మరో హిట్ సినిమా సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసింది. ఓ పక్క థియేటర్లలో ఇంకా ఆడుతూనే ఉంది. ఇప్పుడు డిజిటల్‌గా అందుబాటులోకి వచ్చేసింది. తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతున్నప్పటికీ.. ఓ విషయం మాత్రం నెటిజన్లకు షాకిస్తోంది. అది చూసి కళ్లు తేలేస్తున్నారు. ఇంతకీ ఏంటా సినిమా? ఎందులో స్ట్రీమింగ్ అవుతోంది?
'టిల్లు స్క్వేర్' సినిమాతో పాటు మార్చి 29న థియేటర్లలో రిలీజైన హాలీవుడ్ మూవీ 'గాడ్జిల్లా x కాంగ్: ద న్యూ ఎంపైర్'. గాడ్జిల్లా-కాంగ్ ఫ్రాంచైజీలో వచ్చిన ఈ సినిమాకు మంచి స్పందనే వచ్చింది. వచ్చి చాలా రోజులవుతున్నప్పటికీ ఇప్పటికీ చాలా థియేటర్లలో ఆడుతోంది. అలాంటిది ఇప్పుడు ఓటీటీలో రిలీజ్ చేశారు.
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్)
బుక్ మై షో ఓటీటీలోకి తీసుకొచ్చారు గానీ ఉచితంగా మాత్రం స్ట్రీమింగ్ అందుబాటులో లేదు. ఈ సినిమా రెంట్ విధానంలో 4k క్వాలిటీతో చూడాలంటే రూ.549 చెల్లించాలి. పూర్తిగా కొని చూడాలంటే మాత్రం రూ.799 చెల్లించాలని క్లారిటీ ఇచ్చారు. ఇంగ్లీష్‌తో పాటు తెలుగులోనూ ఈ చిత్రం అందుబాటులో ఉంది.
ఇక బుక్ మై షో ఓటీటీలో సోమవారం అందుబాటులోకి రాగా.. అమెజాన్ ప్రైమ్, యూట్యూబ్‌లో మంగళవారం నుంచి రెంట్ విధానంలో స్ట్రీమింగ్ కానుంది. ఇదిలా ఉండగా రూ.15 కోట్ల డాలర్ల బడ్జెట్ పెట్టగా.. రూ.52.4 కోట్ల డాలర్ల వసూళ్లు ఇప్పటివరకు ఈ సినిమాకు వచ్చాయి. దాదాపు మూడురెట్లు అనమాట.
(ఇదీ చదవండి: స్టేజీపై నటిస్తూ కన్నుమూసిన ప్రముఖ నటుడు)
Comments
Please login to add a commentAdd a comment