డేంజరస్‌ డైనోసర్‌... | One Big Ethical Question Jurassic World | Sakshi
Sakshi News home page

డేంజరస్‌ డైనోసర్‌...

Published Mon, Apr 23 2018 12:59 AM | Last Updated on Mon, Apr 23 2018 12:59 AM

One Big Ethical Question Jurassic World - Sakshi

‘‘ఈ భూమ్మీద జీవించిన అతి భయంకరమైన జంతువు ఇది’. ఆ జంతువును బంధించి పెట్టారు. ఒక పెద్ద గదంత పెద్దగా ఉంది ఆ జంతువు. హీరో అందులో ఉన్నాడు. అతని భార్యా పక్కనే ఉంది. ఆ జంతువు వాళ్లను చూసింది. గట్టిగా అరిచింది. పట్టుకునేందుకు గాండ్రిస్తూ తిరిగింది. అంతే తిరుగులేని యాక్షన్‌ అడ్వెంచర్‌కు మూలం దొరికేసింది. ఆ తర్వాత ఏం జరిగింది? అంతకుముందు ఏం జరిగింది? ‘జురాసిక్‌ వరల్డ్‌ : ఫాలెన్‌ కింగ్‌డమ్‌’ సినిమా చూసి తెలుసుకోవాల్సిందే! ఆ జంతువు పేరు డైనోసర్‌. దశాబ్దాలుగా అడ్వెంచర్‌ సినిమాలను ఇష్టపడుతూ వస్తున్న వారికి డైనోసర్‌ గురించి, జురాసిక్‌ పార్క్‌ గురించీ ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. జురాసిక్‌ పార్క్‌కు రీబూట్‌లాగా జురాసిక్‌ వరల్డ్‌ సిరీస్‌ ప్రస్తుతం నడుస్తోంది.

ఇందులో కొత్త సినిమా ‘జురాసిక్‌ వరల్డ్‌ : ఫాలెన్‌ కింగ్‌డమ్‌’. జూన్‌ 7న ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఇప్పటికే రెండు, మూడు ట్రైలర్లతో ఆసక్తి పెంచిన ఈ సినిమా, తాజాగా ఫైనల్‌ ట్రైలర్‌తో అంచనాలను తారాస్థాయికి చేర్చింది. సినిమా ఎలా ఎలా ఉండబోతోందో ఈ ట్రైలర్‌ స్పష్టంగా తెలియజేస్తోంది. దర్శకుడు జె.ఎ.బయోనా, జురాసిక్‌ పార్క్‌ అభిమానులను దృష్టిలో పెట్టుకొని, వాళ్లను ఆకర్షించే సన్నివేశాలతో సినిమాను తెరకెక్కించినట్లు ట్రైలర్‌ స్పష్టం చేస్తోంది. భారీ విజువల్‌ ఎఫెక్ట్స్‌ కోరుకునే వారికి ఈ సినిమా పండగే అని తెలుస్తోంది. పిల్లలు, అడ్వెంచర్స్‌ ఇష్టపడే పెద్దలూ జురాసిక్‌ వరల్డ్‌ కోసం, ఈ ట్రైలర్‌ విడుదలయ్యాక ఇంకా పిచ్చిగా ఎదురుచూస్తున్నారు. మరి ఈ డేంజరస్‌ డైనోసర్‌ మనల్ని ఎలా భయపెడుతుందో, ఆకట్టుకుంటుందో చూడాలి!!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement