'గాడ్జెల్లా వర్సెస్‌ కాంగ్‌' ప్రాంఛైంజీ నుంచి ఐదో చిత్రం విడుదల ఎప్పుడంటే | 'Godzilla x Kong: The New Empire' Ready To Release | Sakshi
Sakshi News home page

గాడ్జెల్లా వర్సెస్‌ కాంగ్‌ ప్రాంఛైంజీ నుంచి ఐదో చిత్రం రెడీ

Published Thu, Mar 21 2024 11:08 AM | Last Updated on Thu, Mar 21 2024 11:23 AM

Godzilla VS Kong The New Empire Ready To Release - Sakshi

హాలీవుడ్‌ చిత్రాల్లో గాడ్జెల్లా వర్సెస్‌ కాంగ్‌ చిత్రాలకు ప్రత్యేక ఆదరణ ఉంటుంది. ఈ తరహా చిత్రాలు పిల్లలను, పెద్దలను విపరీతంగా అలరిస్తాయి. అలా ఇంతకు ముందు వచ్చిన గాడ్జెల్లా వర్సెస్‌ కాంగ్‌ చిత్రాలు విశేష ఆదరణ పొంది వసూళ్ల వర్షం కురిపించాయి. వాటికి ప్రాంఛైంజీగా వస్తున్న ఐదో చిత్రం 'గాడ్జెల్లా వర్సెస్‌ కాంగ్‌. ది ఎంపైర్‌'. ఆడమ్‌ వింగార్డ్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని లెజెండరీ పిక్చర్స్‌ సంస్థ నిర్మించింది.

రెబాకా హాల్‌, వ్రియాన్‌ టైరీహెన్ని, డన్‌ స్ట్రీవెన్స్‌ తదితరులు ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని వార్నర్‌ బ్రదర్స్‌ సంస్థ ఈ నెల 29వ తేదీన తెలుగు, తమిళం, హిందీ, ఇంగ్లిషు భాషల్లో విడుదల చేయనుంది. కాగా ఈ చిత్రంలో ప్రధాన పాత్రను పోషించిన రెబాకా హాల్‌ చిత్ర దర్శకురాలి గురించి తన అభిప్రాయాన్ని తెలుపుతూ ఆడమ్‌ వింగార్డ్‌ దర్శకత్వంలో నటించడం తనకు ఎప్పుడూ సంతోషం అన్నారు. తను సెట్‌లో చాలా జాలీగా ఉంటారని, అదే సమయంలో దర్శకత్వంలో అత్యంత ప్రతిభ కలిగిన వారని చెప్పారు.

తాను తెరకెక్కించే సన్నివేశాల విషయంలో చాలా క్లియర్‌గా ఉంటారన్నారు. అదే తనను చాలా ప్రశాంతంగా ఉండేలా చేసిందన్నారు. ఈ చిత్రాన్ని చాలా అద్భుతంగా తెరకెక్కించారని చెప్పారు. చిత్రంలో గ్రాఫిక్స్‌ సన్నివేశాలను ప్రేక్షకులు ఎంజాయ్‌ చేస్తారని అన్నారు. కచ్చితంగా ఈ చిత్రం సమ్మర్‌కు చాలా స్పెషల్‌గా ఉంటుందనే అభిప్రాయాన్ని ఆమె వ్యక్తం చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement