థాయ్‌లాండ్: జంక్ ఫుడ్ తింటే మనుషులే కాదు జంతువుల సైతం అనారోగ్య బారిన పడతాయి. దీనికి ఈ తాజా సంఘటనే ఉదాహరణ. హాయిగా చెట్ల కొమ్మలపై అటూ ఇటూ దూకుతూ యాక్టివ్‌గా ఉండాల్సిన ఈ కోతి జంక్ ఫుడ్ తిని తిని ఉభకాయంతో బాధపడుతోంది. వివరాలు.. బ్యాంకాక్ చెందిన మనోప్ అనే ఓ షాప్ యాజమానురాలు గాడ్జిల్లా అనే కోతిని పెంచుకుంటోంది. ప్రస్తుతం దాని వయసు 3 సంవత్సరాలు. ఆమె రోజు తనతో పాటే ఈ కోతిని మార్కెట్‌కు తీసుకువచ్చి తన షాపు ఎదురుగా కట్టి ఉంచుతుంది. దీంతో ఆ దారిన వచ్చిపోయే వారంతా దానికి జంక్ ఫుడ్‌ను ఆహారంగా ఇవ్వడం మొదలు పెట్టారు.
అలా రోజు బర్గర్, పిజ్జా, బన్లు వంటి పదార్థాలు తినడం వల్ల ఈ 3 ఏళ్ల కోతి 20 కేజీల బరువెక్కింది. అంటే దాని వయసుకు ఉండాల్సిన సాధారణ బరువు కంటే రెట్టింపు బరువుతో ఉందని కోతి యజమానురాలు మనోప్ పేర్కొంది. ఇందుకు సంబంధించిన వీడియో, ఫొటోలు నెట్టింటా వైరల్ కావడంతో అందరి దృష్టి ఈ కోతిపై పడింది. అయ్యే ఈ కోతికి ఎంత కష్టం వచ్చిందో అంటూ నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. అయితే గాడ్జిల్లా మొదటి యజమాని దానిని విడిచిపెట్టడంతో ఆమె ఈ కోతినిను పెంచుకుంటున్నట్లు చెప్పింది. అయితే దీనికి మంచి ఆహారం ఇవ్వాలన్నది తన కోరిక అట.
కానీ గాడ్జిల్లా అధిక బరువుతో బాధపడుతుండటంతో తిరిగి దాని బరువును అదుపులోకి తీసుకువచ్చేందుకు ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు ఆమె తెలిపింది. గాడ్జిల్లా అతి చిన్న వయసులో ఉన్నప్పుడు రెస్క్యూ టీం బ్యాంకాక్ రోడ్లపై కనుగోని దీని పాత యజమానికి అప్పగించారట. ఇది చిన్నప్పటి నుంచి పట్టణంలో పెరగడం వల్ల ఆడవిలో స్వయంగా ఆహారం వెతుక్కొవడం దానికి తెలియదని ఆమె వివరించింది. అయితే ఈ కోతి రోజు ఉదయం పూట వ్యాయమం చేస్తున్నప్పటికి పలు అరోగ్య సమస్యల వల్ల ఉభకాయంతో బాధపడుతున్నట్లు ఆమె వెల్లడించింది. గాడ్జీల్లా ఒంటరిగా ఉండటం వల్ల ఒత్తిడికి లోనవుతుందని అందుకే రోజు గాడ్జీల్లాను మార్కెట్‌కు తీసుకువస్తానని ఆమె చెప్పుకొచ్చింది. అయితే గాడ్జీల్లా కేవలం తనకు ఇష్టమైన వారు ఆహారం పెడితేనే తింటుందట.
Comments
Please login to add a commentAdd a comment