిమాలు వచ్చాయి. ఇక కాంగ్ తక్కువ వాడేమీ కాదు! 1933లో వచ్చిన కింగ్ కాంగ్ మొదలుకుని మొన్నటి కాంగ్:స్కల్ ఐలాండ్ వరకు మొత్తం పదికి పైగా సినిమాలు ఉన్నాయి. మార్చి 26న హెచ్‌బీఓ మ్యాక్స్‌తో పాటు థియేటర్లలో ఒకేసారి ఈ సినిమా విడుదల కానుంది. -
వామ్మో.. గాడ్జిల్లా మళ్లీ పుట్టిందా?
ఫ్లోరిడా : రాక్షస బల్లుల జాతికి చెందిన గాడ్జిలా గురించి హాలీవుడ్ చిత్రాల్లో చూసుంటారు. అయితే పరిమాణంలో ఆ సైజులో కాకపోయినా.. కాస్త భయానకంగా ఉన్న మొసలి ఒకటి గోల్ఫ్ కోర్టులో చక్కర్లు కొట్టింది. ఫ్లోరిడాలో చోటు చేసుకున్న ఘటన వీడియో ఒకటి వైరల్ అవుతోంది. పోప్ గోల్ఫ్ మైదానంలో ఈ మధ్య బఫెల్లో క్రీక్ గోల్ఫ్ కోర్స్ పోటీలు జరిగాయి. ఫిబ్రవరి 14న గేమ్ ప్రారంభానికి ముందు అక్కడే ఓ కొలనులో ఉన్న భారీ మొసలి ఒకటి హఠాత్తుగా బయటకు వచ్చింది. ఆ సమయంలో మైదానంలో పని చేసే వ్యక్తి ఒకతను తన మొబైల్ తో వీడియో తీయటం ఆరంభించాడు. అది కాస్త అధికారుల దృష్టికి వెళ్లటంతో వారు స్పందించారు. సుమారు పాతికేళ్ల క్రితం ఓ మొసలి ఇదే ప్రాంతంలో కనిపించిందని.. బహుశా ఇప్పుడు కనిపించింది కూడా అదే అయి ఉంటుందని నిర్వాహకులు చెబుతున్నారు. 2016లో కూడా ఇది ఓసారి కనిపించగా.. దానికి ‘చబ్స్’ అని పేరు పెట్టినట్లు సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఇప్పటిదాకా అది ఎవరి మీద దాడి చేసిన సందర్భాలు లేవనే వారంటున్నారు. మైదానంలో అది ఠీవిగా వెళ్తుంటే.. పక్షులు దాని వెనకాలే వెళ్లటం ఆసక్తికరంగా ఉంది. ఫ్లోరిడాలో ఈ పరిణామంలో ఉన్న మొసలి ఇదేనని జంతు సంరక్షణ అధికారులు చెబుతున్నారు. సోషల్ మీడియాలో ఈ వీడియో చూసిన వారంతా గాడ్జిల్లా మళ్లీ పుట్టిందా? అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరోవైపు ఆటగాళ్లు ఈ వీడియోతో మైదానంలో అడుగుపెట్టేందుకు జంకుతున్నట్లు తెలుస్తోంది. -
వామ్మో.. గాడ్జిల్లా మళ్లీ పుట్టిందా?
-
గోల్డ్ ’గాడ్జిల్లా’
దుబాయ్‌లోని వరల్డ్ ట్రేడ్ సెంటర్లో మూడు రోజులపాటు జరిగిన (ఈ నెల 8-10 వరకు) ఆటోమోటివ్ పార్ట్స్ ఎగ్జిబిషన్ ‘ఆటోమెకానికా దుబాయ్-2016’లో ప్రదర్శించిన గోల్డ్ ప్లేటెడ్ కస్టమైజ్డ్ కారు ఇది. దీని పేరు ‘గాడ్జిల్లా’. ఇది నిస్సాన్ ఆర్35 జీటీ-ఆర్ కారు. ఇందులో 3.8 లీటరు వీ6 ట్విన్ టర్బో 545 హెచ్‌పీ ఇంజిన్, దుర్భేద్యమైన బాడీ, ప్రీమియం డిజైన్, పెడల్ షిఫ్టెడ్ సీక్వెన్షియల్ 6-స్పీడ్ డ్యూయెల్ క్లచ్ ట్రాన్స్మిషన్ వంటి తదితర ప్రత్యేకతలు ఉన్నాయి. దీని ధర దాదాపుగా రూ.6.5 కోట్లుగా ఉంది. -
వామ్మో.. ఇది ఉడుమా.. గాడ్జిల్లా పిల్లనా?
గ్రాఫిక్స్, త్రీడి చిత్రాల్లో గాడ్జిల్లా(రాక్షస బల్లి)ని మనం ఇప్పటి వరకు చూశాం. ఒకప్పుడు అది ఇలా ఉండేదని మిగిలిపోయిన శిలాజాల ద్వారా మనం వాటి పరిమాణాన్ని అంచనా వేశాం తప్ప ఏనాడు ప్రత్యక్షంగా చూడలేదు. అయితే, మనం ఇప్పటి వరకు రాక్షసబల్లి ఎలా ఉంటుందని ఇప్పటి వరకు చూస్తూ వచ్చామో అచ్చం అలాంటి రూపమే ప్రత్యక్షంగా దర్శనమిచ్చింది. అది కూడా గాలపాగో ద్వీపంలోని ఇసబెల్లా కోస్తా తీరంలో. అవునూ.. సముద్ర జలాల్లో ప్రత్యేక కెమెరాల ద్వారా వీడియోలు తీసి అందులోని వృక్షరాశి, జంతురాశి గురించి ఆరా తీసే ప్రత్యేక గజ ఈతగాళ్లకు ఇది కనిపించి అబ్బురపడిపోయేలా చేసింది. కాకపోతే ఇది రాక్షసబల్లి కాదుగానీ, అచ్చం అలాగే ఉన్న ఓ పెద్ద ఉడుము. ఇది నీటి అడుగు భాగంలో ఎంతో నేర్పుగా డైవర్స్ తోపాటు ఈదుతూ రుచికరమైన ఆహారం కోసం నీటి అడుగున పాకుతూ ఆ తర్వాత గాలి తీసుకునేందుకు తిరిగి సముద్ర ఉపరితలంపైకి రావడాన్ని వారు వీడియోలో చూశారు. ఇది అచ్చం జురాసిక్ పార్క్ సినిమాలో జంతువులు ఎలా ఉన్నాయో అలాగే ఉంది. ఇంతకీ దీని పరిమాణం ఎంత ఉందని అనుకుంటున్నారు.. సరిగ్గా ఒక మనిషి అంత పెద్దగా ఉందట. ఇలా ప్రతిసారి నీటిలో వేగంగా మునుగుతూ ఆహారం కోసం వెతుకుతూ తోకతో ఈదుతూ వేగంగా ముందుకు కదలడం ఈ వీడియోలో రికార్డయింది.