ఓటీటీలోకి వచ్చేసిన 'గాడ్జిల్లా మైనస్‌ వన్‌' | Godzilla Minus One Streaning Now On This OTT | Sakshi
Sakshi News home page

ఓటీటీలోకి వచ్చేసిన 'గాడ్జిల్లా మైనస్‌ వన్‌'

Published Sat, Jun 1 2024 2:11 PM | Last Updated on Sat, Jun 1 2024 3:19 PM

Godzilla Minus One Streaning Now On This OTT

ఈ వీకెండ్‌లో మూవీ లవర్స్‌ కోసం సడెన్‌ సర్‌ప్రైజ్‌ ఇచ్చింది నెట్‌ఫ్లిక్స్‌. హాలీవుడ్‌ హిట్‌ సినిమా 'గాడ్జిల్లా మైనస్‌ వన్‌' ఓటీటీలో విడుదలట్లు ప్రకటించేసింది. 2023 ఆక్టోబ‌ర్‌లో మొదట జపాన్‌లో విడుదలైన ఈ సినిమా అక్కడ బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ కొట్టింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

గాడ్జిల్లా ఫ్రాంఛైజీలో 37వ చిత్రంగా 'గాడ్జిల్లా మైనస్‌ వన్‌' తెరకెక్కింది. బెస్ట్ విజువ‌ల్ ఎఫెక్ట్స్ విభాగంలో ఆస్కార్‌ను ద‌క్కించుకున్న ఈ చిత్రం ఎలాంటి ప్రకటన లేకుండా నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది. ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా ఇండియాలో మాత్రం థియేట‌ర్ల‌లో విడుద‌ల కాలేదు. కానీ, ఓటీటీ వేదికగా చూసే అవకాశం ప్రేక్షకులకు దక్కింది. అయితే ఈ సినిమా జపనీస్‌,ఇంగ్లీష్‌,తమిళ్‌,హిందీలో మాత్రమే స్ట్రీమింగ్‌ అవుతుంది. గాడ్జిల్లా మైన‌స్ వ‌న్ చిత్రాన్ని తకాషి యమజాకి  తెర‌కెక్కించారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement