అమెరికన్ ఫిల్మ్స్ ‘గాడ్జిల్లా’ ఫ్రాంచైజీలో వస్తున్న తాజా చిత్రం ‘గాడ్జిల్లా వర్సెస్ కాంగ్: ది న్యూ ఎంపైర్’ (2024). రెబెక్కా హాల్, బ్రియాన్ టైరీ హెన్రీ, డన్ స్టీవెన్స్, కైలీ హోట్లీ, అలెక్స్ ఫెర్న్స్, ఫలా చెన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి ఆడమ్ విన్‌గార్డ్ దర్శకుడు. భారీ బడ్జెట్‌తో లెజండరీ పిక్చర్స్ నిర్మించిన ఈ సినిమాను వార్నర్ బ్రదర్స్ రిలీజ్ చేస్తున్నారు.
‘గాడ్జిల్లా వర్సెస్ కాంగ్: ది న్యూ ఎంపైర్’ చిత్రం అంతర్జాతీయంగా మార్చి 27న, యునైటెడ్ స్టేట్స్‌లో మార్చి 29న, జపాన్‌లో ఏప్రిల్ 26న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ‘గాడ్జిల్లా వర్సెస్ కాంగ్: ది న్యూ ఎంపైర్’ నుంచి లేటెస్ట్ ట్రైలర్‌ను విడుదల చేశారు. ‘మేము ఓ సిగ్నల్‌ని కనుగొన్నాం’, ‘ఏదో ఊహించనది జరగబోతోంది’, ‘అది కేవలం సిగ్నల్ మాత్రమే కాదు.. యుద్ధానికి పిలుపు’ వంటి డైలాగ్స్ ట్రైలర్‌లో ఉన్నాయి. ఇక 2021లో వచ్చిన ‘గాడ్జిల్లా వర్సెస్ కాంగ్’కి సీక్వెల్‌గా ‘గాడ్జిల్లా వర్సెస్ కాంగ్: ది న్యూ ఎంపైర్’ చిత్రం తెరకెక్కింది.
Comments
Please login to add a commentAdd a comment